తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్ | weather forecast in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్

May 18 2026 7:03 PM | Updated on May 18 2026 7:12 PM

weather forecast in telangana

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర తలు నమోదు కావొచ్చని హెచ్చరిం చింది.

ఆదివారం రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణో గ్రత 44.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.

ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వడగాడ్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్య వసరమైతే తప్ప మండే ఎండల్లో (మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు) అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా తీవ్ర తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, స్పృహ కోల్పోయే అవకాశమూ ఉందని.. కండరాలు బలహీనపడి తిమ్మిర్లు రావచ్చని వివరించింది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించింది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తగిన వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టంచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement