సీట్లు.. పాట్లు | people suffering in rtc busstand going to village | Sakshi
Sakshi News home page

సీట్లు.. పాట్లు

Oct 19 2017 8:58 AM | Updated on Aug 20 2018 3:26 PM

people suffering in rtc busstand going to village - Sakshi

పండుగ ఏదయినా సీట్ల పాట్లు షరా మామూలే. దసరా ఇక్కట్లు మరువక మునుపే.. దీపావళి ధమాకా మొదలయింది. సొంతూళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులు చుక్కలు చూశారు. బస్సు పాయింట్‌లోకి చేరక మునుపే పరుగులు పెడుతూ.. కిటికీల్లో నుంచి దూరుతూ అష్టకష్టాలు పడ్డారు. సీటు దొరికిన వారిలో పండుగ సంతోషం కనిపించగా.. దొరకబుచ్చుకోలేకపోయిన వారిలో నిరుత్సాహం అలుముకుంది.

దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్టాండులన్నీ కిటకిటలాడాయి. అనంతపురం ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు రాగానే సీటు పట్టుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement