
ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య (ఫైల్)
సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నియామకం కోసం కొందరు ఏకంగా ఆర్టీసీ ఎండీ మాల కొండయ్య, ఓఎస్డీ నాగేశ్వర్ రావుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. కడపకు చెందిన షేక్ చాన్ బాషాను జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్లు ఉన్న ఫైల్ రవాశాఖ అధికారులకు చేరింది.
అయితే ఈ పోస్ట్ నియమించే అధికారం ఓఎస్డీకి లేదు. దీంతో అనుమానంతో అధికారులు విచారణ చేయగా సంతకాలు ఫోర్జరీ జరిగనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఓఎస్డీ నాగేశ్వర రావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.