
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చనిపోయారంటూ, కనిపించడం లేదంటూ వస్తున్న వార్తలకు తెర పడింది. ఎట్టకేలకు అధ్యక్షుడు ట్రంప్.. దర్శనమిచ్చారు. ఈ మేరకు వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా ట్రంప్ తన వర్జీనియా క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో వైట్‌హౌస్ షేర్ చేసింది. దీంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు క్లారిటీ వచ్చేసింది.
ఇక, వైట్‌హౌస్ ఈ సందర్బంగా స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ట్రంప్ తన మనుమరాలు కయి ట్రంప్, మనువడు ఫ్రెడరిక్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిపింది. ఇక, ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి, అమెరికా గ్రేట్ క్యాప్ ధరించి కనిపించారు. కాగా, తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని తేల్చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో, ట్రంప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. మీమ్స్, వీడియోలు చక్కర్లు కొట్టాయి.
#JUSTIN: Trump is alive
Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30, 2025, heading to Trump National Golf Club in Sterling, Virginia.#Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump… pic.twitter.com/rDvhVWgPXX— upuknews (@upuknews1) August 30, 2025