కాకినాడలోని సుబ్బయ్య హోటల్ వద్ద జంట హత్యలు కలకలం రేపాయి.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జంట హత్యలు కలకలం రేపాయి. బాలు, రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.
సుబ్బయ్య హోటల్ వద్ద జరిగిన ఈ ఘటనలో నిందితుడు అశోక్‌గా గుర్తించారు. క్యాటరింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్.. బాలు, రామస్వామిలను వ్యాన్‌తో ఢీ కొట్టి.. తీవ్రంగా గాయపడిన వారిని రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.