
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల ద్రోహి అని వైఎస్సార్‌సీపీ భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన గతంలో ఆర్టీసీని ప్రైవేటీకరం చేయడానికి ప్రయత్నించాడని, ఇప్పుడు తిరుపతి ఆర్టీసీ గ్యారేజిని ఇతర ప్రాంతాలకు తరలించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్యారేజీని తరలించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. కార్మీకులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.