బైక్‌ను ఢీకొట్టిన ఫార్మా కంపెనీ బస్సు... 100 మీటర్లు ఈడ్చుకెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన ఫార్మా కంపెనీ బస్సు... 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..

Aug 23 2023 4:58 AM | Updated on Aug 23 2023 7:47 AM

- - Sakshi

శామీర్‌పేట్‌: ఓ ప్రైవేటు కంపెనీ బస్సు, బైక్‌ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారు అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి బస్సు, బైక్‌ పూర్తిగా దగ్ధమైన ఘటన మంగళవారం జినోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం వరదరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన సంపత్‌ కుమార్‌ గౌడ్‌ బైక్‌పై తుర్కపల్లిలో తను పనిచేసే యూజియా ఫార్మా కంపెనీకి వెళ్తున్నాడు.

ఈ క్రమంలో జైడస్‌ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు కొల్తూర్‌ వైపు నుంచి పోతారం వైపు వెళ్తోంది. కొల్తూర్‌ గ్రామ పరిదిలోకి రాగానే సంపత్‌కుమార్‌ బైక్‌ను అతివేగంగా ఢీకొట్టింది. దీంతో సంపత్‌ కుమార్‌ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు చెలరేగి బస్సుకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో బస్సుకు పూర్తిగా మంటలు వ్యాపించడంతో బైక్‌, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న జినోమ్‌ వ్యాలీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement