
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy)రచయిత, సంగీత దర్శకుడు, నటుడుగా కూడా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

తాజాగా ఈయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘వేదవ్యాస్’ అనే టైటిల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలను ఈరోజు ఘనంగా నిర్వహించారు.

ఈ సినిమా కోసం హీరోయిన్ ను ఏకంగా కొరియన్ నుంచి తీసుకురావడం గమనార్హం.

విలన్ ను మంగోలియా నుంచి తీసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు ఇది తొలి సినిమా.


















