
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసంస్థ యజమాని అశోక్ ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. ఇటీవల ఆయనకు సిట్ అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. విచారణకు రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీచేసే అవకాశం ఉందని పోలీసులు తేల్చిచెప్పడంతో సిట్ ముందుకు రానున్నారు. ఆయన వ్యక్తిగత న్యాయవాదులతో కలిసి వచ్చే అవకాశం ఉంది. సిట్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ముందు డేటాచోరీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణకు అశోక్ హాజరుకావల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.
చదవండి: డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే!
హైకోర్టులో అశోక్‌కు చుక్కెదురు