‘బీచుపల్లి’ ప్రయాణం భారమే! | beechupalli journy is costly | Sakshi
Sakshi News home page

‘బీచుపల్లి’ ప్రయాణం భారమే!

Aug 9 2016 12:36 AM | Updated on Aug 20 2018 3:26 PM

బీచుపల్లి పుష్కర ఘాట్‌కు ప్రయాణం భారం కానుందా... ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఆలయ, ఘాటు సమీపంలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, స్టాపింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు.

– ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్‌ స్థలం కేటాయించని తెలంగాణ
– కర్నూలు నుంచి సమీపంలో ఉన్న ఘాటు అదే
– శ్రీశైలం కంటే రెట్టింపు భక్తులు వెళ్తారని ఆర్టీసీ ప్రణాళిక
 
కర్నూలు(రాజ్‌విహార్‌): బీచుపల్లి పుష్కర ఘాట్‌కు ప్రయాణం భారం కానుందా... ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఆలయ, ఘాటు సమీపంలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, స్టాపింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కర్నూలుకు సమీపంలో ఉన్న పుష్కర ఘాటు కావడంతో స్థానిక అధికారులు రోజుకు 40 బస్సులు ప్రత్యేకంగా నడిపేందుకు చర్యలు చేపట్టారు. గత వారం పది రోజుల నుంచి ఇక్కడి అధికారులు తమ సర్వీసులకు స్థలం కేటాయించాలని విన్నపాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. శ్రీశైలంతోపాటు సంగమేశ్వరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులు పూర్తి స్థాయి కాకపోవడం,  దూర ప్రయాణం వంటి కారణాలతో భక్తులు బీచుపల్లికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి బీచుపల్లికి ప్రతి రోజు 40 బస్సులు చొప్పున నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీసీటీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు.
మురుగుతున్న నిధులు:
బీచుపల్లి వద్ద పార్కింగ్‌కు స్థలం కేటాయించకపోవడంతో నిధులు మురుగుతున్నాయి. అక్కడ పలు అభివద్ధి పనులు చేపట్టేందుకు రూ.5లక్షలు మంజూరయ్యాయి.  శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటుతో పాటు పష్కరాలకు వచ్చే భక్తులకు సమాచారాన్ని అందించేందుకు అనౌన్స్‌మెంట్‌ సెంటర్, ముత్ర శాలలు, మరుగదొడ్లు, వలంటీర్లు ఉండే సెంటర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.  బస్సుల సౌకర్యార్థం రోడ్డు చదును, విస్తరణ పనులు చేసుకోవాల్సి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement