ఏపీఎస్ ఆర్టీసీ పశ్చిమ రీజియన్ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.19 కోట్ల నష్టాలు వచ్చాయని ఆర్టీసీ జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిడదవోలు డిపో రూ.1.28 కోట్లు, నరసాపురం డిపో రూ. 2.36 కోట్లు, ఏలూరు డిపో రూ.2.79 కోట్లు, తాడేపల్లిగూడెం డిపో రూ.3.28 కోట్లు, భీమవరం డిపో రూ.3.15
ఆర్టీసీకి రూ.19 కోట్ల నష్టం
Sep 14 2016 11:13 PM | Updated on Aug 20 2018 3:26 PM
నిడదవోలు : ఏపీఎస్ ఆర్టీసీ పశ్చిమ రీజియన్ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.19 కోట్ల నష్టాలు వచ్చాయని ఆర్టీసీ జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిడదవోలు డిపో రూ.1.28 కోట్లు, నరసాపురం డిపో రూ. 2.36 కోట్లు, ఏలూరు డిపో రూ.2.79 కోట్లు, తాడేపల్లిగూడెం డిపో రూ.3.28 కోట్లు, భీమవరం డిపో రూ.3.15 కోట్లు, కొవ్వూరు డిపో 2.20 కోట్లు, జంగారెడ్డిగూడెం డిపో రూ.1.77 కోట్లు, తణుకు డిపో రూ.2 కోట్ల నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. నష్టాల్లో ఉన్న డిపోల పరిధిలోని ఆయా మేనేజర్లు, అధికారులకు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించడానికి, ఆర్టీసీ లాభలు పొందడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండడానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిపోయిన ఆటోలేనని అభిప్రాయపడ్డారు. నష్టాలు రావడంతో నిడదవోలు నుంచి మచిలీపట్టణం, విజయవాడ ఎక్స్‌ప్రెస్ బస్సులు, నిడదవోలు నుంచి విశాఖపట్టణం డీలక్స్ బస్సును రద్దుచేశామని పేర్కొన్నారు. ప్రతి కిలోమీటరుకు ఆర్టీసీ బస్సుకు రూ.35.56 పైసలు రాబడి రావల్సి ఉండగా.. రూ. 30.30 పైసలు ఆదాయం మాత్రమే వస్తున్నాయని ఆయన వెల్లడించారు. నిడదవోలు డిపో నుంచి ఏలూరుకు డైరెక్ట్ బస్సు సర్వీసును ఏర్పాటుచేయాలని స్థానికులను కోరగా.. ఆమేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డిపో మేనేజర్ సుబ్బారావు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement