ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు డ్రైవర్, కండెక్టర్ మధ్య మాటామాటా పెరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు.
బస్సులో ఫైటింగ్
May 9 2017 10:49 PM | Updated on Sep 29 2018 5:26 PM
– తన్నుకున్న ఆర్టీసీ కండెక్టర్, డ్రైవరు
– సర్వీసు రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు డ్రైవర్, కండెక్టర్ మధ్య మాటామాటా పెరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. అహోబిలం సర్వీసు బస్సు మంగళవారం మధ్యాహ్నం అహోబిలం నుంచి ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. తిరిగి అహోబిలానికి బయలు దేరే సమయంలో బస్సులో కండెక్టర్, డ్రైవర్లు ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్వీసు నపడటంతో ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, కార్మికులు అడ్డుకున్నారు. అనంతరం వీరు ఉన్నతా«ధికారులకు ఫిర్యాదు చేసుకునేందుకు వెళ్లడంతో ఈ సర్వీసు రద్దయింది. దీంతో నారసింహస్వామి జయంతి మహోత్సవాలకు వెళ్లేందుకు వచ్చే భక్తులు అవస్థలు పడ్డారు. ఈ విషయంపై డీఎం కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా డ్రైవర్, కండెక్టర్ ఘర్షణ పడినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. బస్సు సర్వీసు ఎందుకు రద్దయిందని ప్రశ్నించగా, డ్రైవర్ అనారోగ్యం కారణంగా సర్వీసును నిలిపివేశామన్నారు.
Advertisement
Advertisement