చిన్నారులకు కూడా రాయితీ ఇవ్వనున్నట్టు ఏపీఆర్టీసీ తెలిపింది.
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు ఏసీతో సహా అన్ని బస్సు టిక్కెట్లపై రాయితీ ప్రకటించిన ఆర్టీసీ చిన్నారులకు కూడా రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ జయరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదేళ్లలోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, అలాగే 12 ఏళ్లలోపు పిల్లలకు ఏసీ బస్సు సర్వీసుల్లో 25 శాతం, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ సహా అన్ని బస్సుల్లో అయితే 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ రాయితీ పొందాలంటే వయస్సు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని జయరావు స్పష్టం చేశారు.