అందంగా చూపేందుకు ఐదు కోట్లు | anushka Bhagamathi Update | Sakshi
Sakshi News home page

అందంగా చూపేందుకు ఐదు కోట్లు

Oct 21 2017 10:06 AM | Updated on Oct 21 2017 10:06 AM

Anushka

సినిమాలో అందం ఒక భాగం. ముఖ్యంగా హీరోయిన్ పాత్రల్లో అభినయానికి ఎంత స్కోప్‌ ఉన్నా అందం ఉండేలా జాగ్రత్తపడుతుంటారు దర్శక నిర్మాతలు. ఇక అగ్ర కథానాయకి అనుష్క విషయానికి వస్తే మందం ఆమెకు ఒక శాపంగా మారిందనే అనాలి. ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరో సైజ్‌) చిత్రాన్ని ఏ ముహూర్తాన అంగీకరించిందో గానీ, ఆ చిత్ర ఎఫెక్ట్‌ ఈ బ్యూటీని వెంటాడుతూనే ఉంది.

ఆ చిత్రంలోని పాత్ర కోసం బరువెక్కిన అనుష్క ఆ తరువాత తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారట. బాహుబలి చిత్రంలో అనుష్క లావుగా కనిపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అందులో హీరోకి తల్లిగా కనిపిస్తారు కాబట్టి. బాహుబలి–2కి వచ్చే సరికి అనుష్క బరువు గ్రాఫిక్స్‌ ద్వారా తగ్గించడానికి దర్శకుడు రాజమౌళి కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఆ చిత్రం తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి. ఈ చిత్రానికి ఆ అమ్మడి బరువు భారంగా మారిందన్నది తాజా సమాచారం. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఎట్టకేలకు వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

అయితే భాగమతి చిత్రంలో అ నుష్క బరువును తగ్గించి అందంగా చూపించడానికి రూ.5 కోట్ల వరకూ గ్రాఫిక్స్‌ కోసం ఖర్చు చేస్తున్నారట. ఈ గ్రాఫిక్స్‌ పని ముంబైలో ముమ్మరంగా జరుగుతోందని సమాచారం. అనుష్కకు పారితోషికం  అదనంగా అందంగా చూపించడానికో రూ.5 కోట్లు కలిసి నిర్మాతకు తడిసిమోపెడు అవుతోందని చిత్ర వర్గాలు అంటున్నట్లు మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement