breaking news
n samba siva rao
-
3వేల కొత్త బస్సులు కొనుగోలుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు వేల కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. బుధవారం సీఎం చంద్రబాబుతో ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. సాంబశివరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రయాణికులపై భారం పడకుండా వాణిజ్యపరమైన ఆదాయాన్ని పెంచుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిందిగా కోరారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవటంతో పాటు ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకుని సంస్థను లాభాల బాటలో నడిపించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో బస్సు స్టేషన్లను ఆధునీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సచివాలయంలో టీడీఎల్పీ, టీడీపీపీ తెలుగుదేశం శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్ష సంయుక్త సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. మధ్యాహ్నం వీరికి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. -
క్రిబ్కో ఎండీగా తెలుగు తేజం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల రంగంలో ఉన్న కృషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) ఎండీగా ఎన్.సాంబశివరావు నియమితులయ్యారు. దక్షిణాది వ్యక్తి ఈ పదవిని అలంకరించడం ఇదే తొలిసారి. రైతు కుటుంబానికి చెందిన సాంబశివరావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ. 2009 నుంచి క్రిబ్కో మార్కెటింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. ఈ విభాగాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ఆయనది కీలక పాత్ర. ఎఫ్‌సీఐ, ఈఐడీ ప్యారీ, నాగార్జున ఫెర్టిలైజర్స్ తదితర సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. సహకార రంగంలో ఎరువుల తయారీలో ప్రపంచంలో రెండో స్థానంలో క్రిబ్కో నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా సేవలందిస్తోంది. రైతులకు మేలు చేసే సంస్థకు ఉన్నతాధికారి కావడం రైతులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సాంబశివరావు పేర్కొన్నారు.