
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ త్వరలోనే తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేయబోతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
(చదవండి: ఇదే నా లాస్ట్ బ్యాచిలర్ బర్త్‌డే.. ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించను)
సాయి ధన్సిక, విశాల్ కలిసి ఒక్క సినిమా చేయలేదు కానీ.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో సాయి ధన్సికనే తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామనే విషయాన్ని కూడా అప్పుడే చెప్పింది. అయితే విశాల్ మాత్రం సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికి షాకిచ్చాడు.
ఏజ్ గ్యాప్‌పై చర్చ
విశాల్‌తో ప్రేమలో ఉన్నానని సాయి ధన్సిక ప్రకటించిన వెంటనే వీరిద్దరి మధ్య ఉన్న వయసు తేడాపై నెటిజన్స్ ఆరా తీశారు. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో మరోసారి ‘ఏజ్ గ్యాప్’పై నెట్టింట చర్చ మొదలైంది. విశాల్‌కి నిన్నటితో 48 ఏళ్లు నిండాయి. 1977 ఆగస్టు 29న విశాల్ జన్మించాడు. ఇక సాయి ధన్సిక 1989 సెప్టెంబర్ 20న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. విశాల్ కంటే సాయి ధన్సిక అంత చిన్నదా అని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడే పెళ్లి.. ?
నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడే విశాల్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఇప్పుడు నడిగర్ భవనం దాదాపు పూర్తయినట్లే. అన్ని పనులు అయిపోతే.. తన బర్త్‌డే రోజే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇంకా రెండు నెలల పని పెండింగ్‌లో ఉందట. అందుకే బర్త్‌డేకి ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆగిపోయాడు. రెండు నెలల తర్వాత నడిగర్ సంఘం భవనంలోనే విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విశాలే ప్రకటించాడు. సాయి ధన్సిక సినీ విషయానికొస్తే .. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ కూతురి గా నటించి మెప్పించింది. ‘షికారు’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది.