
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.నవమి రా.11.19 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: జ్యేష్ఠ సా.6.03 వరకు తదుపరి మూల, వర్జ్యం: రా.2.41 నుండి 4.25 వరకు, దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.45 వరకు,అమృత ఘడియలు: ఉ.8.21 నుండి 10.06 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.
వృషభం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు.
మిథునం.... కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కర్కాటకం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం... వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.
కన్య.... కొత్త వ్యక్తుల పరిచయం. నూతన వస్తువులు, ఇళ్లు కొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
తుల..... పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
వృశ్చికం... శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ధనలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
ధనుస్సు... పనులలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
మకరం... వ్యవహారాలలో విజయం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.
కుంభం.. పరిశోధకులకు విశేష గుర్తింపు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థుల యత్నాలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
మీనం... ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.