
భక్త జనసంద్రంగా ఖైరతాబాద్ మహా గణపతిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.ఆదివారం సెలవు రోజు కావడం, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతం భక్త జనసంద్రంగా మారింది.

సాయంత్రం పూట చిరుజల్లులు కురిసినా భక్తులు తడుస్తూనే వినాయకుడిని దర్శించుకున్నారు.

ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
























