breaking news
Andhra Pradesh State Road Transport Corporation (APSRTC)
-
చంద్రబాబు కార్మికుల ద్రోహి : భూమన
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల ద్రోహి అని వైఎస్సార్సీపీ భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన గతంలో ఆర్టీసీని ప్రైవేటీకరం చేయడానికి ప్రయత్నించాడని, ఇప్పుడు తిరుపతి ఆర్టీసీ గ్యారేజిని ఇతర ప్రాంతాలకు తరలించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్యారేజీని తరలించడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. కార్మీకులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఫ్రెండ్లీ కండక్టర్ మూర్తి
సాక్షి కడప/సెవెన్‌రోడ్స్ : కడప–రాయచోటి మధ్య రోజూ ప్రయాణించే వ్యక్తులు పలమనేరు ఆర్టీసీ డిపో బస్సు కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో చిత్తూరు, మదనపల్లె, బెంగళూరు, రాయచోటి నాన్‌స్టాఫ్ బస్సులు వచ్చినప్పటికీ ప్రయాణికులు అందులో ఎక్కరు. ఆ బస్సుల్లో ఎక్కితే ముందే గమ్య స్థానానికి చేరుకోవచ్చని తెలిసినప్పటికీ పలమనేరు డిపో బస్సు కోసమే వేచి ఉంటారు. ఈ కథనం చదివే పాఠకులకు ఇది కొంత వింతగానే అనిపిస్తుంది. కానీ ఇది ముమ్మాటికి నిజం. పలమనేరు బస్సు కండక్టర్ బ్రాహ్మణపల్లె గురుమూర్తి ఇందుకు కారణం. ఆయనేమీ సూపర్‌స్టార్ కాదు. ఒక సాధారణ కండక్టర్‌కు ఇంత ఫాలోయింగ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? అలాగైతే మంగళ, గురు, శనివారాలలో కడప ఆర్టీసీ బస్టాండులో సాయంత్రం 6 గంటలకు పలమనేరు బస్సు ఎక్కితే అర్థమవుతుంది. ప్రయాణికుల పట్ల ఆయన చూపే గౌరవ మర్యాదలే ఇంతటి అభిమానానికి కారణం. ప్రయాణికులు బస్సు ఎక్కే సందర్భంలో డ్రైవర్ వెనుక మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వడంటూ కండక్టర్ గురుమూర్తి అందరినీ అభ్యర్తిస్తుంటారు. ఎవరైనా పురుషులు ఆ సీట్లలో కూర్చుంటే ‘ప్లీజ్ సార్...దయచేసి ప్రక్కసీట్లలో వెళ్లి కూర్చోండి’అంటూ వినమ్రంగా చెబుతారు. బస్సు ఇతర వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో, గువ్వలచెరువు ఘాట్‌లో మలుపులు తిరిగేటపుడు డ్రైవర్ పక్కనే నిలుచుని తగు సూచనలు అందిస్తుంటారు. అందరూ ‘రైట్’అనడం పరిపాటి. అయితే గురుమూర్తి మాత్రం తమదైన చిత్తూరుజిల్లా యాసలో ‘రైట్టు...రైట్టు’అంటూ డ్రైవర్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే నోటితో ఆయన వేసే విచిత్రమైన విజిల్ ప్రయాణీకులంతా ఆసక్తిగా వింటుంటారు. చిల్లర ప్లీజ్ చాలామంది టిక్కెట్టుకు సరిపడు చిల్లర ఇవ్వకపోవడం సర్వసాధారణం. ఎవరైనా తక్కువ టిక్కెట్టుకు పెద్దనోట్లు ఇచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం విసిగించుకోరు. పైగా ఎవరైనా ప్రయాణికుడు తమకు రావాల్సిన చిల్లర మరిచిపోయి వెళ్లిపోతారని ముందస్తుగా అడిగి మరీ చిల్లర అందిస్తారు. కడప నుంచి సాయంత్రం పలమనేరుకు వెళ్లే సమయంలో రాత్రి 8 గంటకల్లా బస్సు రాయచోటికి చేరాలని ఆయన తాపత్రయ పడుతుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు రాయచోటి నుంచి ప్రయాణికులను తీసుకెళుతుందని ఈయన ఆందోళన. అంటే ఆదాయం ఏపీఎస్ఆర్టీసీకి దక్కాలనే తపన ఆయనది. ఎందరో అభిమానులు రాయచోటికి చెందిన పలువురు కడపలో ఉద్యోగాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వీరంతా రోజూ రాయచోటి–కడప మధ్య ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. కండక్టర్ గురుమూర్తి ప్రయాణికులకు ఇచ్చే గౌరవ మర్యాదలకు వీరంతా ఆకర్షితులయ్యారు. గురుమూర్తి ఒక కండక్టర్‌గా కాకుండా తమ స్నేహితునిగా భావిస్తారు. బస్సు దిగే సమయంలో ‘మూర్తి వెళ్లొస్తాం’అంటూ సెలవు తీసుకోవడం పరిపాటి. ఉత్తమ కండక్టర్‌గా అవార్డులు చిత్తూరుజిల్లా తవనంపల్లె మండలం అరగొండ సమీపంలోని గాజులపల్లెకు చెందిన గురుమూర్తి కండక్టర్‌గా కుప్పం డిపోలో మొదటిసారిగా పనిచేశారు. తర్వాత పలమనేరు డిపోకు బదిలీపై వచ్చిన కండక్టర్ గురుమూర్తికి పలుమార్లు అవార్డులు వరించాయి. మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కండక్టర్ అవార్డులను అందుకున్నారు. ప్రయాణికులతో అనుక్షణం కలిసిపోతూ....మనలో ఒకరిలా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రయాణికుల సంగతి అటుంచితే సంస్థలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గురుమూర్తి. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఒక కిలోమీటరుకు ఈపీకే (ఎర్నింగ్ పర్ కిలోమీటరు) రూ. 17–20 ఉండగా, అలాంటిది చిత్తూరు–తిరుమల సర్వీసులో 479 కిలోమీటర్లు తిప్పి కిలో మీటరుకు రూ. 50 ఈపీకే సాధించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో ఇది రాష్ట్రంలోనే మొదటి స్థానమని సంబం«ధిత డిపో మేనేజర్ గురుమూర్తిని అభినందించిన ఘటనలు ఉన్నాయి. కలెక్షన్ కింగ్ ఆర్టీసీసంస్థకు రాబడిలోనూ గురుమూర్తి ఆరాటం ఫలిస్తోంది. కుప్పం, పలమనేరు ఇలా అన్నిచోట్ల...ఏ రూటుకు బస్సు పోయినా గురుమూర్తి కలెక్షన్ల కింగ్‌గా మారిపోయారు. ఇప్పటికే పలమనేరు పరిధిలో ఆర్టీసీ బస్సులో అధిక ఆదాయాన్ని తీసుకువస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వరుసగా కడప–పలమనేరు మధ్య తిరుగుతున్న బస్సు ద్వారా అత్యధిక ఆదాయం ఒనగూరుస్తూ ప్రతినెల ప్రశంసాపత్రం అందుకుంటున్నారు. ఇలా వరుసగా ఐదు నెలలుగా ప్రతినెల అధిక ఆదాయ గుర్తింపు గురుమూర్తికే లభిస్తోంది. సినిమారంగం నుంచి అనుకోకుండా కండక్టర్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గురుమూర్తికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. ఇంటర్ చదువుతున్న సమయంలో చదువుకు స్వస్తి చెప్పి సినిమాపై ఉన్న అభిమానంతో చెన్నైకి వెళ్లారు. ఇష్టమైన సినిమా రంగంలో రాణించడం కోసం కష్టాలు పడుతూ ఎట్టకేలకు ఓ సంస్థలో ప్రొడెక్షన్ చీఫ్‌గా చేరారు. ఇతను పనిచేసిన సంస్థ చిరంజీవి హీరోగానే సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో కూడా ‘గురు’మూర్తికి మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా మూర్తి కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో నేరుగా సొంతూరు వచ్చారు. సినిమా రంగంపై ఆశ వదలుకున్నారు. కుటుంబ భారం మీద పడడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగం కోసం ఆలోచన చేస్తున్న సమయంలోనే పదవ తరగతి అర్హతతో కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే దరఖాస్తు చేశారు. వెంటనే ఉద్యోగం రావడం, అందులో చేరడం కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రయాణీకుల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. -
విజయకేతనం
సాక్షి కడప : ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గురువారం జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా...పలుచోట్ల ఎన్ఎంయూ, ఇంకొన్నిచోట్ల ఎంప్లాయీస్ యూనియన్ ఐక్యకూటమి విజయకేతనం ఎగురవేశాయి. పది రోజులు గా ఆర్టీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు, మంతనాలతో హడావుడిగా కనిపించిన కార్మిక నేతలు ఈ విజయంతో ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగిపోయారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎన్నికల పోలింగ్ జరగ్గా, సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌తో ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఐదుచోట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్ విజయకేతనం ఎగుర వేయగా, మూడు డిపోలతోపాటు వర్క్‌షాప్‌లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి భారీ మెజార్టీతో గెలుపును కైవసం చేసుకుంది. భారీగా పోలింగ్ జిల్లాలో ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి అన్నిచోట్ల భారీగా పోలింగ్ నమోదైంది. జమ్మలమడుగు డిపో పరిధిలో 100 శాతం ఓటింగ్‌నమోదు కాగా, మైదుకూరు, రాయచోటి, రాజంపేట, బద్వేలులో కూడా 98 నుంచి 99 శాతం ఓటింగ్ నమోదైంది. అంతేకాకుండా పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, వర్క్‌షాప్‌లో కూడా కార్మికులందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డ్యూటీలకు వెళుతున్న డ్రైవర్లు, కండక్లర్లు, ఇతర కార్మికులు గురువారం తెల్లవారుజామునే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం కూడా కొంతమంది క్యూలైన్లలో ఉండి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు కావడంతో ఎక్కడికక్కడ డిపోల పరిధిలో సందడి వాతావరణం నెలకొంది. కడపలో ఈయూ ఐక్యకూటమి విజయం కడపలో ఈయూ ఐక్య కూటమి విజయకేతనం ఎగురవేసింది. అందులోనూ జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజంపేట, కడప డిపో, వర్క్‌షాప్‌లలో ఈయూకు భారీ మెజార్టీని కార్మికులు అందించారు. కడప డిపోతో పాటు వర్క్‌షాప్‌లోనూ ఈయూ కూటమి గెలుపును అందుకుంది. రాజంపేట, ప్రొద్దుటూరుల్లో కూటమికి విజయం లభించింది. ఐదుచోట్ల ఎన్ఎంయూ గెలుపు జిల్లాలో నేషనల్ మజ్దూర్ యూనియన్ పలుచోట్ల విజయం సాధించింది. రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, పులివెందులలో గెలుపుబాటలో పయనించింది. జిల్లాలోని పలు డిపోల పరిధిలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్ఎంయూ హవా కనిపించింది. ఆ ఐదు డిపోల పరిధిలో ఎన్ఎంయూకు రాష్ట్రస్థాయిలో కార్మికులు మెజార్టీని అందించారు. బద్వేలులో ఉత్కంఠ బద్వేలు డిపో పరిధిలో కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. రెండు యూనియన్లకు సంబంధించి ఓట్ల కౌంటింగ్‌లో సరిసమానంగా వస్తుండడంతో ఉత్కంఠం నెలకొంది. అయితే డిపో పరిధిలో 292 ఓట్లు ఉండగా, 290 ఓట్లు పోలయ్యాయి. డిపో పరిధిలో ఎన్ఎంయూకు 147 ఓట్లు రాగా, ఈయూ ఐక్య కూటమికి 142 ఓట్లు వచ్చాయి. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. దీంతో ఎన్ఎంయూకు కేవలం ఐదు ఓట్ల మెజార్టీ మాత్రమే లభించింది. రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్ఎంయూకు బద్వేలు డిపో పరిధిలో 150 ఓట్లు వస్తే, ఈయూ కూటమికి 140 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 9 ఓట్ల స్వల్ప మెజార్టీ మాత్రమే లభించింది. ఐక్య కూటమికి పట్టం కట్టిన కార్మికులు జిల్లాలో ఈయూ ఐక్య కూటమికీ ఆర్టీసీ కార్మికులు పట్టం కట్టారు. ఎంప్లాయీస్ యూనియన్, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్యంగా పోటీకి తలపడడంతో కార్మికులు ఆ కూటమికి అండగా నిలిచారు. ఐక్య కూటమి తరఫున కడప రీజనల్ వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు కేటాయించారు. ఎన్నికల్లో ఎన్ఎంయూ కాగడా గుర్తు, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ టేబుల్ ఫ్యాను గుర్తుపై తలపడ్డారు. కాగా ఆర్టీసీ కార్మికులు ఆత్మప్రభోదానుసారం ఓటు వేసుకోవాలని ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికులకు అండగా ఐక్య కూటమి నిలుస్తోందని భావించిన ఓటర్లు పట్టం కట్టారు. జిల్లావ్యాప్తంగా ఎన్ఎంయూ కంటే ఎంప్లాయీస్ ఐక్య కూటమికీ 172 ఓట్లు ఆధిక్యత లభించింది. వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ నాయకులు పారదర్శక పిలుపుతో ఈయూ ఐక్య కూటమికి కార్మికులు అండగా నిలవడం విశేషం. ఇక పోస్టల్ బ్యాలెట్లు 59 ఉన్నాయి. వీటిని 13న లెక్కించనున్నారు. వీటిలో కేవలం 30 ఓట్లు లభిస్తే ఈయూ ఐక్య కూటమి కడప రీజియన్‌ను కైవసం చేసుకోనుంది. -
ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ గెలుపు
-
కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలోని 128 డిపోల్లో పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, బస్ భవన్లలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్‌ఎమ్‌యూ, ఈయూల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. రాత్రి 10.30 గంటల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
శిక్షలకు చెల్లు చీటీ!
గుంటూరు, సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) లో విధి నిర్వహణ కత్తిమీద సాము. బస్సు డిపో నుంచి బయటకు తీసినప్పటి నుంచి మళ్లీ లోపలికి తీసుకెళ్లేవరకు కార్మికులకు క్షణక్షణం పరీక్షలాంటిదే. చార్జీల వసూళ్లలో ఒక్క రూపాయి తగ్గినా, తనకు తెలియకుండా బస్సుకు చిన్న గీత పడినా శిక్షలు పెద్దవిగా ఉండేవి. చిన్న తప్పిదాలకు పెద్ద శిక్షలు పడడంతో కార్మికులతో పాటు కుటుంబసభ్యులూ మానసికంగా క్షోభను అనుభవించేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం యాజమాన్యం కార్మికుడు ఆరు తప్పులు చేసినా శిక్షలు వేయకుండా వెసులుబాటు కల్పించింది. చిన్నచిన్న పొరపాట్లకు శిక్షలు వేయకుండా పాయింట్లు కేటాయిస్తుంది. ఆరు తప్పిదాల వరకు ఇంక్రిమెంట్లలో కోత విధించడం, ఏడు తప్పుల తర్వాత విధుల నుంచి తొలగిస్తారు. నిర్ణీత పాయింటు ముగిసిన తర్వాత శిక్షలు అమలు చేస్తారు. కార్మికులకు శిక్షలు తగ్గిస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు విడుదల చేసిన ఉత్తర్వులపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు శిక్షల విధింపులో మార్పులు తీసుకొచ్చినా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీలో తప్పిదాలు,శిక్షలు ఇలా... n బస్సు కండక్టర్ విధి నిర్వహణలో వచ్చిన నగదును అధికారులకు అప్పజెబుతారు. ఈ సమయంలో ఒక్క రూపాయి తక్కువ వచ్చినా సస్పెండ్ లేదా విధుల నుంచి తొలగిస్తారు. n బస్సు డ్రైవర్ తప్పిదం లేకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాణహాని జరుగుతుంది. ఇలాంటి కేసుల్లోనూ తన తప్పిదం లేకపోయినా కార్మికులను సస్పెండ్ చేయడం, విధుల నుంచి తొలగించడం చేస్తున్నారు. n డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అనవసరంగా> కార్మికులకు శిక్షలు వేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ యంత్రం సరిగ్గా పనిచేయకపోవడం వలన మద్యం తాగినట్టు చూపుతోంది. ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. ఈ తప్పులకు కార్మికులను విధుల నుంచి పక్కన పెట్టడం, ఇంక్రిమెంట్లలో కోత విధిస్తున్నారు. n బస్సు ప్రయాణం సమయంలో విడి భాగాలు పనిచేయకపోయినా, టైరు పగిలిపోయినా కార్మికులకు శిక్షలు అమలు చేస్తున్నారు. తమ ప్రమేయం లేకపోయినా బాధ్యులను చేయడం సరికాదని చెబుతున్నారు. ఈ శిక్షకు వేతనంలో ఇంక్రిమెంట్లో కోత విధిస్తున్నారు. n బస్సు ప్రయాణించే సమయంలో టైరు పగిలితే అజాగ్రత్తగా వ్యవహరించారంటూ రూ.500 వసూలు చేస్తున్నారు. n నిర్దేశించిన కేఎంపీఎల్ సాధించకపోతే జిల్లా కేంద్రానికి శిక్షణ నిమిత్తం పంపుతున్నారు. n స్పీడ్ బ్రేకర్ల ద్వారా బస్సు విడిభాగాలు దెబ్బతింటే ఇంక్రిమెంట్లు, ఇన్సింటివ్లో కోత విధిస్తున్నారు. n సమయపాలన పాటించకపోయినా శిక్షలు అమలు చేస్తున్నారు. శిక్షల తగ్గింపుతోమానసిక ప్రశాంతత ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లుగా విధులు నిర్వహించడం కొంత కష్టంతో కూడుకున్న పనే. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి తప్పులకు కూడా శిక్షలు తప్పవు. శిక్షలు వేయడం వలన కార్మికులు మానసికంగా క్షోభ అనుభవిస్తారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఒత్తిడి ఆందోళన, ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. మనస్ఫూర్తిగా పనిచేయవచ్చు. ముఖ్యంగా కార్మికులకు భద్రత ఉంటుంది. –జి.నాగేంద్రప్రసాద్,ఆర్టీసీ ఆర్ఎం, గుంటూరు -
అద్దె బస్సుల రెన్యువల్‌కూ ఉందో రేటు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ‘అద్దె బస్సుల ఒప్పందం’ వివాదాస్పదంగా మారింది. కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయడానికి వీల్లేదని అధికారులు అంటున్నా. తాజాగా టెండర్లు పిలవాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించినా.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలకనేత వినిపించుకోవడంలేదు. ఎందుకంటే అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యువల్ చేసేందుకు ఉత్తరాంధ్రకే చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా ఆయన డీల్ కుదుర్చుకున్నారు మరి. దాదాపు 140 అద్దె బస్సుల ఒప్పందం 2008, 2009లో ఆర్టీసీ దాదాపు 140 అద్దె బస్సుల్ని తీసుకుంది. వాటిలో పల్లెవెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. వాటి ఒప్పంద కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. దాంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా 6 నెలలకు పొడిగించారు. ఈ సెప్టెంబర్ 30తో ఆ గడువు ముగియనుంది. గతేడాది కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాలను ఆర్టీసీ రెన్యువల్ చేసింది. అయితే అప్పట్లో ఆర్టీసీ పాలకమండలి లేదు. దాంతో అధికారులు ఒప్పందాన్ని రెన్యూవల్ చేసి ఇటీవల పాలకమండలి నియామకం తర్వాత ర్యాటిఫికేషన్ చేశారు. అదే రీతిలో ఈ ఏడాది మార్చితో కాలపరిమితి ముగిసిన 140 బస్సుల ఒప్పందాలను కూడా రెన్యువల్ చేయాలని అద్దె బస్సుల యజమానులు కోరారు. ఆర్టీసీ పాలకమండలికి చెందిన ‘పెద్ద’ అందుకు సమ్మతించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఎంఎస్టీసీ నిబంధనల ప్రకారం అద్దె బస్సుల కోసం ఆన్లైన్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఆర్టీసీ పాలకమండలిలో మెజార్టీ సభ్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమేరకు తీర్మానం ఆమోదించారు. దీంతో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. కీలక నేతతో డీల్.. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతను ఆశ్రయించారు. ఆయన సామాజికవర్గానికే చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అంతా తానై ఈ కథ నడిపించారు. ఆ ఎమ్మెల్సీ సూచన మేరకు అద్దెబస్సుల యజమానులు ఈ నెల 10 విజయవాడలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 9 ఏళ్ల పాటు ఒప్పందాన్ని రెన్యువల్ చేసేందుకు ఎమ్మెల్సీ ప్రతిపాదించిన డీల్‌మీద చర్చించారు. ఒక్కో బస్సుకు రూ.50 వేల చొప్పున వసూలు చేసి ఉత్తరాంధ్ర కీలకనేతకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దాదాపు రూ.70 లక్షలు ఉత్తరాంధ్ర కీలక నేతకు ముట్టజెప్పనున్నారన్నమాట. ఇక ఎమ్మెల్సీకి, ఆర్టీసీ పెద్దకు, జోనల్‌స్థాయి ప్రతినిధులకు ముడుపులు దీనికి అదనం. టెండర్ల ప్రక్రియకు బ్రేక్..? డీల్ కుదిరిన విషయాన్ని ఎమ్మెల్సీ కీలక నేతకు తెలిపారు. దాంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. అద్దె బస్సుల కోసం తాజాగా టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని మౌఖికంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల ఒప్పందాలను నిబంధనలకు విరుద్ధంగా రెన్యూవల్ చేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి కీలక నేత ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ అయితే తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే ఆ కీలక నేత పట్టుబడుతుండటంతో అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయకతప్పదని తేల్చిచెబుతున్నారు. -
పెట్టుబడులు లేకపోవడం మా దౌర్భాగ్యం
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల జీతాలు పెరగాల్సిన అవసరముందని, తాము మిగతా వాళ్లలా రేట్లు పెంచుకోలేమని, ఆర్టీసీలో పెట్టుబడులు లేకపోవడం తమ దౌర్భాగ్యమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..వ్యవస్థలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని, ఆర్టీసీ మంచి ప్రజా రవాణా సంస్థ అని, తన కాళ్ల పై తాను నిలబడేందుకు ఆర్టీసీ కృషి చేస్తుందని చెప్పారు. ఆటోలు కూడా తమకు కాంపిటీషనేనని, చిన్నచిన్న వాళ్లతో కూడా పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. టీ-వాలెట్ కేటీఆర్ మానస పుత్రిక అని, ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయిస్తానని వెల్లడించారు. 13 వేల మంది ఆన్లైన్ ద్వారా, 6 వేల మంది ఈ-టికెట్ ద్వారా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు.ఆర్టీసీలో ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, బయటికి పంపించి వేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో అక్రమాలపై విచారణ జరుపుతున్నామని, 5 లక్షల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసీ ఒకరోజులో వాడుతోందని తెలిపారు. ఎలాంటి కండిషన్ లేకుండా టెండర్ రేట్ ప్రకారం బయోడీజిల్ తీసుకుంటామని, తమకు లక్ష లీటర్ల బయోడీజిల్ అవసరముందని వెల్లడించారు. ప్రభుత్వ నిధులు ఇవ్వని సందర్భంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నామని వివరించారు. తాము 700 కోట్ల రూపాయలతో ఆర్టీసీని నడుపుతున్నామని..3 నెలలు జీతాలు ఆలస్యం అయితే చచ్చిపోతారా అని ప్రశ్నించారు. ఎవరూ కూడా ప్రెస్టీజ్‌గా ఫీల్ కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆస్తుల విభజన అనగానే ఏపీ అధికారులు పారిపోతున్నారని, తెలంగాణ ఆస్తుల మీద ఏపీకి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి బస్‌భవన్ బిల్డింగ్‌పై 52 శాతం మాత్రమే హక్కు ఉందని వెల్లడించారు. -
మరోసారి వర్ల రామయ్య నిర్లక్ష్యపు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మెన్ వర్ల రామయ్య మరోసారి నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఆర్టీసీపై అధ్యయనానికి ఆయన మూడు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ.. హత్య చేస్తే జైలుకు వెళ్తారని అందరికీ తెలసునని, కానీ ఎంత మంది ఊరుకుంటున్నారని, శిక్ష పడుతుందని తెలినసినా హత్యలకు పాల్పడుతున్నారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఏపీలో ప్రైవేట్ బస్సుల కల్చర్ ఇప్పటిది కాదని, దానికి చంద్రబాబు అనడం సరికాదన్నారు. ప్రయాణికుల్లో మార్పు రావాలని, ప్రైవేటు బస్సుల్లో ప్రయానించొద్దు అనే ఉద్యమాన్ని ప్రజలే తీసుకు రావాలంటూ వ్యాఖ్యానించారు. బస్సు స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ టికెట్స్ అమ్మవద్దని రూల్ ఉందని, కానీ ఎవరు రూల్స్ పాటిస్తారంటూ మాట్లాడారు. గుజరాత్లో ఆర్టీసీ ప్రయాణాలు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధి చూసి ఏపీలో ప్లాన్ చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నారని అన్నారు. గుజరాత్లో ప్రత్యేక మార్గం ఉందని అందుకే అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు. గుజరాత్ పర్యటన అనంతరం ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో బస్‌స్టాపుల నిర్మాణంపై సీఎంకు ప్లాన్ ఇస్తామని చెప్పారు. బస్టాండ్ కి వచ్చిన ప్రయాణికులకు షాపింగ్స్, సినిమాలు, హోటల్స్ అన్ని అక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నిర్మాణాల కోసం ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్ట్ కోసం ముందుకు రావాలని కోరారు. -
1,500 మంది ఆశలపై నీళ్లు..
-
ఆర్టీసీలో కారుణ్యం రద్దు
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై యాజమాన్యం కాఠిన్యం ప్రదర్శిస్తోంది. ఇకపై ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా తనువు చాలిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. గత ఆర్టీసీ బోర్డులోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వివరాల్లోకి వెళ్తే.. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాల విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే, 1996–2000 మధ్య కాలంలో గతంలో చంద్రబాబు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు నిలిపేశారు. ఇప్పుడు కూడా ఆయన హయాంలో ఏకంగా కారుణ్య నియామకాలను రద్దుచేయడం గమనార్హం. కాగా, సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం సుమారు 1,500 మందిపై ప్రభావం చూపనుంది. మరోవైపు.. కారుణ్య నియామకాలకు సంబంధించి నిబంధనల పేరుతో వంద మంది మహిళా అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై అక్కడి యాజమాన్యం అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఉద్యోగం ఇవ్వకుండా అదనంగా కొంత మొత్తం ప్రయోజనం కల్పించే విధానం) అమలుచేస్తున్నారని, ఇక్కడ అదే విధానాన్ని అమలుచేస్తున్నట్లు సంస్థ చెబుతున్నప్పటికీ ‘రద్దు’ నిర్ణయాన్ని మాత్రం యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఏఎంబీలోనూ వివక్ష కారుణ్య నియామకం లేకుండా అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఏఎంబీ) కింద గతంలో రూ.లక్ష ఇచ్చేవారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి కొంత మొత్తం ఆర్టీసీ అందించే వీలుంది. 3, 4వ తరగతి ఉద్యోగి అయితే వారి కుటుంబానికి రూ.లక్ష.. రెండో తరగతి అంటే సూపర్వైజర్గా పనిచేసే ఉద్యోగి కుటుంబానికి రూ.1.25 లక్షలు, ఆఫీసర్ కేడర్ అయితే రూ.1.50 లక్షలు అందేలా ఏర్పాటుచేశారు. అయితే, ఇప్పుడు అన్ని కేడర్లకు ఒకే విధంగా రూ.5 లక్షలు అందించే విధంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 18 నుంచి అమలులోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చారు. 1,500మందికి మొండిచెయ్యి ఇదిలా ఉంటే.. మూడేళ్లుగా కారుణ్య నియామకాలు కోసం సుమారు 1,500 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగం వద్దని.. తమకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కాళ్లరిగేలా సంస్థ చుట్టూ తిరుగుతున్నారు. అయితే, వీరికి కేవలం రూ.లక్ష మాత్రమే ఇస్తామని, పెంచిన రూ.5 లక్షలు ప్రయోజనం వీరికి వర్తించదని ఆర్టీసీ తెగేసి చెబుతోంది. అలాగే, ఉద్యోగి చనిపోతేనే కాదు.. మెడికల్‌గా అన్‌ఫిట్ అయిన ఉద్యోగి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని 2015లో చెప్పిన యాజమాన్యం ఇప్పుడు దాని ఊసెత్తడంలేదు. దీంతో 200మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైగా ప్రభుత్వం అనుమతించిన కేడర్ పోస్టుల కంటే అదనంగా నియామకాలు చేస్తున్నారు. ఈడీలు మొదలుకుని ఆర్ఎంలు, డీవీఎంల కేడర్లలోనూ అధికంగా సిబ్బందిని నియమించుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందిని ఈ విధంగా నియమించుకుని ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని చెబుతూ కారుణ్య నియామకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: యూనియన్ నేతలు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు రద్దుచేస్తూ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎన్ఎంయూ, ఈయూ నేతలు రాజారెడ్డి, చంద్రయ్య, దామోదరరావులు తెలిపారు. కారుణ్య నియామకం వద్దనుకునే వారికి ఏఎంబీ కింద రూ.10 లక్షలు అందించాలని వారు డిమాండ్ చేశారు. -
నవ్య, క్యాట్ కార్డులు ఇక బంద్
ఒంగోలు సెంట్రల్: ఆర్టీసీ బస్సుల్లో రాయితీతో ప్రయాణించేందుకు ఉద్దేశించిన నవ్య, క్యాట్ కార్డులను బుధవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు జేబులకు చిల్లులు పడనున్నాయి. రాయితీ వలన ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తుందనే సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో దాదాపు 30 వేలకు పైగా ఇలాంటి కార్డులున్నాయి. రూ. 250 చెల్లిస్తే సంవత్సరం మొత్తం 10 శాతం రాయితీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. దీంతో ఎక్కువగా ప్రయాణించే వారు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తీసుకొనేవారు. తాజా నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. అక్యుపెన్సీ రేటును తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయిం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డుల ద్వారా 30 కిలో మీటర్ల దూరం దాటితే రాయితీ లభించేదని ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్ తెలిపారు. అయితే నూతనంగా కార్డుల జారీ నిలిపి వేశామని చిల్లర సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
ఆర్టీసీకి చమురుదెబ్బ!
