breaking news
RTC MD malakondaiah
-
ఏపీ ఆర్టీసీ ఎండీ సంతకం ఫోర్జరీ
సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నియామకం కోసం కొందరు ఏకంగా ఆర్టీసీ ఎండీ మాల కొండయ్య, ఓఎస్డీ నాగేశ్వర్ రావుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. కడపకు చెందిన షేక్ చాన్ బాషాను జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్లు ఉన్న ఫైల్ రవాశాఖ అధికారులకు చేరింది. అయితే ఈ పోస్ట్ నియమించే అధికారం ఓఎస్డీకి లేదు. దీంతో అనుమానంతో అధికారులు విచారణ చేయగా సంతకాలు ఫోర్జరీ జరిగనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఓఎస్డీ నాగేశ్వర రావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
గుడివాడ టౌ¯న్: ఆర్టీసీ సంస్థ లాభాల దిశగా పయనించడానికి కార్మికుల కృషి ఎంతో అవసరమని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య అన్నారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపోలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే సంస్థ లాభాల బాటలో నడవాలని, అందుకు కార్మికులతోపాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రస్తుతం గుడివాడ డిపో రూ 4 కోట్లు నష్టాలలో ఉందని, దానిని భర్తీ చేయాలంటే ఆక్యుఫెన్సీని పెంచాలన్నారు. అందుకు డ్రైవర్లు సహకారం కావాలని, ఓవర్ లోడ్‌లో నడిపే ఆటోలపై కార్మికులు దృష్టి వేయాలని, వాటి ఫొటోలను సంబంధిత పోలీస్‌స్టేçన్Sకు పంపితే భారీగా జరిమానాలు విధిస్తారని తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరగటానికి అవకాశాలున్నాయన్నారు. బస్టాండ్‌ను పరిశీలించారు. ఆర్టీసీ ఈడీ ఎన్.వెంకటేశ్వరరావు, ఆర్ఎం రామారావు, గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్, డిపో మేనేజర్ వై.సురేష్ బాబు, ఎ¯ŒSఎంయూ, ఇయూ నాయకులు పాల్గొన్నారు.