కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం | solve workers problems | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

Nov 27 2016 11:40 PM | Updated on Sep 4 2017 9:17 PM

కార్మికుల సమస్యలు         పరిష్కరిస్తాం

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

ఆర్టీసీ సంస్థ లాభాల దిశగా పయనించడానికి కార్మికుల కృషి ఎంతో అవసరమని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాలకొండయ్య అన్నారు.

గుడివాడ టౌ¯న్‌: ఆర్టీసీ సంస్థ లాభాల దిశగా పయనించడానికి కార్మికుల కృషి ఎంతో అవసరమని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాలకొండయ్య అన్నారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపోలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే సంస్థ లాభాల బాటలో నడవాలని, అందుకు కార్మికులతోపాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రస్తుతం గుడివాడ డిపో రూ 4 కోట్లు నష్టాలలో ఉందని, దానిని భర్తీ చేయాలంటే ఆక్యుఫెన్సీని పెంచాలన్నారు. అందుకు డ్రైవర్లు సహకారం కావాలని, ఓవర్‌ లోడ్‌లో నడిపే ఆటోలపై కార్మికులు దృష్టి వేయాలని, వాటి ఫొటోలను సంబంధిత పోలీస్‌స్టేçన్‌Sకు పంపితే భారీగా జరిమానాలు విధిస్తారని తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరగటానికి అవకాశాలున్నాయన్నారు. బస్టాండ్‌ను పరిశీలించారు. ఆర్టీసీ ఈడీ ఎన్‌.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం రామారావు, గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్, డిపో మేనేజర్‌ వై.సురేష్‌ బాబు, ఎ¯ŒSఎంయూ, ఇయూ నాయకులు పాల్గొన్నారు.  

 

Advertisement

పోల్

Advertisement