ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే | should merge apsrtc into govenrment, demands ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే

Sep 15 2015 3:05 PM | Updated on Aug 20 2018 3:26 PM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే - Sakshi

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే

నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన వైఎస్ఆర్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...

  • ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచడానికి ఎంతో చొరవ చూపిస్తున్న ఈప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చే విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోవట్లేదు
  • 18 రోజుల పాటు సమ్మె చేస్తే తప్ప జీతాలకు దిక్కులేదు
  • ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచకుండా పాలన చేసింది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే
  • రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పాలన గురించి నా కంటే మీకే బాగా తెలుసు
  • ఆర్టీసీ తన కాళ్ల మీద తాను నిలబడాలని, ఆర్టీసీని బలోపేతం చేస్తూ, కార్మికులకు మంచి జరగాలని ఆలోచించింది వైఎస్ఆర్
  • చంద్రబాబు హయాంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రభుత్వ కార్యక్రమాలకు తరలిపోతున్నాయి
  • నష్టాల్లో మునిగితే మరీ మంచిది, అమ్మేయొచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు
  • వైఎస్ఆర్ మాత్రం 280 కోట్ల రూపాయల మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు
  • ఏ సమ్మె లేకుండా, ఎవరూ అడగకుండానే కార్మికుల ప్రతినిధులు రాగానే వెంటనే జీతాలు పెంచిన ఘనత రాజశేఖరరెడ్డిది
  • 24 రోజుల పాటు మీరు సమ్మె చేస్తే.. 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని అగ్రిమెంటు రాసుకుని కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
  • అదే రాజశేఖరరెడ్డి గారు మాత్రం కేవలం మజ్దూర్ యూనియన్ నేతలు అడగగానే ఆ రాయితీలకు సంబంధించి వంద శాతం ప్రభుత్వమే ఇస్తుందని ఆరోజు చెప్పారు
  • ఔట్ సోర్సింగ్ కార్మికుల పొట్టగొడుతున్నారు చంద్రబాబు
  • ఒక్కటే చెబుతా..
  • రాజశేఖరరెడ్డి వారసుడిగా, ఆయన స్ఫూర్తితో చెబుతున్నా.. ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంత కాలం మనం ఎలా బతికామన్నది ముఖ్యం
  • సీఎం కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది. కానీ, ఆ పదవి కోసం మోసాలు చేసి, అబద్ధాలు ఆడేది మాత్రం చంద్రబాబే
  • అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి కూతుర్నిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు
  • మనం అలా కాదు.. మాట మీద నిలబడతాం.
  • రాబోయే రోజుల్లో చంద్రబాబు మీద ఒత్తిడితెస్తాం
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒత్తిడి తెస్తాం
  • తర్వాత మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడైనా విలీనం చేస్తాం.
  • చెప్పడమే కాదు.. చేసి చూపిస్తాం కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement