మే 3న ఎస్‌డబ్ల్యూఎఫ్ చలో విజయవాడ | On May 3 SWF Chalo Vijayawada | Sakshi
Sakshi News home page

మే 3న ఎస్‌డబ్ల్యూఎఫ్ చలో విజయవాడ

Apr 25 2016 2:24 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఏపీఎస్‌ఆర్టీసీలో సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ మే 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు స్టాఫ్ అండ్ వర్కర్స్

సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీఎస్‌ఆర్టీసీలో సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ మే 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.కె.జిలానీబాషా, సీహెచ్.సుందరయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చే కార్మికులతో కలసి మే 3న ఉదయం 10.30 గంటలకు విజయవాడ ఆర్టీసీ హౌస్ వద్ద ధర్నా చేపడతామని ప్రకటించారు.

ఆర్టీసీలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ప్రైవేటు మందుల షాపుల నుంచి మందులు ఇస్తామని చెప్పడం, అద్దె బస్సుల్లో డ్రైవర్లతో కండక్టర్ విధులు చేయించడం వంటి విధానాలు ఆర్టీసీకి మేలు చేకూర్చేవి కావని వారు పేర్కొన్నారు. ఏడు ప్రధాన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తెచ్చేందుకు ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement