
మంచి తల్లిదండ్రులుగా ఉండటం అంటే అలాంటి ఇలాంటి టాస్క్ కాదు ఇది. జీవిత విలువల్ని, పాఠాలను నేర్పే గొప్ప గురు స్థానం దాన్ని సక్రమంగా నిర్వహించడంపైనే పిల్లల ఎదుగుదల, ఉన్నతి ఆధారపడి ఉంటుంది. అది మొగ్గగా ఉన్నప్పటి నుంచి నేర్పాలి అనేందుకు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోనే ఉదాహారణ
ఆ వీడియోలో మైఫండ్‌బాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అనుజ్‌పాల్ తన కొడుతో సంభాషిస్తున్నట్లు కనిపిస్తుంది. నీస్కూల్ నుంచి ఫిర్యాదు వచ్చిందని అడగగా, అందుకు కొడుకు అద్విక్ ఒకరిని కొట్టానని సమాధానమిస్తాడు. అలా ఎలా ఒక వ్యక్తిపై చెయ్యి ఎత్తడం కరెక్టేనా అని అడుగుతాడు. ఆ పని రౌడీలే చేస్తారు. నువ్వు రౌడీ లేదా హీరోలా ఉండాలనుకుంటున్నావా అని అడగగా..హీరోలానే ఉండాలనుకున్నట్లు సమాధానమిస్తాడు.
అలాంటప్పుడు ఎంతో హుందాగా ఉండాలని, పక్కవారి వస్తువులను తీసుకోకూడదని ఆ సీఈవో తండ్రి కుమారుడికి హితవు చెబుతాడు. మరి హీరోలా ఉండాలనుకున్నప్పుడూ తప్పు చేసిన దానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి కదా అని తండ్రి అడగగా, అందుకు కొడుకు చెబుతానని అంగీకరిస్తాడు. అంతేగాదు వీడియో చివరలో కొడుకు అద్విక్ తన క్లాస్‌మేట్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కూడా.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడూ..కోపంతో కాకుండా ఆలోచనాత్మకంగా చేసిన తప్పుని వివరించి మంచిగా ప్రవర్తించేలా చేయాలి. ఒక్కోసారి కోపంతో కాకుండా విమర్శనాత్మక ధోరణితో తీర్చిదిద్దడమే ఉత్తమం. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్ పాఠం అంటూ సదరు సీఈవో స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..)