‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి.
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
మంత్రి టీజీ భరత్‌కు సిద్ధార్థరెడ్డి కౌంటర్
కర్నూలు: తాను ఎమ్మెల్యే కావాలనే కోరిక తనకంటే మంత్రి టీజీ భరత్‌కే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోందని వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల వేధింపుల బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాము ధర్నాలు చేస్తే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీజీ కుటుంబంపై మండిపడ్డారు. టీజీ వెంకటేశ్ అంటే గౌరవం ఉండేదని.. కానీ తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక, ఆయనపై గౌరవం పోయిందన్నారు. తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నేతలు తిట్టినా స్పందించని ఎంపీ బైరెడ్డి శబరి.. మంత్రి భరత్ గురించి తాను మాట్లాడితే పరుగెత్తుకుంటూ వచ్చి ప్రెస్మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందని సిద్ధార్థరెడ్డి అన్నారు.ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశారని.. ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు 50 ఏళ్లు అని చెప్పారు. 'నీ వయసుకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు అడగండి' అంటూ భరత్‌కు కౌంటర్ ఇచ్చారు. ''కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా, అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈనెల 14న మేము ధర్నా కార్యక్రమం నిర్వహించాం. టీడీపీ నాయకుల వేధింపుల కారణంగా కర్నూలు పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న సతీశ్ అనే కుర్రాడి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఆ రోజు ధర్నా చేశాం. బాలు మరో కుర్రాడిపై పోలీసులు వేధింపులు ఆగాలన్న ఉద్దేశంతోనూ ధర్నా చేపట్టాం. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాయలం దగ్గర ధర్నాకు దిగాం. ప్రభుత్వాన్ని, మంత్రి టీజీ భరత్‌కు ప్రశ్నించామని గడచిన 3 రోజులుగా టీడీపీ నేతల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీజీ వెంకటేశ్ తదితరులు మా గురించి రకరకాలు మాట్లాడారు. వారి మాటలకు సమాధానం చెప్పాలనే మీడియా ముందుకు వచ్చాను. సతీశ్ కుటుంబానికి మంత్రి టీజీ భరత్ న్యాయం చేసివుంటే కర్నూలు టౌన్లో ఆయన స్థాయి వందశాతం పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థరెడ్డిని తిట్టినవాళ్లకు పదివేల రూపాయలు, సిద్ధార్థరెడ్డిపైనా సెల్ఫీ వీడియో చేసిన వాళ్లకు ఇరవై వేల రూపాయలు, ప్రెస్‌మీట్ పెడితే కార్పొరేటర్ సీటు, సిద్ధార్థరెడ్డి ఇంటి మీదకు పోతే స్టోర్ బియ్యం వంటివి చేయడంతో కర్నూలు టౌన్లో టీజీ భరత్ స్థాయి 500 శాతం పడిపోయింది. సతీశ్ కుటుంబానికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్‌మీట్ పెట్టి.. సిద్ధార్థ నువ్వు టికెట్ తెచ్చుకో. మూడు ఎలక్షన్లు చేసినా ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వలేదని మాట్లాడారు. భరత్ వయసు ఇప్పడు 50 సంవత్సరాలు. 48 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు. 43 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నా వయసు 33 సంవత్సరాలు. మీ వయసు వచ్చినప్పడు నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడగండి. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నా కన్నా మీకు ఎక్కువ ఉండడమేంటి? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్‌ను అయ్యాను. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిని అయ్యాను. నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్చార్జిని అయ్యాను. నా వెంట తిరిగిన ఎంతో మందిని ఎంటీసీ, జెడ్పిటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లుగా గెలిపించుకున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం చేశాను. ఎన్నో ప్రెస్మీట్లు, ర్యాలీలు, ధర్నాలు చేశాను. 33 ఏళ్లకే ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాల ఊగుతున్నారా? సతీశ్ కుటుంబానికి న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నార''ని సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు.
డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
తాజాగా నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘సామూహిక పేదరికం తిరిగి రావడం’, ‘విపత్తుల దశాబ్దం’ (డికేడ్ ఆఫ్ డిజాస్టర్స్) అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందే దేశీయంగా చమురు, బంగారం దిగుమతులను తగ్గించుకోవాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటం మానుకోవాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిపై కొంతమంది నిపుణుల మనోగతం కింది విధంగా ఉంది.ఈ వ్యాఖ్యలు వినగానే మనకు పాత రోజులు గుర్తొస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకమైన సంక్షోభంలోకి ప్రవేశించినప్పుడల్లా.. ప్రధానులు దేశభక్తిని మేల్కొలిపి విదేశీయుల నుంచి కొనుగోళ్లు తగ్గించుకోమని కోరడం పరిపాటిగా మారింది.70 ఏళ్లలో 9 సార్లు!మన ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. 1955, 1965, 1974, 1980, 1991, 1998, 2012, 2020.. ఇప్పుడు 2026. గడిచిన 70 ఏళ్లలో ఏకంగా తొమ్మిది సార్లు దేశం ఇదే తరహా డాలర్ల కొరతను, చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశీయంగా ఉన్న సప్లై గ్యాప్ (సరఫరా లోటు)ను భర్తీ చేయడానికి అవసరమైన డాలర్లు మన వద్ద లేకపోవడమే వీటికి మూలకారణం.1972 వరకు ప్రధాన లోటు ఆహార ధాన్యాల్లో ఉండేది. క్రమంలో దాన్ని అధిగమించే స్థాయికి చేరుకోగలిగాం. 1980 తర్వాత ఈ లోటు ఇంధనం (చమురు, గ్యాస్) రూపంలోకి మారింది. మన పొరుగు దేశమైన చైనాకు కూడా ఈ రెండు లోటూ ఉన్నాయి. కానీ, వారు ఈ డాలర్ల సంక్షోభాన్ని మనకంటే మెరుగ్గా నిర్వహించగలిగారు. ఈ పరిస్థితిలో.. మన దేశంలో ఈ సరఫరా లోటు దశాబ్దాలుగా ఎందుకు కొనసాగుతోంది? మనం ఈ డాలర్ల కొరతను ఎందుకు అధిగమించలేకపోతున్నాం? అనే కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.హరిత విప్లవం విజయం.. పారిశ్రామిక రంగంలో ఎందుకు సాధ్యం కాలేదు?వ్యవసాయ రంగంలో ఉన్న లోటును మనం హరిత విప్లవం ద్వారా విజయవంతంగా అధిగమించాం. స్వయంసమృద్ధిని సాధించాం కాబట్టే, 1979లో వచ్చిన తీవ్ర కరువు ప్రభావం 1980 నాటికి దేశంపై పడకుండా నిలిచింది. కానీ, ఇంధన లోటును మాత్రం గత 45 ఏళ్లుగా మనం పరిష్కరించలేకపోయాం. చమురు కొనడానికి డాలర్లు కావాలి, ఆ డాలర్లు రావాలంటే ఎగుమతులు పెరగాలి. కానీ మన ఎగుమతులు ఎప్పుడూ అంతంత మాత్రమే.ఇంధన విధానంలో లోపంమన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ పర్యావరణ కారణాల వల్ల దాన్ని పక్కనబెట్టి చమురు, గ్యాస్ వంటి ఇతర హైడ్రోకార్బన్లపై ఆధారపడ్డాం. ఇది మన ఇంధన సంక్షోభాన్ని మరింత పెంచింది. దీనికంటే ముఖ్యమైన మరో కారణం.. గత 60 ఏళ్లుగా మన పాలకులు అనుసరించిన అస్తవ్యస్త పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సింది పోయి, వాటిని భారీగా దిగుమతి చేసుకునే స్థితికి చేరుకున్నాం. ఫలితంగా డాలర్ల సంపాదన తగ్గిపోయింది.సంక్షోభం రావడం.. మళ్లీ మర్చిపోవడం!ప్రతిసారీ సంక్షోభం తీవ్రమైనప్పుడు ప్రభుత్వం డాలర్లను పొదుపు చేయమని చెప్తుంది. ఆ సమయానికి ఆ నిర్ణయం సరైనదే అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది అత్యంత హాస్యాస్పదమైన వ్యూహం. సంక్షోభం తొలిగిపోగానే మనం ఆ సమస్యను పూర్తిగా మర్చిపోయి విజయం సాధించామంటూ వీధుల్లో వేడుకలు చేసుకుంటాం. మళ్లీ కొన్నాళ్లకు అదే తప్పు చేస్తాం. ఈ దుస్థితి చూసి చాలా మంది ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.ఈ సమస్య పరిష్కారానికి గతంలో డజనుకు పైగా ఉన్నత స్థాయి కమిటీలు వేయడంతో చాలా సిఫార్సులు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో సాధించింది శూన్యం. దీనికి ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులనా, బ్యూరోక్రాట్లనా, పారిశ్రామికవేత్తలనా, గత వ్యూహకర్తలనా? సమాధానం ఒక్కటే.. వ్యవస్థలో అందరూ భాగస్వాములే అయినప్పుడు ఎవరి ఒక్కరినో బాధ్యులను చేయలేం.ప్రజాస్వామ్యం వర్సెస్ ఆర్థిక వృద్ధిఆర్థికవేత్త వాల్టర్ రోస్టో 1960లో తన ‘స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ పుస్తకంలో రాజకీయ వ్యవస్థల గురించి ప్రస్తావించలేదు. కానీ, రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఆర్థిక ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును మూటగట్టుకున్న దేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవు. అవి ప్రజాస్వామ్య దేశాలుగా మారిన మరుక్షణమే వాటి వృద్ధి రేటు మందగిస్తుంది.ఆర్థిక నమూనాప్రధాన లక్షణంవృద్ధి రేటుహక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థప్రజల హక్కులు, ఉచితాలు, రాయితీలకు ప్రాధాన్యతతక్కువ, అస్థిరమైన వృద్ధిబాధ్యతల ఆధారిత ఆర్థిక వ్యవస్థజాతీయ ప్రయోజనాలు, ఉత్పత్తి, క్రమశిక్షణకు ప్రాధాన్యతస్థిరమైన, అత్యధిక వృద్ధిభారతదేశం ఎప్పటికీ ‘హక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ గానే కొనసాగుతుంది. అలాంటప్పుడు గత 70 ఏళ్ల తప్పులను పునరావృతం చేయకుండా ఎలా ఉండాలన్నదే మన ముందున్న ప్రశ్న.ఆలోచన విధానం మారకపోతే..ఈ గందరగోళాన్ని ఎలా చక్కదిద్దాలో అందరికీ తెలుసు. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారాలు మన కళ్లముందే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసి, మెజారిటీ సూచనలను పక్కనబెట్టాం. ఒకేసారి డజన్ల కొద్దీ భిన్నమైన లక్ష్యాలను పెట్టుకుని అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. కుక్క తన తోకను తాను పట్టుకోవడానికి తిరిగినట్లు ఉంది. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ.ప్రస్తుత దశాబ్దం విపత్తులతోనే సాగుతోంది, మున్ముందు మరిన్ని సవాళ్లు రావచ్చు. కానీ, మన పాలకుల ఆలోచనా విధానం, ఆర్థిక విధానాలు సరైన దిశలో ఉండి ఉంటే.. ఈ విపత్తులు దేశాన్ని సామూహిక పేదరికం వైపు నెట్టేంత ప్రమాదకరంగా మారేవి కావు. ఇప్పటికైనా తాత్కాలిక ఉపశమన చర్యలు పక్కనపెట్టి ఎగుమతులను పెంచే దీర్ఘకాలిక పారిశ్రామిక, ఇంధన సంస్కరణలపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో డాలర్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగానే మిగిలిపోతుంది.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
IPL 2026: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
శ్రమకే అగ్రతాంబూలం!
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
ధోని రిటైర్మెంట్.. ఐదేళ్ల క్రితం ప్రకటన వైరల్!
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
18 సార్లు లాటరీ విన్.. లక్కీ మ్యాన్ ‘జాక్‌పాట్’ సీక్రెట్ ఇదే..
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
మద్యం తాగించి.. బలవంతం చేసి!
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
సాక్షి కార్టూన్ 16-05-2026
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
మాను సంపంగి... మా అబ్బాయి
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..!
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
IPL 2026: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
శ్రమకే అగ్రతాంబూలం!
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
ధోని రిటైర్మెంట్.. ఐదేళ్ల క్రితం ప్రకటన వైరల్!
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
18 సార్లు లాటరీ విన్.. లక్కీ మ్యాన్ ‘జాక్‌పాట్’ సీక్రెట్ ఇదే..
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
మద్యం తాగించి.. బలవంతం చేసి!
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
సాక్షి కార్టూన్ 16-05-2026
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
మాను సంపంగి... మా అబ్బాయి
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..!
ఫొటోలు
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 17-24)
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
వయసు పెరిగినా వన్నె తగ్గని మాధురి అందం (ఫొటోలు)
సినిమా
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అని పిలుస్తారు. అందుకే ఆమె తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయింది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది.
సూర్య కరుప్పు.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. మొదటి రోజే ఆర్థిక సమస్యలు రావడంతో ఒక్క రోజు ఆలస్యంగా థియేటర్లో రిలీజైంది. గురువారమే విడుదల కావాల్సి ఉండగా.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది.ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే సెంచరీ మార్క్ కొట్టేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే రూ. 68 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా వసూళ్లు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రూ. 78.75 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ. 42 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఆదివారం ఒక్కరోజే రూ. 28.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.కాగా.. ఈ చిత్రంలో, సూర్య.. శరవణన్ అనే లాయర్ పాత్రను పోషించారు. దోపిడీకి గురై, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థలో చిక్కుకున్న తండ్రీకూతుళ్ల కథగా ఈ మూవీని తెరకెక్కించారు.
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22
క్రీడలు
బీసీసీఐ విషయంలో కీలక తీర్పు.. ఇకపై..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.గతంలో అలా..కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. బోర్డులో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.ప్రభుత్వ నియంత్రణలో లేదుగీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదుబీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్షిపులు, ఐపీఎల్ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.అదే విధంగా.. క్రికెట్ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థగాకాగా తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
‘సత్తా చాటినా.. టీమిండియాకు అతడి ఎంపిక కష్టమే’
ఐపీఎల్-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.బుమ్రాకు విశ్రాంతిప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు బౌలింగ్ విభాగంలో చోటు ఖాయం.ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేస్ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.ఆకిబ్ నబీ ఎంపికపై చర్చఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.పేస్ లేదు‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్ సర్కార్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం!ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.హర్షిత్ రాణా ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్ తాజా సీజన్ ముగియనున్న సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ సిరీస్‌ల షెడ్యూల్👉ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్👉తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల👉రెండో వన్డే: జూన్ 17, లక్నో👉మూడో వన్డే: జూన్ 20, చెన్నై.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న (మే 17) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (56) చేసిన అతడు.. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును (533) దాటాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎడిషన్లలో 500 ప్లస్ పరుగుల ఫీట్‌ను రెండు సార్లు నమోదు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలిసారి 2018 ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును తాకిన రాహుల్.. ఆతర్వాత వరుసగా 2019 (593), 2020 (670), 2021 (626), 2022 (616) ఎడిషన్లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.మధ్యలో 2023 ఎడిషన్‌లో గ్యాప్ ఇచ్చి తిరిగి 2024 (520), 2025 (539), 2026 (533) ఎడిషన్లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఫీట్ ఎవరూ నమోదు చేయలేదు. 19 ఎడిషన్ల చరిత్రలో రాహుల్ తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రాహుల్ ఐపీఎల్లో ఎనిమిదో సారి 500 ప్లస్ మార్కును తాకి విరాట్ కోహ్లి (9) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇదే మ్యాచ్‌లో రాహుల్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్లో తన 50వ ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌ను నమోదు చేశాడు. తద్వారా విరాట్ కోహ్లి (76), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధవన్ (53), రోహిత్ శర్మ (51) తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్లోనూ భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్.. ఇప్పటికే ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసి, ఆరెంజ్ క్యాప్ కోసం ప్రధాన పోటీదారుగా నిలిచాడు.మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్.. అభిషేక్ పోరెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఢిల్లీని గెలిపించాడు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్.. ఫొటో వైరల్
ఐపీఎల్-2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత డీలా పడింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలై.. వరుసగా ఆరో పరాజయం నమోదు చేసింది. తద్వారా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక పంజాబ్ టాప్-4 చేరాలంటే మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.‘ప్లే ఆఫ్స్’లో ఆర్సీబీమరోవైపు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు ఐపీఎల్ 19వ సీజన్లో ‘ప్లే ఆఫ్స్’కు దూసుకెళ్లింది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.పంజాబ్ ఆరో‘సారీ’అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రేయస్ అయ్యర్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అంచనాలు పెంచిన పంజాబ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించగా... కూపర్ కనోలి (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టొయినిస్ (25 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యాంశ్ షెడ్గే (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) విఫలమవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫొటో వైరల్ఇక ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపించింది. ఒంటరిగా.. డగౌట్లో ముందు కుర్చీపై తలవాల్చి ఉన్న పాంటింగ్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అశూ ఏమన్నాడంటే...‘‘ఈరోజు టీవీలో ఓ శక్తిమంతమైన ఫొటో చూశాను. రిక్కీ పాంటింగ్ డగౌట్లో ఒక్కడే కూర్చుని కుర్చీ మీద ఒరిగిపోయాడు. తన మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంటుంది. ఆరంభంలో వాళ్లు టేబుల్ టాపర్‌గా ఉన్నారు. కానీ ఆ తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్.. సెకండ్ హోం గ్రౌండ్ ధర్మశాలలో మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.చిన్న తప్పిదాల వల్ల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రిక్కీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ తీవ్రమైన బాధలో ఉండి ఉంటారు. నాకూ బాధగానే ఉంది. అయినా నిజాన్ని అంగీకరించకతప్పదు’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 23న ఏకనా స్టేడియంలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పాంటింగ్ మార్గనిర్దేశనం.. శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
బిజినెస్
యువత కోసం.. సరికొత్త బీమా పాలసీ
నేటి తరం యువత మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్టివ్ యువ’ పేరుతో సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాకుండా, పాలసీదారులు నిత్యం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.ప్రతిరోజూ కనీసం 10 వేల అడుగులు నడవడం లేదా ఒకే వ్యాయామ సెషన్లో 300 కేలరీలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు రివార్డులు పొందవచ్చు. మెరుగైన ‘హెల్తీ హార్ట్ స్కోర్’ కొనసాగించిన వారు తమ వార్షిక ప్రీమియంలో 100 శాతం వరకు తిరిగి పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. బీమాను కేవలం అత్యవసర వైద్య సాయంలా కాకుండా, రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చేలా ‘యాక్టివ్ యువ’ను రూపొందించినట్లు కంపెనీ సీఈవో మయాంక్ బత్వాల్ తెలిపారు.
ఐటీఆర్ ఫైలింగ్.. జూలై 31 లాస్ట్ డేట్!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు వేయవలసిన ఆదాయపు రిటర్నులలో రెండు ఫారాలు ఉంటాయి. ఒకటి నంబర్ 1, రెండోది నంబర్ 4. వీటిని దాఖలు చేయడానికి డిపార్టుమెంటు వారి తరఫున ప్లాట్‌ఫాం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన యుటిలిటీలను, సాధనాలను వారు సన్నద్ధం చేశారు. ఈ వారం ఐటీఆర్1 గురించి తెలుసుకుందాం. దీన్నే సహజ్ అని కూడా అంటారు. మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా వేయొచ్చు.ఎవరు దాఖలు చేయొచ్చు..కేవలం రెసిడెంట్ వ్యక్తులైన వారు మాత్రమే ఈ ఫారం ఐటీఆర్–1 లేదా సహజ్ వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారంను వేయడానికి లేదు. ఎంత ఆదాయం వచ్చే వారు వేయొచ్చు.. ఈ కింది మార్గాల్లో ఆదాయాలు వచ్చే వారు ఈ ఫారం వాడాలి. పెన్షన్జీతాలుఒకటి/రెండు ఇళ్ల మీద ఇంటద్దె వచ్చే వాళ్లుఇతర ఆదాయంవ్యవసాయ ఆదాయం రూ. 5000 లోపు ఉన్న వారుఇతర షరతులు..మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటిన వారు ఈ ఫారం కింద ఆదాయం డిక్లేర్ చేయకూడదు. భార్య ఆదాయం, పిల్లల ఆదాయం, భర్త కేసులో కలిపే సందర్భం ఏర్పడితే, రూ. 50,00,000 దాటనంత వరకు ఈ ఫారం వాడొచ్చు. రూ. 1,25,000 లోపల లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అటువంటి వారు ఫారం 1 వాడొచ్చు.ఏయే కాగితాలు ఉండాలి..పాత చట్టం ప్రకారం 16, 16ఎ, ప్రీమియం మొదలైన వాటి రశీదులు, అద్దె రశీదులు, మొదలైనవి మీ ఫైల్లో ఉండాలి. రిటర్నుతో పాటు జతపరచనవసరం లేదు కానీ రెడీగా ఉంచుకోండి.ఎవరు ఫారం 1 దాఖలు చేయకూడదు..మీ మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితే.వ్యవసాయం మీద నికర ఆదాయం రూ. 5,000 దాటితే.లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,25,000 దాటితే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగు రూ. 1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,250,000 వరకు పన్ను భారం ఉండదు. వృత్తి మీద ఆదాయం ఉన్నవారు.వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు.ఒకటి, రెండు దాటి .. అంటే మూడో ఇంటి మీద ఆదాయం వచ్చే వాళ్లు వేయకూడదు.ఏదైనా కంపెనీలో డైరెక్టర్ అయితేఅన్లిస్టెడ్ ఈక్విటీ షేర్ల మీద ఆదాయం ఉంటేవిదేశాల్లో ఆస్తులున్నా, వాటి మీద హక్కులున్నామీరు నాన్ రెసిడెంటు అయినావిదేశాల నుంచి ఆదాయం ఉన్నా194ఎన్ (పాత చట్టం) ప్రకారం టీడీఎస్ రికవరీ అయితే, అతి పెద్ద నగదు విత్‌డ్రాయల్స్ మీదఉద్యోగస్తుల స్టాక్ / షేర్ల మీద ఎటువంటి చెల్లింపులు, రికవరీలు ఉన్నాగత సంవత్సరపు సర్దుబాటు నష్టాలున్నాఏ ఆదాయం నుంచైనా సర్దుబాటు చేయాల్సిన నష్టాలున్నాచివరగా..ఫైలింగ్ చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయొచ్చు లేదా ఎక్సెల్లాంటి యుటిలిటీ ద్వారా డౌన్లోడ్ చేసి దాఖలు చేసుకోవచ్చు. ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మీరే స్వయంగా వేయొచ్చు లేదా వృత్తి నిపుణులు ఉన్నారు. సమాచారం సరైనది. సమగ్రమైనది. సంపూర్ణమైనది. రెడీగా ఉంటే సరైనదే, సమగ్రంగా, సంపూర్ణంగా, రెడీగా ఉంటే సులభతరంగా వేయొచ్చు. ఫారంలు చాలా స్నేహపూర్వకంగానే ఉంటాయి.
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే!
బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు పతనమైంది. అయితే వెండి రేటు మాత్రం రూ.10 వేలు పెరగడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ. మూడు లక్షలకు చేరుకుంది. ఇక్కడ లేటెస్ట్ పసిడి ధరలు ఎక్కడ, ఎలా.. ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా దెబ్బతినడంతో.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కేవలం విదేశీ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈఎంఐలు కట్టేవారిపై భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరాన్ సంక్షోభం కారణంగా.. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడటంతో.. ఈ ధరల పెరుగుదల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)పై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచే అవకాశం ఉంది.నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం!ఆర్బీఐ రేపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంలు పెరుగుతాయి. ఇది వారి నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఒక వైపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుండగా, మరోవైపు దేశీయ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇంధన సరఫరా త్వరగా స్థిరపడకపోతే.. రాబోయే దీపావళి నాటికి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
ఫ్యామిలీ
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్‌గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్‌తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో బ్లీడింగ్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్‌ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్‌కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్‌లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..)
