ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి.. | ysrcp opposes ap gogvernment RTC Fare hike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి..

Oct 24 2015 1:55 PM | Updated on Aug 20 2018 3:30 PM

ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి.. - Sakshi

ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి..

రాష్ట్రంలో సామాన్యుడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

హైదరాబాద్ : రాష్ట్రంలో సామాన్యుడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో అయిదేళ్ల పాటు ఏ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కారని ఆయన  మండిపడ్డారు.

 

తమ్మినేని శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ  క్రూడాయిల్, డీజిల్ ధరలు తగ్గినా చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా సామాన్యుడి నడ్డి విరిచేలా ఛార్జీలు పెంచారన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ఈ చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఛార్జీలు పెంచి ప్రయివేట్ ఆపరేటర్లకు మార్గం సుగమం చేశారన్నారు. మద్యం రేట్లు తగ్గించి, కుళాయిల్లో మంచినీళ్లకు బదులు నారావారి సారా ఇస్తున్నారని తమ్మినేని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement