
సరిగ్గా 23 యేళ్ల కిందట ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తలపెట్టిన ఓ సరికొత్త ప్రయోగం ఫలించింది.. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో రెండు మర్రి చెట్లను నాటి పునరుజ్జీవం పోశారు. సెపె్టంబర్ 2, 2002న ట్రాన్స్‌లొకేట్ చేసిన ఈ జంట మర్రి చెట్లకు ‘జాగృతి’, ‘నవజీవన్’ అనే పేర్లతో నామకరణం చేశారు. ప్రస్తుతం ఇవి గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రెండువేలకు పైగా చెట్ల నడుమ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
నగర విస్తరణలో భాగంగా ప్రస్తుతం పలు చోట్ల చెట్లను కొట్టేయడం లేదంటే వాటిని ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో వేరే ప్రాంతాల్లో నాటడం తెలిసిందే.. కానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో 23 ఏళ్ల క్రితమమే ఈ పద్ధతిని అమలుచేశారు. అప్పట్లో క్యాంపస్ విస్తరణలో భాగంగా ఈ మర్రి చెట్లను తొలగించాలని నిర్ణయించారు. దీనిపై అప్పటి ప్రొఫెసర్లు, అధికారులు కలిసి వీటిని ఎలాగైనా క్యాంపస్‌లో మరో ప్రదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో ఒకచెట్టును పరిపాలనా భవనం పక్కన(జాగృతి), మరో చెట్టును నీలగిరి భవన్ వద్ద (నవజీవన్) ఏర్పాటు చేశారు పేర్లతో నామకరణం చేశారు.
రెండో సారి ట్రాన్స్‌లొకేషన్..
ఇదిలావుండగా నీలగిరి భవన విస్తరణలో దాన్ని మళ్లీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతి ద్వారానే క్యాంపస్‌లోని పలాష్ నివాస్ సర్కిల్ వద్దకు నవజీవన్‌ను తరలించారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని 66 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం దాదాపు 2వేల చెట్లు కొలువుదీరాయి. యేటా వనమహోత్సవం పేరిట మొక్కలు నాటుతుంటారు. అదేవిధంగా కొన్ని చెట్లను విద్యార్థులే తమ గుర్తు కోసం నాటి వాటికి పేర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు.
సస్టైనబుల్ గ్రీన్ ఇనిషియేటివ్..
వనమహోత్సవంలో భాగంగా సస్టైనబుల్ గ్రీన్ ఇనిíÙయేటివ్ ప్రోగ్రాం కింద క్యాంపస్‌లో ఇటీవల 1,200 మొక్కలను నాటారు.
వన్ ట్రీ ప్లాంటెడ్ యూఎస్‌ఏ, ఫెడెక్స్ కార్పొరేషన్ యూఎస్‌ఏ సంస్థల సహకారంతో క్యాంపస్‌లో ఇటీవలే వీటిని నాటడం విశేషం
క్యాంపస్‌లో రేయిన్ వాటర్ హర్వెస్టింగ్ సిస్టమ్స్, వైసన్ స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, ఇంటిలిజెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, వాటర్, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
(చదవండి: నవరాత్రుల వేళ..సాంస్కృతిక సందడి..)