సాక్షి, రాజంపేట : పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ సంస్థ కుదేలవుతోంది. చమురుదెబ్బతో విలవిలాడుతోంది. దీంతో మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. ఇంధన ధరల పెరుగుదలే నష్టాలకు కారణమని ఆర్టీసీ కార్మికవర్గాలు వాపోతున్నాయి. జిల్లాలో కడప, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు డిపోలు ఉన్నాయి. రెండు నెలల్లో డిజిల్ లీటరుకు రూ.5 పెరిగింది. దీంతో రోజుకు రూ.10 లక్షల అదనపు భారం ఆర్టీసీపై పడింది. తరచూ ఇంధన ధరల పెరుగుదల ఆర్టీసీకి గుదిబండలా మారింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రోజుకు 3.75 లక్షల కిలోమీటర్లు మేర బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. గతంలో డీజిల్ ధరలు పెరిగితే చార్జీలను పెంచేవారు. ప్రస్తుతం చార్జీలు పెంచితే ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోందనే భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. డీజిల్ ధరల ప్రభావం ఇలా.. జిల్లాలోని డిపోల పరిధిలో 564 ఆర్టీసీ బస్సులను సొంతంగా నడుపుతోంది. 294 అద్దె బస్సులను వినియోగిస్తోంది. మొత్తం మీద 858 బస్సులకు రోజుకు 65వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం రోజుకు రూ.4 లక్షలకుపైగా వెచ్చించాల్సి ఉంది. నెలకు రూ.8 కోట్లు డీజిల్‌కే ఖర్చు చేయాల్సి వస్తోం ది. నెల రోజులపాటు బస్సులను రోడ్డెక్కిస్తే రూ.27 కోట్లు ఆదాయం వస్తోంది. జిల్లాలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూ రు, జమ్మలమడుగు, రాయచోటì, రాజం పేట డిపోలకు చిత్తూరు నుంచి డీజిల్ సరఫరా చేస్తోంది. బద్వేలుకు ఒంగోలు, పులివెందులకు గుంతకల్లు నుంచి అందుతోంది. నెలకు రూ.3కోట్లు అదనపుభారం పడుతోంది. ఇంధన పొదుపు తప్పనసరి.. ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో మూడో వంతు డీజిల్, జీతభత్యాలు, విడిభాగాల కొనుగోలుకు ఖర్చు అవుతోంది. నష్టాల ఊబిలో కూరుకున్న సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీజిల్‌తోపాటు ఇతర ధరలు పెరుగుదల శాపంగా మారుతోంది. ఇంధనపొదుపుపై డ్రైవర్లకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. నష్టాలను తగ్గించేందుకు అంతర్గతంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళుతున్నారు. ట్యాక్స్ ఎత్తివేయాలి ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌పై ట్యాక్స్ ఎత్తివేయాల్సిన ఆవశ్యకత ఉంది. కెఎంపీఎల్ సాధించే విషయంలో డ్రైవర్లపై విపరీతంగా మానసిక ఒత్తిడి కలుగుతోంది. మానసిక ప్రశాంతతో విధులు నిర్వర్తించాలంటే ప్రభుత్వం డీజిల్ సరఫరా విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. –శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్ఎంయూ, కడప -
ఏడాదంతా ఒక్కటే బస్ పాస్
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు) : ఏడాది పొడవునా బస్‌పాస్‌ల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన పనిలేకుండా ఆర్టీసీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎ.అన్సారీ సోమవారం ఎంవీపీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు నెలవారి బస్‌పాస్ పొందుతున్నారని, దీనివల్ల వారికి సమయం వృ థా అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏడాది మొ త్తం ఒకేపాస్ ఉండేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఏడాదిలో ఒక్కసారి బస్ పాస్ తీసుకుంటే సరిపోతుందన్నారు. దీంతోపాటు బస్ పాస్‌ల మంజూరులో ఇక నుంచి ఇంటర్నెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ముందుగా విద్యార్థులు వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకొని అనంతరం దగ్గరలోని ఆర్టీసీ కేంద్రంలో పాస్‌లు పొందవచ్చన్నారు. ఎంవీపీ, ద్వారకా నగర్, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, కూర్మనపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, మధురవాడ కేంద్రాల్లో బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. గతంలో జారీ చేసే 3 నెలల పాస్‌లో యథాతదంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు 10 నెలలకు రూ.1300, ఇంటర్, పాలిటెక్నికల్ విద్యార్థులకు 11 నెలలకు రూ.1430, డిగ్రీ, పలు వృత్తి విద్యా కోర్సుల వారికి 12 నెలలకు రూ.1560 చొప్పున చెల్లించి బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదేష్కుమార్, సుధా బిందు వెంకటరావు పాల్గొన్నారు. -
దళిత యువకుడిపై వర్ల రామయ్య అభ్యంతరకర వ్యాఖ్యలు
-
దళిత యువకుడిపై వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య బస్సులో ప్రయాణిస్తున్న దళిత యువకుడి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం మచిలీపట్నం బస్టాండ్‌లో అధికారులతో కలసి ఆయన బస్సుల తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సులో ఓ యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటాన్ని రామయ్య గమనించారు. అతని దగ్గరకు వెళ్లి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? అంటూ ప్రశ్నించారు. ‘మీ కులం ఏంటో చెప్పు?. మాల లేదా మాదిగా?. మాదిగలు అసలు చదవరు. ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?. పొలం ఉందా?. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది?. డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్?. ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.’అంటూ అసభ్యంగా మాట్లాడారు. రామయ్య వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు, బస్సులోని ఇతర ప్రయాణీకులు విస్తుపోయారు. గత వారంలో ప్రయాణీకులతో డ్రైవర్లు, కండెక్టర్లు మర్యాదగా ప్రవర్తించాలని, మర్యాద వారోత్సవాలు నిర్వహించారు. ఇంతలో సాక్ష్యాత్తు ఆర్టీసీ చైర్మన్ దళిత యువకుడిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జగన్ వస్తేనే.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
తిరుపతి మంగళం: ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసి, కార్మికుల కష్టాలను తీర్చలిగే సత్తా వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని అని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఏర్పాటై ఐదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం తిరుపతి కోటకొమ్మలవీధిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరో పిం చారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి చేస్తున్న సహాయ సహకారాలు, నిధుల మంజూరు, పోస్టుల భర్తీ వంటి సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీఎస్ ఆర్టీసీకి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులను ఏపీకే కేటా యించాలని, డీజల్‌పై ట్యాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా సైనికుల్లా పనిచేసి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, చెలికం కుసుమ, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర, జిల్లా కార్యదర్శి టి.రవిశంకర్, జిల్లా కోశాధికారి మారెప్ప, రాష్ట్ర నాయకులు పీసీ బాబు, టీఎస్ఎస్.ప్రసాద్, సీబీ ఎస్.రెడ్డి, పీసీ.బాబు, రాజేంద్ర, టి.రవికుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసిలో జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి : ఈయు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్న జోనల్ చైర్మన్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయు) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రవేశ్ ఆర్టీసీలో జోనల్ వ్యవస్థను రద్దు చేసి గతంలో ఉన్న మూడంచెల వ్యవస్థను ప్రవేశ పెడితే ఏడాదికి 60 కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొనే చర్యలు చేపట్టాలని, నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈయు నాయకులు కె.పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఎన్వి సురేంద్రబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను కలసి అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీ మాలకొండయ్యతో కలసి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికులకు మంచి సేవలు అందించడానికి కృష్టి చేస్తానన్నారు. ఆర్టీసీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకాకుండా చూస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని అభినందించారు. -
ఏపీఎస్ఆర్టీసీ నూతన ఎండీగా సురేంద్ర
-
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఎండీగా ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబు నియమితులయ్యారు. 2001 నుంచి 2004ల మధ్య ఆయన విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేశారు. 2007లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. 2006 నుంచి 2007ల మధ్య హైదరాబాద్ సిటీ అడిషనల్ పోలీసు కమిషనరేట్‌లో కో-ఆర్డినేషన్ విభాగంలో పని చేశారు. అంతకుముందు హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సేవలు అందించారు. ప్రస్తుతం ఆక్టోపస్(కౌంటర్ టెర్రరిజం ఫోర్స్) విభాగంలో అడిషనల్ డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ ప్రయాణం సురక్షితమా?
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అంటూ ప్రకటనలు గుప్పించే యాజమాన్యం ఆచరణలో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా ఒకరికే డ్రైవర్, కండక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ అధిక భారం మోపుతోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చవలసిన గురుతర బాధ్యత ఉన్న డ్రైవర్లపై ఇలా అదనపు ఒత్తిడి పెంచడం తగదని కార్మిక సంఘాల నాయకులు పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి, కొత్తపేట/రావులపాలెం: ఆర్టీసీలో డ్రైవర్ బస్సును నడపాలి..కండక్టర్ ప్రయాణికులకు టిక్కెట్స్ ఇచ్చి డబ్బు వసూలు చేయాలి..అలా ఇద్దరూ ఎవరి డ్యూటీ వారు చేయాలి. కానీ ఎంతోకాలంగా ఒక్కరితోనే అనేక సర్వీసుల్లో డ్యూటీ చేయిస్తున్నారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోల ద్వారా 40 సర్వీసుల్లో ఒక్క డ్రైవరే డ్యూటీ చేస్తుండగా, 80 సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు డ్యూటీ చేస్తున్నారు. ఒకపక్క బస్సును నడుపుతూనే మరోపక్క టిక్కెట్స్ ఇచ్చి డబ్బు వసూలు చేయాలి. ఈ విధానం వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండు డ్యూటీలు ఒక్కరే చేస్తున్న సర్వీసులకు అదనపు సమయం కేటాయించకుండా ఇద్దరు ఉన్న సర్వీసులకు ఇచ్చిన సమయమే ఈ సర్వీసులకూ కేటాయిస్తున్నారు. దీంతో నిర్దేశించిన సమయానికి సర్వీస్‌ను గమ్యస్థానానికి చేర్చడంతో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలి. ఇద్దరు ఉన్న సర్వీసు తిరిగి గమ్యస్థానానికి చేరాక డ్రైవర్ బస్సును డిపోలో స్వాధీనం చేస్తారు. కండక్టర్ ఎస్‌ఆర్‌తో పాటు టిమ్ యంత్రాన్ని, నగదును అప్పగిస్తారు. కానీ ఒక్కరు డ్యూటీ సర్వీసులో రెండు విధులు డ్రైవర్ ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో సుమారు రెండు గంటలు అదనంగా పనిచేయాల్సి వస్తోంది. ప్రమాదకరంగా ప్రయాణం బస్‌ను ఎంత జాగ్రత్తగా నడుపుతున్నా.. ఎదుటి వాహన చోదకులు లేదా బాటసారి సక్రమంగా ప్రయాణించకపోతే ప్రమాదం జరుగుతుంది. బస్ స్టార్ట్ చేసి ఆపే వరకూ డ్రైవర్ ముందు రోడ్డుపైన, సైడ్ మిర్రర్స్ వైపు చూస్తూ ఉండాలి. కానీ రెండు డ్యూటీలు చేస్తున్న డ్రైవర్ ఒకవైపు బస్సును నడుపుతూ మరోవైపు టిక్కెట్స్ ఇవ్వాలి. డబ్బు తీసుకోవాలి. ప్రయాణికుడు టిక్కెట్‌కు తగిన సొమ్ము కాకుండా పెద్ద నోట్లు ఇస్తే తిరిగి చిల్లర చెల్లించాలి. ఈ తతంగమంతా పూర్తయ్యాక బస్ స్టార్ట్ చేద్దామంటే సమయం సరిపోదు. దాంతో బస్ రన్నింగ్‌లో ఉండగానే రెండు డ్యూటీలు చేస్తున్నారు. ఎవరి డ్యూటీ వారు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీలు భర్తీ చేయాలని కార్మిక సంఘాల నాయకులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండు డ్యూటీలతోఅభద్రతా భావం ఆర్టీసీలో ఒక్కరే డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయడంతో అభద్రతాభావానికి గురవుతున్నారు. ఆ సర్వీసులకు అదనపు సమయం కూడా కేటాయించడంలేదు. దానితో డ్రైవర్లు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారు. సంస్థ ఖర్చును తగ్గించుకోవడానికి కార్మికులపై ఈ విధంగా భారం పెంచడం మంచిది కాదు. 12 ఏళ్లుగా కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. – జి.చిరంజీవి, రీజనల్ సెక్రటరీ, ఎంప్లాయీస్ యూనియన్, రాజమహేంద్రవరం -
మీ బస్సులు నిలపొద్దు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బస్టాండ్లలో టీఎస్ఆర్టీసీ బస్సులను నియంత్రిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కొత్త వివాదానికి తెరలేపింది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ఏపీ బస్సు పర్మిట్లు తగ్గిపోతున్నాయన్న కారణంతో.. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన బస్టాండ్లలోకి వచ్చే తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ బస్సులు నిలిచే ప్లాట్‌ఫామ్స్‌లోకి వాటిని అనుమతించకపోవటం, దూరంగా ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో నిలపాలని ఆదేశించటం, హైదరాబాద్‌కు వెళ్లే ఏపీ బస్సులను ముందు పంపి తర్వాత తెలంగాణ బస్సులను అనుమతించటం వంటి చర్యలను ఏపీ ఆర్టీసీ సిబ్బంది చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఆ బస్సులు ఎక్కడ నిలుస్తున్నాయో ప్రయాణికులకు తెలియకపోవటంతో వాటిలో సీట్లు నిండటం లేదు. ఫలితంగా వారం రోజుల నుంచి తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరిగాయి. విషయాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు డిపో మేనేజర్లకు బస్‌భవన్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సమస్యను పరిష్కరిస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు. భారీగా పెరిగిన తెలంగాణ సర్వీసులు ఆర్టీసీ విభజన సమయంలో రెండు సంస్థల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల్లో భారీ వ్యత్యాసం ఉండేది. తెలంగాణ కంటే ఏపీ బస్సులు 2.35 లక్షల కిలోమీటర్ల మేర అదనంగా తిరిగేవి. దీంతో టీఎస్ఆర్టీసీ క్రమంగా ఏపీకి ప్రస్తుతం 185 వరకు సర్వీసులు పెంచింది. కిలోమీటర్ల వ్యత్యాసం భారీగా తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీ బస్సులు 80 వేల కి.మీ. అదనంగా తిరుగుతున్నాయి. మరో 120 బస్సులు ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నందున త్వరలో ఈ వ్యత్యాసం కూడా తగ్గనుంది. దీనివల్ల టీఎస్ఆర్టీసీకి రోజుకు రూ.70 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక విజయవాడ వరకే తిరుగుతున్న సర్వీసుల్లో కొన్నింటిని సమీపంలోని పట్టణాలకు పొడిగిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ ఇరుగ్గా మారటం కూడా ఈ నిర్ణయానికి కారణం. విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు మార్గాల్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దీంతో సమీపంలోని పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు ఆయా పట్టణాల్లోనే ఎక్కుతున్నారు. ఇది కూడా ఏపీ సిబ్బందికి కంటగింపుగా తయారైందని టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
ఏపీ ఆర్టీసీ ఎండీ సంతకం ఫోర్జరీ
సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నియామకం కోసం కొందరు ఏకంగా ఆర్టీసీ ఎండీ మాల కొండయ్య, ఓఎస్డీ నాగేశ్వర్ రావుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. కడపకు చెందిన షేక్ చాన్ బాషాను జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్లు ఉన్న ఫైల్ రవాశాఖ అధికారులకు చేరింది. అయితే ఈ పోస్ట్ నియమించే అధికారం ఓఎస్డీకి లేదు. దీంతో అనుమానంతో అధికారులు విచారణ చేయగా సంతకాలు ఫోర్జరీ జరిగనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఓఎస్డీ నాగేశ్వర రావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘మా సంస్థకు సంబంధం లేదు’
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో నియామకాలు జరుపుతున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు సంస్థ పేరుతో బోగస్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఆర్టీసీ అధికారులు మేల్కొన్నారు. ఈ నియామక పత్రాలు నిజమైనవి కావు అంటూ గురువారం ఏపీఎస్ ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. వెంకటేశ్వర రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంతో ఆర్టీసీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంస్థ నిర్ణీత విధివిధానాలతో నోటిఫికేషన్ రూపంలో దినపత్రికలలో బహిరంగ ప్రకటన జారీ చేసి నియామక ప్రక్రియ నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే నియామకాలు జరుగుతాయని, సంస్థ జరిపే నియామకాలలో ఎలాంటి గోప్యత ఉండదన్నారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించి మోసగాళ్ల వలలో పడవద్దని చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వ్యక్తులు లేదా సంస్థలు, నియామక పత్రాలు జారీ చేస్తున్నవారు తారసపడినా లేదా వారి వివరాలు తెలిసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
19 అర్ధరాత్రి నుంచి సమ్మె
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజయనగరం రీజనల్ మేనేజర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నామని ఆర్టీసీలో గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) రీజనల్ అధ్యక్షుడు వై.అప్పయ్య, డివిజనల్ అధ్యక్షుడు శ్రీనివాసరావులు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ రెండో డిపో గ్యారేజీ ఎదురుగా ఎన్ఎంయూ నాయకులు బుధవారం గేట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రీజనల్ మేనేజర్‌కు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ ఏడాది జనవరి 9న మెమోరాండం ఇచ్చామన్నారు. సమస్యలపై విడతల వారీగా చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ఎంయూ రీజనల్ కమిటీ నిర్ణయం మేరకు నెక్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నామని వెల్లడించారు. ప్రధానంగా కార్మికులకు ఓటీ డ్యూటీలు రద్దు చేయాలని, ఎంటీడబ్ల్యూ చట్టం ప్రకారం డ్యూటీలు సరి చేయాలని, సిక్కు గురైన వారికి జీతాలు ఇవ్వాలని, కార్మికులందరికీ సెలవు సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే డీఎస్ఎం గేజ్ అయిన ఎస్సీ/ఎస్టీ డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, ఒన్‌మన్ సర్వీసులను రద్దు చేయడంతోపాటు పాడైపోయిన టిమ్‌ల స్థానంలో కొత్త వాటిని సరఫరా చేయాలని, గ్యారేజీలో సూపర్వైజర్ల పక్షపాతవైఖరి నశించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఎన్ఎంయూ నేతలు చెప్పారు. గేట్ మీటింగ్‌లో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల కార్యదర్శులు ఎంఎన్ రావు, వి.శాంతరాజు పాల్గొన్నారు. -
ఆర్టీసీ స్పెషల్ బాదుడు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్ ఆర్టీసీ మహాశివరాత్రి వేడుకలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రూ.3.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు జిల్లాలోని 13 శైశక్షేత్రాలకు బస్సులను నడిపేందుకు రంగం సిద్ధంచేసింది. నేటి నుంచి 14వ తేదీ వరకు 393 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల టిక్కెట్‌పై 50 శాతం అధికంగా వసూలు చేయనున్నారు. కర్నూలు నుంచి ప్రతి పది నిమిషాలకు శ్రీశైలానికి బస్సు.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైల మహాక్షేత్రం ప్రధానమైంది. మహాశిరాత్రి రోజుల్లో మల్లికార్జునుడు, భ్రమరాంబదేవిలను దర్శించుకుంటే పుణ్యమొస్తుందనే నమ్మకంతో జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు ఇబ్బంది పడకుండా కర్నూలు నుంచి 106 స్పెషల్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అందులో ప్రతి పది నిమిషాలకు ఒక్క బస్సు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలానికి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 6 న బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచే శ్రీగిరికి భక్తుల తాకిడి అధికం కానుండడంతో 11, 12, 13, 14 తేదీల్లో స్పెషల్ బస్సులను అధికంగా నడుపుతారు. శ్రీశైలంతోపాటు మరో 12 శైవక్షేత్రాలకు మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇతర రీజియన్ల నుంచి 200 బస్సుల రాక.. కర్నూలు–శ్రీశైలం రహదారి ఘాట్ కావడంతో ఫిట్నెస్ ఉన్న బస్సులనే నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఘాట్ ఎలిజిబుల్ ఫిట్నెస్ పాసైన కర్నూలు రీజియన్‌లోని 193 బస్సులకు ఎంపికచేశారు. మిగిలిన బస్సులను నెల్లూరు నుంచి 60, తిరుపతి నుంచి 40, అనంతపురం నుంచి 100 ఘాట్ ఎలిజిబుల్ ఉన్న వాటిని తెప్పించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక మార్గమధ్యలో బస్సులు మరమ్మతులకు గురైతే బాగు చేసేందుకు శ్రీశైలం, దోర్నాలలో వెహికల్ మెయింటెనెన్స్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీకి కాసులుకురిపిస్తున్న శివరాత్రి రెండు, మూడేళ్ల నుంచి కూడా శివరాత్రి ఉత్సవాలు ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 2016లో 329 ప్రత్యేక బస్సులు 6.90లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.2.84 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక 2017లో 372 ప్రత్కేక బస్సులు 7.30 లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.311.16 కోట్ల ఆదాయం సమకూర్చాయి. ఈ యేడాది ఏకంగా రూ.3.50కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితం మహాశివరాత్రి ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం 393 ప్రత్యేక బస్సులను వివిధ శైవ క్షేత్రాలకు నడుపుతాం. అత్యధికంగా శ్రీశైలానికి ఎక్కువ బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచిస్తున్నాం. ప్రమాదాలకు గురికాకుండా సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులే మేలు. – పైడి చంద్రశేఖర్, ఆర్ఎం -
హా...ర్టీసీలో... అన్నీ అవస్థలే...
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రగతి రథ చక్రాలకు వేదికైన ఆర్టీసీ బస్సు కాంపెక్సుల్లో సమస్యలు తిష్టవేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని తొమ్మిది కాంప్లెక్సుల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. సరిపడా మరుగుదొడ్లు, కూర్చునేందుకు, అవసరమైనన్ని బెంచీలు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, క్యాంటీన్లలో బెంబేలెత్తించేలా టీ, టిఫిన్ల ధరలు, తాగడానికి మంచినీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన డంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో చోటుచేసుకున్న లోపాలు ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూశాయి. ముక్కు మూసుకోవాల్సిందే... గోకవరం, రావులపాలెం కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేకపోవడంతో ఆరుబయటే మూత్రశాలగా మారింది. ప్రయాణికులు ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తుండడంతో డిపో ఆవరణల్లో దుర్గంధం వెదజల్లుతోంది. రావులపాలెంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోకవరంలోని మూత్రశాల వద్ద నీటి సమస్య నెలకొంది. నీరు రాకపోవడంతో మూత్రశాలలో దుర్వాసన వస్తోంది. అమలాపురంలో పార్కింగ్ స్టాండ్ పక్కన డ్రైనేజీ నీరు ఆవరణలో నిల్వ ఉంటుండడంతో ఆ పరిసరాలు మురికికూపంలా మారాయి. ప్రమాదం జరిగితే బూడిదే... గోకవరం బస్టాండ్‌లో తాటాకుల పందిరిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే భారీ ఆస్తినష్టం వాటిల్లుతుంది. రావులపాలెం డిపోలో రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యం లేదు. బస్టాండ్ ఆవరణంతా ఆటోలు, వ్యాన్ల స్టాండ్లతో ఆక్రమణలో ఉంది. పార్కింగ్ సదుపాయం సరిపోకపోవడంతో డిపో చుట్టూ మూడు ప్రైవేటు పార్కింగ్ స్టాండ్లు వెలిశాయి. జాతీయ రహదారి, లొల్ల ప్రధాన కాలువ ఆధునికీకరించడంతో బస్టాండ్ వర్షాకాలంలో చెరువును తలపిస్తోంది. ఆ సయమంలో రెండు మోటార్లు పెట్టి వర్షపు నీటిని తోడుతారు. ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా సదుపాయం లేదు. డీలక్స్ ఫ్లాట్‌ఫాంపై సరిపడా బల్లలు లేవు. బస్సులు ఆగేందుకు సరైన ఫ్లాట్‌ఫాం లేదు. డ్రైవర్ ఆదమరిచినా, బస్సు బ్రేక్ విఫలమైనా ప్రయాణికులపై దూసుకొచ్చే ప్రమాదం ఉంది. రామచంద్రపురంలో పార్కింగ్ స్టాండ్ నిర్వహించడం లేదు. ఒక్కో కాంప్లెక్సులో ఒక్కోలా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ కాంప్లెక్సుల్లో ప్రతి నాలుగు గంటలకు రూ.5 లెక్కన రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. గోకవరం, రాజోలు డిపోల్లో రోజుకు రూ.20లñ చొప్పున తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్న సమస్యలున్నా ప్రయాణికులను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దడపుట్టిస్తున్న ధరలు.... అన్ని ఆర్టీసీ కాంప్లెక్సుల్లోని దుకాణాల్లో తినుబండారాలు, కూల్ డ్రింకులు, కంపెనీ చిప్స్ ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నారు. అర లీటర్ కూల్ డ్రింక్ ఎమ్మార్పీ రూ.38 ఉంటే రూ.42, రూ.18 లేస్చిప్స్ రూ.20, రూ.15 గుడ్ డే బిస్కట్ ప్యాకెట్ రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక క్యాంటీన్లలో టీ తాగినా, టిఫిన్ చేసినా జేబులు గుల్ల అవ్వాల్సిందే. రాజమహేంద్రవరం కాంప్లెక్సులోని క్యాంటిన్లో టిఫిన్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. రెండు ఇడ్లీ రూ.30, చపాతి రూ.40, దోసె రూ.35, మైసూర్ బజ్జీ రూ.30 (నాలుగు), పేపర్ కప్పులో టీ రూ.15 లెక్కన విక్రయిస్తున్నారు. కాకినాడ కాంప్లెక్సులోని క్యాంటీన్లో రెండు ఇడ్లీ రూ.25, చపాతి రూ.30, దోసె రూ.30, మైసూర్ బజ్జీ రూ.25, టీ రూ.10 లెక్కన అమ్ముతున్నారు. హోటళ్లు, ఆర్టీసీ డిపో ఎదరుగా ఉన్న హోటళల్లో కన్నా డిపోల్లో 25 నుంచి 35 శాతం అధికంగా ధరలున్నాయి. మౌలిక సౌకర్యాలు మాటుమాయం... ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిర్వహణకు వివిధ పేర్లతో టికెట్లపై అదనంగా వసూలు చేస్తున్నా ఆర్టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, రాజోలు కాంప్లెక్సుల్లో తాగునీటి సదుపాయం లేదు. మంచినీరు కావాలంటే అక్కడ దుకాణాల్లో రూ.20 వెచ్చించి బాటిల్ కొనుగోలు చేయాల్సిందే. అది కూడా స్థానికంగా తయారు చేసే సంస్థ బాటిళ్లు విక్రయిస్తున్నారు. రావులపాలెం, గోకవరంలలో ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు. ప్రత్తిపాడు, రామచంద్రపురాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. రామచంద్రపురం డిపోలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పగటి పూటే ప్రయాణికులపై దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. -
ఇవేం బస్టాండ్లు బాబోయ్
ఇదీ జిల్లాలో బస్టాండ్ల పరిస్థితి. పైకి మాత్రం హైటెక్ హంగులంటూ టీవీలు, స్టీలు బెంచీలు వేశారు. కానీ ప్రాంగణాలు మొత్తం కంపుకొడుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా దారుణం. అంతా వసూళ్లే. ఇక దుకాణాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. సాక్షి, కడప : ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలావరకు బస్టాండ్లకు సోకులు చేసినప్పటికి కొన్ని మౌలిక వసతులను ఇంకా కల్పించలేదు. బస్టాండ్లలోకి వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారాయి. ఆవరణలు కంపుకొడుతున్నాయి. ధరల మోత మోగుతోంది. అయినా అధికారులు మాత్రం అంతా బాగుందనే చెబుతున్నారు. ఉదాహరణకు.. కడప నగరంలోని పాత బస్టాండ్ ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఇప్పటికే పెచ్చులు రాలుతున్నా..పైకప్పు అంతా నెర్రెలు చీలి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా....గోడలకు చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునేవారే లేరు. పరిస్థితి చేయదాటకమునుపే అధికారులతోపాటు అందరూ అప్రమత్తం కావాలి. ప్రతినిత్యం వేలాది మంది కడప పాత బస్టాండులో బస్సుల కోసం వేచి ఉండడంతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటోంది. అయితే పరిస్థితి చూస్తే భయానకంగా ఉంది. ఇలా జిల్లాలో రాయచోటి, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పోరుమామిళ్ల తదితర బస్టాండ్లలో సమస్యలమయంగా మారడంతో పాటు విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు.. జనం మధ్యలో మూత్ర విసర్జన జిల్లాకేంద్రమైన కడపలో ప్రతినిత్యం వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత బస్టాండు మీదుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో పాత బస్టాండులో ఎక్కడ చూసినా జనమే జనం. అయితే అనువైన వసతులు సరిగా లేకపోవడంతో బహిరంగంగానే మూత్ర విసర్జన చేస్తుంటారు. జనం చూస్తున్నా....గోడల మీద రాతలు కనిపిస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని కానిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా...కనీసం జనం సమీపంలోకి వస్తే జరిమాన విధిస్తారన్న భయం కూడా ప్రజల్లో లేదు. దీంతో పాత బస్టాండులో పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడ చూసినా మూత్ర విసర్జన కంపుతో జనం అల్లాడిపోతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కుకూడా లేదు. అలాగే కొత్త బస్టాండ్‌లోనూ పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి. వర్షం కురిస్తే అంతా జలమయమే. ఆవరణలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. పారిశుద్ద్యం అంతంతమాత్రమే ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పాత బస్టాండులోనూ పారిశుధ్యం అధ్వానంగా కనిపిస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల నీరు రోడ్లమీదనే పారుతుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే, దిగే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండులో టాయ్లెట్ల వద్ద తప్పనిసరిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 తీసుకుంటున్నారు. అయినా పరిశుభ్రంగా ఉంచడ లేదు. దుర్వాసన భరించలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీకి ఎసరు జిల్లాలోని బస్టాండ్లలో ఎమ్మార్పీకి ఎసరు పెట్టి తినుబండారాలపై దోపిడీ చేస్తున్నారు. మినరల్ వాటర్ ఒక లీటరు ఎమ్మార్పీ ధర రూ.20 అయితే రూ.25 వరకు రాబడుతున్నారు. ఒక్క వాటరే కాదు, మిగతా వాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బస్టాండు ప్రాంగణంలోని హోటళ్లలో దోపిడీపర్వం మరింత అధికంగా కొనసాగుతోంది. బస్టాండ్లలో ఉన్న అధికభాగం షాపులలో ఎమ్మార్పీని పక్కనపెట్టి దోచుకుంటున్నా అడిగే అధికారులు లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాలోని బస్టాండ్ల తీరిది.. ♦ మైదుకూరు బస్టాండ్‌లో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. అందులోనూ నీటి సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడూ మూత వేసి ఉంటారు. ఇబ్బందిగా మారింది. పైగా చుట్టుపక్కల వారు కూడా బస్టాండు ఆవరణంలోని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన సాగిస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో బస్సులు గుంతలో వెళుతున్నప్పుడు ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ♦ ప్రొద్దుటూరు బస్టాండులో మరుగుదొడ్లు ఉన్నా సరిగా లేవు. దీంతో ప్రయాణికులకు మరుగు కంపుతో అల్లాడుతున్నారు. ♦ రాయచోటి బస్టాండ్‌లో మరుగుదొడ్లు త లుపులకు రంధ్రాలు పడి వాడకానికి ఇబ్బం దిగా ఉంది. చుట్టూ దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలోని దుకా ణాల్లో అధికధరలు వసూలు చేస్తున్నారు. ♦ బద్వేలు బస్టాండ్‌లో తాగునీటి సమస్య వెంటాడుతోంది. పైగా ఎప్పుడు చూసినా పందులు నిత్య సంచారంగా మారింది. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. -
బంద్ ఎఫెక్ట్.. ఆర్టీసీకి రూ.80లక్షల నష్టం
అనంతపురం న్యూసిటీ: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్‌తో వేకువజాము నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో, ఆర్టీసీకి 80లక్షల ఆదాయం కోల్పోయినట్లు అధికారులు అంచనా వేశారు. రోజులో 806 బస్సులు తిరగాల్సి ఉండగా, 604 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 5 లక్షల మంది ప్రయాణించటం వలన రూ 1.20 కోట్ల నుంచి రూ 1.50 కోట్ల ఆదాయం వస్తోంది. -
వైఎస్ జగన్ హామీతో ఆర్టీసీలో హర్షాతిరేకాలు
-
నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు
-
‘ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం’
సాక్షి, పుంగనూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 53వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. నాలుగేళ్ల పాటు పింఛన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. పింఛన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలు ఆడుతున్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గం. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకుని, అభివృద్ధి ఆగిపోయింది. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏమీ చేయకుండానే నాకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారు. ఆయన మాటలు చూస్తే కళ్లు నెత్తికెక్కినట్లున్నాయి. ఓటు వేయకుంటే ప్రజలు సిగ్గుపడాలా?. ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలా?. ఏం చేశాడని చంద్రబాబుకు ఓట్లు వేయాలి. మూడుసార్ల కరెంట్, బస్సు ఛార్జీలను పెంచిన ఘనత చంద్రబాబుది. అలాంటి చంద్రబాబుకు ఓట్లు వేయాలా? రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, నిరుద్యోగ భృతి ఇస్తామని, మాట తప్పినందుకు ఓట్లు వేయాలా?. ఎన్నికల సమయంలో పదేళ్లు కాదు...పదిహేనేళ్లు హోదా కావాలన్నారు. ఎన్నికలు రాగానే హోదాను మర్చిపోయారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హోదాను అమ్మేసినందుకు ఓట్లు వేయాలా?. జన్మబూమి కమిటీల పేరుతో మఫియాను ప్రోత్సహిస్తున్నారు. 35 పడకల ఆస్పత్రికి ఎమ్మల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11 ఎకరాల సొంత భూమి ఇచ్చారు. ఆ స్థలంలో ఆస్పత్రిని కట్టడం లేదు. ఆ భూమిని తిరిగి ఇవ్వడం లేదు. ఆ భూమి ఇస్తే ఆస్పత్రి కట్టడానికి మేం సిద్ధం. పుంగనూరులో ఆర్టీసీ డిపో కట్టి ఏడున్నరేళ్లు అయినా బస్సులు ఇవ్వలేదు. ఇంత అన్యాయమైన పాలన ఎక్కడా ఉండదు. పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఆర్టీసీని బ్రహ్మాండంగా నడిపిస్తాం. హంద్రీ-నీవా నీటిని పుంగనూరుకు తీసుకొచ్చి అన్ని చెరువులను నింపి గ్రామాలను సస్యశ్యామలం చేస్తాం. పేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తాం. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తాం. రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తాం. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి విశ్రాంతి అవసరం అయితే ఆరు నెలల పాటు డబ్బులిస్తాం. వైద్యం కోసం పేదలను అప్పులపాలు కానివ్వం. అందరికీ కార్పొరేట్ వైద్యం అందిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పేదలకు రూ.10వేల పెన్షన్ ఇస్తాం. నాన్న ఒక్క అడుగు ముందుకేశాడు. నేను రెండడుగులు ముందుకేస్తా. పేద ప్రజలకు అండగా నిలుస్తా.’ అని అన్నారు. -
సంక్రాంతి షాక్
మండపేట: సంక్రాంతి బాదుడుకు అంతా సిద్ధమైంది. పెద్ద పండుగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చే జిల్లా వాసులను రవాణా ఛార్జీల రూపంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ సమాయత్తమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది. ప్రత్యేక బస్సుల పేరిట సాధారణ టిక్కెట్టు ధరపై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనుండగా, రద్దీని బట్టి రెండు నుంచి మూడు రెట్లు వరకు టిక్కెట్టు ధర వసూలు చేసే యోచనలో ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. మరోపక్క రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవడం ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్న వారు పెద్ద పండుగ సందర్భంగా జిల్లాకు రావడం పరిపాటి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ప్రారంభానికి ఐదు రోజుల ముందు నుంచీ ప్రయాణ రద్దీ మొదలవుతుంది. పండుగ తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారితో దాదాపు వారం రోజులపాటు రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో దాదాపు రెండు వారాల పాటు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ వారికి పెద్ద పండుగనే చెప్పాలి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టిక్కెట్టు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. పరుగులిలా... జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, ఏలేశ్వరం, రాజోలు తదితర ప్రాంతాల నుంచి రోజూ హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సుమారు 130 బస్సులు నడుస్తుండగా, ఆర్టీసీ సర్వీసులు 38 వరకూ నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో కాకినాడ నుంచి హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర ప్రైవేట్ ట్రావెల్స్‌లో రూ. 600 నుంచి రూ.700, ఏసీ సర్వీసుకు రూ. 1000 వరకూ ఉంటుంది. రద్దీని బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులుంటుంటాయి. ఆర్టీసీ టిక్కెట్టు ధర రూ.680 వరకు ఉంటుంది. ఏసీ బస్సుకు రూ.950 వరకు ఉంటుంది. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీతో అదనపు టిక్కెట్టు ధరపై ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు. సైట్‌ను బ్లాక్ చేసిన ఆర్టీసీ... గతంలో మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ సదుపాయం కల్పించిన ఆర్టీసీ సంస్థ పండుగ రద్దీ దృష్ట్యా రిజర్వేషన్ కాలపరిమితిని నెల రోజులకు కుదించేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికే సైట్స్ మూసివేశాయి. ప్రత్యేకం పేరుతో జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ సంస్థ హైదరాబాద్‌కు దాదాపు 60 బస్సులు వరకు నడిపే ప్రయత్నంలో ఉంది. ప్రత్యేక బస్సుల ద్వారా రానుపోను అదనపు ధర రూపంలో దాదాపు రూ.80 లక్షల మేర ఆదాయం రాబట్టే పనిలో ఉన్నట్టు సమాచారం. రికార్డు స్థాయిలో పెరగనున్న ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు... ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు రికార్డు స్థాయిలో పెరగనున్నట్టు ట్రావెల్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఆయా ట్రావెల్స్ రిజర్వేషన్ చార్జీను ఇంకా తెరవలేదు. దసరా పండుగ సందర్భంగా రూ.2,500లు వరకు టిక్కెట్టు ధర పలికింది. అదే తరహాలో పండుగ ధరలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా రోజుకు సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో నాన్ ఏసీ బస్సులు 70 శాతం కాగా, మిగిలినవి ఏసీ బస్సులు. పండుగ రద్దీతో నాన్ ఏసీ ధరలు రూ.1200లు నుంచి రూ. 1600 వరకు, ఏసీ సర్వీసుకు రూ. 2000లు నుంచి రూ. 3000లు వరకు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వాసుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. దోపిడీకి గురికాకుండా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. చాంతాండంత వెయిటింగ్ లిస్ట్... జిల్లా మీదుగా రోజూ హైదరాబాద్‌కు 12 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జనవరి 12వ తేదీ నుంచి స్లీపర్‌తోపాటు థర్డ్, సెకండ్ ఏసీల వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. పండుగ రోజుల్లో మినహా, తిరుగు ప్రయాణానికి సంబంధించి 16వ తేదీ నుంచి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై రైల్వేశాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం ప్రయాణికులను నిరాశకు గురిచేస్తోంది. -
పండక్కి ప్రయాణమెలా?
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆర్టీసీ గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దోపిడీకి తెరతీశాయి. గతంలో ఆన్లైన్లో ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేసుకు నేందుకు మూడు నెలల గడువు ఉండేది. అంటే ప్రయాణానికి తొంబై రోజులకు ముందుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆర్టీసీ ఈ గడువును 30 రోజులకు కుదించింది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణి కులకు టిక్కెట్ల రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో లేకుండా పోయింది. టికెట్ రిజర్వేషన్ ఫ్రాంచైజీని ఆర్టీసీ యాజమాన్యం నాలుగు కంపెనీలకు అప్పగించింది. రెడ్‌బస్, అభీబస్, పేటీఎమ్, ఐబిబో కంపెనీలు టికెట్ రిజర్వేషన్ ప్రాంఛైజీలు పొందాయి. ప్రాంఛైజీల కోసమే ఆర్టీసీ రిజర్వేషన్ల గడువును కుదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీకి సొంతంగా ఆన్లైన్ రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం గమనార్హం. ఆర్టీసీ రిజర్వేషన్లకు నెల గడువు విధించినట్లు యాజమాన్యం పేర్కొంటున్నా.. టిక్కెట్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అంటే పండక్కి ముందు డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 11వ తేదీ తర్వాత ప్రయాణానికి ఆర్టీసీ టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. మరో దారిలేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిద్దామంటే టిక్కెట్ల ధరలు షాక్ కొడుతున్నాయి. జేబులకు చిల్లు పడేలా పండగ సీజన్లో టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది. రైళ్లదీ అదే పరిస్థితి రైళ్లలో టిక్కెట్ల రిజర్వేషన్లు సైతం గగనంగా మారాయి. రైళ్లలో 120 రోజులు ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంది. అయితే ప్రధాన రైళ్లలో చాంతాండంత వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే ముఖ్య రైళ్లలో ఇప్పటికే ‘నో రూమ్’ కనిపిస్తోంది. పైగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికీ ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. ప్రైవేటు ట్రావెల్స్ దందా ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నా రవాణా శాఖ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విజయవాడ నుంచి విశాఖపట్నం టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా చెబుతున్నారంటే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్ల ధరలను కట్టడి చేయాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం మానేశారు. ‘ప్రత్యేక’ దోపిడీకి రెడీ ఆర్టీసీ కూడా పండుగ సీజన్లో ప్రత్యేక చార్జీల పేరుతో దోపిడీకి రంగం సిద్ధం చేసింది. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసుకు చార్జీ రూ.808. అదే ప్రత్యేక బస్సుకు 50 శాతం అధికంగా వసూలు చేస్తారు. అంటే రూ.1,200కు పైగా చెల్లించాలన్నమాట! ప్రైవేటు బస్సుల్లో విజయవాడ–విశాఖపట్నం రూటుకు జనవరి 11న టిక్కెట్ ధర రూ.1,550–రూ.1,800, జనవరి 12న రూ.3 వేలు, జనవరి 13న రూ.3,500 వరకు ఉండడం గమనార్హం. విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య దూరం 337 కిలోమీటర్లు. అంటే కిలోమీటర్‌కు రూ.10కి పైగానే దండుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల పేరిట ఆర్టీసీ అధికంగా వసూలు చేస్తుండగా, తాము డిమాండ్‌ను బట్టి ఎక్కువ తీసుకుంటే తప్పేంటని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌కు 2,135 ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండుగ సీజన్లో జనవరి 9 నుంచి ప్రతి రోజూ 2,135 ప్రత్యేక బస్సులను విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. టిక్కెట్లు బ్లాక్ చేశారు ‘‘ప్రైవేటు బస్సులో ప్రయాణం కంటే ఆర్టీసీ బస్సు సురక్షితమని ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించా. కానీ, పండుగ సీజన్లో టిక్కెట్లు బ్లాక్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్టు ధరలు దారుణంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ – శ్రీధర్, విజయవాడ ప్రతి పండక్కీ ఇదే ఆనవాయితీ ‘‘దసరా, దీపావళి, సంక్రాంతి ఏ పండుగకైనా ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ఆపరేటర్ల తీరు మారడం లేదు. ఆర్టీసీ టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేయడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాం. నెల గడువు అని అధికారులు చెబుతున్నా.. నెలకు ముందు రోజు కూడా రిజర్వేషన్ దొరకడం లేదు’’ – కిరణ్మయి, సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు ‘‘ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపితే కచ్చితంగా 50 శాతం అధిక చార్జీలు వసూలు చేస్తాం. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ గతంలో 90 రోజులకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలుండేది. ఇప్పుడు 30 రోజులకే పరిమితం చేశాం’’ – జయరావు, ఆర్టీసీ ఈడీ -
ఏ తల్లి కన్న బిడ్డో...
విజయనగరం ఫోర్ట్ : ఆర్టీసీ బస్సులోని ఓ బ్యాగ్‌లో ఆడశిశువు లభ్యమైన ఘటన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజాం వెళ్లే బస్సు (ఏపీ 35 డబ్ల్యూ 9007)లోకి విశాఖలోని హనుమంతవాక ప్రాంతంలో ఓ వ్యక్తి ఒక బ్యాగ్‌తో ఎక్కాడు. అతను మార్గమధ్యలో బ్యాగ్‌ను వదిలేసి దిగిపోయాడు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బస్సు ఉదయం 6:30 గంటలకు చేరుకోగా బ్యాగ్‌లోంచి చిన్న పిల్ల ఏడుపు రావడాన్ని బస్సు డ్రైవర్ సిహెచ్.రఘునాథ్, కండక్టర్ అప్పారావులు గమనించారు. దీంతో వారు బ్యాగ్ తెరిచి చూడగా అందులో ఆడశిశువు కనిపించింది. ఈ విషయాన్ని వారు డిపో మేనేజర్ ఎన్.వి.ఎస్.వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లగా అతను శిశువును చైల్డ్ లైన్ సభ్యులకు అప్పగించారు. చైల్డ్‌లైన్ సభ్యులు శిశువును ఘోషాస్పత్రిలో చికిత్స నిమత్తం చేర్పించారు. -
ఏపీ సర్కార్ డబుల్ గేమ్!
సాక్షి, అమరావతి : ‘‘ఆర్టీసీలో ఉద్యోగులు అడగకుండానే పదవీ విరమణ వయస్సు పెంచాం. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు వయో పరిమితి పెంచాం. అందరికీ సర్వీసు పెంపు అమలుచేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేశాం.(ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవ సభలో సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి.) ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు హామీని ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్లుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి యాజమాన్యం మోకాలడ్డుతుండడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని.. పైగా ఆర్టీసీకి బోర్డు కూడా ఏర్పాటు కానందున వయో పరిమితి పెంపు సాధ్యంకాదని యాజమాన్యం సాకుగా చెబుతోంది. 9, 10 షెడ్యూళ్లలో ఉన్న కార్పొరేషన్లు, సంస్థల్లో 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన అమలుచేయాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 8న జీవో–138ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ షెడ్యూల్ 9లో ఉంది. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం.. ఆర్టీసీలో 2014 జూన్ 2 నుంచి పదవీ విరమణ చేసిన వారికి 60 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. కానీ, గతేడాది నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన వారు సుమారు అన్ని కేడర్లలో 3,600 మంది వరకు ఉన్నారు. వీరంతా రెండేళ్ల సర్వీసు పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. నిబంధనల సాకు.. కాగా, బోర్డు లేకపోవడంతో వయో పరిమితి పెంపు కుదరదంటున్న యాజమాన్యం.. ఆర్టీసీలో 60 ఏళ్ల పెంపు నిర్ణయం తీసుకోవాలంటే సంస్థ విభజన జరగాలని, కొత్తగా బోర్డు ఏర్పాటుచేసుకోవాలని నిబంధనలున్నాయి. ఈ నిబంధనను ఆర్టీసీ యాజమాన్యం సాకుగా చూపుతోంది. అయితే, గత మూడేళ్లుగా ఆర్టీసీ బోర్డు లేకుండానే యాజమాన్యం అన్ని నిర్ణయాలు తీసుకుందని, ఇప్పటివరకు 3 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేసిందని, ఆర్టీసీ హౌజ్ నిర్మాణం కూడా చేసినట్లు ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. బోర్డు అనుమతి లేకుండా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేసే అవకాశంలేదని, మానవతా దృష్టితో ఉద్యోగుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా అందుకు యాజమాన్యం ససేమిరా అంటోంది. మూడేళ్లుగా నియామకాల్లేవు ఇదిలా ఉంటే.. గత మూడేళ్ల నుంచి ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య 7,130గా ఉంది. అయితే, 2014 నుంచి 2016 వరకు పదవీ విరమణ చేసిన వారికి న్యాయం జరిగే అవకాశాల్లేవు. అంతేకాకుండా, గత మూడేళ్లగా సంస్థలో ఏ కేడర్‌లోనూ ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా ఉద్యోగులపట్ల కఠినంగా వ్యవహరించడం సబబు కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో యాజమాన్య తీరుపై రిటైరైన ఉద్యోగులు కొందరు ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.. 9, 10 షెడ్యూల్లో ఉన్న విద్యుత్ సంస్థ, గృహ నిర్మాణం, సివిల్ సప్లైస్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితరాల్లో 60 ఏళ్లకు పదవీ విరమణ జీవోను అమలుచేశారు. ఒక్క ఆర్టీసీలోనే అడ్డంకులు సృష్టిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం. ∙పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరితో కలిసి త్వరలో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాం. – తాడంకి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత -
ఏపీఎస్ఆర్టీసీలో డబుల్ డ్యూటీలు రద్దు!
-
ఆధునిక సౌకర్యం..సురక్షిత ప్రయాణం..
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీవారు ఆధునిక సౌకర్యాలతో కూడిన అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను నడుపుతూ ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు. కడప డిపో నుంచి బెంగుళూరుకు విజయవంతంగా ‘అమరావతి’ బస్సు సర్వీస్‌ను 2016 జనవరి నుంచి నడుపుతున్నారు. అమరావతి బస్సు సర్వీస్ కడప – బెంగళూరు అమరావతి బస్సు సర్వీస్‌లో ఆధునిక సౌకర్యాలున్నాయి.సెమీస్లీపర్ సీట్ల అమరిక, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించే విధంగా వుంది. ♦ ప్రతి రోజూ కడప నుంచి అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరుతుం ది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు నుంచి కడపకు మరో బస్సు బయలుదేరుతుంది. ♦ ప్రతి రోజూ రాత్రి కడప నుంచి బెంగళూరుకు 11:45 గంటలకు బయలుదేరుతుంది. బెంగుళూరు నుంచి కడపకు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. ♦ ఈ సర్వీస్‌లో ఛార్జి రూ.638గా చెల్లించాలి. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం వుంది. రిజర్వేషన్ చేయించుకున్న వెంటనే సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది. సర్వీస్ బయలు దేరు సమయానికి అరగంట నుంచి గంటలోపు కండక్టర్/డ్రైవర్ సెల్ నెంబర్లు సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. ఏదైనా సమస్యలు తలెత్తినా, ఆయా సెల్ఫోన్లకు సమాచారం ఇవ్వవచ్చును. ఇంద్ర బస్సు సర్వీస్‌లు ♦ ఏపీఎస్ ఆర్టీసీ వారు ఆధునిక సౌకర్యాలతో కడప నుంచి ఇంద్ర బస్సులను 2012 నుంచి ప్రారంభించారు. ♦ కడప– విజయవాడకు రాత్రి 9:00 గంటలకు బయలుదేరుతుంది. ఛార్జి రూ. 685గా చెల్లించాలి. ♦ కడప– బెంగళూరుకు ఉదయం 10:30, రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ బస్సులో ఛార్జి రూ. 460గా వసూలు చేస్తున్నారు. ♦ కడప –చెన్నైకి రాత్రి 11:45 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 387గా చెల్లించాలి. ♦ కడప– హైదరాబాద్ (మియాపూర్)– రాత్రి 10:30 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 741గా చెల్లించాలి. ప్రయాణికుల సురక్షితమే ధ్యేయంగా సర్వీస్‌లు : ప్రైవేట్ బస్సు సర్వీస్‌లకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను విజయవంతంగా నడుపుతున్నాం. పుష్ఆప్ బ్యాక్ సెమీస్లీపర్ సీట్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వున్నాయి. ప్రయాణికుల ఆహ్లాదం కోసం, ఎల్ఈడీ టీవీల్లో చలనచిత్రాల ప్రదర్శన రెగ్యులర్‌గా ఉంటుంది. ఏసీ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల్లో ఆదరణ పెరుగుతోంది. ప్రతీ రోజూ ఈ రెండు బస్సులలో ఉన్న సీట్లన్నీ నిండుతాయన్నారు. ఏవైనా అసౌకర్యాలు కలిగినచో వెంటనే కడప ఆర్టీసీ బస్టాండ్ విచారణ కేంద్రం ఫోన్ నెంబర్: 08562– 244160కు సమాచారం ఇవ్వాలి. – గిరిధర్ రెడ్డి, కడప డిపోమేనేజర్ -
రైళ్లలోనే తిరుమలకు ఆర్టీసీ టికెట్లు
సాక్షి, తిరుపతి అర్బన్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రైళ్లలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు టికెట్లను ఇకపై రైళ్లలోనే ఇవ్వనున్నారు. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైపు నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టీసీ కండక్టర్ గూడూరు నుంచి తిరుపతి వరకు వస్తూ ఏసీ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్ బోగీలలో తిరుమలకు వెళ్లే యాత్రికులకు రైలులోనే ఆర్టీసీ బస్సు టికెట్లను విక్రయిస్తారు. ప్రయాణికులు రైలు దిగగానే ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన అన్ని మార్గాల్లోని రైళ్లలో దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు. -
ఆర్టీసీలో ‘దొంగలు పడ్డారు’!
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో సామగ్రికి భద్రత కరువైంది. దాదాపు ఏడేళ్ల నుంచి కడప డిపో పరిధిలో సామాన్లకు సం బంధించిన ఆడిట్ కూడా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆర్టీసీ బస్సులోల ఏవైనా వస్తువులు ప్రయాణికులు మరిచిపోతే వెంటనే ప్రకటన ఇవ్వడంకానీ, పోలీసులకు ఫిర్యా దు చేయడంగానీ జరగాలి. అలాంటివేమీ చేయకుండానే ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పలు ఆరోపణలకు తావి స్తోంది. ఆర్టీసీలో కొందరు ఇంటి దొంగలైతే, మరికొందరు బ యటివారు ఉన్నారు. అయినా వారిపై నిఘా కరువవుతోంది. ∙సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కడప డిపో గ్యారేజీలో టైర్లు కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు కొత్త టైర్లు డిపో గ్యారేజీ ప్రహరీ సమీపంలో ఉన్న ఓ పాఠశాల ఆవరణంలో పడిపోయాయి. వాటిని సంబంధిత పాఠశాల వారే ఆర్టీసీ వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ⇒ ఆర్టీసీ బస్టాండ్‌లోని జనరేటర్ చోరీకి గురైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని విలువ దాదాపు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంటుంది. ⇒ ఎర్నింగ్ సెక్షన్లో కంప్యూటర్, మానిటర్లను ఎత్తుకుపోయినా దిక్కులేదని అనుకుంటున్నారు. ⇒ కండక్టర్లకు సంబంధించిన టికెట్ ట్రేలు దాదాపు 20 దాకా మాయమైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ⇒ టిమ్ (టికెట్ ఇష్యూయింగ్ మిషన్) లకు సంబంధించిన సామాన్లు కూడా గల్లంతయినట్లు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు లేవనే చర్చ జరుగుతోంది. ⇒ ప్రతి డిపోకు ఇద్దరు క్యాషియర్లు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ చేయించాల్సి ఉంది. అయితే గత ఏడేళ్లుగా ఎలాంటి ఆడిట్ జరగలేదని సమాచారం. ⇒ అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 800 వివిధ రకాల సామాన్లు, పరికరాలకు సంబంధించి ఎలాంటి గణాంకాలు లేకపోయినా, సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాం కడప డిపోతో పాటు అన్ని డిపోలలో ఏవైనా అక్రమాలు జరిగితే వెంటనే ఎవరైనా సరే రాత పూర్వకంగా తమ దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కడప రీజనల్ మేనేజర్ చెంగల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం కిషోర్‌లు వివరణ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒకసారి ఆడిటింగ్ డిపోల వారీగా జరగాల్సి ఉందన్నారు. కడప డిపోకు ఆడిటింగ్ ఎపుడు జరిగింది విచారించి తెలియజేస్తామన్నారు. బంగారు ఆభరణాల వ్యవహారానికి సంబంధించి బద్వేలు సంఘటనలో బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. కడప డిపోలో బంగారు ఆభరణాలకు సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విలువైన వస్తువుల మాటేమిటి ? కడప, బద్వేల్ డిపోల పరిధిల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహారం ప్రయాణికుల్లో ఆర్టీసీపై విశ్వసనీయత కోల్పోయే విధంగా ఉంది. ∙బద్వేల్ బస్టాండ్‌లో నాలుగు నెలల క్రితం ఓ ప్రయాణికుడు బ్యాగును మరిచిపోయి వెళ్లాడు. ఆ బ్యాగులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆలస్యంగా బయటకు పొక్కింది. ఐదుగురు ఉద్యోగులు కలిసి పంపకాలు చేసుకోవడంలో భేదాభిప్రాయాలు వచ్చి బయట ప్రచారం జరగడంతో ఉలిక్కిపడ్డారు. ఆ నోటా, ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కంగుతిన్న సదరు ఉద్యోగులు ఎంతోకొంత డబ్బులను జమచేస్తామని చెప్పుకుంటున్నట్లు సమాచారం. ⇒ కడప డిపో పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 27న అనంతపురం నుంచి గంజికుంటకాలనీకి చెందిన షేక్ జిలానీ భార్య రుక్సానాబేగం తన పిల్లలతో కలిసి కడపకు వచ్చింది. ముద్దనూరు వద్ద టిఫెన్ తీసుకుని బస్సులోనే తిన్నారు. కడపకు చేరుకునే సరికి తమ లగేజీలోని సూట్‌కేస్ కన్పించలేదు. దీంతో చిన్నచౌక్, ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరినే నిందించడంతో మిన్నకుండిపోయారు. తర్వాత అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నా సూట్‌కేస్‌లోని వస్తువులను వేలం వేశారని, సుమారు 72 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారని తెలిసింది. ⇒ఈ సంఘటనపై ఈనెల 18న సాక్షి దినపత్రికలో ‘కడప డిపోలోనే బంగారు ఆభరణాలు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో బాధితులు తగిన ఆధారాలతో అధికారులను సంప్రదించారు. అధికారులు బాధితురాలిని విచారించి, త్వరలో కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత విచారిస్తామని వెల్లడించినట్లు బాధితురాలు ‘సాక్షి’కి వివరించింది. ∙ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
సీట్లు.. పాట్లు
పండుగ ఏదయినా సీట్ల పాట్లు షరా మామూలే. దసరా ఇక్కట్లు మరువక మునుపే.. దీపావళి ధమాకా మొదలయింది. సొంతూళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులు చుక్కలు చూశారు. బస్సు పాయింట్లోకి చేరక మునుపే పరుగులు పెడుతూ.. కిటికీల్లో నుంచి దూరుతూ అష్టకష్టాలు పడ్డారు. సీటు దొరికిన వారిలో పండుగ సంతోషం కనిపించగా.. దొరకబుచ్చుకోలేకపోయిన వారిలో నిరుత్సాహం అలుముకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్టాండులన్నీ కిటకిటలాడాయి. అనంతపురం ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు రాగానే సీటు పట్టుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. -
‘పాట పాడాలన్నా’.. పైసా పడాల్సిందే!
సాక్షి, అమరావతి: చిత్తూరుకు చెందిన రామారావు తన కుమారుడిని విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. వారాంతంలో తన కుమారుడిని చూసి వచ్చేందుకు సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడకు బయలుదేరితే టికెట్ ధర రూ.560 అయ్యింది. అయితే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ బస్టాండ్లలో యూరినల్స్‌కు టాయిలెట్లను వాడకున్నందుకు ప్రతి చోటా రూ.5 చొప్పున రూ.25 చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాల పేరిట ప్రతి టికెట్‌పై అదనంగా సెస్సు పేరిట రూపాయి వసూలు చేయడం గమనార్హం. మళ్లీ యూరినల్స్ చార్జీల కింద అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికుల్ని దోపిడీ చేస్తోంది. బీవోటీ విధానంలో దోపిడీ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి బస్టాండ్లలో యూరినల్స్‌కు యూజర్ చార్జీల కింద ఆర్టీసీ రూ.5 వసూలు చేస్తోంది. గతంలో బస్టాండ్లలో మరుగుదొడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా అప్పగించారు. అప్పట్లో యూరినల్స్‌కు మాత్రం ఎలాంటి చార్జీలు వసూలు చేసేవారు కాదు. అయితే ఇప్పుడు నిర్మించు–నిర్వహించు–అప్పగించు (బీవోటీ) విధానంలో రెస్ట్ రూమ్‌ల నిర్వహణను 20 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ అప్పగించింది. దీనిలో భాగంగా రెండేళ్ల కిందట విజయవాడ ప్రధాన బస్టాండ్‌లో రెస్ట్ రూమ్ పేరిట టాయిలెట్లను నిర్వహిస్తూ యూరినల్స్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. సిటీ టెర్మినల్‌లో రూ.2 వంతున వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు బస్టాండ్లలోనూ అమలుచేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. గుంటూరులో విజయవాడకు నడిపే సర్వీసుల కోసం ప్రత్యేకంగా మరో బస్టాండ్ నిర్మిస్తున్నారు. అక్కడ కూడా బీవోటీ విధానం ద్వారా నిర్మించే మరుగుదొడ్లలో యూరినల్స్‌కు యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఏటా టికెట్లపై సెస్సు పేరిట రూ.60 కోట్ల వసూళ్లు ప్రయాణికులకు బస్స్టేషన్లలో తగిన వసతులతో పాటు మూత్రశాలలకు సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ తన ప్రయాణికుల నుంచి అభివృద్ధి సెస్సు పేరిట ప్రతి టికెట్‌పై రూపాయి వంతున వసూలు చేస్తోంది. 2013 నుంచి సెస్సు వసూలు చేస్తోంది. దీనివల్ల ఆర్టీసీకి ఏటా రూ.60 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. ప్రయాణికుల నుంచి సౌకర్యాల కోసం వసూలు చేస్తూ మళ్లీ యూరినల్స్‌కు వెళ్లేందుకు రూ.5 చొప్పున వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 కోట్లతో తొమ్మిది జిల్లాల్లో టాయిలెట్ల నిర్మాణం ఆసక్తిగల కంపెనీల నుంచి తొమ్మిది జిల్లాల్లో నిర్మించే టాయిలెట్లకు రూ.2 కోట్ల వరకూ వెచ్చించనున్నారు. శ్రీకాకుళం బస్టాండ్‌లో రూ.17 లక్షలు, కావలిలో రూ.13 లక్షలు, విజయనగరంలో రూ.16 లక్షలు, విశాఖలో 25 లక్షలు, గుంటూరులో రూ.26 లక్షలు, చిత్తూరులో రూ.23 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో రూ.36 లక్షలు, కర్నూలులో రూ.18 లక్షలు, అనంతపురంలో రూ.26 లక్షలతో రెస్ట్ రూమ్‌లు నిర్మించనున్నారు. -
ఆర్టీసీలో కానరాని "ఠీవీ"
బహుదూరం వెళ్లే ప్రయాణికులకు వినోదం కరువైంది. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం లగ్జరీ సేవల్లో భాగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికోసం సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీవీల ప్రక్రియ ఇక్కడ అటకెక్కింది. వినోదం కోసమంటూ టికెట్ రూపంలో ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేస్తూ టీవీ మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు చిర్రెత్తుత్తున్నారు. ఇటీవలే కర్నూలు నుంచి హైటెక్ బస్సులో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దూర ప్రాంత సర్వీసులో వినోదం లేకపోతే ఎలా ప్రయాణించాలంటూ అధికారులను నిలదీశారు. కర్నూలు కొత్త బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనతో కళ్లు తెరచిన అధికారులు ఆగమేఘాల మీద టీవీ సౌకర్యం ఉన్న వేరే సర్వీసును ఏర్పాటు చేసి పంపారు. కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్ బస్సుల్లో టీవీ (టెలివిజన్)ల నిర్వాహణ అటకెక్కింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు వినోదం కరువైంది. టెండర్ల ద్వారా ప్రైవేటు కాంట్రాక్టరు చేతిలో పెట్టిన ఆర్టీసీ వాటిపై పర్యవేక్షణ మరిచింది. ఒక్కో బస్సుకు నెలనెలా రూ.2,500 చెల్లిస్తున్నా సరైన సేవలు అందడం లేదు. ఫలితంగా దూర ప్రాంత ప్రయాణికులు వినోదాన్ని పొందలేకపోతున్నారు. సూపర్ లగ్జరీ (హైటెక్), కొన్ని అల్ట్రా డీలక్స్ బస్సుల్లో టీవీల నిర్వాహణ జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారింది. ప్రారంభంలో సంస్థే నేరుగా టీవీలను ఏర్పాటు చేసి సీడీ, డీవీడీ ప్లేయర్ల ద్వారా సినిమా ప్రదర్శన చేసేవారు. ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా నెలవారిగా వేతనం ఇచ్చి బాయ్‌ను కూడా నియమించారు. అయితే అది భారంగా మారడంతో బాయ్‌లను తొలగించి టీవీల నిర్వాహణ బాధ్యతలను డ్రైవర్లపైన పెట్టారు. బస్సు డ్రైవింగ్ చేయడం, టికెట్లు జారీ చేయడం, టీవీల సినిమా ప్రదర్శన బాధ్యతలు నిర్వహించడం ఇబ్బంది కావడంతో చేతులెత్తేశారు. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల చేతికి టీవీల ఏర్పాటు, నిర్వాహణకు యాజమాన్యం 2015లో ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. కాంట్రాక్టర్ల ద్వారా ఈ పని చేయించాలని టెండర్లు పిలిచింది. బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసి, సినిమా ప్రదర్శన, యూఎస్బీ, పెన్ డ్రైవ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కోసం ఒక్కొక్క బస్సుకి నెలకు రూ.2500 కాంట్రాక్టురుకు చెల్లిస్తారు. 162 బస్సులకు టెండర్లు జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లోని 162 బస్సుల్లో టీవీల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. అందులో ఆదోని డిపోలో 15, డోన్ –4, కర్నూలు–1డిపో 30, 2డిపో 31, ఎమ్మిగనూరు 15, ఆళ్లగడ్డ 12, ఆత్మకూరు 11, బనగానపల్లె 8, కోవెలకుంట్ల 2, నందికొట్కూరు 6, నంద్యాల 28 బస్సులకు టెండర్లు పిలిచారు. అయితే, ఆదోని, బనగానపల్లె డిపోలకు ఎలాంటి స్పందనా రాలేదు. విడతల వారీగా టీవీలను ఏర్పాటు చేశారు. అటకెక్కిన నిర్వాహణ: జిల్లాలోని బస్సుల్లో టీవీల నిర్వాహణ అటకెక్కింది. పాత టీవీలు కావడంతో పదేపదే రిపేరు రావడం, యూఎస్బీ, పెన్‌డ్రైవ్‌లు పాడవడంతో టీవీలు ఉన్నా అలంకారప్రాయంగా మారాయి. కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. టీవీల నిర్వాహణ సమస్యను పరిష్కరిస్తాం దూర ప్రాంత బస్సుల్లో టీవీ ఏర్పాటు చేశాం. వాటి ఏర్పాటు, నిర్వాహణ బాధ్యతలు టెండర్ల ద్వారా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాం. అయితే వాటిలో రిపేరు సమస్య రావచ్చు. వీటిని మరోసారి పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్ బాబు, డీసీఎంఈ, కర్నూలు. -
అంతర్రాష్ట్ర సర్వీసు ఇక ఆదాయమే బాసు!
అంతర్రాష్ట్ర సర్వీసులతో ఆర్టీసీకి అదనపు ఆదాయం - రోజూ సగటున రూ.1.10 కోట్ల మేర పెరిగిన రాబడి - డిసెంబర్ నాటికి మరో 200 కొత్త సర్వీసులు ప్రారంభం - వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా - ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు భారీగా సర్వీసులు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర పర్మిట్లు, సర్వీసులను పట్టించుకోకుండా ఇంతకాలం భారీగా ఆదాయాన్ని చేజార్చుకున్న తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు ‘కొత్తబాట’పట్టింది. డిమాండ్ ఉన్న అన్ని అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సర్వీసులు నిర్వహించడంపై దృష్టి పెట్టింది. దాదాపు నాలుగు నెలలుగా చేసిన కసరత్తుతో ఏకంగా 10% ఆదాయాన్ని పెంచుకుంది. రోజుకు సగటున రూ.1.10 కోట్ల అదనపు రాబడిని అందుకుంటోంది. ఈ అదనపు రాబడిని డిసెంబర్ నాటికి రూ.2.50 కోట్లకు పెంచుకునే దిశగా మరిన్ని అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇంతకాలం ఏపీ ఆర్టీసీ దూకుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ ఆర్టీసీ దూకుడుగా వ్యవహరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు విస్తృతంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తూ ఆదాయం పొందింది. అదే సమయంలో టీఆర్టీసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. బాగా డిమాండ్ ఉండే మార్గాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి చోట్లకూ నామమాత్రంగా సర్వీసులు నిర్వహించింది. ఇటీవల ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారుతుండటంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీ సహా ఇతర పొరుగు రాష్ట్రా ల్లోని పట్టణాలు, డిమాండ్ ఉన్న మార్గాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులను మొదలుపెట్టారు. ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్, గుంటూరు, శ్రీశైలం, ఒంగోలు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, కర్నూలు, పులివెందుల, పోలవరం, పుట్టపర్తి, ఆదోని, అనంతపురం, ఉదయగిరి, తాడిపత్రి, వింజమూరు, మచిలీప ట్నం, నంద్యాల, నెల్లూరు, పలమనేరు, చిలకలూరిపేట.. ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు కొత్త సర్వీసులు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఇతర పొరుగు రాష్ట్రాలకు కూడా.. మరోవైపు కొత్తగా డిమాండ్ ఉన్న మార్గాలపై (రూట్) సర్వే చేసిన ఆర్టీసీ అధికారులు... మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు బస్సు సౌకర్యం లేదు. దాంతో ప్రయాణికులు ఏపీ బస్సులపై ఆధారపడేవారు. తాజాగా హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు ప్రతిరోజూ నడిచేలా గరుడ ప్లస్ సర్వీసు ప్రారంభించారు. దానికి మంచి ఆదరణ రావటంతో... తాండూరు నుంచి హైదరాబాద్ మీదుగా దంతెవాడ డీలక్స్ బస్సు సర్వీసు ప్రారంభించారు. హన్మకొండ నుంచి మహారాష్ట్రలోని సిరోంచకు రోజు ఎనిమిది బస్సు సర్వీసులు మొదలుపెట్టారు. ఇక బెంగళూరుకు నడిపే సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్తగా ఏడు రాజధాని ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ఇక మహారాష్ట్రలోని పండరీపూర్, అమరావతి, బారామతి, చంద్రాపూర్, వార్ధా, సతారాలకు సర్వీసులు నడపటంతోపాటు నాగ్‌పూర్‌కు మరిన్ని గరుడ ప్లస్ బస్సు సర్వీసులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాతబడిన 25 గరుడ బస్సు లను మార్చి కొత్తవి తీసుకోనున్నారు. నాలుగు నెలల్లో 122 కోట్లు ‘‘అంతర్రాష్ట్ర అదనపు సర్వీసులతో కేవలం నాలుగు నెలల్లో రూ.122 కోట్ల అదనపు ఆదాయం సాధించాం. ఇది ఇక్కడితో ఆగదు. ఒక్క ఏపీకే కొత్తగా మరో 150 బస్సులు నడపాలని నిర్ణయించాం. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు సర్వీసులు విస్తరిస్తాం. డిమాండ్ ఉన్న అన్ని ప్రాంతాలకు నడుపుతాం. ఇందుకోసం కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నాం. మెరుగైన సేవల కోసం పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకువస్తున్నాం..’’ – ఆర్టీసీ ఎండీ రమణారావు -
చిన్నారులకు ఆర్టీసీ రాయితీ
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు ఏసీతో సహా అన్ని బస్సు టిక్కెట్లపై రాయితీ ప్రకటించిన ఆర్టీసీ చిన్నారులకు కూడా రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ జయరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, అలాగే 12 ఏళ్లలోపు పిల్లలకు ఏసీ బస్సు సర్వీసుల్లో 25 శాతం, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ సహా అన్ని బస్సుల్లో అయితే 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ రాయితీ పొందాలంటే వయస్సు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని జయరావు స్పష్టం చేశారు. -
వ్యవస్థలో మార్పులు చేస్తేనే ఆర్టీసీ మనుగడ
► అధికార, కార్మిక భాగస్వామ్యంతోనే ప్రగతిబాట ► ఎన్ఎంయూ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధనుంజయరెడ్డి నెల్లూరు(బృందావనం) : ఆర్టీసీలో అధికారులు పాత విధానాలకు స్వస్తి పలికి, వ్యవస్థలో మార్పులు తెచ్చి కార్మికులను భాగస్వామ్యం చేస్తేనే సంస్థ మనుగడ సాగిస్తుందని ఎన్ఎంయూ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ కొడవలూరు ధనుంజయరెడ్డి అన్నారు. నెల్లూరులోని పురమందిరంలో గురువారం జరిగిన ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నెల్లూరు రీజియన్ 10వ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రగతిచక్రంలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం సుమారు 70 ఏళ్లనాటి విధానాలనే అమలుపరుస్తోందన్నారు. ఈ కారణంగా ఆర్టీసీ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ లాభాలబాటలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయాలన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరంచేసే ఆలోచన విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లాచంద్రయ్య, వై.శ్రీనివాసరావు, రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, నెల్లూరు రీజియన్ నాన్ ఆపరేషన్ గౌరవాధ్యక్షుడు గాదిరాజు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
సీఎం పర్యటనకు ఆర్టీసీ బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్): సీఎం చంద్రబాబు పర్యటనకు బుధవారం ఆర్టీసీ అధికారులు.. 175 బస్సులు సమకూర్చారు. జిల్లా వ్యాపంగా 12 డిపోల్లో ఉన్న 1020 బస్సులు ఉన్నాయి. వాటిలో 175 సర్వీసులను సీఎం పర్యటనకు వినియోగించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా రెగ్యులర్ సర్వీసులును రద్దు చేసి పంపారు. ఆదోని డిపో నుంచి 17, ఎమ్మిగనూరు – 15, కర్నూలు–1 డిపో – 14, కర్నూలు–2 డిపో – 25, డోన్ – 10, నందికొట్కూరు – 20, ఆత్మకూరు – 20, ఆళ్లగడ్డ – 12, నంద్యాల – 23, బనగానపల్లె – 12, కోవెలకుంట్ల డిపో నుంచి 8 చొప్పున బస్సులను సీఎం పర్యటనకు సమకూర్చారు. -
బడి బస్సులు
– 71 విద్యార్థి బస్సులను నడిపేందుకు చర్యలు – రూట్ల వారిగా సర్వీసులు ఖరారు చేసిన ఆర్టీసీ – అసవరమైతే మరిన్ని నడుపుతాం: డీసీటీఎం శ్రీనివాసులు కర్నూలు (రాజ్‌విహార్): బడి పిల్లలపై రోడ్డు రవాణ సంస్థ కరుణ చూపింది. ఉన్న ఊరు నుంచి విద్యా సంస్థలు ఉన్న పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు విద్యార్థి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12డిపోల నుంచి 71 విద్యార్థి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రూట్ల వారిగా సర్వీసులు ఖరారు చేసి ఆచరణకు సిద్ధం చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, అవసరాలను బట్టి మరిన్ని నడుపుతామని అధికారులు పేర్కొంటున్నారు. – డిపోల వారిగా విద్యార్థి బస్సులు తిరిగే రూట్లు – ఆదోని డిపో: ఆదోని డిపో నుంచి ఐదు విద్యార్థి బస్సులు నడుపుతుండగా ఆదోని నుంచి తొగలగల్లు– డి.కోటకొండ, బనవనూరు– కల్లుకుంట, హొళగుంద– చిన్నకుంట, సుంకేశ్వరి– హానవాలు, ఆలూరు–ఎల్లార్తి, హొళగుందకు నడుపుతున్నారు. – డోన్ డిపో: డోన్ డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కంబాలపాడు– మల్లెంపల్లె, డోన్– సి.కొతూరు, డోన్–జలదుర్గం, డోన్ జక్కసాని గుంటకు తిప్పుతున్నారు. – కర్నూలు–2 డిపో: కర్నూలు–2 డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కర్నూలు– రేమట, కర్నూలు– అనుగొండ, కర్నూలు–ముడుమాల, కర్నూలు– సీ.బెళగల్‌కు నడుతుతున్నారు. – నందికొట్కూరు డిపో: నందికొట్కూరు డిపో నుంచి ఎమినిది బస్సులు నడుపుతుండగా నందికొట్కూరు తర్తూరు, మండ్లెం, జూపాడుబంగ్లా, కె.ప్రాతకోట, బిజినెవేముల, కొనిదేల, వడ్డెమాను, వాడాల, చెరుకుచెర్ల, పైపాళెం, పగిడ్యాల, వీపనగండ్ల, వనుముల పాడు, లక్ష్మాపురం, కడుమూరు, పైపాళెం, నెహ్రు నగర్, నాగటూరు, నెహ్రు నగర్, పారుమంచాల, కడుమూరు, పైపాళెం, వాడాల, చౌట్కూరుకు తిప్పుతున్నారు. – ఎమ్మిగనూరు డిపో: ఎమ్మిగనూరు డిపో నుంచి 12బస్సుల్లో ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు, ఆదోనికి మూడు, మసీదుపురం, కంపాడు, మల్కాపురం, పెద్దకొత్తిలి, వి.తిమ్మాపురం, నాగలదిన్నె, కనకవీడు మధ్య నడుపుతున్నారు. – ఆళ్లగడ్డ డిపో: ఆళ్లగడ్డ డిపో నుంచి తొమ్మిది బస్సులు నడుపుతుండగా ఆళ్లగడ్డ నుంచి సుద్దమల్ల, చాగలమర్రి, శ్రీరంగాపురం, ఆర్.జంబులదిన్నె, బీసీపీఎల్–తండా, చందలూరు, చిన్న వాగలి, రామచంద్రాపురం మధ్య తిప్పుతున్నారు. – ఆత్మకూరు డిపో: ఆత్మకూరు డిపో నుంచి 11 బస్సులు నడుపుతుండగా ఆత్మకూరు–ఇస్కాల, బైర్లూటి, కొత్తలచెర్రు, గుమ్మడపురం, వానాల, పి.అనంతపురం, ఏటీకే–మద్దూరు, జడ్డువారి పల్లె, వేంపెంట, మద్దూరు, వెలుగోడు, రేగడ గూడూరు గ్రామాలకు తిప్పుతున్నారు. – బనగానపల్లె డిపో: బనగానపల్లె డిపో నుంచి ఎమినిది బస్సులు తిప్పుతుండగా బనగానపల్లె– గార్లదిన్నే, బేతంచెర్ల, కందికాయపల్లె, రామతీర్థం, చెర్లో కొత్తూరు, కొండనాయుని పల్లె, టంగుటూరు, ఆర్జీఎం కాలేజీ నెర్రవాడ గ్రామాల మధ్య నడుపుతున్నారు. – కోవెలకుంట్ల డిపో: కోవెలకుంట్ల డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కోవెలకుంట్ల– కాకరవాడ, కొండ సుంకేసుల, పెద్ద వెంచర్ల, కాశీపురం– అవుకు మధ్య తిరుగుతున్నాయి. – నంద్యాల డిపో: నంద్యాల డిపో నుంచి ఐదు బస్సులు నడుపుతుండగా నంద్యాల–గుండంపాడు, పులిమద్ది, బోయిల్కుంట్ల, మహానంది, గుంటనాల, ఏవీఆర్ ఎస్వీఆర్ కళాశాల, తిమ్మాపురం, గడివేముల మోడల్ స్కూల్, గోరుకల్లు, ఆర్జీఎం కళాశాలకు సర్వీసుల తిప్పేందుకు చర్యలు చేపట్టారు. అవసరమైతే మరిన్ని బస్సులు: శ్రీనివాసులు, డీసీటీఎం, ఆర్టీసీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం 71 విద్యార్థి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాం. వీరి రాకపోకల్లో సమయాలు మర్చాలని విద్యార్థులు, కళాశాల, పాఠశాల యాజమాన్యాలు విన్నవిస్తే సరి చేస్తాం. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేటు ఆటోలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సంస్థకు మేలు కలుగుతుంది. దీంతో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు వీలుంటుంది. -
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
► ఆర్టీసీ యాజమాన్యంపై ఎన్‌ఏంయూ నేతల ధ్వజం బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు) : ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఉందని ఎన్‌ఏంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) గ్యారేజి వర్క్‌షాపు నేతలు ధ్వజమెత్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్‌ఏంయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గ్యారేజీ వర్క్‌షాపు నేతలతో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్సుల పనితీరును పరిశీలించే విభాగంపై యాజమాన్యం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణితో వస్తున్న సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన జోనల్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు చల్లాచంద్రయ్యకు వివరించారు. చల్లాచంద్రయ్య మాట్లాడుతూ కనీసం కారుకు తీసుకున్న జాగ్రత్తల్ని సైతం బస్సుకు తీసుకోకపోవడం దారుణమన్నారు. మానవశక్తి, విడిభాగాలు అందించడంలో యాజమాన్యం విఫలమయ్యిందన్నారు. అవి లేక గ్యారేజీల్లో కార్మికులు పనులు చేయలేకపోతున్నారన్నారు. మారుతున్న కాలనుగుణంగా విడిభాగాల్ని అందించలేకపోతున్నారన్నారు. దశబ్దాలుగా గ్యారేజీలో బస్సు పరిశీలన విభాగంలో ఉన్న 4 షెడ్డుల్ని కుదించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారన్నారు. ఈ సమస్యల్ని యాజమాన్యం పరిష్కరించకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొత్త బస్సులు వస్తేనే సమస్యలకు పరిష్కారమన్నారు. చల్లా చంద్రయ్య మాట్లాడుతూ ఈ సమస్యలపై యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రావి సుబ్బారావు, తోట వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, జోన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగాలకు ఎసరు
జాబు కావాలంటే.. బాబు రావాలి.. అంటూ టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకూ ఎసరుపెడుతూ వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. తాజాగా అంతర్రాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింపు నిర్ణయంతో 14 వందల మంది ఉపాధి కోల్పోనున్నారు. కాగా, మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఆర్టీసీలో మూడువేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ► అంతర్రాష్ట్ర ఒప్పందం పేరుతో 221 బస్సుల తగ్గింపు ► వీధినపడనున్న 1400 మంది ఉద్యోగులు ► పల్లె వెలుగు సర్వీసుల కుదింపుతో ► ఏడొందలమంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి కరువు ► పనిష్మెంట్ పేరుతో మరికొందరు ఉద్యోగాల నుంచి తొలగింపు ► మూడేళ్లలో మూడు వేల మంది కార్మికుల ఇంటి బాట సాక్షి : రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రాకు 11,500 పైగా బస్సులతో 60 వేలమంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి అప్పులతో వచ్చిన ఆర్టీసీకి మూడేళ్ల నుంచి భారీ నష్టాలు రావడంతో సంస్థ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం తెచ్చిన రుణాలకు వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలో ఆర్టీసీని ఆదుకోవాల్సిన సర్కార్ పథకం ప్రకారం సంస్థను నిర్వీర్యం చేస్తోంది. ఈ క్రమంలోనే మూడేళ్ల కాలంలో 60 వేల ఉద్యోగుల్లో మూడువేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. ఉద్యోగులకు ఎసరు ఇలా.. ఆర్టీసీ నష్టాల్లో ఉందని సాకు చూపి పల్లె వెలుగు బస్సులను తగ్గించారు. దీనివల్ల దాదాపుగా 700 వందలమంది కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పోయాయి. పనిష్మెంట్ల పేరుతో 1000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వారందరి ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో బస్సులు తిరిగే దూరాన్ని ఏపీఎస్ ఆర్టీసీ 20 వేల కిలోమీటర్లకు తగ్గించింది. దీని కారణంగా మరో 1300 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా మూడేళ్లలో మూడు వేల మంది కార్మికులు ఉద్యోగాలు పోగొట్టుకుని పూటగడవని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. అంతర్రాష్ట్ర ఒప్పందంతో ఎసరు అంతర్రాష్ట్ర ఒప్పందం పేరుతో మరో 221 బస్సులను తెలంగాణ వైపు వెళ్లకుండా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బస్సుల కుదింపుతో ఆర్టీసీకి భారీ నష్టంతో పాటు మూడు డిపోలు మూతపడే అవకాశం ఉంది. ఈ ఒప్పందం అమలయితే మరో 14 వందల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రోజూ దాదాపు 800 బస్సులు.. 3.30 లక్షల కిలోమీటర్ల మేరకు రాకపోకలు సాగించేవి. తెలంగాణ నుంచి ఆంధ్రాకు 100 బస్సులు.. లక్ష కిలోమీటర్లు రాకపోకలు సాగించేవి. తెలంగాణలో బస్సులు తిరిగే దూరాన్ని ఏపీఎస్ ఆర్టీసీ 20 వేల కిలోమీటర్లకు తగ్గించింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అనుమతులు లేకున్నా బస్సుల సంఖ్య పెంచుకుంది. 1.45 లక్షల మేరకు బస్సులు నడుపుతోంది. దీంతో తెలంగాణ ఆదాయం తగ్గిపోతుండటంతో అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ బస్సులు తిరిగే దూరాన్ని తగ్గించాలని తెలంగాణ ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రం పన్ను వేసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే 221 బస్సులను తగ్గించే ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాల వాదన. ఒక్క కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా 70 బస్సులు తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల దాదాపు 14 వందల మంది కార్మికులు ఉపాధి పొగొట్టుకోనున్నారు. మరో రెండు నెలల్లో ఆరు వందల మంది ఉద్యోగ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారి నియామకం చేపట్టకపోగా ఉన్నవారితోనే సర్దుబాటు చేసే యత్నం చేస్తున్నారు. తమను పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీసీకి నష్టం కల్గించేలా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల ఆందోళన
అమరావతి: ఆర్టీసీ యాజమాన్యం ఆవలంభిస్తున్న నిర్లక్ష్యనికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 14 న రాష్ర్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ఆర్టీసీ బస్సుల సంఖ్యను, సిబ్బందిని కుదిస్తున్నందుకు నిరసనగా మొత్తం 13 జిల్లాల్లోని 128 డిపోలు, వర్కుషాపుల వద్ద ఆందోళనలు చేస్తామని ఈయూ పేర్కొంది. యాజమాన్యం సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ ట్రస్టులకు బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని కోరింది. పెండింగ్ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. -
కడప రీజియన్‌కు 250 కొత్త బస్సులు
నంద్యాల: కడప రీజియన్ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల డిపోలకు 250 కొత్త బస్సులను కేటాయించామని కడప రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంచి సేవలను అందించిన కార్మికులకు శనివారం ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా 119 ఎక్స్‌ప్రెస్, 34డీలక్స్, ఏడు సెమీలగ్జరీ బస్సులను ఇచ్చామని, కర్నూలు జిల్లాకు 97 బస్సులను అందజేశామని చెప్పారు. గత ఏడాది నాటికి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ 23.8లక్షల నష్టాల్లో ఉండగా రూ.12.17లక్షలకు తగ్గించామని చెప్పారు. నంద్యాల డిపోలో గత ఏడాది రూ.1.40కోట్ల నష్టం రాగా కార్మికులు శ్రమించి నష్టాన్ని రూ.13లక్షలకు తగ్గించడం అభినందనీయమన్నారు. రీజియన్‌లో రూ.5కోట్ల నష్టం వచ్చిందని, దీన్ని క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రయాణీకుల మన్ననలు పొందడానికి సిబ్బంది, కార్మికులు పని చేయాలన్నారు. ఆదాయం వచ్చే రూట్లలోనే బస్సులను తిప్పాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్, అసిస్టెంట్ డీఎం దీప్తిసుజన పాల్గొన్నారు. -
ప్రయాణికులకు రూ.5లక్షల బీమా సౌకర్యం
కర్నూలు (రాజ్‌విహార్): బస్సు ప్రయాణికులకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజరు వెంకటేశ్వర రావు బుధవారం ప్రకటలో తెలిపారు. బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మరిణించినా లేదా శాశ్విత అంగవైకల్యం ఏర్పడినా ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రమాణికులను ఆకర్షించి వారి ఆదరణ పొందేందుకు యాజమాన్యం ఈ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దీంతోపాటు పల్లె ప్రయాణికుల సౌకర్యార్థం లింక్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టామని, దీంతో గ్రామీణ, మండల ప్రాంతాల నుంచి తిరుపతి, హైదరాబాదు తదితర నిర్ణీత దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఒకేసారి టికెట్ పొందవచ్చునన్నారు. దీంతో చార్జీ తగ్గడంతోపాటు చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సదుపాయాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సర్వీసులు తగ్గించాల్సిందే..
ఏపీకి తేల్చి చెప్పిన టీఎస్ఆర్టీసీ... రెండో రోజూ కుదరని ఏకాభిప్రాయం సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య గురువారం రెండోరోజు చర్చ ల్లోను ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణకు తిప్పే సర్వీసులు తగ్గించా లని తెలంగాణ అధికారులు ఖరాఖండీగా చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు అత్యధి కంగా సర్వీసులు నడుపుతుండటంతో తమకు ఏటా రూ.130 కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలంగాణ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తమ వాదన వినిపించారు. రెండు రాష్ట్రాల రవాణా మంత్రుల మధ్య ఆర్టీసీ సర్వీసుల విషయంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావడంతో గురువారం ఈడీల స్థాయిలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీకావాలని నిర్ణయిం చడం తెలిసిందే. ఈ మేరకు విజయవాడలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు సమావేశమ య్యారు. ఏపీఎస్ఆర్టీసీకి కిందటేడాది రూ.840 కోట్ల నష్టాలు వచ్చాయని, హైదరాబాద్‌కు ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతోనే తమ పరిస్థితి ఆశాజనకంగా ఉందని ఏపఎస్ ఆర్టీసీ ఈడీలు వివరించారు. హైదరాబాద్‌తో ఏపీలోని అన్ని ప్రాంతాలకు సంబంధాలు న్నాయని, అందుకే ఇక్కడి ప్రయాణికుల కోరిక మేరకు అన్ని ప్రాంతాల నుంచి సర్వీసులు నడు పుతున్నామన్నారు. ఇందుకు టీఎస్ఆర్టీసీ ఈడీ లు అంగీకరించలేదని సమాచారం. సగమైనా తగ్గించుకోవాల్సిందే... ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రాంతంలో రోజుకు 386 రూట్లలో 1,226 బస్సుల్ని 3,37,603 కిలోమీటర్లు తిప్పుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఏపీలో 175 రూట్లలో 554 బస్సుల్ని 94,048 కిలోమీటర్లు తిప్పుతోంది. ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ కంటే అధికంగా తిప్పుతున్న 2,43,555 కిలోమీటర్లలో సగం కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరారు. జూన్‌లో ఆర్టీసీ రూట్లను సమీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు చెప్పడంతో రెండు రాష్ట్రాల ఈడీల సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. ఈనెలాఖరులో మళ్లీ రెండు రాష్ట్రాల రవాణామంత్రుల భేటీ జరగనుండటంతో అప్పుడు ఆర్టీసీ పర్మిట్ల తకరారు తేలుతుందా.. లేదా.. అన్నది చూడాల్సి ఉంది. పర్మిట్ల విషయంలో పేచీ ఏపీఎస్ఆర్టీసీకి తెలంగాణలో సర్వీసులు తిప్పేందుకు 1,006 పర్మిట్లున్నాయి. అదే తెలంగాణకు ఏపీలో సర్వీసులో తిప్పేం దుకు 506 పర్మిట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ పర్మిట్ల విషయంలో అభ్యంతరాల్ని లేవనెత్తారు. సాంకేతికంగా విభజన జరగ కపోయినా పరిపాలనపరంగా విడిపోయా యని, నష్టాల్ని భరించేది తెలంగాణ ఆర్టీసీ యేనని పేచీ పెట్టినట్లు తెలిసింది. గతం లోనూ పర్మిట్ల విషయంలో రెండు రాష్ట్రాల ఎండీల మధ్య లేఖల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీ సర్వీసులపైనే పీటముడి
- కొలిక్కిరాని రవాణా మంత్రుల చర్చలు - ఖరారుకాని అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం - మళ్లీ హైదరాబాద్‌లో భేటీకి నిర్ణయం - అప్పటికి ‘అంతర్రాష్ట్ర’ ఒప్పందం కొలిక్కి వస్తుందని ఆశాభావం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రవాణా శాఖల మంత్రుల మధ్య బుధవారం విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్లోని జరిగిన సమావేశం ఎటువంటి ఫలితాన్నివ్వలేదు. ఉభయరాష్ట్రాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం కొలిక్కిరాలేదు. సరికదా ఆర్టీసీ సర్వీసులపై పీటముడి పడింది. ఏపీ, తెలంగాణల రవాణా మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సుమితా దావ్రా, సునీల్‌శర్మ, ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టీసీ ఎండీలు మాలకొండయ్య, రమణరావులు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు, ఆర్టీసీ సర్వీసులపై ప్రధానంగా చర్చించారు. విభజనానంతరం రెండు రాష్ట్రాలమధ్య రవాణారంగ వాహనాలు, ప్రైవేటు బస్సులపై పరస్పర ఒప్పందం జరగలేదు. అప్పటి నుంచి అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం తెరపైకొచ్చి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అధికారులు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తాత్కాలిక పర్మిట్లతోనే రవాణా సాగుతోంది. సింగిల్ పర్మిట్ విధానం అమలుపై ఇరు రాష్ట్రాల రవాణా అధికారుల మధ్య పలు మార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాజా భేటీలోనూ ఆర్టీసీ సర్వీసుల విషయంలో అభిప్రాయ భేదాలు కొనసాగినట్టు సమాచారం. ఏపీ సర్వీసులు తెలంగాణలో 700 తిరుగుతుంటే, తెలంగాణ సర్వీసులు 400 మాత్రమే తిరుగుతున్నాయంటూ మంత్రి మహేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.హైదరాబాద్‌కు బస్సులు నడపడం వల్లే ఏపీఎస్ఆర్టీసీకి ప్రధానంగా ఆదాయం సమకూరుతోందని, అందువల్ల సర్వీసులను తగ్గించుకోవడం సాధ్యపడదని ఏపీ ఆర్టీసీ అధికారులు వాదించారు. అయితే ఆర్టీసీ సర్వీసుల విషయంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల స్థాయిలో గురువారం చర్చలు జరపాలని తాజా భేటీలో నిర్ణయించారు. రవాణారంగ సమస్యలపై 5 అంశాలు చర్చకొచ్చాయని, 4 అంశాలపై సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తమైనట్లు రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో మళ్లీ భేటీ.. సమావేశానంతరం రెండు రాష్ట్రాల రవాణా మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ.. సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్టు క్యారేజీ బస్సుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో హైదరాబాద్‌లో మరలా భేటీ అవుతామని, అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలామంది.. భార్య ఓ రాష్ట్రంలో భర్త మరో రాష్ట్రంలో పనిచేస్తున్నారని, వీరి సమస్యతోపాటు స్థానికతపై చర్చించామని అచ్చెన్నాయుడు వివరించారు. ఆర్టీసీ సర్వీసులపై లోతుగా చర్చించి పరిష్కార అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులను కొంతమేరకు కుదించి, తెలంగాణ సర్వీసులు పెంచుకునేలా సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తామని చెప్పారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆర్టీసీ రూట్ల విషయంలో జూన్‌లో పునఃసమీక్ష జరుగుతుందని, అప్పటివరకు యథాస్థితి కొనసాగించాలని ఏపీ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య కోరారు. ఆ సమీక్షలో సర్వీసుల కుదింపు, పొడిగింపుపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. -
బస్సులో ఫైటింగ్
– తన్నుకున్న ఆర్టీసీ కండెక్టర్, డ్రైవరు – సర్వీసు రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు డ్రైవర్, కండెక్టర్ మధ్య మాటామాటా పెరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. అహోబిలం సర్వీసు బస్సు మంగళవారం మధ్యాహ్నం అహోబిలం నుంచి ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. తిరిగి అహోబిలానికి బయలు దేరే సమయంలో బస్సులో కండెక్టర్, డ్రైవర్లు ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్వీసు నపడటంతో ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, కార్మికులు అడ్డుకున్నారు. అనంతరం వీరు ఉన్నతా«ధికారులకు ఫిర్యాదు చేసుకునేందుకు వెళ్లడంతో ఈ సర్వీసు రద్దయింది. దీంతో నారసింహస్వామి జయంతి మహోత్సవాలకు వెళ్లేందుకు వచ్చే భక్తులు అవస్థలు పడ్డారు. ఈ విషయంపై డీఎం కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా డ్రైవర్, కండెక్టర్ ఘర్షణ పడినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. బస్సు సర్వీసు ఎందుకు రద్దయిందని ప్రశ్నించగా, డ్రైవర్ అనారోగ్యం కారణంగా సర్వీసును నిలిపివేశామన్నారు. -
ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం
-
ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం
ఆర్టీసీకి రోజూ రూ.8 కోట్ల నష్టం - నిబంధనలకు విరుద్ధంగా 2,174 ప్రైవేటు బస్సులు - కాంట్రాక్టు క్యారియర్ పర్మిట్లు.. స్టేజి క్యారియర్లుగా టూర్లు - దర్జాగా ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ - బస్టాండ్ల సమీపంలోనే ప్రైవేటు ట్రావెల్స్ దందా - అక్రమంగా 93 వేల ఆటోలు, ప్రైవేటు వాహనాలు - రూ. 4 వేల కోట్లకు చేరుకున్న ఆర్టీసీ నష్టాలు - యాజమాన్యం సర్వేలో బైటపడ్డ లెక్కలు - సంస్థ పరిరక్షణ కోసం సంఘాల ఆందోళనబాట సాక్షి,అమరావతి బ్యూరో: రోజుకు రూ.8 కోట్లు నెలకు రూ. 240 కోట్లు ఏడాదికి రూ. 2,880 కోట్లు అక్రమ రవాణా వాహనాల వల్ల ఆర్టీసీకి కలుగుతున్న నష్టం లెక్కలివి. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఆర్టీసీ ఆదాయానికి ఏ మేరకు గండి కొడుతున్నాయో ఈ గణాంకాలే చెబుతాయి. రెండేళ్లపాటు ఈ అక్రమాలను అరికడితే చాలు ప్రజారవాణా వ్యవస్థ అప్పుల ఊబి నుంచి బైటపడి లాభాల బాట పడుతుంది. కానీ ప్రభుత్వ పాలకులకు ఎంతో చిత్తశుద్ధి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. రాష్ట్రంలో అక్రమ వాహనాల వల్ల ఆర్టీసీకి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఈ నష్టం పరిమాణం ఎంత అనే దానిపై ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం ఓ సర్వే జరిపించింది. ఆ సర్వేలో నిర్ఘాంతపోయే నిజాలు బైటపడ్డాయి. అక్రమంగా నడుస్తున్న వాహనాల సంఖ్యతో పాటు వాటివల్ల ఆర్టీసీకి రోజుకు ఎంత మేర నష్టం వాటిల్లుతోందో లెక్కలన్నీ తేలిపోయాయి. ఆ వివరాలు.. ప్రైవేటు వాహనాలతో ఆర్టీసీకి భారీ నష్టం.. ఆర్టీసీ సంస్థకు నష్టం తెస్తున్న ప్రైవేటు వాహనాల అక్రమరవాణాపై యాజమాన్యం చేయించిన సర్వే ప్రకారం... రాష్ట్రంలో 2,174 ప్రైవేటు బస్సులు, 93 వేల ఆటోలు అక్రమంగా నడుస్తున్నాయని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడి, నష్టాలు మిగులుతున్నాయి. రాజకీయ నేతల స్వార్థం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు అక్రమ రవాణా మాఫియా రెచ్చిపోతోంది. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్టు క్యారియర్లుగా పర్మిట్లు తీసుకొని స్టేజి క్యారియర్లుగా నడుపుతూ, వాటికి ఆన్లైన్లో దర్జాగా టికెట్లు బుక్ చేస్తున్నారని వెల్లడైంది. ఆర్టీసీ బస్టాండ్ రెండు కిలో మీటర్ల దూరంలో మాత్రమే ప్రైవేటు వాహనాలను ఆపాలని మోటారు వాహనాల చట్టంలో నిబంధన ఉన్నా ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ట్రావెల్స్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకొని ఆర్టీసీకి రోజుకు రూ.4 కోట్లు ఆదాయానికి గండికొడుతున్నాయి. స్లీపర్ బస్సులకు ఆంధ్రాలో పర్మిట్లు బ్యాన్ చేశారు. గోవా, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పర్మిట్లు పొంది మన రాష్ట్రంలో తిప్పుతున్నట్లు సర్వే బృందం గుర్తించింది. ప్రైవేటు బస్సుల వల్ల రూ. 4 కోట్లు నష్టం వాటిల్లుతుండగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల వల్ల రోజుకు మరో రూ. 4 కోట్లు నష్టం జరుగుతున్నట్లు సర్వేలో తేలింది. ఆర్టీసీ అప్పులు, నష్టాలు రూ.4 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఒకప్పుడు దేశ రవాణా రంగానికే ఆదర్శంగా ఉంది. 12,500 బస్సులతో 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులతో నిత్యం 70 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజారవాణా వ్యవస్థగా పేరుపొందింది. అయితే ప్రయివేటు వాహనాల అక్రమ రవాణా వల్ల సంస్థ నష్టాల బాటలో నడుస్తోంది. ఏ ఏటికాయేడు పెరుగుతున్న అప్పులతో ఆర్టీసీ మనుగడ కష్టంగా మారింది. రాష్ట్ర విభజనతో సుమారు రూ.1600 కోట్ల అప్పులు ఆర్టీసీకి గుదిబండగా మారాయి. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చేయూతా ఇవ్వడం లేదు. దీంతో ఏటా నష్టాలు తప్పడంలేదు. 2016–17 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సంస్థకు రూ.840 కోట్లు నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రస్తుతం సుమారు రూ.4 వేల కోట్ల అప్పుల క్లబ్‌లోకి చేరింది. రోజుకు రూ.2 కోట్లు చొప్పున ఏడాదికి సుమారు రూ.750 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. అక్రమ రవాణాను కట్టడి చేయాలి.. అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రోజుకు కోట్లలో నష్టాలు వస్తున్నాయి. వేలాది బస్సులు, ఆటోలు చట్టవ్యతిరేకంగా నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. లక్షల మంది ప్రయాణికులలో మమేకమైన ప్రజారవాణా వ్యవస్థను అందరం కాపాడుకోవాలి. రవాణా శాఖలో ఖాళీలను భర్తీ చేసి వారికి స్వేచ్ఛనివ్వాలి. ఉద్యోగులకు రక్షణనిస్తే ప్రైవేటు అక్రమ రవాణాను కట్టడి చేస్తారు. – పలిశెట్టి దామోదరరావు, ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం తేల్చకుంటే ఆందోళన అక్రమ రవాణాపై ప్రభుత్వం స్పందించి కట్టడి చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఆర్టీసీని అందరం కలిసి రక్షించుకోవాలి. వేలాది వాహనాలు, ఆటోలు చట్టవ్యతిరేకంగా నడుస్తున్నాయి. దీనివల్ల ఆర్టీసీకి నష్టాలు వాటిల్లి సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీని కాపాడుకుందాం. – వై.వి.రావు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు -
బస్సు సర్వీసును పొడిగించాలి
ఓబులవారిపల్లె: ఓబులవారిపల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. మండలంలోని గాడవారిపల్లె నుంచి రైల్వేకోడూరుకు వైకోట మార్గంలో ఆర్టీసీబస్సును నడుపుతున్నారు. గాడివారిపల్లె నుంచి ఓబులవారిపల్లె మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్లదూరం మాత్రమే ఉంది. ఈ మార్గంలో కటికంవారిపల్లె, ముదినేపల్లె, జె.వడ్డిపల్లె, కొత్తవడ్డిపల్లె, ముదినేపల్లి అరుంధతీవాడ గ్రామాలున్నాయి. పది సంవత్సరాలక్రితం ఓబులవారిపల్లె, వైకోట గ్రామానికి రోడ్డును ఏర్పాటుచేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మార్గంలో ఆర్టీసీబస్సు సర్వీసులను నడుపుతామని చెపుతున్నా ఇప్పటివరకు నడపలేదు. అయితే ప్రస్తుతం గాడివారిపల్లె వరకు నడుపుతున్న ఆర్టీసీబస్సును ఓబులవారిపల్లె వరకు పొడిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈమార్గం గుండా ఆటోలుకానీ ప్రైవేటు వాహనాలుకానీ లేవు. తద్వారా ఆర్టీసీకీకూడా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న బస్సులను కూడా తొలగిస్తే ప్రజలు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతొ ప్రజలు గాడివారిపల్లెకు వస్తున్న ఆర్టీసీబస్సును ఓబులవారిపల్లె వరకు పొడిగించాలని అధికారులను కోరుతున్నారు. -
కేశినేనికో.. దివాకర్ రెడ్డికో ఆర్టీసీ అమ్మకం!
-
కేశినేనికో.. దివాకర్ రెడ్డికో ఆర్టీసీ అమ్మకం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి పాలనపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గుంటూరు బస్టాండు వద్ద మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వీలుంటే ఏపీఎస్ ఆర్టీసీని ఏ కేశినేనికో, దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే రేషనలైజేషన్ పేరుతో కాలేజిలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం మూయించేస్తున్నారని తెలిపారు. కాస్త వీలుంటే వాటిని నారాయణకు ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఇంకా కొద్దిగా వీలు కనిపిస్తే చంద్రబాబు ఏపీ జెన్కోను, ట్రాన్స్‌కోను కూడా సీఎం రమేష్‌కో, సుజనా చౌదరికో అమ్మేయడానికి ఆయన సిద్ధపడతారని, దాంతో కార్మికుల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరం కలిసి ఒక్కటై మే ఒకటో తేదీని మేడేగా నిర్వహించుకుంటామని, ఈ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఒక పండుగలా చేసుకుంటామని.. ఏ దేశమైనా కార్మికులమంతా ఒక్కటేనని చెప్పే రోజు ఇదని జగన్ తెలిపారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత తన సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే వీళ్లకూ వెన్నుపోటు పొడిచేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో కార్మికులు, రైతులు చదువుకున్న పిల్లలు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. అంతా కలిసికట్టుగా ఒక్కటై చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాల్సిందిగా పేరు పేరునా కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వైఎస్ జగన్‌కు తమ కష్టాలపై వినతిపత్రం సమర్పించారు. -
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మైదుకూరు టౌన్ : ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఎన్ఎంయూ కార్మికులు డిపో గేట్ వద్ద ఎర్రబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి వి.ఎస్ రాయుడు మాట్లాడుతూ కార్మికులకు రావాలసిన బకాయిలు, కార్మికులపై యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు అన్నిడిపోల వద్ద ధర్నా, ఎర్రబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్మికులకు గత ఏడాది నుంచి ఇవ్వవలసిన డీఏ బకాయిలు, సమైక్యాంద్ర ఉద్యమంలో 60 రోజులను స్పెషల్ లీవ్‌ల పరిగణించాలని, 2017 వ సంవత్సరంలో ఏప్రియల్ నుంచి నూతన స్కేల్ పై తక్షణం స్పందించి జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరిని రెగ్యులర్ చేయడంతో పాటు కార్మికుల పై పెడుతున్న పనిభారాన్ని తగ్గించి తదితర డిమాండ్లు వెంటనే పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఇలానే వ్యవహరిస్తూ పోతే రాబోవు కాలంలో తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాశం శీనయ్య, టి.పీ మునెయ్య, రమణారెడ్డి, పీ.వీ ఆంజనేయులు, కె.సీ కొండయ్య, జెవీఎస్ రెడ్డి, ఆచారీ, వినోద్‌కుమార్, ఎంసీ నాయక్, యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కరోనా ఏసీ బస్సులు ప్రారంభం
విజయవాడ: ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన కరోనా గరుడ ఏసీ బస్సులను రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలో ప్రారంభించారు. మొత్తం 15 బస్సులు రెండు వారాల క్రితమే విజయవాడ చేరుకోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం కిందటే పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీకి నష్టాలు కొత్తేమి కాదని, ప్రణాళికాబద్ధంగా పనిచేసి వాటిని అధిగమిస్తామని అన్నారు. కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తే నష్టాల నుంచి గట్టెక్కించవచ్చన్నారు. ప్రైవేటు బస్సుల నుంచి పోటీ ఉన్నప్పటికీ పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ఆర్టీసీ లాభాల బాట పట్టవచ్చన్నారు. కాగా, 11 సర్వీసులను కృష్ణా రీజియన్‌కు, మిగతా వాటిని ఇతర రీజియన్లకు కేటాయించనున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు 9, బెంగళూరుకు 4, చెన్నైకి 2 ఏసీ బస్సులు నడుపుతారు. మంత్రి దేవినేని ఉమ, అధికారులను ఎక్కించుకుని మంత్రి అచ్చెన్నాయుడు కొద్దిసేపు బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. -
ఆర్టీసీలో ‘కేశినేని’ పాగా!?
-
ఆర్టీసీలో ‘కేశినేని’ పాగా!?
అమరావతి: మూలిగే నక్క మీద తాటి కాయ పడడమంటే ఇదేనేమో. అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీపై కేశినేని ట్రావెల్స్ అదనపు భారాన్ని మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన కేశినేని ట్రావెల్స్‌ను ఇటీవల వివాదాస్పద రీతిలో మూసివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన అద్దె బస్సుల రూపంలో ఆర్టీసీలో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. నాని బ్లాక్ మెయిల్ రాజకీయాల ఒత్తిడికి తలొగ్గిన సీఎం చంద్రబాబు ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్ వద్ద దాదాపు 170 బస్సులు ఉన్నాయి. కండిషన్లో ఉన్న ఏసీ బస్సులు సుమారు 100 వరకు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఆయన వ్యూహాత్మకంగా ఆరు నెలల కిందట నుంచే పావులు కదుపుతున్నారు. వాస్తవానికి ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను భరించే స్థితిలో లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీకి 11,865 బస్సులు ఉన్నాయి. అందులో ఏసీ బస్సులు 2,700, స్లీపర్ 5, డీలక్స్ 613, సూపర్ లగ్జరీ 752, ఎక్స్‌ప్రెస్‌లు 2,117, మిగిలినవి 5,678 మామూలు బస్సులు. ఏసీ బస్సులు ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం రూట్లలో నడుపుతున్నారు. వాస్తవానికి ఆరు నెలల క్రితం వరకు ఆర్టీసీలో ఏసీ అద్దె బస్సులు లేవు. తొలిసారిగా 21 ఇంద్ర ఏసీ బస్సులను ఆరు నెలల కిందటే అద్దెకు తీసుకున్నారు. కేవలం కేశినేని ట్రావెల్స్ బస్సులకు మార్గం సుగమం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తద్వారా ఓసారి ఏసీ బస్సులను అద్దెకు తీసుకునే విధానానికి ఆమోద ముద్ర వేశారు. అదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 100 ఏసీ బస్సులను ఆర్టీసీకి కట్టబెట్టాలని పావులు కదుపుతున్నారు. త్వరలో టెండర్లు.. కేశినేని ట్రావెల్స్‌కు మార్గం సుగమం చేసేందుకు ఆర్టీసీ పెద్దలు ఇప్పటికే కార్యాచరణకు దిగారు. వేసవి సీజన్ కావడంతో ఆర్టీసీకి బస్సుల కొరత తీవ్రంగా ఉందనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదనే వాదనను టీడీపీ అనుకూల కార్మిక సంఘాల నేతలు బలంగా వినిపిస్తున్నారు. అద్దె బస్సులు తీసుకునేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించేలా ఎంపీ కేశినేని నాని పావులు కదుపుతున్నారు. ఇందుకు సీఎం కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి.. ఆ తర్వాతి పరిణామాలను నాని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న తమ సంస్థను ఆర్టీసీ ద్వారా ఆదుకుంటానని సీఎం చంద్రబాబు వద్ద హామీ తీసుకున్న అనంతరమే ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో కేశినేని ట్రావెల్స్ బస్సులు ఆర్టీసీ షెడ్డులోకి చేరతాయని అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆందోళనకు కార్మిక సంఘాలు సన్నద్ధం ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడల పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అద్దె బస్సుల భారంతో ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతుందని కార్మికులు చెబుతున్నారు. అది చివరగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే కార్మిక సంఘాలు సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తాయని ఓ కార్మిక సంఘం నేత ‘సాక్షి’కి తెలిపారు. -
ఫ్లాట్‌పారంపై షెల్టర్ లేక అవస్థలు
► బస్సు వచ్చే వరకు నేలపైనే పడిగాపులు చీరాల అర్బన్ : చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫారంల కొరత కారణంగా ఫ్లాట్‌ఫారంపై షెల్టర్ లేక ప్రజలు నేలపైనే కూర్చొండి పోతున్నారు. దీంతో నాలుగు గ్రామాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు బస్సుల కోసం నిలబడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే... చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో మొత్తం 16 ఫ్లాట్‌ఫారంలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు లేవు. దీంతో అద్దంకి, ఇంకొల్లు వయా తిమ్మసముద్రం, మరో రెండు గ్రామాలకు వెళ్లే బస్సులకు సంబంధించి ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు లేకపోవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు నిత్యం ఆరుబయట బండలపైనే వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కొంతమేర మాత్రమే ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు ఉండడంతో మిగిలిన నాలుగు గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు నిత్యం నేలపైనే కూర్చొనాల్సి వస్తుంది. ఇలా నిత్యం కళాశాలల నుండి వచ్చే విద్యార్థులు, ప్రజలు గంటల తరబడి నిలబడే ఉంటున్నారు. వేసవికాలం కూడా రావడంతో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. గతంలో ప్లాట్‌ఫారాలపై షెల్టర్లు నిర్మించేందుకు ఒక దాత ముందుకు రాగా మిగిలిన ఫ్లాట్‌ఫారంలపై కూడా నిర్మించాల్సి ఉండడంతో తిరిగి వెనుతిరిగారు. ఆర్టీసీ తరుపున కూడా ఎటువంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన లేకపోవడంతో ఆ సమస్య ఎప్పటి నుండో అలానే ఉంది. ప్రయాణీకులు కూడా ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా అధికారులలో స్పందన లేదు. ప్రయాణీకుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు ఇదే విధంగా అవలంభించడంపై ప్రయాణీకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ఫారాలపై షెల్టర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉంది. -
శివరాత్రికి రూ.3.11 కోట్ల ఆదాయం
కర్నూలు (రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌కు శివరాత్రి పండుగ లాభాలు తెచ్చి పెట్టింది. 10రోజుల పాటు శ్రీశైలంతోపాటు వివిధ శైవ క్షేత్రాలకు 12డిపోల నుంచి 340 ప్రత్యేక బస్సులు నడిపారు. రూ. 49లక్షల ఆదాయార్జనతో ఆదోని డిపో మొదటి స్థానంలో ఉండగా ఎమ్మిగనూరు, నంద్యాల డిపోలు రూ.46 లక్షలు ప్రకారం సాధించాయి. ఆళ్లగడ్డ, డోన్ డిపోలు చివరి స్థానంలో నిలిచాయి. కర్నూలు-1, 2డిపోలు ఈ సారి వెనుకబడ్డాయి. -
ఆర్థిక నష్టాల్లో ఆర్టీసీ
► అక్రమ రవాణా, యాజమాన్య నిర్ణయాలే కారణం ► ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి ► వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి కడప అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, దీనికి అక్రమ రవాణా, యాజమాన్య నిర్ణయాలే ప్రధాన కారణాలని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నా రు. బుధవారం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయిలోనే ఆర్టీసీలో ప్రమాదాల రేటు 0.11గా నమోదై 64 కార్పొరేషన్ల కంటే ఉన్నత సంస్థగా పేరు తెచ్చుకుందన్నారు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ రవాణా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో పలు ట్రావెల్స్ టూరిస్టు పర్మిషన్ తీసుకుని స్టేజ్ క్యారియర్లుగా నడుపుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారన్నారు. ప్రమాదాలు జరిగినపుడు ఎక్స్‌గ్రేషియాలు చెల్లిస్తూ చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ప్రస్తుతం అద్దె బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ కండక్టర్‌తో పనిలేకుండా వారికే టిమ్‌లను ఇచ్చి నష్టానికి కారణమవుతున్నారని ఆరోపించారు. అలాగే ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్‌ను ప్రైవేటు వారి కి అభి బస్‌కు అప్పగించడం ఎంతవరకు సమంజసమన్నా రు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం ఒక శాతం నిధులను ఆర్టీసీకి కేటాయించి నిబంధనలు పాటిస్తే అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి శివశంకర్, రీజినల్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కార్యదర్శి బాబా ఫకృద్దీన్, కడప డిపో కార్యదర్శి టి.జయరామయ్య, ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఈడీఎల్‌ఐఎఫ్ పరిమితి 6 లక్షలకు పెంపు
అమరావతి: ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రస్తుతం ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్‌ఐఎఫ్) ద్వారా చెల్లిస్తున్న రూ.3.60 లక్షల పరిమితిని యాజమాన్యం పెంచింది. రూ.6 లక్షల వరకు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ తర్వాత మరణించిన వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకానికి ఉద్యోగుల నుంచి అదనపు రికవరీలు ఏమీ ఉండవు. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) రికవరీ అవుతున్న వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. 2014 సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఉద్యోగి పింఛన్ రికవరీ వాటాను రూ.6,500 నుంచి రూ.15వేలకు పెంచే విధంగా చట్ట సవరణ జరిగింది. దీంతో చట్ట ప్రకారం ఇన్సూరెన్స్ బెనిఫిట్‌ను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నందున ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదరరావులు తెలిపారు. -
శాఖల మధ్య స్థలవివాదం
మాదంటే మాది అంటున్న ఆర్టీసీ, ఇరిగేషన్ పరిశీలన చేసి నివేదికకు ఆదేశించిన జేసీ అన్నవరం : అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఖాళీ స్థలం వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. అన్నవరం నడిబొడ్డులో మెయిన్‌రోడ్ పక్కన గల ఈ స్థలం రూ.కోట్లు విలువ చేస్తుంది. ఈ స్థలంపై ఆర్టీసీ, ఇరిగేషన్ శాఖల మధ్య వివాదం నెలకొనడంతో ఖాళీ స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆ స్థలం తమదేనని ఆర్టీసీ అధికారులు అంటుండగా కాదు అది ఇరిగేషన్శాఖదని ఎవరికీ బదలాయించలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ స్థలం పై రెండు శాఖల మధ్య వివాదం ఏర్పడింది. పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు తదితరులు జేసీ వెంట ఉన్నారు. ఈ స్థలం వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వమని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జేసీ ఆదేశించారని ఆర్డీఓ ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ లీజుకు ఇవ్వడంతో మొదలైన వివాదం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఇరిగేషన్ శాఖ, అన్నవరం దేవస్థానం నుంచి సేకరించిన 2.38 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి అప్పగించారు. అందులో ఎకరం స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థలంలో హోటల్ నిర్మాణం నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు గతేడాది స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఓ కాంట్రాక్టర్‌కు 43 సంవత్సరాలు లీజుకు అప్పగించారు. ఆ స్థలంలో హోటల్ నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్ శంకుస్థాపన చేయడంతో ఇరిగేషన్ శాఖ అభ్యంతరం చెప్పింది. ఆ స్థలం తమదేనని ఆర్టీసీకి అప్పగించలేదని తెలిపింది. దీంతో ఆ హోటల్ నిర్మాణం ఆగిపోయింది. తనకు ఆర్టీసీ స్థలం అప్పగించలేదని కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించడంతో మళ్లీ ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాకు అప్పగించినట్టు రికార్డు ఉంది ఆ ఖాళీ స్థలాన్ని తమకు అప్పగించినట్టు రికార్డులు ఉన్నాయి. అప్పుడు అప్పగించి ఇప్పుడు ఇవ్వలేదని ఇరిగేషన్ అధికారులు అంటే చెల్లదు. దీనిపై వివరణ ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు. - డీఎస్ఎన్ రాజు, ఈఈ, ఆర్టీసీ ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించలేదు ఆ స్థలాన్ని రెవెన్యూశాఖకు ఇరిగేషన్ శాఖ అప్పగించలేదు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని అప్పగించినట్టు చెబితే అందుకు మేం భాద్యులం కాదు. ఈ వివాదంపై సంయుక్త పరిశీలన నిర్వహించమని జేసీ ఆదేశించినందున మా వద్ద ఉన్న రికార్డుల ప్రకారం నివేదిక అందజేస్తాం. - ఇరిగేషన్ డీఈ శేషగిరిరావు -
కారుణ్య నియామకాలకు రేపు ఇంటర్వ్యూలు
కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించి ‘‘శ్రామిక్’’ పోస్టులకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ఎం జి.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఆర్ఎం కార్యాలయంలో వీటి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగి మరణించిన తేదీని ప్రాతిపదికనగా తీసుకోని సినీయారిటీ నిర్ణయిస్తామన్నారు. ఈ జాబితాలోని వారిలో 60 మంది పురుషులకు ఇది వరకే కాల్ లెటర్ వారి అడ్రసులకు పంపించామని, అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు ఫొటోలు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
- ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుల హెచ్చరిక - ఆర్ఎం కార్యాలయం ముట్టడి కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటన్న సమస్యలపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని నేషషన్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డి. సూర్య ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు మధుసూదన్ అన్నారు. ఇదే పరిస్తితి కొనసాగితే సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కర్నూలు కొత్త బస్టాండ్‌లో 500మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద బైఠాయించారు. యాజమాన్య, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యాజమాన్యం నిర్ణయాల కారణంగా సంస్థ నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్యాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్యారేజీల్లోని ఖాళీ పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షుడు షఫీవుల్లా, సంయుక్త కార్యదర్శి దేవసహాయం, నాయకులు మద్దయ్య, ఇసాక్, ఫకృద్దీన్, 12డిపోల కార్యదర్శులు పాల్గొన్నారు. -
కార్మికులసమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్:ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే యాజమాన్యం పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎం.ఎ. రాజు, జోనల్ ఆఫీస్ బేరర్ బి.టి.రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ రెండు రోజుల రిలేనిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దీక్షా శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడుతూ మే 2015 నెలలో జరిగిన 8 రోజుల సమ్మె కాలపు జీతాన్ని ఏరియర్స్‌తో కలిపి చెల్లించాలని, జూలై–2016 నుంచి రావాల్సిన డీఏను ఏరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని, అంగీకరించిన ప్రకారం సమైక్యాంధ్ర సమ్మె కాలానికి 60రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని, గ్యారేజీల్లో అన్ని కేటగిరిలలో ఖాళీలను భర్తీ చేయాలని, రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించాలని, అన్ని సర్వీసులకు అవసరం మేరకు రన్నింగ్టైం ఇవ్వాలని, కొత్తబస్సులు ప్రవేశపెట్టాలని, డిస్ ఎంగేజ్ అయిన కండక్టర్, డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అంగీకరించిన మేరకు పెండింగ్‌లో ఉన్న యూనిఫాం ఇవ్వాలని, 2015 లీవ్ఎన్క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలని, 2013 నుంచి జోనల్ వర్క్‌షాపు టైర్షాపుల్లో రివైజ్డ్ మ్యాన్ పవర్ రేటును అమలు చేసి బకాయిలు చెల్లించాలని, నష్టాల పేరుతో సర్వీసులు రద్దు చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని తదితర డిమాండ్లపై ఈ రెండు రోజులు రిలే నిరాహారదీక్ష చేçపడుతున్నామని తెలిపారు. ఈ «నిరాహారదీక్షా శిబిరంలో సోమవారం దీక్షకు దిగిన వారిలో ఎన్ఎంయూ నేతలు ఎం.జి.కృష్ణా, ఎం.ఆర్.మూర్తి, పి.రమణ, ఆర్వీఎస్ఎస్ రావు, కె.పి.రావు, జె.ఆర్.కుమార్, టి.ఎస్.నారాయణ, ఎం.ఎస్.రాములు, బి.పి.రాజు, జె.ఎం.రావు, ఎం.ఎన్.రావు, ఆర్.వి.రావు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
కోటప్పకొండ తిరునాళ్లకు సన్నద్ధం
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి నరసరావుపేట రూరల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పండగగా నిర్వహించే కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లను జయప్రదం చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధం కావాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్ణానంగారి శ్రీహరి తెలిపారు. కోటప్పకొండలో ఆదివారం తిరునాళ్లలో ఆర్టీసీ ఏర్పాట్లపై డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 13 డిపోల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి తిరునాళ్లకు హాజరయ్యే లక్షలాది యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. గతేడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ మార్గాల నుంచి ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌ల్లో ఇబ్బంది పడకుండా స్వామి వారిని దర్శించుకుని వెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఘాట్‌రోడ్డు మార్గంలో ప్రయాణించే ప్రత్యేక బస్సులను వివిధ డిపోల నుంచి తిరునాళ్లకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 700 బస్సులను మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేక బస్సులుగా నడిపినట్టు తెలిపారు. ప్రత్యేకించి కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 200 బస్సులు, చిలకలూరిపేట డిపో నుంచి 120 బస్సులతో పాటు ఘాట్‌రోడ్డు మార్గానికి 40 బస్సులను వినియోగించినట్టు వివరించారు. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా గతంలో కంటే అదనంగా బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, డిప్యూటీ సీటీఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎంఈ గంగాధర్, ఆర్టీసీ డీఎం వి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఈయూ గెలుపు
ముగిసిన ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలు – ఈయూ, మిత్రులకు 11, ఎన్ఎంయూకు 6 స్థానాలు – గుర్తింపు ఎన్నికల తరహాలో హోరాహోరీ – 12 డిపోల్లో 17 డెలిగేట్స్ పోస్టులు – ప్రశాతంగా ముసిగిన పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌లో నిర్వహించిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. మిత్ర సంఘాలతో కలిసి పోటీ చేసి అధిక స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో గుర్తింపులోని నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు పరాభవం ఎదురవడంతో నిరాశ తప్పలేదు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. జిల్లా వ్యాప్తంగా 12 డిపోల్లో 17 డెలిగేట్ స్థానాలకు పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ మిత్ర సంఘ సభ్యులతో కలిసి పోటీకి దిగి 11 స్థానాల్లో గెలువగా నేషనల్ మజ్దూర్ యూనియన్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. గెలుపు కోసం డబ్బును వెదజల్లి మద్యాన్ని పారించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం కార్మిక పరిషత్ ఒక్క చోట కూడా గెలవలేదు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ సొమ్మును దాచుకోవడంతో పాటు రుణాలు పొందే వీలుతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. దీంతో కొత్త ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో నవంబర్ 16న ఎన్నికలకు నోటిఫికేషన్, షెడ్యూల్‌ను సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఎన్నికైన డెలిగేట్లు ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఈయూ ఆధిపత్యం గుర్తింపు సంఘం ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈయూకు 9 స్థానాలు రాగా మిత్ర సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు రెండు స్థానాలొచ్చాయి. ఎన్ఎంయూ మాత్రం 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సంఘానికి కంచుకోటలా ఉన్న కర్నూలు–1 డిపోను సైతం కోల్పోయింది. డెలిగేట్ల ఎన్నికలు గుర్తింపు ఎన్నికల తరహాలో బ్యాలెట్ పేపరులో 'గుర్తు'కు బదులుగా వరుస సంఖ్య, అభ్యర్థి పేరు మీదుగానే జరిగాయి. ఓటర్లు ఎన్ఎంయూ వైఫల్యాలను ఎండగడుతూ ఈయూకు పెద్దపీట వేశారు. కర్నూలు రీజియన్(జిల్లా)లో 12డిపోలు ఉండగా ఇందులో 17 డిలిగేట్ పోస్టులు ఉన్నాయి. కర్నూలు–1డిపోతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కర్నూలు–2 డిపోల్లో రెండేసి పోస్టులుండగా ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె, పత్తికొండ, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ డిపోలకు ఒక్కో పోస్టు ఉంటుంది. ఈ స్థానాల్లో పోటీకి 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ 17 డెలిగేట్ పోస్టులకు ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సహకారంతో 17 మంది అభ్యర్థులను బరిలో దించింది. మరో 20 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. గెలిచిన అభ్యర్థులు త్వరలో రాష్ట్ర సొసైటీ డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. గెలుపు సంఘాల సంబరాలు సీసీఎస్ ఎన్నికల్లో గెలిచి సంఘాలు ఆయా డిపోల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. కర్నూలులోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. పారని 'పచ్చ' పాచిక సీసీఎస్ ఎన్నికల్లో తమ అనుబంధ సంఘాన్ని గెలిపించుకునేందుకు తెలుగుదేశం తమ్ముళ్లు చేసిన కుట్రలు ఫలించలేదు. గురువారం రాత్రి ప్రలోభాలకు తెరలేపి డ్రైవర్, కండక్టర్లతో పాటు వివిధ కార్మికులు, ఉద్యోగులను రహస్యంగా కలసి డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. ఓటరుకు రూ.2 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు అందించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేక ఆ సంఘం జిల్లా వ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయింది. -
ప్రయివేటు బస్సులతో రూ.లక్షల నష్టం
ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి రేపల్లె : ప్రయివేటు వాహనాలతో ఆర్టీసీకి రోజుకు రూ.30 లక్షల నష్టం వస్తోందని రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. రేపల్లె ఆర్టీసీ డిపోకు ఆయన ఆదివారం సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఆర్టీసీ డిపోను లాభాల బాటలో నడిపించాలని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులకు సూచించారు. రహదారులు ఉన్న దూర, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మధ్యాహ్న సమయాల్లో ఉండే పాసింజర్లను బట్టి బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి పలు కూడళ్లలో ఆర్టీసీ పరిరక్షణ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 58 పరిరక్షణ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. పరిరక్షణ పాయింట్లలో ఆర్టీసీ సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ చార్ట్స్ ప్రకారం కొంత సమయం కేటాయించి పాసింజర్లు ఆర్టీసీ బస్సులు ఎక్కేలా కృషి చేయాలని కోరారు. ఆక్యుపెన్సీ, కేఎంపీఎస్లను సాధించడంలోనూ రాష్ట్రంలో జిల్లానే మొదటిస్థానంలో ఉందన్నారు. ఆర్టీసీపై నోట్ల ప్రభావం రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపై కొంత వరకు చూపినట్లు ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. నోట్ల రద్దుతో కొత్తనోట్లకు చిల్లర లేకపోవటం, నోట్ల కష్టాలతో ఆర్టీసీ ప్రయాణికులు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడంతో కొంత వరకు ఆదాయం తగ్గిందన్నారు. చిల్లర సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ ప్రయాణికులకు స్వైపింగ్ మిషన్లను డిపోల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 20 మిషన్లను ఏర్పాటు చేశామని, తొలిరోజు వాటి ద్వారా రూ.1.80 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు. మరో 300ల మిషన్లు డిపోలకు తీసుకువచ్చి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. నరసరావుపేట డిప్యూటీ సీటీఎం సీహెచ్ వెంకటేశ్వరరావు, డీఏం జే.నాగేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన సప్తగిరులు
* అందుబాటులో ఐదుబసస్సులు * అతి త్వరలో మరో 25 రాక * ఆర్ఎం శ్రీహరి వెల్లడి గుంటూరు (పట్నంబజారు): నగర వాసుల కల నెరవేరింది. ఎట్టకేలకు నగరంలో మినీ సిటీ బస్సులు రోడ్డెక్కాయి. నగరంలో నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా తిరుమల నుంచి తెప్పించిన సప్తగిరి బస్సులను ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం శ్రీహరి మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు తిప్పటంపై దృష్టి సారించామన్నారు. ఐదు సప్తగిరి బస్సులు గుంటూరుకు వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం సమయంలో కూడా విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. దూరప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చిన ప్రయాణికులు రిజర్వేషన్ టిక్కెట్‌తో నగరంలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఐదు బస్సులు వచ్చాయని, అతి త్వరలో మరో 25 వస్తాయని వివరించారు. బస్సులు రాకపోకలు సాగించే రూట్లు ఇవీ.. 1) ఎస్వీఎన్ కాలనీ, బృందావన్ గార్డెన్స్, హాలీవుడ్ జంక్షన్, మార్కెట్, గుంటూరు బస్టాండ్, గోల్డెన్ కంపెనీ, ఆటోనగర్, పెదకాకాని, పెదకాకాని ఆలయం వరకు తిరుగుతాయి. 2) గుంటూరు బస్టాండ్ నుంచి మార్కెట్, కొరిటిపాడు, విద్యానగర్, విజ్ఞాన్నిరుల, పెద పలకలూరు, చిన పలకలూరు, పేరేచర్ల వరకు తిరుగుతుంది. 3) ఆర్టీసీ బస్టాండ్, సంగడి గుంట, బైపాస్, సెయింట్ మేరీస్ ఉమెన్స్ కళాశాల, కారంమిల్లు, నారాకోడూరు, వేజెండ్ల అడ్డరోడ్డు, వేజెండ్ల, సుద్దపల్లి వరకు తిరుగుతుంది. 4) బస్టాండ్ నుంచి పాతగుంటూరు యాదవ కళాశాల, సుద్దపల్లి డొంక ప్రధాన రహదారి, నల్లచెరువు, శ్రీనివాసరావుపేట, ఐటీసీ, గుంటూరు మార్కెట్ మీదుగా బస్టాండ్‌కు చేరుకుంటుంది. -
ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికలు
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం లిమిటెడ్(క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ) ఎన్నికలు వచ్చే నెల 16న జరగనున్నాయి. ఈ మేరకు సీసీఎస్ కార్యదర్శి ఎన్వీ రాఘవరెడ్డి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సభ్యులు డిసెంబరు2 నుంచి 8వ తేదీ వరకు ఆయా డిపోల్లో నామినేషన్ దాఖలు చేయాల్సివుంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబరు 13 అని రాఘవరెడ్డి చెప్పారు. 13 జిల్లాల్లో పనిచేస్తున్న 55,462 మంది ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎస్ ఎన్నికల్లో పాల్గొని 242 మంది డెలిగేట్స్‌ను ఎంపిక చేసుకుంటారు. సీసీఎస్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదరరావులు హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం ప్యాంట్రీ వాహనానికి రూ.30.94 లక్షలు
అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు ప్యాంట్రీ వాహనంలో సౌకర్యాలను కల్పించినందుకు గాను ఏపీఎస్ఆర్టీసీకి రూ.30.94 లక్షల్ని రీ యింబర్స్ చేసేందుకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు పర్యటనల కోసం సమకూర్చిన ప్యాంట్రీ వాహనంలో కిచెన్, చిమ్నీ, గీజర్, ఫ్రిజ్ తదితర సౌకర్యాలను కల్పించారు. ఏపీఎస్ఆర్టీసీ రూ.3 కోట్ల నిధులతో గతేడాది మేలో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అంత ఖర్చుతో బస్సు కొనుగోలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్య లేఖలో ప్రశ్నించారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుతో పాటు ప్యాంట్రీ వాహనానికి ఆర్టీసీ రూ.30.94 లక్షలు వెచ్చించింది. ఈ నిధుల్ని తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఉత్తర్వులిచ్చారు. -
గూగూడు బ్రహ్సోత్సవాలకు ప్రత్యేక బస్సులు
అనంతపురం న్యూసిటీ : గూగూడు బ్రహోత్సవాలకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భట్టు చిట్టిబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాలకు అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం నుంచి 260 బస్సులు తిప్పుతామన్నారు. ఈ నెల 10న చిన్న సరిగెత్తు సందర్భంగా అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నామన్నారు. 11వ తేదీ 42 సర్వీసులు, 12న 90 సర్వీసులు, 13న 90 సర్వీసులు వివిధ ప్రాంతాల నుంచి గూగూడు నడుపుతున్నామన్నారు. గూగూడులోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామనీ, అక్కడ డివిజినల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు డీఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గూగూడు దేవస్థానం పరిసర ప్రాంతంలో టెంట్లు వేస్తామన్నారు. అనంతపురం నుంచి గూగూడుకు రూ. 47, తాడిపత్రి నుంచి గూగూడుకు రూ.66, ధర్మవరం నుంచి గూగుడుకు రూ.66 టికెట్ ధర ఉంటుందన్నారు. -
‘ఆర్టీసీని కాపాడుకుందాం’
– ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వెల్లడి – ఆరు కొత్త బస్సుల ప్రారంభం మదనపల్లె అర్బన్: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థలను కాపాడుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వన్‌డిపో పరిధిలో ఆరు నూతన బస్సులు సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో అనువజ్ఞులైన డ్రైవర్లు ఉండడం వల్ల ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తారని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెకించేందుకు కృషి చేయాలన్నారు. అక్రమ వాహనాలను అరికట్టేందుకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాదుకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు, రెండు బెంగళూరుకు, రెండు మదనపల్లె–తిరుపతి మార్గాల్లో ప్రవేశపెట్టడంతో వన్ yì పోకు మరింత ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వన్, టూ డిపో మేనేజర్లు ఎస్.వి ప్రభాకర్, పెద్దన్నశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మీ, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
నష్టాల సాకుతో ‘బస్సుల’ తగ్గింపు
* ఖాళీగా వందలాది మంది ఆర్టీసీ సిబ్బంది * హైర్ బస్సులను మాత్రం తగ్గించని అధికారులు * కార్మిక సంఘాల ఆందోళన నష్టాల సాకుతో ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్మికులకు తలపోటుగా మారుతున్నాయి. రీజియన్ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు రద్దు చేయటంతో కార్మికులకు పని లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్టీసీకి చెందిన 83 బస్సులను వివిధ రూట్లలో నిలిపివేశారు. అధికారులు తీసుకున్న నిర్ణయంతో వందలాది మంది కార్మికులు వి«ధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. గుంటూరు (పట్నంబజారు): రీజియన్ పరిధిలో మొత్తం 1300 బస్సులున్నాయి. వీటిలో 380 (హైర్) అద్దెవి. రీజియన్ వ్యాప్తంగా 13 డిపోల్లో కలిపి 2345 మంది డ్రైవర్లు, 2300 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. కేవలం సంస్థకు చెందిన బస్సుల రూటు నిలిపివేయటంతో కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 83 సర్వీసులను రద్దు చేశారు. దీంతో సుమారు 300 మంది డ్రైవర్లు, కండక్టర్లకు పనులు లేకుండా పోయాయని చెబుతున్నారు. గుంటూరు నుంచి బెంగళూరు, విజయవాడ, మాచర్ల, వినుకొండ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులు రద్దు చేశారు. డిపో 1లో 8, డిపో 2 పరిధిలో 8, తెనాలి పరిధిలో 8, పొన్నూరు 7, మంగళగిరిలో 5, సత్తెనపల్లిలో 7, మాచర్ల 6, వినుకొండలో 8, పిడుగురాళ్లలో 6, రేపల్లెలో 5, బాపట్ల డిపోల 5, నర్సరావుపేటలో 5, చిలకలూరిపేటలో 5 బస్సులను నిలిపివేసినట్లు సమాచారం. నష్టాల కారణంగా తాత్కాలిక కుదింపు అని చెబుతున్నప్పటీకీ అందులో వాస్తవం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులను తగ్గించే పనిలో ఉన్నారనే వాదనలు వినవస్తున్నాయి. బస్సుల కుదింపులో ఖాళీగా ఉన్న సిబ్బందిన ఇతర సంస్థ అవసరాలకు కోసం వినియోగిస్తామని అధికారులు చెబుతున్నా... అవి కార్యరూపం దాల్చటంలేదని కార్మికులు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. హైర్ బస్సులను నిలిపి వేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. కండక్టర్ వ్యవస్థ రద్దుకే..? ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ వ్యవస్థ లేకుండా సర్వీసులు తిప్పాలనే యోచన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చే దిశగా ఆర్టీసీ అధికారులు అడుగులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు వెలుగు బస్సులను కొన్నింటిని రద్దు చేసి, నాన్‌స్టాప్, సూపర్ఫాస్ట్లుగా తిప్పుతున్నారనేది కార్మిక సంఘాల నేతల వాదన. బస్సులను యథాతథంగా తిప్పాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు. తాత్కాలిక నిలుపుదల మాత్రమే.. రీజయన్ పరిధిలో 83 బస్సులను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశాం. కృష్ణా పుష్కరాల తర్వాత తీవ్రంగా నష్టం వాటిల్లుతున్న రూట్లులో మాత్రమే నిలుపుదల చేశాం. బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అసిస్టెంట్ కంట్రోలర్, ట్రాఫిక్, గ్యారేజీల్లో విధుల్లోకి పంపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న నిర్ణయం ఇదీ. గ్రామీణ ప్రాంతాలు, సింగిల్ రూట్లులో ఏ ఒక్క సర్వీసును రద్దు చేయలేదు. - ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి -
సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆర్టీసీలో సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి దాని ద్వారా మరింత ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ సంస్థ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని 8 డిపోలకు చెందిన రవాణా విభాగ అసిస్టెంట్ డిపో క్లర్క్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా వ్యవస్థ ద్వారా మూడు నెలల్లో పశ్చిమ గోదావరి రీజియన్‌లో రూ.19 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పారు. సరుకు రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించి మరింత ఆదాయం తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు, మార్కెటింగ్ అండ్ కమర్షియల్ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీఎస్ఆర్కే మూర్తి, ఏటీఎం కమర్షియల్ సి.శివరామ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ఏకైక మార్గం
కడప అర్బన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రజా రవాణా మనుగడకు ఏకైక మార్గమని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేయకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం లేదన్నారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదన్నారు. ప్రజల అవసరాల కోసం నడుస్తున్న సంస్థ అని, లాభనష్టాలతో యాజమాన్యం మొదటి నుంచి బేరీజు వేయడం తప్పుడు ఆలోచన విధానమన్నారు. ప్రజా రవాణా అవసరాలను గమనించి అందుకు అనుగుణంగా సంస్థను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 4 వర్క్‌షాపుల్లో ఈయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించామన్నారు. బుధవారం కూడా ఈ ధర్నాలు కొనసాగుతాయన్నారు. యాజమాన్యం అద్దె బస్సులను పెంచడం వల్ల సంస్థకు మరింత భారమవుతుందన్నారు. అద్దె బస్సులను పెంచడమే కాకుండా ఆ బస్సులకు ఆర్టీసీ కండక్టర్లను నియమించకుండా ప్రైవేటు డ్రైవర్లకే డబ్బులు వసూలు చేసే బాధ్యత అప్పగించడం యాజమాన్య వికృత చేష్టలకు పరాకాష్ట అన్నారు. ప్రయాణికులు లేరనే సాకుతో యాజమాన్యం ట్రిప్పులను తగ్గించడం ద్వారా ప్రైవేటు బస్సులు, లారీలు, ఆటోల అక్రమ రవాణాను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. అక్రమ రవాణాను నియంత్రించడం ద్వారానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు. యాజమాన్యం అద్దె బస్సులు, సింగిల్ క్రూ డ్యూటీలు, గ్రౌండ్ బుకింగ్స్, వన్‌మ్యాన్ సర్వీసుల వంటి తప్పుడు విధానాలను మానుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు యాజమాన్యం కూడా గట్టిగా కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. -
ఆర్టీసీకి రూ.19 కోట్ల నష్టం
నిడదవోలు : ఏపీఎస్ ఆర్టీసీ పశ్చిమ రీజియన్ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.19 కోట్ల నష్టాలు వచ్చాయని ఆర్టీసీ జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిడదవోలు డిపో రూ.1.28 కోట్లు, నరసాపురం డిపో రూ. 2.36 కోట్లు, ఏలూరు డిపో రూ.2.79 కోట్లు, తాడేపల్లిగూడెం డిపో రూ.3.28 కోట్లు, భీమవరం డిపో రూ.3.15 కోట్లు, కొవ్వూరు డిపో 2.20 కోట్లు, జంగారెడ్డిగూడెం డిపో రూ.1.77 కోట్లు, తణుకు డిపో రూ.2 కోట్ల నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. నష్టాల్లో ఉన్న డిపోల పరిధిలోని ఆయా మేనేజర్లు, అధికారులకు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించడానికి, ఆర్టీసీ లాభలు పొందడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండడానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిపోయిన ఆటోలేనని అభిప్రాయపడ్డారు. నష్టాలు రావడంతో నిడదవోలు నుంచి మచిలీపట్టణం, విజయవాడ ఎక్స్‌ప్రెస్ బస్సులు, నిడదవోలు నుంచి విశాఖపట్టణం డీలక్స్ బస్సును రద్దుచేశామని పేర్కొన్నారు. ప్రతి కిలోమీటరుకు ఆర్టీసీ బస్సుకు రూ.35.56 పైసలు రాబడి రావల్సి ఉండగా.. రూ. 30.30 పైసలు ఆదాయం మాత్రమే వస్తున్నాయని ఆయన వెల్లడించారు. నిడదవోలు డిపో నుంచి ఏలూరుకు డైరెక్ట్ బస్సు సర్వీసును ఏర్పాటుచేయాలని స్థానికులను కోరగా.. ఆమేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డిపో మేనేజర్ సుబ్బారావు తదితరులు ఉన్నారు. -
కర్ణాటకకు ఆర్టీసీ బస్సు సర్వీసుల తగ్గింపు
అనంతపురం టౌన్ : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రగిలిన కా‘వేడి’ అనంతకూ తాకింది. కర్ణాటకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడి ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా నుంచి కర్ణాటకకు 73 సర్వీసులు నడుపుతుండగా సగం వరకు మాత్రమే నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలవివాదం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. తాజాగా తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ నెల 20 వరకు తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కర్ణాటకకు ఆదేశిస్తూ తదుపరి విచారణను 20కి వాయిదా వేసింది. ఈ క్రమంలో కర్ణాటకలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆగ్రహానికి తమిళనాడుకు చెందిన సుమారు 40 బస్సులు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అనంతపురం ఆర్టీసీ అధికారులు అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బెంగళూరులో ఉండే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌తో మాట్లాడారు. ప్రస్తుతం మెజిస్టిక్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని, తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. పైగా మంగళవారం బక్రీద్ సెలవుతో పాటు అక్కడి ఐటీ కంపెనీలు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం నుంచి ఆర్టీసీ సర్వీసులను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. పరిస్థితి సద్దుమణిగే వరకు బస్ సర్వీసులను తక్కువగానే నడుపుతామని ఆర్టీసీ ఆర్ఎం చిట్టిబాబు ‘సాక్షి’కి తెలిపారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు, అధికారులు, వ్యాపారులు నిబంధనలను తప్పక పాటించాలనీ కడప జోన్ ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు అన్నారు. ఇటీవలే బాధ్యతలను చేపట్టిన ఆయన శుక్రవారం తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. – కృష్ణా పుష్కరాల విజయవంతానికి కృషి చేశామనీ, ప్రథమ స్థానంలో రెవెన్యూ, రెండవ స్థానంలో ఆర్టీసీ నిలిచిందన్నారు. – ఆర్టీసీ బస్టాండ్లలో తాము సంస్థ వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వస్తు, సామగ్రిపై వున్న రేట్లకే ప్రయాణీకులకు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. – డ్రైవర్ల పని తీరును మెరుగు పర్చుకునేందుకు యోగా లాంటి కార్యక్రమాలను చేపడతామన్నారు. – విధి నిర్వహణ సమయంలో ఎవరైనా మద్యం సేవిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము రూట్లలోనే ఆకస్మిక తనిఖీలను మళ్లీ చేస్తామన్నారు. – ఏదైనా సమాచారంను తమ ఫోన్ నెంబర్స్ : 99592 25754, 73829 23333లకు చేరవేయవచ్చన్నారు. తాము ప్రయాణిస్తున్న బస్సుల్లో డ్రైవర్ మార్గమధ్యంలో మద్యం సేవిస్తే తమకు తెలుపవచ్చన్నారు. -
ఆర్టీసీ పుష్కర సేవలు భేష్!
పాత గుంటూరు: కృష్ణా పుష్కరాల మూడో రోజు ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజియన్ పరిధిలో పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉదయం నుంచే బస్సు సర్వీసులను పెంచి భక్తులను పుష్కర ఘాట్లకు చేరవేశారు. వరుస సెలవు దినాలు, ఆదివారం కావడంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు, భక్తులు, పాఠశాలల విద్యార్థులతోపాటు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు స్టాఫ్లు కిటకిటలాడాయి. ప్రముఖ ఘాట్లు అమరావతి, సీతానగరంలకు వెళ్లేందుకు యాత్రికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచినట్లు రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. అవసరమైన చోట బస్సుల సంఖ్యను పెంచి యాత్రీకులకు అందుబాటులో ఉంచారు. ఆదివారం మొత్తం 1105 బస్సులతో 9338 ట్రిప్పులను నడిపి 3,26,376 మంది యాత్రికులను జిల్లాలోని వివిధ పుష్కర స్నాన ఘాట్లకు చేరవేసినట్లు తెలిపారు. వీటిలో మొత్తం 4791 ట్రిప్పులు ఉచితంగా నడిపి 1,63,520 మంది యాత్రికులను అమరావతిలోని పుష్కర ఘాట్లకు, ఎయిమ్స్ నుంచి సీతానగరం, మహానాడు స్నానఘట్టాలకు చేరవేసినట్లు వెల్లడించారు. యాత్రికులు ప్రై వేటు వాహనాలను ఆదరించకుండా ఆర్టీసీని ఆదరించి సంస్థ పురోభివృద్ధికి చేయూతనందించాలని ఆయన కోరారు. -
ఏ ఘాటుకు ఎంత చార్జి?
కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుష్కర స్నానం చేసి పునీతులు అయ్యేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమవుతుంటారు. నదీ స్నానం చేసేందుకు ఏ ఘాటుకు వెళ్దాం.. ఎలా వెళ్దాం.. ఎంత దూరం ఉంటుంది.. ఆర్టీసీ చార్జీలు ఎంత ఉంటాయి.. పిల్లలకు బస్సుల్లో ఎంత తీసుకుంటారు.. సమీపంలోని ఊరి నుంచి ఫలాన ఘాటుకు వెళ్లోస్తే చార్జీలు ఎంతవుతాయి.. అని భక్తులు లెక్కలు వేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీల వివరాలు ఇస్తున్నాం.. చార్జీల వివరాలు.. నుంచి వరకు కిలో మీటర్లు పెద్దల చార్జీ పిల్లల చార్జీ కర్నూలు శ్రీశైలం 195 రూ.225 రూ.115 కర్నూలు సంగమేశ్వరం 104 రూ.110 రూ.60 కర్నూలు బీచుపల్లి 51 రూ.60 రూ.35 ఆత్మకూరు సంగమేశ్వరం 45 రూ.50 రూ.25 నందికొట్కూరు సంగమేశ్వరం 72 రూ.65 రూ.34 నంద్యాల బస్టాండ్ లింగాలగటు 176 రూ.210 రూ.110 నందికొట్కూరు నెహ్రూనగర్ 15 రూ.15 రూ.12 సంగమేశ్వరం శ్రీశైలం 168 రూ.148 రూ.75 నంద్యాల శ్రీశైలం 176 రూ.155 రూ.78 మంత్రాలయం శ్రీశైలం 286 రూ.306 రూ.156 ఆళ్లగడ్డ శ్రీశైలం 221 రూ.250 రూ.130 కోవెలకుంట్ల శ్రీశైలం 218 రూ.250 రూ.130 బనగానపల్లె శ్రీశైలం 223 రూ.250 రూ.130 ఎమ్మిగనూరు శ్రీశైలం 262 రూ.285 రూ.145 ఆదోని శ్రీశైలం 292 రూ.310 రూ.160 ఆత్మకూరు శ్రీశైలం 123 రూ.160 రూ.85 కర్నూలు విజయవాడ 342 రూ.300 రూ.152 నంద్యాల విజయవాడ 327 రూ.286 రూ.145 శ్రీశైలం విజయవాడ 272 రూ.238 రూ.120 గమనిక: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను మాత్రమే నడుపుతోంది. ఆయా బస్సుల్లో కిలో మీటరుకు 0.87పైసల చొప్పున వసూలు చేస్తారు. ఈ చార్జీలపై ఆర్టీసీ డెవెలప్మెంట్ సెస్సు, రిజర్వేషన్ చార్జీ, ప్యాసింజరు ఇన్ఫర్మేషన్ చార్జీ, ఘాట్ రూట్లలో ఒక కిలో మీటరుకు వసూలు చేసే రూ.1.74ను కూడా కలిపి టికెట్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన చార్జీల్లో కొద్దిగా తేడా ఉండవచ్చు. -
‘బీచుపల్లి’ ప్రయాణం భారమే!
– ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించని తెలంగాణ – కర్నూలు నుంచి సమీపంలో ఉన్న ఘాటు అదే – శ్రీశైలం కంటే రెట్టింపు భక్తులు వెళ్తారని ఆర్టీసీ ప్రణాళిక కర్నూలు(రాజ్‌విహార్): బీచుపల్లి పుష్కర ఘాట్‌కు ప్రయాణం భారం కానుందా... ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఆలయ, ఘాటు సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, స్టాపింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కర్నూలుకు సమీపంలో ఉన్న పుష్కర ఘాటు కావడంతో స్థానిక అధికారులు రోజుకు 40 బస్సులు ప్రత్యేకంగా నడిపేందుకు చర్యలు చేపట్టారు. గత వారం పది రోజుల నుంచి ఇక్కడి అధికారులు తమ సర్వీసులకు స్థలం కేటాయించాలని విన్నపాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. శ్రీశైలంతోపాటు సంగమేశ్వరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులు పూర్తి స్థాయి కాకపోవడం, దూర ప్రయాణం వంటి కారణాలతో భక్తులు బీచుపల్లికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి బీచుపల్లికి ప్రతి రోజు 40 బస్సులు చొప్పున నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీసీటీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. మురుగుతున్న నిధులు: బీచుపల్లి వద్ద పార్కింగ్‌కు స్థలం కేటాయించకపోవడంతో నిధులు మురుగుతున్నాయి. అక్కడ పలు అభివద్ధి పనులు చేపట్టేందుకు రూ.5లక్షలు మంజూరయ్యాయి. శాటిలైట్ బస్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు పష్కరాలకు వచ్చే భక్తులకు సమాచారాన్ని అందించేందుకు అనౌన్స్మెంట్ సెంటర్, ముత్ర శాలలు, మరుగదొడ్లు, వలంటీర్లు ఉండే సెంటర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బస్సుల సౌకర్యార్థం రోడ్డు చదును, విస్తరణ పనులు చేసుకోవాల్సి ఉంది. -
పుష్కరాలకు 905 బస్సులు
అదనంగా అందుబాటులో మరో 500 బస్సులు 3,500 మంది సిబ్బందితో విధులు నిర్వహణ ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి వెల్లడి కృష్ణా పుష్కరాల్లో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి నది పరీవాహక ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడపనున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థ అధికారులు పూర్తి చేశారు. పట్నంబజారు (గుంటూరు) : పుష్కరాల సందర్భంగా 905 బస్సులతో సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ రీజియన్ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అదనంగా రీజయన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 500 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. గుంటూరు రీజియన్‌లోని డిపో 1, సత్తెనపల్లి, క్రోసూరు, మంగళగిరి నుంచి అమరావతికి 193 బస్సు సర్వీసులు నడపనున్నారు. అన్ని డిపోల నుంచి విజయవాడకు 140 బస్సులు, విజయపురి సౌత్‌కు 110, తాళ్ళాయపాలెంకు 26, కష్ణా గోదావరి సంగమ ప్రదేశానికి 20, శ్రీశైలానికి 79, పెనుమూడికి 10, చిన్న చిన్న ఘాట్ల వద్దకు 201 బస్సులను నడపనున్నారు. నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, కడప రీజియన్ల నుంచి మరో 300 బస్సులు రానున్నాయి. 3,500 మంది సిబ్బంది సేవలు.. బస్సు సర్వీసులను నడిపేందుకు 3,500 మంది సిబ్బందిని సంస్థ కేటాయించింది. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి మరో 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సిబ్బందికి ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక బస్స్టేషన్లు.. ప్రయాణికులకు మార్గ సూచన, మరుగుదొడ్లు వినియోగం, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కోసం ఆర్టీసీ రీజియన్ అధికారులు తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పాత ఆర్ఎం కార్యాలయం, ఉల్ఫ్ హాల్ గ్రౌండ్స్, గోరంట్ల, అమరావతిలో 3, విజయవాడలో 3, సత్తెనపల్లిలో 3 తాత్కాలిక బస్ స్టేషన్లు ఉంటాయి. వీటితో పాటుగా తాత్కాలిక కంప్యూటర్ కేంద్రాలు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్ ఇచ్చే విధంగా ఆంధ్ర ముస్లిం కళాశాల, పెదకాకాని, చినకాకానితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికో బస్సు సర్వీసు.. గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాలకు 12 రోజుల పాటు నిమిషాల వ్యవధిలో బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. విజయవాడ, అమరావతి, విజయపురిసౌత్, సీతానగరాలకు ప్రతి నిమిషానికి ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి రోజుకు సగటున 2 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు సిద్ధంగా ఉన్నాం.. ఈ నెల 12న ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాం. ఆయా ఘాట్లకు ఉన్న రద్దీలను బట్టీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి ఘాట్ వద్ద ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుని ముందుకు సాగుతాం. సిబ్బందికి సైతం శిక్షణా తరగతులు నిర్వహించాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు. – జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం -
పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర యాత్రికులకు పన్నెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ఇంఛార్జి డీజీపీ, ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. శనివారం ఆర్టీసీ హౌజ్‌లో పోలీసు, ఆర్టీసీ, రవాణా శాఖలకు చెందిన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో మొత్తం 24 వేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని, విజయవాడ నగరంలో 1,300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. కర్నూలు, గుంటూరులలో రిజర్వ్ ఫోర్సును అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 136 ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాలు గుర్తించామని, విజయవాడ నగరంలోనే 22 ప్రదేశాలలో పెయిడ్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్డు మీద ప్రైవేటు వాహనం ఆగితే భారీ జరిమానాతో పాటు క్రేన్ల సాయంతో యార్డుకు తరలిస్తామన్నారు. నో వెహికల్ జోన్ మ్యాపులను త్వరలో విడుదల చేస్తామని సాంబశివరావు ప్రకటించారు. టోల్‌ప్లాజాల్లో వాహనాలు నిలిచిపోకుండా సీఎం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని, టోల్ ఫీజుపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. ఆటోలు, రవాణా వాహనాలు అధిక ఫీజులు వసూలు చేయకుండా రవాణా శాఖ నియంత్రిస్తుందన్నారు. పుష్కర యాత్రికులు ఏ బస్ ఎక్కాలి.. ఏ ఘాట్‌కు ఎలా చేరుకోవాలనే సమాచారాన్ని కరపత్రాలు, బ్యానర్ల ద్వారా బస్సులతో పాటు అన్ని ముఖ్యప్రాంతాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. విజయవాడలో శాటిలైట్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను పుష్కరాలు జరిగే 12 రోజులు సిటీ బస్టాండ్‌గా మాత్రమే వినియోగిస్తామని తెలిపారు. ఘాట్లకు, దుర్గ గుడికి పీఎన్బీఎస్ బస్టాండ్ దగ్గర్లో ఉన్నందున దూర ప్రాంత సర్వీసులు నడపబోమన్నారు. నగరంలో 600 సిటీ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. -
ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీకి నష్టాలు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఏపిఎస్ఆర్టీసీకి ఆర్థికంగా కష్టాలు, నష్టాలు సంభవిస్తున్నాయని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాజారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల ఊబిలోకి పోకుండా ఉండాలంటే అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, కానీ ప్రభుత్వం ఆ పనిచేయలేకపోతోందన్నారు. సంస్థ రెవెన్యూను కాపాడటంలో, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆయిల్‌పై పన్ను రద్దు చేయలేదని, నష్టాలు వచ్చే రూట్లలో ఎంవీ ట్యాక్సు రద్దు చేయలేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీని వాడుకుంటున్నారని ఉదహరించారు. ప్రభుత్వం నిర్దేశించడం వల్ల ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే కొన్ని సర్వీసులను తిప్పాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే రూట్లలో ప్రయివేటు బస్సులు, హైర్ బస్సులను తిప్పడం అత్యంత దారుణమన్నారు. హైర్ బస్సుల్లో కండక్టర్లకు టిమ్ మిషన్లు ఇచ్చి ఆర్థిక పరిపాలనను ప్రయివేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆటోలు విపరీతంగా తిరుగుతూ తరచూ ప్రమాదాలకు గురికావడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయన్నారు. ఆటోలను నియంత్రించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకొని, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిందని, ఇవన్నీ చూస్తూ కూడా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆర్టీసీలో కార్మికులు 8 గంటల డ్యూటీ కాకుండా 14 గంటలు పనిచేస్తున్నారని, దీంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కండక్టర్ కేటగిరీని పూర్తిగా లేకుండా చేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. డ్రైవర్ టిమ్‌లు ఇచ్చి కండక్టర్ పనిని డ్రైవర్లపై వేస్తున్నారన్నారు. దీని వల్ల డ్రైవర్లు ఒత్తిడికి గురై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23వేల మంది కండక్టర్లు ఉండగా, ప్రస్తుతం ఏపిలో 18వేలమంది ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు బెనిఫిట్లు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్నాయని, వాటిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయం కోసం విశాఖపట్నం, విజయవాడ, కడపలలో ఆర్టీసీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌పై ఆర్టీసీ యాజమాన్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈయూ, ఎన్ఎంయూ నాయకులకు ఇచ్చినట్లుగానే వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులకు కూడా వర్క్ రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీలో చర్చించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్, రీజనల్ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, కడప డిపో కార్యదర్శి జయరామయ్య, డిపో వైస్ ప్రెసిడెంట్లు భాస్కర్‌రెడ్డి, బీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
అక్రమ రవాణా, ప్రైవేటీకరణపై పోరే లక్ష్యం
గోపాలపట్నం : అక్రమ రవాణా, ప్రైవేటు బస్సుల పెంపుపై ఉద్యమించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీవీవీ మోహన్ స్పష్టం చేశారు. ఇక్కడి సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపో వద్ద బుధవారం కార్మిక ఐక్యత కోరుతూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా డిపో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు బస్సులను ఉంచాలన్న నిబంధన ఆచరణలో ఉండాలని, మేక్సీ క్యాబ్‌లు, జీపులు, ఆటోలు పరిమితికి మించి రవాణా చేయకూడదని, హైవేలో ఆటో ప్రయాణాలు ఆపాలని ఇప్పటికే డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌కు నివేదించామన్నారు. టూరిస్టు పర్మిట్లతో స్టేజి కేరియరు సర్వీసులు నడపడం, ఒకే నంబరుతో మూడు నాలుగు బస్సులు అక్రమ రవాణా జరిగిపోతుండడంపైనా తాము అభ్యంతరం చెప్పామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 3000 ఆర్టీసీ బస్సులు రానున్నాయని తొలి విడతగా పుష్కరాల సర్వీసులకు ఆరువందల బస్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లపై అధికారులు అన్యాయంగా పనిష్మెంట్లు ఇస్తున్నారని, ఇలాంటి ఇబ్బందులు రాకుండా గుర్తింపు యూనియన్ నుంచి నలుగురు, ఆర్టీసీ అధికారుల నుంచి నలుగురితో ఒక కమిటీ ఏర్పాటు కానుందన్నారు. రీజినల్ పబ్లిసిటీ కార్యదర్శి టీవీ శర్మ, డివిజినల్ వర్కింగ్ అధ్యక్షుడు డీకే రాజు, డిపో అధ్యక్ష కార్యదర్శులు డీఏనాయుడు, ఎస్. అప్పారావు, గ్యారేజి అధ్యక్షుడు సాయిబాబా తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఏపీ కొత్త డీజీపీగా సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్(డీజీపీ)గా ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ ఎండీగా ఉన్న నండూరి సాంబశివరావు నియమితులు కానున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డీజీపీ రాముడు ఈనెల 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు సాంబశివరావు ఇన్చార్జి డీజీపీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత డీజీపీ ర్యాంకు అధికారుల జాబితాను ఏపీ సర్కారు కేంద్రానికి పంపిస్తుంది. అందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి ఏపీ సర్కారుకు సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఏపీ సర్కారు డీజీపీగా నియమించుకుంటుంది. -
ఆధిపత్య పోరే ప్రాణం తీసింది
ప్రొద్దుటూరు: ఒక యూనియన్‌పై మరో యూనియన్ ఆధిపత్యం చేయాలనే ఒకే ఒక కారణం.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం సకాలంలో స్పందించక పోవడం.. పోలీసుల వ్యవహారం కూడా ఇందుకు పరోక్షంగా కారణమయ్యాయని కార్మికులు మండిపడుతున్నారు. యూనియన్లు ఉండేది కార్మికుల సంక్షేమం, వారికి న్యాయం చేసేందుకే తప్ప ఆధిపత్యం చూపించుకోవడానికి కాదని వారు అంటున్నారు. చిన్న సంఘటన జరిగినప్పుడే డిపో అధికారులు స్పందించి.. కఠినంగా హెచ్చరించి ఉంటే ఈ వ్యవహారం ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చేది కాదు. ఏ సంఘటన జరిగినా సస్పెండ్ చేస్తామన్న ఉన్నతాధికారుల మాటలు తప్ప.. ఏం జరిగిందో విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోలేక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తననే కొట్టి.. తన పైనే కేసు పెట్టడంతో మనస్తాపం ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గ్యారేజీలో శ్రామిక్ కొండారెడ్డి శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కొండారెడ్డి, మెకానిక్ రామచంద్రుడు మధ్య మాటకుమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కొండారెడ్డిని రామచంద్రుడు చెప్పుతో కొట్టగా... కొండారెడ్డి రామచండ్రుడి పైకి టైర్ రింగ్ విసిరాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి స్వల్ప గాయమైంది. కొండారెడ్డి దాడి చేశాడంటూ రామచంద్రుడు పోలీస్‌స్టేçÙన్లో కేసు పెట్టారు. తనను చెప్పుతో కొట్టాడని కొండారెడ్డి పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అక్కడి ఎస్ఐ పట్టించుకోలేదు. అసలు ఈ విషయం పోలీస్‌స్టేçÙన్ వరకు వెళ్లడాన్ని ఆర్టీసీ అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. షెడ్లో 40 మందికి పైగా కార్మికులు గొడవ జరిగిన సమయంలో గ్యారేజిలో 40 మందికిపై కార్మికులు విధుల్లో ఉన్నారు. అయితే జరిగిన వాస్తవాన్ని అక్కడ ఉన్న కార్మికులు ఎవరూ పోలీసులకు చెప్పలేదు. పైగా కొండారెడ్డే దాడి చేశాడని రామచంద్రుడికి ఒత్తాసుగా కొందరు కార్మికులు పోలీసులకు చెప్పారు. దీంతో కొండారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను కొట్టి, మళ్లీ తనపై కేసు పెట్టడంలో ఒక యూనియన్ నాయకులు వ్యవహరించిన తీరు... తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తిరష్కరించిన విషయం కొండారెడ్డి ప్రాణం పోయేందుకు కారణమయ్యాయి. ఆయన గ్యారేజి ఆవరణలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకున్న సంఘటనను ఎవరూ చూడ లేదని అధికారులు చెబుతున్నారు. 40 మందికి పైగా పని చేసే బహిరంగ ప్రదేశంలో ఎవరూ చూడకుండా ఎందుకు ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యంతోపాటు యూనియన్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
సచివాలయానికి 20 మెట్రో బస్సులు
గుంటూరు (పట్నంబజారు) : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి గుంటూరు రీజియన్ నుంచి 20 మెట్రో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కూడళ్లు, నాగార్జున యూనివర్సిటీ, రెయిన్‌ట్రీ పార్కు వద్ద నుంచి సచివాలయానికి మెట్రో సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. సచివాలయం వద్ద ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లేందుకు సచివాలయం నుంచి బస్సులు నడపనున్నట్లు, తిరిగి సచివాలయానికి రావడానికి ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయాన్ని ఆర్జించడానికి సమష్టిగా కృషి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. పోటీ వాతావరణంలో మరింత పోటీతత్వాన్ని పెంచుకొని, సమయపాలన పాటిస్తూ, నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. గుంటూరు రీజియన్‌లో ఉన్న 13 డిపోల్లో ఒక్క మాచర్ల డిపో మాత్రమే గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఆదాయాన్ని సాధిస్తోందని తెలిపారు. డిపోల్లోని అధికారులు బస్సులను పంపించడమే కాకుండా బస్సుల పరిశుభ్రత, కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన, స్టేజిల్లో బస్సులు ఆపకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి ఉండడం, మహిళలతో అసభ్య ప్రవర్తన మొదలైన అంశాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో కార్మిక పరిషత్ రీజనల్ సెక్రటరీ రాజేష్, నరసరావుపేట, గుంటూరు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెంకటేశ్వరరావు, వాణిశ్రీ, అకౌంట్స్ ఆఫీసర్ పవన్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
17 మందితో ఏపీఎస్ఆర్టీసీ బోర్డ్
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి పాలక మండలి - చైర్మన్‌గా ఎన్.సాంబశివరావు సాక్షి, హైదరాబాద్: ఏపీఎస్ఆర్టీసీకి 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు, తెలంగాణ తరఫున ఐదుగురు, కేంద్రం తరఫున ఐదుగురితో కలిపి పాలక మండలిని నియమిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. పాలనాపరంగా ఆర్టీసీ విభజన జరిగినా సాంకేతికంగా కేంద్రం దృష్టిలో ఇంకా ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీగానే ఉంది. గతంలో తమకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ తిరస్కరించింది.తెలంగాణకు ప్రాతినిధ్యం పెంచుతామంది. దీనికి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కాగా, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణను నియమించింది. టీఎస్ చైర్మన్‌కు పాలకమండలిలో చోటు లేదు. ఏపీ నియమించే చైర్మన్‌కే చోటు కల్పించారు. ఏపీ ఇంతవరకు ఆర్టీసీకి చైర్మన్‌ను నియమించకపోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ అయిన ఎన్.సాంబశివరావు ఉమ్మడి బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. త్వరలో జరిగే పాలక మండలి సమావేశంలో ఆర్టీసీ విభజన అంశమే ప్రధాన ఎజెండా కానుంది. ఆస్తులు, విభజనపై తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. పాలక మండలిలో చోటు వీరికే... ఆంధ్రప్రదేశ్ నుంచి పాలక మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ (టీ ఆర్అండ్బీ ఇంచార్జి) కార్యదర్శి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (అడ్మిన్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఐటీ), ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ నుంచి టీఎస్ ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, రవాణా శాఖ అంశం పర్యవేక్షించే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, ఎల్.ఇ.టి అండ్ ఎఫ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శి. కేంద్రం తరఫున మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డెరైక్టర్ (రోడ్ సేఫ్టీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డెరైక్టర్/డిప్యూటీ సెక్రటరీ (ట్రాన్స్‌పోర్టు), మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ డెరైక్టర్, అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. -
ఆర్టీసీలో తరలింపు సెగ!
27కు విజయవాడ రావాల్సిందేనని యాజమాన్యం ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నెల 27 కల్లా ఆర్టీసీ ఉద్యోగులు విజయవాడలోని ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా కార్యాలయాని(పండిట్ నెహ్రూ బస్ స్టేషన్)కి తరలి రావాలని ఎండీ నండూరి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేయడంపై యూనియన్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల పంపకాలు పూర్తి కాకుండా ఉద్యోగుల్ని తరలిస్తే హైదరాబాద్‌లోని ఆస్తులపై వాటా కోల్పోయే ప్రమాదం ఉందంటూ గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు శనివారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 17న ధర్నాలు.. దీక్షలు...: ఆర్టీసీ ఉద్యోగుల తరలింపు, ఉమ్మడి ఆస్తుల విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న బస్‌భవన్ వద్ద భోజన విరామంలో ధర్నాలు, రాష్ట్రంలోని అన్ని యూనిట్లలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఎన్ఎంయూ పిలుపునిచ్చింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు వేసిన కమిటీ ఇంతవరకు సమావేశం కాలేదని, ఈ స్థితిలో ఏకపక్ష నిర్ణయం సరికాదని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదర్‌రావులు పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ప్రయాణం
సాక్షి నెట్వర్క : పలు పథకాల కింద ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ వివిధ రాయితీలు అందిస్తోంది. ఎక్కువమంది ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించడం, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడంలో భాగంగా ఈ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో కొన్ని.. వారం రోజుల ప్రయాణానికి ‘విహారి’ రూ.550తో ‘విహారి’ టిక్కెట్ తీసుకున్నవారు వారం రోజులపాటు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీపై రాష్ట్రాన్ని చుట్టి రావొచ్చు. ఏసీ బస్సులు ఎక్కే వీలుండదు. వనిత ఫ్యామిలీ కార్డు రెండేళ్లపాటు మనుగడలో ఉండేవిధంగా వనిత ఫ్యామిలీ కార్డును ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఎవరైనా ఈ కార్డును రూ.100 చెల్లించి పొందవచ్చు. కుటుంబం మొత్తం కానీ, ఒక్కొక్కరుగా కానీ ఈ కార్డుపై బస్సులో ప్రయాణించినప్పుడు టిక్కెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. అయితే ఈ కార్డుపై రారుుతీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసులకే పరిమితం. ఈ కార్డు పొందడానికి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీతో ఆయా ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలి. ఈ కార్డు ఉన్నవారికి రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యం ఉంది. నవ్య క్యాట్ కార్డ్ (ఫ్రెష్) నవ్య క్యాట్ కార్డు (ఫ్రెష్) పేరుతో ఏడాది చెల్లుబాటులో ఉండే విధంగా ఆర్టీసీ కొత్త కార్డును ప్రవేశపెట్టింది. రూ.250 చెల్లించి ఈ కార్డు పొందవచ్చు. ఏసీవి మినహా మిగిలిన బస్సుల్లో టికెట్‌పై 10 శాతం రాయితీ ఇస్తారు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులున్న ఒకే కుటుంబంలోనివారికి మొదటి వ్యక్తి మినహా మిగిలినవారు రూ.100 చెల్లిస్తే నవ్య క్యాట్ యాడ్ ఆన్ కార్డు (ఫ్రెష్) ఇస్తారు. ఈ కార్డు తీసుకున్నవారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, అదే కుటుంబంలో రూ.100 చొప్పున చెల్లించి (యాడ్ ఆన్ కార్డు) తీసుకున్నవారికి రూ.1.75 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. నవ్య క్యాట్ కార్డ్ (రెన్యువల్) నవ్య క్యాట్ కార్డు (ఫ్రెష్) గడువు ముగిసిన తర్వాత రెండో ఏడాది తీసుకునేది నవ్య క్యాట్ కార్డు (రెన్యువల్). రూ.150 చెల్లిస్తే ఇది ఏడాది చెల్లుబాటులో ఉంటుంది. మిగిలిన నిబంధనలు ఫ్రెష్ కార్డుకు వర్తించేవే కొనసాగుతాయి. అయితే రూ.1.75 లక్షలు మాత్రమే ప్రమాద బీమా ఉంటుంది. వికలాంగులకు 50 శాతం రాయితీ ఈ కార్డు తీసుకున్న వికలాంగులు 50 శాతం రాయితీతో సూపర్ లగ్జరీ, ఏసీవి మినహా మిగిలిన బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆధార్ కార్డ్, అంగవైకల్య శాతం తెలిపే డాక్టర్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఈ కార్డు పొందవచ్చు. ఇది ఏడాదిపాటు మనుగడలో ఉంటుంది. ఈ కార్డు కోసం రూ.20 చెల్లించాలి. అంధులు, చెవిటి, మూగవంటివాటితో బాధపడేవారికి కూడా రాయితీ కార్డులు జారీ చేస్తున్నారు. -
ఆరు నెలల్లో అన్ని బస్సులకు జీపీఎస్
విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సులకు జీపీఎస్‌ను అమర్చుతామని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కంపార్ట్మెంట్లను విజయవాడ సిటీ టెర్మినల్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 వేల ఆర్టీసీ బస్సుల్లోను ఆరు నెలల్లో జీపీఎస్ సిస్టమ్ అమలులోకి తెస్తామన్నారు. పాత బస్సులను సరుకు (గూడ్స్) రవాణాకు ఉపయోగించి ఆర్టీసీకి కమర్షియల్ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని సిటీ పరిధిలో తిరిగే ప్రతీ బస్సులోను ప్రత్యేక కంపార్టుమెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ నగరంలో 350, విశాఖలో 350 సిటీ బస్సులు తిరుగుతున్నాయని, ఆ బస్సుల్లోను వారం రోజుల్లో మహిళలకు ప్రత్యేక కంపార్టుమెంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సులను మరింత సౌకర్యవంతంగాను, సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రతీ బస్సు స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో అన్ని బస్స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని, రెండవ దశలో 1200 మండల కేంద్రాల్లో బస్స్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ బస్ డిపో, ఆర్టీసీ గ్యారేజీల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) జి.జయరావు, విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు, కృష్ణా రీజినల్ మేనేజర్ పీవీ రామారావు, అధికారులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. -
మే 3న ఎస్‌డబ్ల్యూఎఫ్ చలో విజయవాడ
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీలో సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ మే 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.కె.జిలానీబాషా, సీహెచ్.సుందరయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చే కార్మికులతో కలసి మే 3న ఉదయం 10.30 గంటలకు విజయవాడ ఆర్టీసీ హౌస్ వద్ద ధర్నా చేపడతామని ప్రకటించారు. ఆర్టీసీలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ప్రైవేటు మందుల షాపుల నుంచి మందులు ఇస్తామని చెప్పడం, అద్దె బస్సుల్లో డ్రైవర్లతో కండక్టర్ విధులు చేయించడం వంటి విధానాలు ఆర్టీసీకి మేలు చేకూర్చేవి కావని వారు పేర్కొన్నారు. ఏడు ప్రధాన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తెచ్చేందుకు ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. -
3వేల కొత్త బస్సులు కొనుగోలుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు వేల కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. బుధవారం సీఎం చంద్రబాబుతో ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రయాణికులపై భారం పడకుండా వాణిజ్యపరమైన ఆదాయాన్ని పెంచుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిందిగా కోరారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవటంతో పాటు ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకుని సంస్థను లాభాల బాటలో నడిపించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో బస్సు స్టేషన్లను ఆధునీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సచివాలయంలో టీడీఎల్పీ, టీడీపీపీ తెలుగుదేశం శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్ష సంయుక్త సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. మధ్యాహ్నం వీరికి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. -
ఆర్టీసీలో ఉమ్మడి పాలక మండలి
♦ తెలంగాణ బోర్డు ఏర్పాటుకు అనుమతించని కేంద్రం ♦ ఏపీ అధీనంలోని బోర్డులోకి తెలంగాణ సభ్యులు ♦ రవాణా, ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ జేఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు అవకాశం సాక్షి, హైదరాబాద్: పాలనాపరంగా తెలంగాణ, ఏపీ ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా... మరికొంతకాలం పాటు ఒకే ‘పాలక మండలి’ కింద పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్తులు, అప్పుల విభజన సహా సాంకేతికంగా విడిపోయే వరకూ కూడా ఒకే పాలకమండలి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతికంగా ఈ రెండు రవాణా సంస్థలు ఇప్పటికీ ఒకటిగానే కొనసాగుతున్నాయి. బస్సుల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వేటికవేగా ఉన్నా... ఆస్తులు-అప్పుల విభజన పూర్తికాలేదు. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అయితే ఈ అంశం తేలకున్నా ఇప్పుడే విడివిడిగా పాలక మండళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ పరిధిలో ఉన్న పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం సభ్యులను నియమించేందుకు సిద్ధమైంది. తెలంగాణ పక్షాన ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించబోతోంది. రవాణా శాఖ, ఆర్థిక శాఖ, కార్మిక ఉపాధి కల్పన శాఖల కార్యదర్శులు, టీఎస్ఆర్టీసీ జేఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ఇప్పటివరకు పదిమంది సభ్యులు ఏపీ నుంచి ఉండగా ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గనుంది. ఈ బోర్డుకు ఏపీ రవాణాసంస్థ ఎండీ చైర్మన్‌గా ఉంటారు. చైర్మన్ వస్తే ఎలా..? ప్రసుతం పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీకి కూడా చైర్మన్‌ను నియమించాలని భావిస్తోంది. మిగతా కార్పొరేషన్లతోపాటు ఆర్టీసీ చైర్మన్ పోస్టును భర్తీ చేస్తే కొత్త సమస్య రావటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ పాలకమండలికి నేతృత్వం వహిస్తారు. సాంకేతికంగా ఆర్టీసీ విడిపోనందున... తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఉమ్మడి బోర్డుకు నేతృత్వం వహించే అవకాశం ఉండదు. అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ హోదాలో ఎండీ దాన్ని నిర్వహిస్తే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ దానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోమారు బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ 2014 అక్టోబరు తర్వాత బోర్డు సమావేశం కాలేదు. తెలంగాణ నేతలు, ఏపీ ఎండీ మధ్య అప్పట్లో తీవ్ర విభేదాలుండటంతో ఈ సమావేశాలు జరగలేదు. కానీ బోర్డు చేసిన ఓ తీర్మానం సమావేశాలు జరగకున్నా న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసింది. చైర్మన్ లేని సమయంలో ఆర్టీసీ ఎండీ ఆ బాధ్యతను నిర్వహించేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్మానించింది. ప్రస్తుతం కీలక నిర్ణయాలను కూడా బోర్డుతో సంబంధం లేకుండా ఎండీలే కానిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ఆర్టీసీకి ఎండీ లేనట్టే. సాంకేతికంగా ఏపీ ఎండీనే తెలంగాణ-ఆంధ్రలకు చైర్మన్‌గా వ్యవహరించాలి. కానీ టీఎస్ ఆర్టీసీ జేఎండీగా రమణారావును నియమించిన తరుణంలో ఆయనకు ఎండీ అధికారాలను కూడా కట్టబె ట్టడంతో ఆయన ఎండీ హోదాలో చైర్మన్‌తో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి బోర్డులో తెలంగాణ సభ్యులను నియమించబోతున్నందున బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. -
టిమ్స్.. టెన్షన్స్
► ప్రైవేట్ వ్యక్తులకు ‘టిమ్స్’ అందజే యడంపై కార్మిక సంఘాల ఆగ్రహం ► ఆర్టీసీ యాజమాన్య నిర్ణయం సరి కాదంటున్న కార్మికులు ► అడ్డుకునేందుకు సై అంటున్న వైనం పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించడానికి యాజమాన్యం చేపడుతున్న కొన్ని చర్యలు కార్మికుల ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాటిలో డ్రైవర్ కం కండక్టర్ విధానమూ ఒకటి. దీని ద్వారా కండక్టర్‌తో పని లేకుండా నేరుగా డ్రైవరే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమలవుతున్న సంగతి విదితమే. స్థానిక సర్వీసుల్లోనూ ఇదే విధానాన్ని ప్రవేశ పెట్టి దశల వారీగా కండక్టర్ల సంఖ్యను కుదించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్నది యాజమాన్యం ఎత్తుగడ. ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలుండగా వాటిపై దృష్టి సారించకుండా ఉద్యోగుల సంఖ్యను కుదించడం ద్వారానే ఆర్థిక భారం తగ్గించుకోవాలని చూస్తున్న తీరుపై కార్మిక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇటీవల యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలూ వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగిస్తుండటంతో కార్మికులు ఆందోళన బాట పట్టనున్నట్లు వారు చెబుతున్నారు. నేతలపై కేసుల నమోదు.. ప్రసుత్తం రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి అద్దె బస్సులూ దూరప్రాంతాలకు తిరుగుతున్నాయి. గతంలో ఒక్కో బస్సులో డ్రైవర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి, ఆర్టీసీ కండక్టర్లు విధులు నిర్వర్తించే వారు. ఇటీవల యాజమాన్యం అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులకే సర్వాధికారాలు అప్పగించింది. దీంతో కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కొన్నిరోజుల కిందట గుంటూరు డిపో నుంచి విశాఖపట్నానికి పైవేట్ బస్సు పంపిస్తూ, దానిలో హైర్ బస్సు వ్యక్తికే టిమ్‌ను అప్పగించటంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును కదలనివ్వమని రాస్తారోకో దిగారు. దీనిపై పాతగుంటూరు పోలీసుస్టేషన్లో ఎన్ఎంయూ నేతలపై కేసు కూడా నమోదయింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు తాత్కాలికంగా ఆర్టీసీ డ్రైవర్‌ను కండక్టర్‌గా పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొన్నాళ్ల క్రితం కృష్ణా జిల్లా నూజీవీడు డిపోకు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ప్రైవేటు వ్యక్తి వేలల్లో డబ్బులు తీసుకుని పరారడయ్యాడని కార్మిక నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పోరుకు సన్నాహాలు.. హైర్ (అద్దె) బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించటంపై కార్మిక సంఘాలు పోరుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నాయి. యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామంటున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు హైర్ బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించ చూస్తే సహించొద్దని ఆయా డిపోల నేతలకు మౌఖికంగా చెప్పినట్లు సమాచారం. రీజియన్ పరిధిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోసారి పునరావృతమైతే సహించొద్దన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఆఖరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే ! -
ఆర్టీసీకి నాలుగు జాతీయ అవార్డులు
- బెంగుళూరులో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఎండీ స్వీకరణ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (ఏపీఎస్ఆర్టీసీ) ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఎఎస్ఆర్టీయూ) నుంచి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. 2014-15 సంవత్సరానికిగాను గ్రామీణ సర్వీసులలో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల సాధించినందుకు, అతి తక్కువ ఆపరేషనల్ (పన్ను ఎలిమెంట్ లేకుండా కి.మీ.కు 26.02 రూపాయలు వ్యయం) కలిగి ఉన్నందుకు ఆర్టీసీకి ఈ అవార్డులు లభించాయి. మంగళవారం బెంగుళూరులో జరిగిన ఎఎస్ఆర్టీయూ 60వ వార్షికోత్సవ సభలో ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. గ్రూపు-1 కేటగిరీ మొఫిసిల్ (గ్రామీణ) సర్వీసుల్లో విన్నర్ అవార్డు, ఇంధన వినియోగంలో అత్యధిక కె.ఎం.పి.ల్. (5.23) సాధించినందుకు, గ్రామీణ సర్వీసుల్లో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల (వాహనం రోజుకు నడుపుతున్న కిలోమీటర్లు 320.59 నుంచి 381.19 వరకు పెరుగుదల) సాధించినందుకు విన్నర్ అవార్డులు ఆర్టీసీ సాధించింది. వీటితో పాటు సెక్రటేరియల్ సామర్ధ్యంలో మరో అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డులు ఆర్టీసీకి లభించడం పట్ల సంస్థ ఎండీ సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల అంకితభావం, సూపర్వైజర్లు, అధికారులు, సిబ్బంది అంతా కలిసికట్టుగా చేసిన కృషి దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఆ ఆలోచన విరమించుకోవాలి: రవీంద్రనాథ్‌రెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రోజురోజూకు నిర్వీర్యమైపోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... గతంలో ఆర్టీసీ పరిపుష్టికి దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధిక గంటలు పని చేయించుకుంటూ సిబ్బందిని వేధిస్తున్నారని విమర్శించారు. కండక్టర్ల వ్యవస్థను రద్దు చేస్తామని సంస్థ ఎండీ ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎండీకి రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఇచ్చి ఆదుకుందని... అలాగే నిధులిచ్చి ఏపీఎస్ఆర్టీసీని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. -
'ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం'
విజయవాడ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కొత్త బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. మే 15 నుంచి విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేట్ ఆఫీస్ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లోని ఆఖరి రెండు వరుసలకు ఛార్జీలో 20 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. మార్చి ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా 81 ఆర్టీసీ బస్టాండ్ల ఆధునీకరణ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది వందకోట్ల మేరకు నష్టాలు తగ్గినట్టు తెలిపారు. ఆపరేషన్ నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమించమన్నారు. 250 కిలీమీటర్లు ప్రయాణించినవారికి చుట్టుపక్కల తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. -
ఎంప్లాయీస్ యూనియన్ విజయఢంకా
ఫలితాలు ఇలా.. జిల్లాలో 13 డిపోలకుగాను ఎనిమిదింటిలో విజయం 5 డిపోలతో సరిపెట్టుకున్న ఎన్.ఎం.యు. ప్రభావం చూపించలేకపోయిన కార్మికపరిషత్ పట్నంబజారు(గుంటూరు) ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో గుంటూరు రీజియన్‌లో ఎంప్లాయిస్ యూనియన్ విజయశంఖారావాన్ని పూరించింది. ప్రధాన ప్రత్యర్థి నేషనల్ మజ్దూర్ యూనియన్‌పై ఘన విజయాన్ని సాధించింది. రీజియన్‌లోని 13 డిపోల్లో ఎనిమిది డిపోలు ఎంప్లాయిస్ యూనియన్ కైవసం చేసుకోగా, ఎన్ఎంయూ ఐదు డిపోలతో సరిపెట్టుకుంది. బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, గుంటూరుడిపో-2, మంగళగిరి,మాచర్ల, పిడుగురాళ్ళ డిపోల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించగా, పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు డిపో-1, చిలకలూరిపేటల్లో ఎన్ఎంయూ విజయం సాధించింది. ఎంప్లాయిస్ యూనియన్ బాపట్ల డిపోలో 62 ఓట్ల మెజార్టీ, రేపల్లె -80, నరసరావుపేట - జిల్లాకు 56, స్టేట్‌కు 61, వినుకొండ -15, సత్తెనపల్లి స్టేట్‌కు-29, గుంటూరు డిపో-2లో జిల్లాకు 61, స్టేట్‌కు-57, మంగళగిరి జిల్లా-79, స్టేట్‌కు-64, మాచర్ల జిల్లా- 37, స్టేట్‌కు-55, పిడుగురాళ్ల జిల్లా 54, స్టేట్-54 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ పొన్నూరు డిపోలో 110 ఓట్లతో, తెనాలి డిపోలో 34, సత్తెనపల్లి డిపోలో 11 ఓట్లతో, చిలకలూరిపేట డిపోలో 5 ఓట్లతో, గుంటూరు డిపో-1లో 106 ఓట్లతో విజయం సాధించింది. మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్‌కు స్టేట్‌కు 2,584 ఓట్లు రాగా, జిల్లాకు 2,585 ఓట్లు వచ్చాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు స్టేట్‌కు 2270 రాగా, జిల్లాకు 2230 వచ్చాయి. వీటితోపాటు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియర్కు స్టేట్‌కు 38, జిల్లాకు 38, కార్మిక పరిషత్‌కు స్టేట్‌కు 318, జిల్లాకు 352 ఓట్లు రాగా, ఎస్‌డబ్ల్యూఎఫ్ స్టేట్‌కు 238, జిల్లాకు 252 ఓట్లు సాధించాయి. బీడబ్ల్యూ, కార్మిక సంఘ్, యునెటైడ్ వర్కర్స్ యూనియన్ సంఘాలకు కేవలం కొద్దిపాటి ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రీజియన్ పరిధిలో ఎంప్లాయిస్ యూనియన్‌కు అధిక ఓట్లు, డిపోలు రావడంతో మెజార్టీ సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ.. ఆర్టీసీ బస్టాండ్‌లోని డిపో-1, డిపో-2ను కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎల్లారావు, ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తనిఖీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. -
ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
బరిలో ఎనిమిది యూనియన్లు సాక్షి, విజయవాడ/హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 55,151 ఆపరేషనల్.. 1,287 నాన్-ఆపరేషనల్ ఓట్లతో కలిపి మొత్తం 56,438 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. ప్రతి కార్మికుడు విధిగా రెండు ఓట్లు వేయాలి. రాష్ట్ర స్థాయి(క్లాస్-3) తెలుపు రంగు బ్యాలెట్, రీజియన్ స్థాయి (క్లాస్-6) గులాబీ రంగు బ్యాలెట్‌పై ఓటు వేయాల్సి ఉంటుంది. 13 జిల్లాల్లో 152 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చిన యూనియన్‌కే స్థానిక గుర్తింపు (క్లాస్-6) వస్తుంది. మొత్తం పోలైన ఓట్లలో ఏ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వస్తే దాన్నే (క్లాస్-3) గుర్తింపు యూనియన్‌గా ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (బస్సు గుర్తు), నేషనల్ మజ్దూర్ యూనియన్ (కాగడా), వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ (టేబుల్ ఫ్యాన్), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (స్టార్), కార్మిక పరిషత్ (టైరు), ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ (పావురం), యునెటైడ్ వర్కర్స్ యూనియన్ (స్టీరింగ్), కార్మిక సంఘ్ (పిడికిలి గుర్తు) బరిలో ఉన్నాయి. -
ఆర్టీసీ ఎన్నికలకు రెడీ!
4946 మంది ఓటర్లు 11 చోట్ల పోలింగ్ కేంద్రాలు బరిలో 8 యూనియన్లు సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18న జరిగే ఈ ఎన్నికలకు ఎనిమిది యూనియన్లు పోటీ పడుతున్నాయి. విశాఖ రీజియన్ పరిధిలో పది డిపోల్లోనూ, విశాఖ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మరొకటి వెరసి 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రీజియన్ వ్యాప్తంగా 4946 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటరు ఒకటి రీజియన్‌కు, మరొకటి రాష్ట్ర యూనియన్‌కు ఓటేయాల్సి ఉంటుంది. రాష్ట్ర యూనియన్‌కు తెలుపు, రీజియన్ యూనియన్‌కు గులాబీ రంగు బ్యాలెట్లు ఇస్తారు. పోలింగ్ ముగిసాక అదే రోజు ఓట్ల లెక్కింపు ఉన్నా ఫలితాన్ని ఆ రోజు వెల్లడించరు. ఎందుకంటే ఈ నెల 24న పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే 18వ తేదీన ఫలితాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా అనధికారికంగా ఏ యూనియన్ విజయం సాధించిందో తెలిసిపోతుంది. ఒకవేళ స్వల్ప ఓట్ల తేడా వస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలను డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో ఎన్ఎంయూ, రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్లు గుర్తింపు యూనియన్లుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం యూనియన్లకు కేటాయించిన గుర్తులకే ఓటేస్తారు. గెలిచిన అనంతరం ఆయా యూనియన్లు రీజియన్, డిపోల వారీగా కార్యవర్గాన్ని నియమిస్తాయి. ముగిసిన ప్రచారం: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. కొద్దిరోజులుగా బరిలో నిలిచిన వివిధ యూనియన్లు విస్తృతంగా ప్రచారం చేశాయి. పలు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాయి. తమ యూనియన్ను గెలిపిస్తే చేయబోయే మేళ్లను, ప్రత్యర్థి యూనియన్ల వైఫల్యాలను వివరించాయి. గత ంకంటే తగ్గిన ఓట్లు: వాస్తవానికి ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల పదవీకాలం రెండేళ్లుంటుంది. గత ఏడాదితో రెండేళ్ల పదవీకాలం ముగిసింది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గత సంవత్సరం ఈ ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లు గడిచిపోయింది. ఈసారి ఎన్నికల్లో గతంకంటే దాదాపు వెయ్యి ఓట్లు తగ్గాయి. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో దాదాపు ఆరు వేల ఓట్లుండేవి. ఈ రీజియన్‌లో 108 బస్సుల (సిటీలో 76, జిల్లాలో 32) ను తొలగించారు. ఒక్కో బస్సుకు సగటున 7.6 మంది సిబ్బంది ఉంటారు. దీంతో ఈ బస్సుల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదించేయడం ఓట్ల సంఖ్య తగ్గడానికి కారణమని కార్మిక నాయకులు చెబుతున్నారు. గుర్తింపు ఎన్నికల్లో 95 శాతానికి పైగానే ఓట్లు పోలవుతాయని వీరు అంచనా వేస్తున్నారు. మరోవైపు రీజియన్‌లో అత్యధికంగా వాల్తేరులో 776 ఓట్లు, పాడేరులో అత్యల్పంగా 183 ఓట్లు ఉన్నాయి. ఏ యూనియన్‌కు ఏ గుర్తు? గుర్తింపు యూనియన్ ఎన్నికల బరిలో నిలిచిన యూనియన్లకు గుర్తులను కేటాయించారు. అవి బ్యాలెట్ పత్రంలో వరస క్రమంలో ఇలా ఉన్నాయి. 1) ఏపీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఎగిరే పావురం 2) ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బస్సు 3) ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ బస్సు టైరు 4) ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ కార్మికుని పిడికిలి 5) ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కాగడా 6) ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నక్షత్రం 7) ఏపీఎస్ఆర్టీసీ యునెటైడ్ వర్కర్స్ యూనియన్ స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ 8) వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ టేబుల్ ఫ్యాన్ -
రేపు ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు
ముగిసిన ప్రచారం ఓటు హక్కు వినియోగించుకోనున్న 3,450 మంది కాకినాడ సిటీ : ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఆయా డిపోల్లో అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జిల్లాలోని తొమ్మిది డిపోల్లో జరిగే పోలింగ్‌కు కార్మిక శాఖ అధికారులు పోలింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎక్కడికక్కడే స్థానికంగా ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. జిల్లావ్యాప్తంగా 3,450 మంది ఆర్టీసీ కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా నెల రోజులుగా డిపోల్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. డిపోలవారీగా ఓటర్ల వివరాలు జిల్లాలోని తొమ్మిది డిపోల్లో ఓటర్ల వివరాలు.. కాకినాడలో 611, రాజమహేంద్రవరం 614, అమలాపురం 540, తుని 331, ఏలేశ్వరం 265, గోకవరం 287, రామచంద్రపురం 284, రావులపాలెం 290, రాజోలు డిపోలో 228 మంది ఓటర్లు ఉన్నారు. రెండు ఓట్లు వేయాలి గుర్తింపు సంఘ ఎన్నికలో ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాజ్-6 పేరుతో ఉన్న పింక్ బ్యాలెట్ పేపర్‌పై జిల్లా గుర్తింపు సంఘానికి, క్లాజ్-3 పేరుతో ఉన్న వైట్ బ్యాలెట్ పేపర్‌పై రాష్ట్ర గుర్తింపు సంఘానికి ఓటు వేయాలి. బరిలో నిలిచిన సంఘాలు గుర్తింపు సంఘ ఎన్నికల బరిలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యుైనెటైడ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ ఉన్నాయి. -
ఎన్నికల కోలాహలం
18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు ప్రచారాలతో హోరెత్తిస్తున్న కార్మిక సంఘాలు కార్మిక ఓట్లు రాబట్టేందుకు ముమ్మర యత్నాలు పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల కోలాహలం నెలకొంది. కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో రీజియన్ పరిధిలోని 13 డిపోల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు రీజయన్ పరిధిలో 5963 కార్మిక ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న తొలి గుర్తింపు ఎన్నికలు కావడంతో సంగ్రామాన్ని తలపిస్తోంది. కార్మిక సంఘాలు ఈ ఎన్నికలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కార్మిక సంఘాల నేతలు తమదైన శైలిలో ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్)తోపాటు మరో నాలుగు కార్మిక సంఘాల పోటీకి దిగుతున్నాయి. బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళ ఇప్పటికే ఆర్టీసీ బస్‌స్టాండ్‌తో పాటు, రీజియన్ పరిధిలోని డిపోలన్నీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. కార్మిక నేతలను సైతం పోటీలు పడి మరీ బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ నేతలతో ఎన్ఎంయూ, ఎస్డ బ్ల్యూఎఫ్ సంఘాలు భారీ బహిరంగ సభలు నిర్వహించగా, కార్మిక పరిషత్, ఎంప్లాయీస్ యూనియన్లు సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి.ఎన్ఎంయూ రీజియన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ నరసింహారావు, కార్మిక పరిషత్ నేత మురళి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డీవీ స్వామి ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణను పరిశీలిస్తున్నారు. దీంతోపాటు పలువురు ఎన్ఎంయూ నేతలు ఈయూలో చేరడం, పలువురు ఈయూ నేతలు ఎన్‌ఎంయూలో చేరడంతో గట్టిపోటీ వాతవరణం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పూర్తిచేసేస్తున్నాయి. ప్రచారానికి ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉండడంతో కార్మిక సంఘాల నేతలు చకచకా పావులు కదపుతున్నారు. కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు, పోస్టర్ల ప్రచారాన్ని భారీగా చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పైనా కార్మిక సంఘాల నేతలు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల ముందు రోజు రాత్రి గుంటూరు రీజియన్ నుంచి దూరప్రాంతాలు వెళ్లే వారి లిస్టులు సేకరించే పనిలో ఉన్నారు. సుమారు 100 నుంచి 150 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు చెబుతున్నారు. -
ఏపీఎస్ఆర్టీసీకి హైదరాబాద్‌లో లీజు స్థలాలు!!
హైదరాబాద్: ఏపీఎస్ఆర్టీసీ లీజు ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రైవేటు స్థలాలు తీసుకోవాలని యోచిస్తోంది. మియాపూర్, దిల్సుఖ్నగర్లలో స్థలాలు తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తెలంగాణ ఆర్టీసీతో సంప్రదించి ఇరు రాష్ట్రాల నడుమ స్థలాల్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అధికారులు ప్రతిపాదించారు. హైదరాబాద్‌లో ఏపీఎస్ఆర్టీసీకి స్థలాలిస్తే, తెలంగాణ ఆర్టీసీకి ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరులో ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు నివేదిక సమర్పించారు. అయితే లీజు విధానంలో ముందుగా స్థలాలు గుర్తించి తీసుకుందామని మంత్రి శిద్ధా ఆదేశాలివ్వడంతో ఆ దిశగా ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని నగరాలు, పట్టణాలకు ప్రయాణికులను చేరవేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేటు బస్సుల మాదిరిగానే ఆర్టీసీ కూడా ప్రయాణీకుల్ని రోడ్లపైనే ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరుస్తోంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ 23 బోర్డింగ్ పాయింట్లున్నాయి. ఎక్కడా కూడా ప్రయాణీకులు కూర్చొనేందుకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ సీజన్లలో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కనీసం రెండు చోట్ల స్థలాలు సేకరించి చిన్నపాటి డిపోలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పుడు లీజు విధానంలో 33 ఏళ్ల పాటు స్థలాలు లీజుకు తీసుకుని ప్రయాణీకులకు కనీస సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ భావిస్తోంది. -
ప్రయాణికుల మన్ననలు అందుకోగలిగాం
- గణతంత్ర వేడుకల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన రవాణా సేవలు అందించడం ద్వారా ప్రయాణీకుల మన్ననలు అందుకోగలుగుతున్నామని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు అన్నారు. విజయవాడ బస్‌హౌస్ వద్ద మంగళవారం గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ఆర్టీసీ కూడా కొన్ని గవర్నింగ్ సూత్రాల(మార్గదర్శకాలు)ను రూపొందించుకోవాలని ఉందన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన మార్గంలో ప్రగతి సాధఙంచేందుకు ఈ సూత్రాలు ఉపకరిస్తాయని చెప్పారు. మెరుగైన రవాణా సేవలందించడం ద్వారా గత ఏడాది ప్రయాణీకుల మన్ననలు అందుకోగలిగామని అన్నారు. గోదావరి పుష్కరాలు ఆర్టీసీ ప్రతిష్టను పెంచాయని, అదే స్పూర్తితో ఈ ఏడాది కృష్ణా పుష్కరాల్లోను ప్రయాణీకులకు రవాణా సౌకర్యాలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. -
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
- ఫిబ్రవరి 18న గుర్తింపు సంఘం ఎన్నికలు - యూనియన్లకు గుర్తులు ఖరారు చేసిన కార్మిక శాఖ - వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్‌కి టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18న అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. సోమవారం బస్‌భవన్‌లో కార్మిక శాఖ అధికారులు, యూనియన్ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించి సమావేశంలో ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు. ఏపీలోని అన్ని డిపోల్లో ఫిబ్రవరి 18న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫలితాల్ని అదే డిపోల్లో ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో లెక్కిస్తారు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ఈ నెల 7న తొలిసారిగా సమావేశం జరిగింది. ఏపీ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సూర్యప్రకాష్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 29న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టులు యూనియన్లకు అందజేస్తారు. ఫిబ్రవరి 2న ఓటర్ లిస్టులపై అభ్యంతరాల్ని ఆయా డిపోల్లో మేనేజర్లకు తెలియజేయాలి. తుది అభ్యంతరాలపై ఫిబ్రవరి 5న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 9న తుది ఓటర్ల జాబితాలను కార్మిక శాఖ కమిషనర్ అన్ని డిపోలు, యూనిట్లకు అందజేస్తారు. గుర్తింపు ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు సెల్ఫోన్లు, కెమెరాలను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించరు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎనిమిది సంఘాలు పోటీలో ఉంటాయి. యూనియన్లకు గుర్తులు ఖరారయ్యాయి. వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్‌కు టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఎంప్లాయిస్ యూనియన్‌కు బస్సు, ఎన్‌ఎంయూకి కాగడా, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు స్టార్, కార్మిక పరిషత్తుకి టైర్, ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్‌కి పావురం, యునెటైడ్ వర్కర్స్ యూనియన్‌కి స్టీరింగ్, కార్మిక సంఘ్ పిడికిలి గుర్తులను కేటాయించారు. డమ్మీ బ్యాలెట్లను ఫిబ్రవరి 9న పోటీలో ఉన్నవారికి అందించనున్నారు. -
ఏపీఎస్ఆర్టీసీలో ఆర్నెల్లపాటు సమ్మె నిషేధం
ఏపీఎస్ఆర్టీసీలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు స్పందించలేదు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్
విజయవాడ : సంక్రాంతి పండగ సెలవులు పూర్తి కావడంతో గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 500 సాధారణ బస్సులు... అలాగే 250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరో 300 సర్వీసులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. విజయవాడ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ప్రత్యేక సర్వీసులను ఎండీ సాంబశివరావు పర్యవేక్షించారు. అయితే ఆదివారం సాయంత్రం విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. -
విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ
విజయవాడ : సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లి.... మళ్లీ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం విజయవాడలో ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకోసం విజయవాడ నగరం నుంచి 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు. -
ఏపీఎస్ ఆర్టీసీకే ‘సంక్రాంతి’
♦ హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు ♦ రద్దీని సొమ్ము చేసుకోవడానికి విజయవాడ సిటీ బస్సులు ♦ ఆదాయం పొందే అవకాశమున్నా.. చేతులెత్తేసిన టీఎస్ ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కూడలి ప్రాంతం.. సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.. విజయవాడలో తిరిగే సిటీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఎల్బీనగర్లో ఆగుతున్నాయి.. ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. వాటితోపాటు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన గరుడ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులూ పెద్ద సంఖ్యలో వచ్చి జనాన్ని తీసుకెళుతున్నాయి. ఇంతగా ప్రయాణికుల రద్దీ ఉన్నా తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులేవీ అక్కడ కనబడడం లేదు. భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటే బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఆర్టీసీకి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా భారీగా ఆదాయమూ దక్కే అవకాశం ఉంది. కానీ సంక్రాంతి రద్దీ వేళ పరిస్థితి ఇం దుకు పూర్తి విరుద్ధంగా కొనసాగుతోంది. ‘సంక్రాంతి’ ప్రయాణికులను చేరవేసి గంపగుత్తగా ఆదాయం పొందేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళికాబద్ధంగా దూసుకుపోతుండగా.. తెలంగాణ ఆర్టీసీ మాత్రం చోద్యం చూస్తోంది. అదేమంటే ఆంధ్రా ప్రాంతానికి తిప్పేందుకు పర్మిట్లు లేవని చెబుతోంది. ఆ పర్మిట్లలో మూడొంతులకుపైగా ఏపీఎస్ ఆర్టీసీ చేతిలో ఉన్నా... ఇంతకాలం నోరుమెదపకుండా.. ఇప్పుడు నిస్సహాయత వ్యక్తం చేస్తుండడంపై టీఎస్ఆర్టీసీ సిబ్బందే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3 వేలకుపైగా ప్రత్యేక బస్సులు.. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 20 లక్షల మంది వరకూ వెళ్తారు. ఇందుకోసం ఏటా ప్రత్యేక బస్సులు వేస్తారు. రద్దీబాగా పెరిగితే హైదరాబాద్ సిటీ బస్సులకు ‘స్పెషల్’ బోర్డులు తగిలించి నడిపారు కూడా. కానీ ఈసారి ఆ ‘స్పెషల్’ బస్సులుగా విజయవాడ సిటీ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దింపింది. అవి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ వరకు వస్తే టీఎస్ ఆర్టీసీ సిబ్బంది అడ్డుకునే అవకాశం ఉంటుందని భావించిన ఏపీ అధికారులు వాటిని ఎల్బీనగర్ వరకే పరిమితం చేశారు. మొత్తంగా ఏపీఎస్ ఆర్టీసీ మూడువేలకు పైగా ప్రత్యేక బస్సులను రంగంలోకి దింపింది. మరోవైపు ఈ సీజన్లో కనీసం రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండి కూడా తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాప్రాంతానికి అదనపు బస్సులను తిప్పడం లేదు. సంక్రాంతి కోసం రెండు వేలకుపైగా ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్టు ఇటీవల ప్రకటించినా... వాటిని కేవలం తెలంగాణ జిల్లాలకే పరిమితం చేసింది. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు : 15 మందికి గాయాలు
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లక్ష్మీపురం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు... చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సదరు ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఇప్పటికే ఏడాది ఆలస్యమవుతున్న ఎన్నికల కసరత్తులో అటు యూనియన్లు, ఇటు యాజమాన్యం తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న అన్ని యూనియన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. యాజమాన్యం, యూనియన్ ప్రతినిధుల నుంచి ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు తదితర వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఈ నెల 20న మరోమారు సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ నెలాఖరున లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా యూనియన్లు ఇప్పటి నుంచే ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), ఐఎన్టీయూసీ(పులి గుర్తు), ఐఎన్టీయూసీ(త్రాచు గుర్తు), భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్), కార్మిక పరిషత్(టీఎన్టీయూసీ), యునెటైడ్ వర్కర్స్ యూనియన్లు ఈ సారి పోటీకి సిద్ధమవుతున్నాయి. ఏడాది ఆలస్యంగా ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 2013 జనవరి నుంచి ఈయూ గుర్తింపు సంఘంగా కొనసాగుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాలతో కాలయాపన జరిగింది. మొత్తం 57,700 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టి ఆరు నెలలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నారు. ఎన్నికలకు పలు అడ్డంకులు... ఆర్టీసీలో అంతర్గత సమస్యలు ప్రభావం చూపకుంటే గుర్తింపు సంఘం ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందని పలు యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. యూనియన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ అద్దె బస్సుల టెండర్లను ఈ నెల 5న యాజమాన్యం ఆమోదించనుంది. ఒప్పందం ప్రకారం కార్మికులకు గత ఏడాది డిసెంబర్ 23న ఇవ్వాల్సిన బకాయిలును యాజమాన్యం ఇంత వరకు చెల్లించలేదు. మరోవైపు సంక్రాంతికి ముందు జనవరి 8న పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంది. అద్దె బస్సులు, పలు సమస్యలపై ఈ నెల 4న ఈయూ అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహించనుంది. ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్‌ఎంయూలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలతో ముడిపడి ఉండటం గమనార్హం. -
చార్జీ తక్కువ.. మన బస్సే ఎక్కండి ..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సరికొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. పొరుగు రాష్ట్రాల టిక్కెట్టు చార్జీలు.. టీఎస్ ఆర్టీసీ టిక్కెట్టు చార్జీలలో వ్యత్యాసాన్ని ప్రయాణికులకు వివరించి.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి రోజుకు సగటున రూ. 54 లక్షల చొప్పున నష్టం వస్తుందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మూడు డివిజన్ల పరిధిలో 11 రీజి యన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 95 డిపోలలో 10,521 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాష్ట్ర పరిధితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా మన బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీకి వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు తిరుగు ప్రయాణంలో చాలావరకు ఖాళీగా వస్తున్నాయి. దీంతో తీవ్రంగా నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ కంటే టీఎస్ ఆర్టీసీలో టిక్కెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిని ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు సూచించారు. ఈ క్రమంలో డిపో మేనేజర్లు తమ పరిధిలో నడిచే బస్సులలో చార్జీల తీరు.. అదేవిధంగా ఇవే రూట్లలో నడిచే ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలతో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు రూపొందించారు. వీటిని బస్‌స్టాప్‌ల వద్ద ప్రయాణికులకు కనిపించే విధంగా ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ రూట్లో నడిచే దేవరకొండ డిపో బస్సుల చార్జీలు, ఇదే రూట్లో నడిచే ఆంధ్రప్రదేశ్ బస్సు చార్జీలు పేర్కొంటూ సైదాబాద్, సాగర్ రింగ్‌రోడ్ బస్‌స్టాపుల్లో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలో రూ.8, డీలక్స్ బస్ చార్జీల్లో రూ. 9 చొప్పున వ్యత్యాసం ఉన్నట్లు ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. -
ఏపీ బస్సులు కిటకిట తెలంగాణ బస్సులు కటకట
♦ ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఖాళీ’గా టీఎస్ఆర్టీసీ బస్సులు ♦ అదే సమయంలో ఏపీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ♦ తెలంగాణ బస్సుల టికెట్లు అమ్మకుండా వదిలేస్తున్న అక్కడి సిబ్బంది ♦ కిలోమీటరుకు సగటున రూ.38 చొప్పున నష్టం సాక్షి, హైదరాబాద్: అమలాపురం నుంచి హైదరాబాద్ లోని మియాపూర్‌కు తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ప్రయాణికులు పది మందే. అదే.. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు కిటకిట లాడుతూ వచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో కనిపిం చినదృశ్యమిది. ఇది అమలాపురం బస్సు కథ ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాంతాలు-హైదరాబాద్ మధ్య నడుస్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్ బస్సులన్నింటి కథ ఇదే. ఇప్పుడు తెలంగాణ బస్సులు తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నాయి. వాటిని నడిపే బదులు రద్దు చేసుకోవటం మంచిదని అధికారులు భావిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీతో పోలిస్తే... తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువ. అయినప్పటికీ తెలంగాణ బస్సులు కిటకిటలాడాల్సింది పోయి గరుడ బస్సులు ఖాళీగా వస్తూ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఏపీ డిపోల్లో తెలంగాణ సిబ్బంది లేకనే.. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రధాన డిపోల్లో రిజర్వేషన్ టికెట్లు, సాధారణ టికెట్లు విక్రయించేందుకు తెలంగాణ సిబ్బంది లేకపోవటంతో ఏపీ సిబ్బంది తెలంగాణ బస్సుల టికెట్లు అమ్మకుండా మొరాయిస్తున్నారు. అసలు ఆ సర్వీసులు ఉన్నట్టు ప్రయాణికులకు సమాచారం కూడా ఉండటం లేదు. దీంతో తెలంగాణ గరుడ బస్సులకు రిజర్వేషన్ ఇబ్బందిగా మారింది. ఫలితంగా సగం సీట్లు కూడా నిండకుండానే బస్సులు ప్రయాణించాల్సి వస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, తిరుపతి, అమలాపురం...తదితర ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ బస్సులను అక్కడి సిబ్బంది ప్లాట్‌ఫామ్‌ల వద్దకు రానివ్వడం లేదు. దూరంగా నిలపాల్సి వస్తుండటంతో వాటి ఆక్యుపెన్సీ రేషియో బాగా పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం గరుడ కేటగిరీ బస్సుల్లో సగటున కిలోమీటరుకు రూ.38 నష్టం వస్తున్నట్టు అధికారులు తేల్చారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రాంతాలకు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం ఉండగా, తిరుగుప్రయాణంలో హైదరాబాద్‌కు వచ్చే బస్సుల్లో అది 49-54 శాతం మధ్య ఉన్నట్టు తేలింది. రూ.1.10 కోట్ల ఖరీదు చేసే ఈ కేటగిరీ బస్సుల నిర్వహణ కూడా భారంతో కూడుకున్నదే. వాటి మనుగడ ఉండాలంటే ఆక్యుపెన్సీ రేషియో 75 శాతానికి మించి ఉండాలి. తాజాగా కొందరు డిపో మేనేజర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తెచ్చారు. ఏపీ అధికారులతో చర్చించి వెంటనే తెలంగాణ సిబ్బందిని అక్కడి డిపోల్లో ఏర్పాటు చేయకుండా.. ఆ సర్వీసులను రద్దు చేయటమే మంచిదని వారు పేర్కొనటం విశేషం. ప్రైవేటు ఆపరేటర్లతోఒప్పందం.. సాంకేతికంగా ఆర్టీసీ ఉమ్మడిగా ఉన్నప్పటికీ పాలనాపరంగా విడిపోయింది. ఏ రాష్ట్రం పరిధిలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను నిర్వహిస్తోంది. టికెట్ల కేటాయింపు, సీట్ల రిజర్వేషన్ వంటి పనులను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించాలి. హైదరాబాద్‌లోని ప్రధాన డిపోల్లో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆపరేటర్లతో ఏపీఎస్ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుని వారితో కూడా టికెట్లు విక్రయింపచేస్తోంది. వెరసి హైదరాబాద్ నుంచి ఏపీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే గరుడ బస్సులు నిండుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రధాన డిపోల్లో తెలంగాణ సిబ్బంది లేరు. ఇదే ఇప్పుడు సమస్యలకు కారణమైంది. -
ఏపీఎస్ ఆర్టీసీలో ఆద్దె బస్సులకు టెండర్లు
-
చార్జీలు తగ్గించకపోతే 26న డిపోల ముందు ధర్నా
-
చార్జీలు తగ్గించకపోతే 26న డిపోల ముందు ధర్నా
ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ఇక్కడ డీజిల్ ధరలు తగ్గుతున్నా కూడా ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలను దోచుకోవాలనే దృక్పథంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, 25వ తేదీ అర్ధరాత్రిలోగా ఆ నిర్ణయం వెలువడకపోతే, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ చార్జీలను పెంచబోమని తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిందని, ఇప్పుడు మాత్రం సంస్థకు నష్టాలు వస్తున్నాయన్న సాకు చూపించి చార్జీలు పెంచుతున్నారని ఆయన అన్నారు. ఆర్టీసీని నడిపించే సామర్థ్యం ప్రభుత్వానికి లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాలకు విచ్చలవిడిగా సహకరిస్తున్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం వల్ల ప్రైవేటు బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటే వాటివైపే ప్రయాణికులు మొగ్గు చూపుతారని ఆయన తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలన్నీ చంద్రబాబుకు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు బినామీ సంస్థలేనని, అందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. -
ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి..
హైదరాబాద్ : రాష్ట్రంలో సామాన్యుడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో అయిదేళ్ల పాటు ఏ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కారని ఆయన మండిపడ్డారు. తమ్మినేని శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ క్రూడాయిల్, డీజిల్ ధరలు తగ్గినా చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా సామాన్యుడి నడ్డి విరిచేలా ఛార్జీలు పెంచారన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ఈ చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఛార్జీలు పెంచి ప్రయివేట్ ఆపరేటర్లకు మార్గం సుగమం చేశారన్నారు. మద్యం రేట్లు తగ్గించి, కుళాయిల్లో మంచినీళ్లకు బదులు నారావారి సారా ఇస్తున్నారని తమ్మినేని విమర్శించారు. -
ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి..
-
ఆర్టీసీ చార్జీల బాదుడు
-
ఒకే దూరానికి వేర్వేరు చార్జీలు!
♦ ఏపీ బస్సుచార్జీల పెంపుతో గందరగోళం ♦ తెలంగాణ బస్సుల్లో తక్కువ చార్జి... ఏపీ బస్సుల్లో ఎక్కువ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం బస్సు చార్జీలు పెంచడంతో రెండు రాష్ట్రాల మధ్య తిరిగే టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ చార్జీల విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు ఒకే చార్జీని వసూలు చేస్తూ వచ్చాయి. సరిహద్దు దాటి వెళ్లినా చార్జీలు సమానంగానే ఉన్నాయి. తాజా గా ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచడంతో పరిస్థితి మారింది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులకు సంబంధించి ఏపీ బస్సుల్లో ఎక్కువ, తెలంగాణ బస్సుల్లో తక్కువ చార్జీ ఉండనుంది. తెలంగాణ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉండటంతో వీటిల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు పోటెత్తే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సంస్థ పూర్తిగా విడిపోకపోవడంతో ఇప్పటి వరకు పర్మిట్ లెక్కలు తేల్చలేదు. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య దూర ప్రాంత సర్వీసుల్లో మూడొంతుల బస్సులు ఏపీఎస్ఆర్టీసీ చేతిలోనే ఉండిపోయాయి. తెలంగాణ సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువ ఉన్న తెలంగాణ సర్వీసులకు ప్రయాణికులు ఎగబడితే.. తమ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ గందరగోళం పోవాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రేట్లు సవరించాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. అంతర్రాష్ట ఒప్పందం లేకపోవడంతో.. సాధారణంగా ఆయా రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఆర్టీసీ రేట్లు సవరిస్తుంటాయి. ఒప్పందం ఉంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో ఒకే రకమైన చార్జీలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఇదే ఒప్పందం ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులో తెలంగాణ ఆర్టీసీ చార్జీ, కర్ణాటక భూభాగంలోకి రాగానే ఆ రాష్ట్ర చార్జీని రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు స్థిరీకరించి వసూలు చేస్తాయి. కానీ ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య ఇలాంటి ఒప్పందం లేదు. దీంతో చార్జీలను సమం చేసే పరిస్థితి లేనందున ఏపీఎస్ఆర్టీసీలో ఎక్కువ చార్జీ, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తక్కువ చార్జీ వసూలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
ఆర్టీసీ చార్జీల బాదుడు
- పల్లె ప్రజలపై 5 శాతం భారం - డీలక్స్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ ప్రయాణికులపై 10 శాతం వడ్డన - అర్ధరాత్రి నుంచి అమల్లోకి - తెలుగు వెలుగు బస్సులో కిలోమీటరుకు - 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులో 8 నుంచి 9 పైసలు పెంపు - ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల భారం - స్టూడెంట్ బస్సు పాస్‌ల చార్జీలు యథాతథం - చార్జీలు పెంచబోమన్న ఎన్నికల హామీలు తుంగలోకి తొక్కిన బాబు సర్కారు - డీజిల్ ధరలు తగ్గుతున్నా, ఆర్టీసీ చార్జీలు పెంచడంపై సర్వత్రా విస్మయం - డిసెంబర్ 31లోగా జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లకు కొత్త హంగులు సాక్షి, విజయవాడ : ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ప్రభుత్వం చార్జీల భారం మోపింది. వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపన, దసరా పండుగ ముగిసీ ముగియగానే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల దెబ్బ వేసింది. రాష్ట్రంలో చార్జీలు పెంచబోమని గత ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజలపై భారం మోపబోమంటూ అప్పట్లో చంద్రబాబు ఊరూ వాడా తిరిగి హామీ ఇచ్చారు. దానిని విస్మరించి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి చార్జీల భారం మోపారు. కొద్ది నెలల క్రితం బస్సు చార్జీలను పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం కారణంగా పంటలు పండక, కరువు పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మరోసారి చార్జీలను పెంచింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి, డీజిల్ ధరలు తగ్గుతుండగా, రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే తెలుగు వెలుగు, డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల చార్జీలను పెంచింది. అత్యంత ధనికులు మాత్రమే ప్రయాణించే వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెరిగిన చార్జీల వివరాలను వెల్లడించారు. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తెలుగు వెలుగు బస్సుల చార్జీలను ప్రస్తుతం ఉన్న రేటుపై 5 శాతం అంటే కి.మీ.కు 3 పైసలు పెంచామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు ప్రస్తుతం ఉన్న చార్జీలపై 10 శాతం అంటే 8 నుంచి 9 పైసలు పెంచామని వెల్లడించారు. ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల చార్జీలను కూడా 10 శాతం పెంచినట్లు తెలిపారు. వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు ఉపయోగించుకుంటున్నారని, అందువల్ల వాటి చార్జీలు పెంచలేదని తెలిపారు. పెరిగిన చార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.300 కోట్ల భారం పడుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.595 కోట్లు నష్టం వచ్చిందని, దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల మరో రూ.660 కోట్లు ఆర్థిక భారం పడిందని ఎండీ వివరించారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రయత్నించామని, అయినప్పటికీ రూ.1,200 కోట్లకు పైగా నష్టం రావడంతో ప్రజలపై భారం మోపక తప్పలేదని చెప్పారు. ఆర్టీసీ ఆఖరుసారిగా 2013 నవంబర్‌లో చార్జీలు పెంచిందని వివరించారు. ఆర్టీసీని ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో 14,000 గ్రామాలకు సేవలందిస్తోందని వివరించారు. విద్యార్థుల బస్ పాస్‌లకు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.280 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంటుందని, మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ విధించడం వల్ల ఆర్టీసీపై ఏడాదికి రూ.395 కోట్లు భారం పడుతోందని వెల్లడించారు. దీన్ని మాఫీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. గతంతో పోల్చితే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగిందని, గతంలో 52 శాతం ఉండగా, ప్రస్తుతం 72 శాతానికి చేరిందని చెప్పారు. కొన్ని బస్సుల్లో నూరు శాతం ఉండగా, కొన్నింటిలో 44 శాతం కంటే పెరగడం లేదని చెప్పారు. -
ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. బస్సు చార్జీలను ప్రభుత్వం 10 శాతం మేర పెంచింది. పెరిగిన బస్సు చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలవుతాయి. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన చార్జీల ప్రకారం హైదరాబాద్- విజయవాడ మార్గంలో టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్- విజయవాడ ఎక్స్‌ప్రెస్ చార్జీ గతంలో రూ. 213.. కొత్త చార్జీ రూ. 235 హైదరాబాద్- విజయవాడ డీలక్స్ చార్జీ గతంలో రూ. 240.. కొత్త చార్జీ రూ. 264 హైదరాబాద్- విజయవాడ సూపర్ లగ్జరీ చార్జీ గతంలో రూ. 283.. కొత్త చార్జీ రూ. 303 -
ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు
-
'ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం'
విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా 600 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో మంత్రి వర్గం ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
అధికారంలోకి వస్తూనే ఆర్టీసీని విలీనం చేస్తాం
సాక్షి, చిత్తూరు: ‘మూడేళ్లు ఓపిక పట్టండి. మనం అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఆ తర్వాత కార్మికులు ప్రభుత్వ ఉద్యోగుల్లా బతుకుతారు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పీఎల్ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రెండో మహాసభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆర్టీసీని విలీనం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని.. బాబు చేస్తే సరి.. లేకపోతే అధికారంలోకి వచ్చాక మనమే విలీనం చేసుకుందామని చెప్పారు. త్వరలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు గుర్తింపు వస్తుందన్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో యూనియన్ అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. వైఎస్ వారసుడిగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే 43 శాతం ఫిట్‌మెంట్‌కు బాబు ఒప్పుకున్నారన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచినా... కార్మికులకు జీతాలు పెంచలేదన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచకుండా ఐదేళ్లపాటు వైఎస్ పాలన చేశారని గుర్తుచేశారు. ఆర్టీసీని నిలబెట్టాలని, ఆర్థికంగా బలోపేతం చేయాలని, కార్మికులకు మంచి జరగాలని వైఎస్ కాంక్షించారన్నారు. వైఎస్, చంద్రబాబు పాలన గురించి నాకంటే మీకే బాగా తెలుసన్నారు. ఇవాళ ఎన్నికలు పెడితే బాబుకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. వైఎస్ స్ఫూర్తితో... మాట చెబితే మాటమీద నిలవడం.. అందుకు ఎందాకైనా వెళ్లడం తాను నేర్చుకున్న రాజకీయమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ రాష్ట గౌరవాధ్యక్షుడు, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, వైఎస్సార్ టీయూసీ రాష్ట అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఆర్టీసీ యూనియన్ రాష్ట అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు న్యాయం చేయండి తిరుచానూరు: 1998 డీఎస్సీ అర్హత పరీక్షలో విజయం సాధించి, ఇంటర్వ్యూల్లో అన్యాయానికి గురైన తమకు న్యాయం జరిగేలా చూడాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల యూనియన్ చిత్తూరు జిల్లా నాయకులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వారు మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో జగన్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. జగన్ స్పందిస్తూ.. ఈ అంశంపై శాసనసభలో చర్చించి, న్యాయం జరిగేలా చూస్తానన్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే
-
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే
నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన వైఎస్ఆర్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచడానికి ఎంతో చొరవ చూపిస్తున్న ఈప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చే విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోవట్లేదు 18 రోజుల పాటు సమ్మె చేస్తే తప్ప జీతాలకు దిక్కులేదు ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచకుండా పాలన చేసింది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పాలన గురించి నా కంటే మీకే బాగా తెలుసు ఆర్టీసీ తన కాళ్ల మీద తాను నిలబడాలని, ఆర్టీసీని బలోపేతం చేస్తూ, కార్మికులకు మంచి జరగాలని ఆలోచించింది వైఎస్ఆర్ చంద్రబాబు హయాంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రభుత్వ కార్యక్రమాలకు తరలిపోతున్నాయి నష్టాల్లో మునిగితే మరీ మంచిది, అమ్మేయొచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు వైఎస్ఆర్ మాత్రం 280 కోట్ల రూపాయల మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు ఏ సమ్మె లేకుండా, ఎవరూ అడగకుండానే కార్మికుల ప్రతినిధులు రాగానే వెంటనే జీతాలు పెంచిన ఘనత రాజశేఖరరెడ్డిది 24 రోజుల పాటు మీరు సమ్మె చేస్తే.. 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని అగ్రిమెంటు రాసుకుని కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అదే రాజశేఖరరెడ్డి గారు మాత్రం కేవలం మజ్దూర్ యూనియన్ నేతలు అడగగానే ఆ రాయితీలకు సంబంధించి వంద శాతం ప్రభుత్వమే ఇస్తుందని ఆరోజు చెప్పారు ఔట్ సోర్సింగ్ కార్మికుల పొట్టగొడుతున్నారు చంద్రబాబు ఒక్కటే చెబుతా.. రాజశేఖరరెడ్డి వారసుడిగా, ఆయన స్ఫూర్తితో చెబుతున్నా.. ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంత కాలం మనం ఎలా బతికామన్నది ముఖ్యం సీఎం కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది. కానీ, ఆ పదవి కోసం మోసాలు చేసి, అబద్ధాలు ఆడేది మాత్రం చంద్రబాబే అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి కూతుర్నిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు మనం అలా కాదు.. మాట మీద నిలబడతాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు మీద ఒత్తిడితెస్తాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒత్తిడి తెస్తాం తర్వాత మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడైనా విలీనం చేస్తాం. చెప్పడమే కాదు.. చేసి చూపిస్తాం కూడా. -
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ వడ్డనకు రంగం సిద్ధం
-
ఏపీలో ఎంత పెంచితే అంత పెంచుదాం!
-
ఏపీలో ఎంత పెంచితే అంత పెంచుదాం!
బస్సు చార్జీలపై ప్రభుత్వానికి నివేదించనున్న టీఎస్ఆర్టీసీ * 12 శాతం నుంచి 15 శాతం మధ్య పెరిగే అవకాశం? * వేతన సవరణ భారం నుంచి బయటపడేందుకు మేధోమథనం * ఉన్నతాధికారులతో ఉదయం నుంచి రాత్రి వరకు జేఎండీ మంతనాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్సు చార్జీలను ఎంత పెంచితే తెలంగాణలో కూడా అంత పెంచాలని టీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది. గతేడాదితో పోల్చితే నష్టాలు తగ్గినప్పటికీ, ఇటీవల ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచడం టీఎస్ఆర్టీసీకి భారంగా మారింది. జూలై నెలలో పుష్కరాల రూపంలో రూ.30 కోట్లు అదనపు ఆదాయం సమకూరినప్పటికీ వేతనాల పెంపు కారణంగా ఇంకా రూ.32 కోట్ల నష్టంలోనే ఉండిపోయింది. ఇక ప్రతినెలా ఇదే పరిస్థితి ఎదరుకానుండడంతో బస్సు ఛార్జీల పెంపు తప్పదని అధికారులు నిర్ణయానికొచ్చారు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోన్న ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అక్కడ 12 నుంచి 15 శాతం వరకు చార్జీలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీలో ఛార్జీలు ఎంత పెంచితే తెలంగాణలో కూడా అంత పెంచాలని టీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. చార్జీల పెంపులో తేడాలు ఉంటే రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు చార్జీలలో తేడాలు ఉండి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపులో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, ఆ తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ఓఆర్ 70 శాతం ఉండాలి: అధికారులకు జేఎండీ ఆదేశాలు ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో జేఎండీ రమణరావు ఈడీలు, ఆర్ఎంలతో మేథోమథన సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ సమావేశంలో అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడంతోపాటు వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించారు. ఇకనుంచి ప్రతినెలా పరిస్థితిని సమీక్షించేందుకు ఈ తరహా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సామాజిక అవసరంగా పల్లెవెలుగు బస్సులు నిర్వహిస్తున్నందున వాటి నుంచి వచ్చే నష్టాలను ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లగ్జరీ తదితర ఇతర రకాల బస్సుల ద్వారా సర్దుబాటు చేయాలని జేఎండీ పేర్కొన్నారు. ఇందుకోసం ఆ కేటగిరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 70 శాతానికి తగ్గకుండా కచ్చితంగా చూడాలని ఆదేశించారు. అంతకంటే తక్కువ ఓఆర్ ఉన్న మార్గాలను గుర్తించి వెంటనే సమీక్షించి ఎలాంటి మార్పుచేర్పులు చేస్తే అవి 70 శాతంపైకి చేరుతాయో గుర్తించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. అతి తక్కువ ఓఆర్ ఉన్న సర్వీసులను వేరే చోటకు మళ్లించాలన్నారు. ఇంధన వృథాను అరికట్టి ఇతర ఖర్చులను నియంత్రించాలని పేర్కొన్నారు. కనీస భారం రూ.410 కోట్లు... టీఎస్ఆర్టీసీ పరిధిలో నిత్యం రూ.9.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఏడాదికి ఈ మొత్తం రూ.3,420 కోట్లు. జరుగుతున్న ప్రచారం ప్రకారం 12 శాతం చార్జీలు పెంచితే ప్రజలపై రూ.410 కోట్ల మేర భారం పడుతుంది. ఆదే 15 శాతం పెంచితే ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది. ఇదిలాఉండగా, పల్లె వెలుగును పెంపునుంచి మినహాయించాలని దాదాపు నిర్ణయించారు. -
త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!
-
త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. బస్సు ఛార్జీలను10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశముంది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోందని సాంబశివరావు తెలిపారు. నష్టాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బయటపడాలంటే బస్సు ఛార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ నుంచే ఏపీఎస్ ఆర్టీసీ పనిచేస్తుందని సాంబశివరావు చెప్పారు. -
బాబు ‘బొమ్మ’ పోయింది
- టీఎస్ఆర్టీసీకి ఏపీ సీఎం ఫొటో ఉన్న టికెట్ల సరఫరా - ప్రయాణికుల ఫిర్యాదుతో గుర్తించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జారీ అవుతున్న టికెట్ల వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన ప్రభుత్వ పథకాల ప్రకటనలుండటం అధికారుల్లో గుబులు రేపింది. ఆ టికెట్లు పొందిన కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయటంతో అధికారులు హడావుడి చేశారు. ఆ టికెట్లు ఏయే డిపోల్లోని బస్సుల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఏకంగా 3 రోజుల పాటు నానా హైరానా చేశారు. ఎట్టకేలకు వాటి జాడ కనిపెట్టి అన్నిటినీ ఉపసంహరించుకున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన టికెట్లు ఒకేచోట ముద్రిస్తారు. దీంతో వాటి సరఫరా సిబ్బంది చేసిన పొరపాటు వల్ల అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కన్నెర్ర చేస్తారోనని అధికారులు ఆందోళనపడ్డారు. చివరికి ఆ టికెట్లు ఉపసంహరించుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ ఈష్యూయింగ్ మెషిన్ (టిమ్) ద్వారా టికెట్లు జారీ అవుతున్నాయి. ఆ మెషిన్‌కు అమర్చే పేపర్ రోల్ వెనుక వాణిజ్య ప్రకటనలు, ప్రభుత్వ పథకాల వివరాలను ముద్రిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాలున్న ఆ టికెట్ రోల్స్ టీఎస్ఆర్టీసీకి పొరపాటుగా సరఫరా అయ్యాయి. వాటిని ఉపసంహరించాం: ఈడీ ఏపీకి సరఫరా కావాల్సిన టికెట్ రోల్స్ కొన్ని పొరపాటున టీఎస్ఆర్టీసీకి చేరాయని ఈడీ ఎం.రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్ జోన్ల పరిధిలోని నాలుగు డిపోలకు ఈ రోల్స్ సరఫరా అయ్యాయని, ఫిర్యాదులు రావడంతో అన్నింటిని పరిశీలించి ఆరు రోల్ బాక్సులను వెనక్కి రప్పించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ విభజనకు ముందు మే నెలలో వీటిని ముద్రించినట్లు వెల్లడించారు. -
కార్మికులను వేదిస్తే ఉద్యమిస్తాం
విజయనగరం : ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం వేధిస్తుందని ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం విజయనగరం జిల్లా సాలూరులో ఎన్ఎంయూ ఏర్పాటు చేసిన సమావేశంలో వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులు చేసిన చిన్న తప్పులను కూడా యాజమాన్యం పెద్దదిగా చూస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్మికులను వేధిస్తే ఉద్యమం తప్పదని ఆయన ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించారు. -
వామ్మో.. అట్టపెట్టె
- తీవ్ర ఉత్కంఠతో బాంబు స్వ్కాడ్ తనిఖీలు - బయటపడ్డ రాగి చెంబు కడప అర్బన్: కడప నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం సమీపంలో గోడ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన అట్ట పెట్టె సోమవారం రాత్రి కలకలం రేపింది. రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యలో డయల్ యువర్ 100 నెంబరుకు ఫోన్ చేసి ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం సమీపంలో ఓ అట్ట పెట్టె సీల్ చేసి ఉందని సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ కె.రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అట్ట పెట్టె నుంచి వరిపొట్టు రాలుతుండటంతో వెంటనే బాంబు స్వ్కాడ్‌ను రప్పించారు. మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేస్తే పాజిటివ్ శబ్ధం రావడంతో మరింత అనుమానం పెరిగింది. జాగ్రత్తగా అట్ట పెట్టెను తెరిచారు. లోపల కాగితాలు, దూదితో చుట్టిఉన్న ఓ వస్తువు బయటపడింది. దూదిని తొలగించి చూడగా నల్లటి పేపర్ కవరింగ్‌తో ఓ రాగి చెంబు బయటపడింది. లోపల ఓ పేపరుపై 89784 85881 అనే నెంబరుతో పాటు అర్కట వేముల రవి, అర్కట వేముల జయపాల్, రాంగోపాల్ వర్మ, ఇందిరానగర్ అని పేర్లు రాసి ఉన్నాయి. దీనిపై ఆరా తీస్తామని సీఐ తెలిపారు. -
ప్రత్యేక హోదా ఏపీ హక్కు: చిరంజీవి
అనంతపురం: ప్రత్యేక హోదా ఏపీ హక్కు... దీని కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రను చేపట్టారు. అందులోభాగంగా ఓడీసీలో ఏర్పాటు చేసిన సభలో చిరంజీవి మాట్లాడారు. నరేంద్ర మోదీ ఏడాది పాలన వల్ల దేశంలో గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు 38 శాతం మేర పెరిగాయని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. -
సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ : గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు వెళ్లే బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ అన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. -
ఆర్టీసీలో బదిలీలాట!
* వారం క్రితం జరిగిన బదిలీల్లో మార్పులు * 70 మందికి తిరిగి కొత్త పోస్టింగ్‌లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో బదిలీలాట సాగుతోంది. ఎక్కడి వారు అక్కడ పద్ధతిలో పాలనపరంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు కావటంతోనే తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 270 మంది అధికారులను బదిలీ చేశారు. ఒకే పోస్టులో మూడేళ్లుపైబడ్డవారిని మార్చారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు, వరస పదోన్నతులు పొందుతూ ఒకేచోట పాతుకుపోయినవారిని కూడా మార్చారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలబాట పట్టాలంటే అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఎం సూచించటంతో... ఈ మార్పులు అవసరమని ఆర్టీసీ జేఎండీ రమణరావు భావించారు. దీంతో సమూలంగా ప్రక్షాళన లక్ష్యంగా ఆయన భారీ ఎత్తున బదిలీలు చేశారు. దీంతో చాలామంది అభ్యర్థనలు పెట్టుకున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు... ఇలా పరిశీలనార్హమైన అభ్యర్థనలు కొన్ని రావటంతో వాటి ఆధారంగా మార్పుచేర్పులు చేయాలని జేఎండీ నిర్ణయించారు. వాటిని పరిశీలించి సిఫారసు చేసేందుకు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో ఆయన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. కొందరు అవినీతి అధికారులు కూడా కోరుకున్న సీటు కోసం పైరవీలు ప్రారంభించారు. ఇందుకోసం అర్థబలం, రాజకీయ నేతల బలాన్ని కూడా ఉపయోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేశారు. వెరసి... బదిలీ అయిన వారిలో 70 మందికి తిరిగి కొత్త పోస్టింగ్స్ జారీ చేశారు. ఇందులో అర్హమైన మార్పులు కొన్ని ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం ఒత్తిళ్లతో చేసినవి ఉన్నాయని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. ఇక పదోన్నతి కల్పించి జూనియర్లకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారంటూ సీనియర్లు చేసిన ఫిర్యాదుల మేరకు కొన్ని మార్పులు చేశా రు. ఈ నేపథ్యంలో మార్పులకు సంబంధించి 70 మంది అధికారులకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. వారంతా గురువారం కొత్త చోట రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.