మరణం, అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్‌ పోస్ట్ వైరల్‌ | Donald Trump Says Never Felt Better In My Life Amid Health And Death Rumours, More Details Inside | Sakshi
Sakshi News home page

మరణం, అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్‌ పోస్ట్ వైరల్‌

Sep 1 2025 9:11 AM | Updated on Sep 1 2025 9:59 AM

Donald Trump Says Never Felt Better In My Life Amid Viral Trend

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనారోగ్య వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్‌’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా ట్రంప్‌.. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్‌గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్‌ మీడియా వార్తలకు చెక్‌ పడినట్టు అయ్యింది.

ఇక, అంతకుముందు.. ట్రంప్ మద్దతుదారుడు, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డీసీ డ్రైనో ట్రంప్‌ ఆరోగ్యంపై ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా డైసీ.. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారాల పాటు ప్రజల ముందుకు రాకుండా ఉంటారు. కానీ మీడియా ఆయన 'చురుగ్గా' ఉన్నారు.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతారు. ఇలాగే ఆయన డైపర్‌లు ధరించి నిద్రపోతున్నారు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ట్రంప్ 24 గంటలు కనిపించకపోతే మీడియా గగ్గోలు పెడుతోంది. ఇది హాస్యాస్పదమైన ద్వంద్వ ప్రమాణం. అమెరికా చరిత్రలోనే అందరి అధ్యక్షుల కంటే ట్రంప్ ఎక్కువ సమయం ప్రజా పనుల్లో గడిపారు అని వివరించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను’ అని సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేతులు, కాళ్లపై గాయాలు ఉండడం, వాటిని కవర్ చేసేందుకు ట్రంప్ మేకప్ వేసుకుని మీడియాకు దొరికిపోవడంతో.. అంతా ఆయన ఏదో అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కానీ ఏదైనా అనుకోని భయంకరమైన విషాదం జరిగితే తానే అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దీంతో, ట్రంప్‌ ఆరోగ్యంపై మరింత అనుమానం పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement