సీఎం చంద్రబాబు పర్యటనకు బుధవారం ఆర్టీసీ అధికారులు.. 175 బస్సులు సమకూర్చారు.
సీఎం పర్యటనకు ఆర్టీసీ బస్సులు
Jun 21 2017 11:59 PM | Updated on Aug 20 2018 3:26 PM
కర్నూలు(రాజ్‌విహార్): సీఎం చంద్రబాబు పర్యటనకు బుధవారం ఆర్టీసీ అధికారులు.. 175 బస్సులు సమకూర్చారు. జిల్లా వ్యాపంగా 12 డిపోల్లో ఉన్న 1020 బస్సులు ఉన్నాయి. వాటిలో 175 సర్వీసులను సీఎం పర్యటనకు వినియోగించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా రెగ్యులర్ సర్వీసులును రద్దు చేసి పంపారు. ఆదోని డిపో నుంచి 17, ఎమ్మిగనూరు – 15, కర్నూలు–1 డిపో – 14, కర్నూలు–2 డిపో – 25, డోన్ – 10, నందికొట్కూరు – 20, ఆత్మకూరు – 20, ఆళ్లగడ్డ – 12, నంద్యాల – 23, బనగానపల్లె – 12, కోవెలకుంట్ల డిపో నుంచి 8 చొప్పున బస్సులను సీఎం పర్యటనకు సమకూర్చారు.
Advertisement
Advertisement