‘మా సంస్థకు సంబంధం లేదు’

no relation to our company - Sakshi

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్‌టీసీ)లో నియామకాలు జరుపుతున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు సంస్థ పేరుతో బోగస్‌ నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఆర్టీసీ అధికారులు మేల్కొన్నారు. ఈ నియామక పత్రాలు నిజమైనవి కావు అంటూ గురువారం ఏపీఎస్‌ ఆర్టీసీ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏ. వెంకటేశ్వర రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంతో ఆర్టీసీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.  సంస్థ నిర్ణీత విధివిధానాలతో నోటిఫికేషన్‌ రూపంలో దినపత్రికలలో బహిరంగ ప్రకటన జారీ చేసి నియామక ప్రక్రియ నిర్వహిస్తుందని చెప్పారు.

ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే నియామకాలు జరుగుతాయని, సంస్థ జరిపే నియామకాలలో ఎలాంటి గోప్యత ఉండదన్నారు.  నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించి మోసగాళ్ల వలలో పడవద్దని చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వ్యక్తులు లేదా సంస్థలు, నియామక పత్రాలు జారీ చేస్తున్నవారు తారసపడినా లేదా వారి వివరాలు తెలిసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top