కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. మొదటి రోజే ఆర్థిక సమస్యలు రావడంతో ఒక్క రోజు ఆలస్యంగా థియేటర్లో రిలీజైంది. గురువారమే విడుదల కావాల్సి ఉండగా.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది.
ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే సెంచరీ మార్క్ కొట్టేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే రూ. 68 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా వసూళ్లు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రూ. 78.75 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్‌సీస్‌లో రూ. 42 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఆదివారం ఒక్కరోజే రూ. 28.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
కాగా.. ఈ చిత్రంలో, సూర్య.. శరవణన్ అనే లాయర్ పాత్రను పోషించారు. దోపిడీకి గురై, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థలో చిక్కుకున్న తండ్రీకూతుళ్ల కథగా ఈ మూవీని తెరకెక్కించారు.