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్‌గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్‌ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్‌గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్‌లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్‌లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?)
పేరెంట్ మార్క్ స్కాలర్షిప్స్
సంస్థలు ఇచ్చేది మార్కులకు స్కాలర్షిప్. కాని తల్లిదండ్రులు ఇవ్వాల్సింది బతుకుకు స్కాలర్షిప్. ఈ సెలవుల్లో పిల్లలకు నేర్పాల్సిన ఆరు లక్షణాలు: 1. కుతూహలం 2. ఓర్పు 3. సహానుభూతి 4. శ్రమ 5. ఓటమి ఒప్పుకోలు 6. కృతజ్ఞత... రోజుకో గంట. సెలవులు మరో 30 రోజులు. ఎలా నేర్పాలో చదవండి. చివరి రోజు ‘స్కాలర్షిప్ సర్టిఫికెట్’ ఇచ్చి వాళ్లు కోరిన సబబైన కానుక ఇవ్వండి. అదే అసలైన వేసవి ఫలితం. వేసవి సెలవులు ఇంకో 30 రోజులున్నాయి. ఆటలూ పాటలూ సరే. వాటితోపాటు కొన్ని వ్యకిత్వ గుణాల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలి. మార్కుల కోసం హితవు చెప్పినట్టే ఈ లక్షణాల పెంపు కోసం కూడా హితవు చెప్పాలి. అందుకు స్కాలర్షిప్లు ప్రకటించండి. పిల్లల్లో ఆరు ఉత్తమ లక్షణాలను నాటి, పెంచి, సెలవులు అయిపోయే రోజు ‘స్కాలర్షిప్’ పేరుతో వాళ్లు అడిగిన సబబైన కానుక ఇవ్వండి. ఆ కానుక అందుకునే సమయానికి పిల్లలు ‘మనిషి’గా తయారై ఉంటారు. అదీ సంతోషం. ఇంతకీ ఆ ఆరు లక్షణాలు ఏంటి? 1. కుతూహలం: ప్రశ్నించే గుణం లేకపోతే నేర్చుకునేది ఏదీ ఉండదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగే ధైర్యం నీలో ఉండాలి’ అని చెప్పాలి. ఇలా నేర్పాలి: రోజూ ‘ఈ రోజు నువ్వు అడిగే మూడు ప్రశ్నలు’ అని ఒక పేపర్ ఇవ్వండి. అందులో ప్రశ్నలు మీరే రాయండి. సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు? ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఇలా. జవాబు తెలుసుకోమనండి. ‘జవాబు నాక్కూడా తెలీదు, కలిసి వెతుకుదాం పద’ అనండి. నెట్లో కాదు. లైబ్రరీకి తీసుకెళ్లండి. ప్రశ్న లేకపోతే జీవితమే ప్రశ్నార్థకవుతుందని తెలియచేయండి.2. ఓర్పు: రీల్స్, షార్ట్స్ యుగంలో పిల్లలకు పది సెకన్ల కన్నా ఎక్కువ వేచి చూసే ఓపిక ఉండటం లేదు. ఓర్పు లేని వాడు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి అనే భావన సరికాదని తెలియచేయండి.ఇలా నేర్పాలి: ఒక మొక్క నాటించండి. రోజూ నీళ్లు పోయమనండి. ‘రేపటికి రేపు పండ్లు రావు. దానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పండి. ఓపిగ్గా చేయాల్సిన పజిల్స్, చెస్‌లో ఉంచండి. వంట చేయడం నేర్పండి. ‘సేమ్యా పాయసం ఉడకడానికి 20 నిమిషాలు ఆగాలి’ అని రుచి చూపించండి. ఈలోపు అతడు ఏడ్చినా, గొడవ చేసినా వెంటనే ఫోన్ ఇవ్వకండి. ‘ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా’ అనండి. ఓర్పుకు రివార్డ్ ఇవ్వండి. 3. సహానుభూతి: ‘సాటివాడికి నొప్పి అయితే నాకూ నొప్పే’ అనే భావన కలిగించాలి. క్లాస్‌లో 95 శాతం మార్కులు తెచ్చుకుని అన్ని మార్కులు రాని వారితో కలవకపోతే, వారిని సహానుభూతితో చూడకపోతే ఒంటరిగా మిగలక తప్పదని చెప్పండి. రేపు ఉద్యోగమైనా అంతే అని చెప్పండి. ప్రపంచాన్ని నడిపేది ఐక్యూ కాదని; ఈ.క్యూ (ఎమోషనల్ కోషియెంట్) అని చెప్పండి.ఇలా నేర్పాలి: పనిమనిషి, పాలవాడు, చెత్త ఎత్తే అన్నతో మాట్లాడించండి. ‘వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారు?’ అని అడగమనండి. వీధికుక్కకు, పక్షులకు నీళ్లు పెట్టమనండి. ‘దానికి దాహం అవుతుంది’ అని చెప్పండి. టీవీలో యుద్ధం వార్త వస్తే ‘అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లలేరు కదా’ అని చర్చ పెట్టండి.4. శ్రమ: ‘నా పని నేను చేసుకుంటా’ అనే దర్జా కలిగి ఉండటమే జీవితం అని నేర్పండి. ఫోన్లో మీటలు నొక్కుతూ ఏ.సి. రూమ్‌లో కూర్చుని ఆర్డర్ వేస్తే అన్నీ ముంగిటకొస్తాయనుకునే తరం తయారవుతోంది. ఇలాంటి వారు డేటా అయిపోయినా, కరెంట్ లేకపోయినా, స్విగ్గీబాయ్ రాకపోయినా మిడిగుడ్లేస్తారు. ఇలా నేర్పాలి: వాళ్ల పక్క వాళ్లతోనే సర్దించండి. ప్లేట్ కడిగించండి. వారానికి ఒకరోజు ‘నో స్విగ్గీ డే’. కలిసి అన్నం వండండి, చపాతీలు చేయించండి. తల్లి, తండ్రి ఎంత శ్రమ చేస్తారో ఆఫీస్, షాప్, పొలం చూపించండి. ‘ఇంట్లో ఫ్యాన్ తిరగడానికి బయట నాన్న ఎంత చెమటోడుస్తున్నాడో’ చూపించండి.5. ఒప్పుకునే గుణం ‘ఓడిపోయా. తప్పు నాదే. నెక్ట్స్ ట్రై చేస్తా’ అనిపించే తత్త్వం పిల్లల్లో ముఖ్యం. 99 మార్కులు వచ్చి ఒక మార్కుతో ఫస్ట్ ర్యాంక్ పోతే కుంగిపోయే పిల్లలున్నారు. ఆటల్లో ఓడిపోతే బ్యాట్ విరగ్గొడుతున్నారు. జీవితం ర్యాంకుల గేమ్ కాదు పడి లేచే గేమ్ అని వారికి తర్ఫీదు ఇవ్వండి.ఇలా నేర్పాలి: వాళ్లతో కలిసి క్యారమ్స్, చెస్ ఆడండి. కావాలని ఓడించండి. ‘ఓటమి కొత్త గేమ్‌కి టికెట్’ అని చెప్పండి. మీరు కూడా చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల ఓడిపోయిన ఉదంతాలు చెప్పండి. ‘నాన్న కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాడు’ అనండి. ‘ట్రై’ అనే మాటకు చాలా బలం ఉందని చెప్పండి. ఓడినా గెలిచినవారి కథలు వినిపించండి.6. కృతజ్ఞత: ‘ఇది నాకు ఊరికే రాలేదు’ అని గుర్తించే పిల్లలూ, గుర్తుంచుకునే పిల్లలే ముందుకు వెళతారు. అన్నీ ఉన్నా ‘ఇంకా ఏం లేదు’ అని ఏడ్చే పిల్లలు ఉంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడటం లేదు. కృతజ్ఞత లేని వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండడని చెప్పాలి.ఇలా నేర్పాలి: రాత్రి పడుకునే ముందు ‘ఈ రోజు నీకు నచ్చిన మూడు మంచి విషయాలు’ చెప్పమనండి. అన్నం తిన్నాను, సినిమాకు వెళ్లాను, ఫ్రెండ్ బ్యాట్‌తో ఆడుకున్నాను – ఇలా ఏదైనా. అన్నం వండిన అమ్మకు, సినిమా కు డబ్బు ఇచ్చిన నాన్నకు, బ్యాట్ ఇచ్చిన ఫ్రెండ్‌కు మనసులో థ్యాంక్స్ చెప్పుకోమనండి. ‘థ్యాంక్యూ కార్డ్’ చేయించండి. ‘గ్లాస్ నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్‌రా’ అనండి. పిల్లలూ నేర్చుకుంటారు. ముగింపు – స్కాలర్షిప్ డేసెలవులు అయిపోయే రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్. ‘నెల రోజుల స్కాలర్షిప్ ప్రోగ్రాం కంప్లీటెడ్’ అని సర్టిఫికెట్ మీ చేత్తో రాసి ఇవ్వండి. ‘నువ్వు స్కాలర్షిప్ గెలిచావ్. నీకు ఈ టెలిస్కోప్’ అని ఇవ్వండి. ఆ కానుక విలువ 500 కావచ్చు, 5000 కావచ్చు. ఎన్ని లక్షణాల్లో బాగా తర్ఫీదు అయ్యారో ఆ ప్రతి లక్షణానికి ఒక సర్టిఫికెట్, బహుమతి ఇవ్వండి. ఇవి జీవితాంతం గుర్తుంటాయి. ఆ లక్షణాలను కాపాడుకునేలా చేసి జీవితాంతం నడిపిస్తాయి.
అంతర్జాతీయం
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్‌కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది.
రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి
మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్లో మరో వ్యక్తి చనిపోయాడు.మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
యువతులపై ఆగని ఆగడాలు.. అలా చేస్తే పెళ్లికి అంగీకారమే
కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు. అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు. మహిళలపై కఠిన చట్టాలు కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.పార్కులు, జిమ్‌లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు
విజృంభిస్తున్న ఎబొలా.. WHO హెల్త్ ఎమర్జెన్సీ
కాంగోలో ఎబోలా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ దాదాపు 87 మంది మృతిచెందారు. దీంతో వరల్డ్ హల్త్ ఆర్గనైజేషన్ (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎబొలా వైరస్‌తో అట్టుడుకిపోతుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 87 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. తూర్పు ఇటూరి, బూనియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 347 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు నమోదైన 87 మరణాలలో... 57 మోంగ్వాలులో, 27 ర్వాంపారాలో, బునియా మూడు మరణాలు సంభవించాయి. అయితే (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఎబొలాను మహమ్మారి (Pandamic) గా మాత్రం ప్రకటించలేదు. ఈ వైరస్ లక్షణాలుప్రమాదకరమైన ఈ వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు.
జాతీయం
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్‌గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్‌ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్‌ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్‌స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్‌లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్‌ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్‌కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్‌గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్‌లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్‌ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్‌లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్‌గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్‌లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్‌కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్‌లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్‌మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు.
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు.
విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
సాక్షి, చెన్నై: అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్ డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది."మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్ విసిరారు.కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది. దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు
కాంగ్పోక్పి: మణిపూర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయుధ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలను ప్రాణాలతో రక్షించేందుకు భద్రతా దళాలు భారీ ‘ఆపరేషన్ రెస్క్యూ’ను ప్రారంభించగా, మరోవైపు తమ వారిని విడిపించాలంటూ గిరిజన సంఘాలు జాతీయ రహదారులను దిగ్బంధించడంతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మే 13న జరిగిన దాడుల తర్వాత మొదలైన ఈ బందీల వ్యవహారం పతాక స్థాయికి చేరుకుని, ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతోంది.ఆపరేషన్ రెస్క్యూ షురూకాంగ్పోక్పి జిల్లాలో సాయుధ దళాల ఆధీనంలో ఉన్న వ్యక్తులను రక్షించేందుకు సోమవారం భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేపట్టాయి. అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తూ, బందీలను పట్టుకున్న వారి కోసం గాలిస్తున్నాయి. మే 14, 15 తేదీల్లో కుకీ, నాగా వర్గాలకు చెందిన దాదాపు 38 మందిలో 31 మంది బందీలను ఇప్పటికే భద్రతా దళాలు సురక్షితంగా విడిపించాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశాయి.కలకలం రేపిన కిడ్నాప్‌లు ఈ కిడ్నాప్‌ల పర్వానికి మే 13న జరిగిన హింసాత్మక ఘటనలే ప్రధాన కారణం. కాంగ్పోక్పిలో ముగ్గురు చర్చి నాయకులను అనుమానిత మిలిటెంట్లు దారుణంగా కాల్చి చంపగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నోనీ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఒక పౌరుడు మృతి చెందగా, అతని భార్య గాయపడింది. ఈ దాడుల అనంతరం మిలిటెంట్లు పలువురిని కిడ్నాప్ చేసి, ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు.హైవేల దిగ్బంధం - గిరిజనుల ఆందోళన బందీలందరినీ తక్షణమే సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆదివారం రాత్రి నుండి 2, 37వ జాతీయ రహదారులను పూర్తిగా దిగ్బంధించింది. ఇంకా ఆరుగురు నాగా యువకులు మిలిటెంట్ల చెరలో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో, తమ వర్గానికి చెందిన 14 మంది సెనాపతి జిల్లాలో వివిధ సాయుధ వర్గాల చేతిలో ఇంకా బందీలుగానే ఉన్నారని కుకీ ఇన్పి మణిపూర్ ప్రకటించడంతో రాష్ట్రంలో పరిస్థితి మరింత అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్ఆర్ఐ
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
క్రైమ్
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
వీడియోలు
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
లోకేష్ ని రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
బయటపడ్డ బుద్ధా వెంకన్న.. అల్లుడి అరాచకాలు కన్నీళ్లు పెట్టుకున్న బాధితుడు
జనసైనికులతో పవన్ కీలక వ్యాఖ్యలు టీడీపీతో పొత్తు ఇక లేనట్టే?
నీకు చేతకాకపోతే నోరు మూసుకో.. బాబుపై సిపిఐ నారాయణ ఫైర్
వాడెవడు నా మీద కేసు పెట్టడానికి పేర్ని నాని ఉగ్రరూపం


