
క్రిబ్‌కో ఎండీగా తెలుగు తేజం
ఎరువుల రంగంలో ఉన్న కృషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్‌కో) ఎండీగా ఎన్.సాంబశివరావు నియమితులయ్యారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల రంగంలో ఉన్న కృషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్‌కో) ఎండీగా ఎన్.సాంబశివరావు నియమితులయ్యారు. దక్షిణాది వ్యక్తి ఈ పదవిని అలంకరించడం ఇదే తొలిసారి. రైతు కుటుంబానికి చెందిన సాంబశివరావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ. 2009 నుంచి క్రిబ్‌కో మార్కెటింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. ఈ విభాగాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ఆయనది కీలక పాత్ర. ఎఫ్‌సీఐ, ఈఐడీ ప్యారీ, నాగార్జున ఫెర్టిలైజర్స్ తదితర సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.
సహకార రంగంలో ఎరువుల తయారీలో ప్రపంచంలో రెండో స్థానంలో క్రిబ్‌కో నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా సేవలందిస్తోంది. రైతులకు మేలు చేసే సంస్థకు ఉన్నతాధికారి కావడం రైతులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సాంబశివరావు పేర్కొన్నారు.