సర్వీసులు తగ్గించాల్సిందే.. | Services should be lowered | Sakshi
Sakshi News home page

సర్వీసులు తగ్గించాల్సిందే..

May 12 2017 4:53 AM | Updated on Aug 20 2018 3:30 PM

ఏపీఎస్‌ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య గురువారం రెండోరోజు చర్చ ల్లోను ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణకు తిప్పే సర్వీసులు తగ్గించా లని తెలంగాణ అధికారులు ఖరాఖండీగా చెప్పారు.

ఏపీకి తేల్చి చెప్పిన టీఎస్‌ఆర్టీసీ... రెండో రోజూ కుదరని ఏకాభిప్రాయం

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య గురువారం రెండోరోజు చర్చ ల్లోను ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణకు తిప్పే సర్వీసులు తగ్గించా లని తెలంగాణ అధికారులు ఖరాఖండీగా చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు అత్యధి కంగా సర్వీసులు నడుపుతుండటంతో తమకు ఏటా రూ.130 కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలంగాణ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు తమ వాదన వినిపించారు. రెండు రాష్ట్రాల రవాణా మంత్రుల మధ్య ఆర్టీసీ సర్వీసుల విషయంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావడంతో గురువారం ఈడీల స్థాయిలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీకావాలని నిర్ణయిం చడం తెలిసిందే.

 ఈ మేరకు విజయవాడలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు సమావేశమ య్యారు. ఏపీఎస్‌ఆర్టీసీకి కిందటేడాది రూ.840 కోట్ల నష్టాలు వచ్చాయని, హైదరాబాద్‌కు ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతోనే తమ పరిస్థితి ఆశాజనకంగా ఉందని ఏపఎస్‌ ఆర్టీసీ ఈడీలు వివరించారు. హైదరాబాద్‌తో ఏపీలోని అన్ని ప్రాంతాలకు సంబంధాలు న్నాయని, అందుకే ఇక్కడి ప్రయాణికుల కోరిక మేరకు అన్ని ప్రాంతాల నుంచి సర్వీసులు నడు పుతున్నామన్నారు. ఇందుకు టీఎస్‌ఆర్టీసీ ఈడీ లు అంగీకరించలేదని సమాచారం.

సగమైనా తగ్గించుకోవాల్సిందే...
ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ ప్రాంతంలో రోజుకు 386 రూట్లలో 1,226 బస్సుల్ని 3,37,603 కిలోమీటర్లు తిప్పుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఏపీలో 175 రూట్లలో 554 బస్సుల్ని 94,048 కిలోమీటర్లు తిప్పుతోంది. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ కంటే అధికంగా తిప్పుతున్న 2,43,555 కిలోమీటర్లలో సగం కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరారు. జూన్‌లో ఆర్టీసీ రూట్లను సమీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు చెప్పడంతో రెండు రాష్ట్రాల ఈడీల సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. ఈనెలాఖరులో మళ్లీ రెండు రాష్ట్రాల రవాణామంత్రుల భేటీ జరగనుండటంతో అప్పుడు ఆర్టీసీ పర్మిట్ల తకరారు తేలుతుందా.. లేదా.. అన్నది చూడాల్సి ఉంది.

పర్మిట్ల విషయంలో పేచీ
ఏపీఎస్‌ఆర్టీసీకి తెలంగాణలో సర్వీసులు తిప్పేందుకు 1,006 పర్మిట్లున్నాయి. అదే తెలంగాణకు ఏపీలో సర్వీసులో తిప్పేం దుకు 506 పర్మిట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ పర్మిట్ల విషయంలో అభ్యంతరాల్ని లేవనెత్తారు. సాంకేతికంగా విభజన జరగ కపోయినా పరిపాలనపరంగా విడిపోయా యని, నష్టాల్ని భరించేది తెలంగాణ ఆర్టీసీ యేనని పేచీ పెట్టినట్లు తెలిసింది. గతం లోనూ పర్మిట్ల విషయంలో రెండు రాష్ట్రాల ఎండీల మధ్య లేఖల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement