3వేల కొత్త బస్సులు కొనుగోలుకు ఆమోదం | 3 thousand of new RTC buses can be purchased | Sakshi
Sakshi News home page

3వేల కొత్త బస్సులు కొనుగోలుకు ఆమోదం

Mar 30 2016 11:56 PM | Updated on Aug 20 2018 3:30 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు వేల కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు వేల కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. బుధవారం సీఎం చంద్రబాబుతో ఏపీఎస్‌ఆర్‌టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రయాణికులపై భారం పడకుండా వాణిజ్యపరమైన ఆదాయాన్ని పెంచుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిందిగా కోరారు.

ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవటంతో పాటు ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకుని సంస్థను లాభాల బాటలో నడిపించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో బస్సు స్టేషన్లను ఆధునీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సచివాలయంలో టీడీఎల్పీ, టీడీపీపీ తెలుగుదేశం శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్ష సంయుక్త సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. మధ్యాహ్నం వీరికి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement