అమెరికాలో టెన్షన్‌.. ట్రంప్‌కు ఏమైంది.. ఎక్కడ? | Where Is Donald Trump Tag Trending In Social Media | Sakshi
Sakshi News home page

Where Is Donald Trump.. ట్రంప్‌కు ఏమైంది.. సోషల్‌ మీడియాలో చర్చ

Aug 30 2025 12:25 PM | Updated on Aug 30 2025 12:37 PM

Where Is Donald Trump Tag Trending In Social Media

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ ‘మిస్సింగ్‌’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వేర్‌ ఈజ్‌ ట్రంప్‌ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

వివరాల ప్రకారం.. ట్రంప్ అనారోగ్యంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున​ సంగతి తెలిసిందే. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్‌మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ట్రంప్‌ బయట కనిపించలేదు.. మీడియా ముందుకు సైతం రాలేదు. ట్రంప్‌ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ‘ట్రూత్‌’ ద్వారానే వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్‌ ఈవెంట్లు వైట్‌హౌస్‌ షెడ్యూల్‌లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో, ట్రంప్‌ విషయమై నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

నెటిజన్లు సోషల్‌ మీడియాలో స్పందిస్తూ..‘గత 24 గంటలుగా ట్రంప్‌ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే వేర్‌ ఈజ్‌ ట్రంప్‌ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్‌ సోషల్‌ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్‌ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement