State
-
ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. -
‘లేడీ సింగం’ గాలి తీసేశారు!
సాక్షి, బెంగళూరు: ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే 'లేడీ సింగం'గా మహిళా ఐపీఎస్ డి.రూప సోషల్ మీడియాలో చాలా పాపులర్. అయితే రూప చెప్పింది పచ్చి అబద్ధమంటూ తేల్చింది నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (ఎన్బీఎఫ్). ఎన్బీఎఫ్ ఎన్జీఓ సంస్థ తనకు అవార్డు ఇచ్చేందుకు సిద్ధమైనా తిరస్కరించినట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు రూప. అవార్డు స్వీకరించినలేనని ఫౌండేషన్ సీఈవో ఎన్బీఎఫ్ శ్రీధర్ శెట్టికి ఆమె లేఖ రాయడం నిజం కాదని యాజమాన్యం వెల్లడించింది. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాము ఐపీఎస్ రూపకు అవార్డు ప్రకటించలేదన్నారు. అలాంటిది ఎన్బీఎఫ్ ఇచ్చే అవార్డును స్వీకరించనంటూ ఆమె ఎలా ప్రకటన చేస్తారంటూ మండిపడ్డారు. అవార్డు స్వీకరించలేనని చెప్పిన రూప.. ఆ అవార్డు తనకు దక్కించుకునేందుకు జ్యూరీ సభ్యులు, ఎన్బీఎఫ్ బృందం, ట్రస్టీలతో పలుమార్లు చర్యలు జరిపారని ఆ సంస్థ వెల్లడించడంతో 'లేడీ సింగం' వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ చరిత్రలో అవార్డు కోసం ఓ నామినీ ఇలా ప్రలోభాలకు పాల్పడటం, జ్యూరీ సభ్యులు, ఎన్బీఎఫ్ బృందంతో చర్చలు జరపడం తొలిసారి చూస్తున్నామని పెదవి విరవడం గమనార్హం. అవార్డు ప్రకటించకున్నా 'లేడీ సింగం' లేఖ ఇటీవల ఐపీఎస్ రూప లేఖ రాయడమే వివాదానికి కారణమైంది. ‘ ఎన్బీఎఫ్ అవార్డుకు నా పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ అవార్డు స్వీకరించేందుకు నా మనస్సాక్షి ఒప్పకోవడం లేదు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వ అధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే ప్రజల మనసులో మచ్చలేని అధికారులుగా ఉంటారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నా అవార్డు అంశం రాజకీయం కావటం నాకు ఇష్టం లేదని’ లేఖలో రూప పేర్కొన్నారు. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఐదు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగిరీ కోసం కోసం 8 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో ఐజీ (హోమ్‌గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్) రూప పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఆ జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరడంతో ఫౌండేషన్ సిబ్బంది ఐపీఎస్ రూప చెప్పింది పచ్చి అబద్ధాలని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు రాజభోగాలను బయటపెట్టి రూప వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
కిరాతకుడికి మహిళా కోర్టు మరణశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన కన్న తల్లిని, ఆరేళ్ల చిన్నారిని అమానుషంగా హతమార్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దశ్వంత్ (24)కు తమిళనాడులోని మహిళా కోర్టు మరణదండన విధించింది. చిన్నారిపై అత్యాచారం చేసి సజీవంగా తగలబెట్టినట్లు, డబ్బు ఇవ్వలేదని తల్లినే హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో చెంగల్పట్టు మహిళా కోర్టు నిందితునికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు సోమవారం తీర్పు వెల్లడించింది. చెన్నై శివారులోని కున్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్ తల్లిదండ్రులతో కలసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో బాబు అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. బాబు కుమార్తె హాసిని (6)ని దశ్వంత్ గతేడాది ఫిబ్రవరి 5న ఇంటికి సమీపంలోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని సజీవదహనం చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గతేడాది ఫిబ్రవరి 7న దశ్వంత్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబరు 13న అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. జులాయి తిరుగుళ్లకు అలవాటుపడ్డ దశ్వంత్ డబ్బు కోసం తల్లితో గొడవపడేవాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో డిసెంబర్ 2న తల్లిని దారుణంగా హత్యచేసి ఆమె మెడలోని 25 తులాల బంగారు నగలు, బీరువాలోని రూ. 10 వేల నగదు తీసుకుని తమిళనాడు నుంచి పరారయ్యాడు. డిసెంబర్ 8న ముంబైలో తమిళనాడు పోలీసులకు పట్టుబడగా, నిందితుడిని చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో దశ్వంత్ చేసిన నేరాలు సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణశిక్ష విధిస్తున్నట్లు చెంగల్పట్టు మహిళా కోర్టు న్యాయమూర్తి వేల్మురుగన్ సోమవారం తీర్పు చెప్పారు. -
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
నెలన్నరగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మానందరెడ్డిసాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొల్లం బ్రహ్మానందరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన త్వరలో కోలుకుంటారని, పూర్వపు ఉత్సాహంతో ప్రజాసేవలో అడుగుపెడతారని బంధువులకు జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మాజీ మండలాధ్యక్షుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అయిన బ్రహ్మానందరెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతగా కొనసాగుతున్నారు. ఆరోగ్య సమస్యలతో నెలన్నర రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆయన్ను పరామర్శించారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్దిరెpsrడ్డి మిథున్‌రెడ్డి, వి.వరప్రసాదరావు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సైతం జగన్ వెంట వెళ్లి బ్రహ్మానందరెడ్డిని పరామర్శించారు. పార్టీ నేత బ్రహ్మానందరెడ్డిని పరామర్శించే నిమిత్తం సోమవారం చెన్నైకి వచ్చిన జగన్మోహన్రెడ్డికి తమిళనాడు జనం బ్రహ్మరథం పట్టారు.నేడు నెల్లూరుకు వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: బాణసంచా యూనిట్ దగ్ధమై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు నెల్లూరుకు వెళుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
డార్జిలింగ్/గువాహటి/న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన దరిమిలా గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వతప్రాంతంలో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవధిక బంద్ బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. డార్జిలింగ్, కలింపాంగ్, మిరిక్, సుఖిపొక్రీ, కుర్సియాంగ్ తదితర పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. కేంద్రం నుంచి చేరుకున్న ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఒకవైపు బంద్ కొనసాగుతుండగా, మరోవైపు పోలీసులు పాత కేసులకు సంబంధించి అరెస్టులు సాగిస్తున్నారు. జీజేఎంలోని గూర్ఖాలాండ్ పర్సనల్ (జీఎల్పీ) విభాగానికి చెందిన 32 మందిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 143కు చేరుకుంది. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీకి ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఉద్యమకారులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. కర్బీ-ఆంగ్లాంగ్‌లో కర్ఫ్యూ సడలింపు అస్సాంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూను సడలించారు. కర్బీ-ఆంగ్లాంగ్, బోడోలాండ్, కామ్తాపూర్ రా ష్ట్రాల డిమాండుతో అస్సాంలో వివిధ సంస్థ లు, పార్టీల నేతృత్వంలో రెండు రోజులు కొనసాగిన బంద్‌లు బుధవారం ముగిశా యి. మరోవైపు బోడో నాయకులు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌ను కలుసుకుని, తమ డిమాండ్‌ను వినిపించారు. తమ డిమాండు పై ఉన్నతస్థాయిలో చర్చించనున్నట్లు ప్ర ధాని హామీఇచ్చారని చెప్పారు. ఈ అంశం పై బాధ్యతలను హోంమంత్రి షిండేకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వీసా ఆన్ ఎరైవల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో విదేశీ పర్యాటకులకు అందిస్తున్న వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని మరో నాలుగు నగరాల్లోని ఎయిర్‌పోర్టులకు విస్తరించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఆగస్టు 15 నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులలోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ సహా 11 దేశాల పర్యాటకులు ఈ సదుపాయాన్ని పొందేందుకు అర్హులని చెప్పారు. -
‘ఆధార్’తో వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ పిటిషన్
న్యూఢిల్లీ: ఆధార్ పథకం అమలును సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి బుధవారం ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆధార్ పథకం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతుందంటూ దాఖలైన పిటిషన్‌పై నవంబరు 6 లోగా స్పందించాలంటూ నోటీసుల్లో కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రణాళికా శాఖ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఆధార్ సంఖ్య కేటాయించేందుకు వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ సమాచారం సేకరించడం ఆందోళనకరమని మానవ హక్కుల కార్యకర్త ఇందు ప్రకాశ్ సింగ్‌తో కలిసి బేఘర్ మజ్దూర్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పిటిషన్ దాఖలుచేసింది. -
ఉభయ సభల్లో సమైక్యాంధ్ర హోరు
మూడో రోజూ సభను అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వరుసగా మూడో రోజూ పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు. బుధవారం ఉదయం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, ఎస్.పి.వై.రెడ్డిలు రెండవ వరుస స్థానాల్లో నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఆ తర్వాత మధ్యాహ్నం మా త్రం వీరు సభామధ్యంలోకి దూసుకెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సభామధ్యంలోకి వెళ్లి పాలకపార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కల్గించవద్దన్న సోనియా గాంధీ సూచన మేరకు ఆమె సభలో ఉన్నంతసేపూ రెండవ వరుసలోని స్థానాలలోనే నిలబడి నిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యులు ఆ తర్వాత పోడియం వద్దకెళ్లి గందరగోళం సృష్టించారు. వీరితోపాటు టీడీపీ సభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణరావు, శివప్రసాద్‌లు సభ ప్రారంభమైనప్పటి నుంచీ సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో సోనియా, ప్రధాని మన్మోహన్సింగ్ల స్థానాల వద్దకు వచ్చి రాష్ట్రాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారంటూ ప్రధానిని ప్రశ్నించేందుకు యత్నించారు. దీంతో సోనియా వారిపై కొంత చికాకును ప్రదర్శించి ప్రతిపక్ష బెంచీల వైపు వెళ్లాలని సైగలు చేశారు. కాగా, రాజ్యసభలో టీడీపీ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ నిరసన వ్యక్తంచేశారు. -
రేషన్ చక్కెరకు రెక్కలు!
న్యూఢిల్లీ: చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న చక్కెర ధర పెరిగే అవకాశముంది. దీని రిటైల్ ధరను పెంచుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు కేంద్ర ఆహార మం త్రిత్వ శాఖ.. కేబినెట్ పరిశీలన కోసం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఆ శాఖ మంత్రి కేవీ థామస్ బుధవారమిక్కడ ఈ సంగతి వెల్లడించారు. చక్కెర సేకరణ ధర ఎక్కువగా ఉంది కనుక ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇచ్చే చక్కెర ధరను పెంచాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రితో చర్చించానని, కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. చక్కెర ధరను కేజీకి గరిష్టంగా రూపాయి పెంచాలని ఆహార శాఖ ప్రతిపాదించినట్లు సమచారం. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35-40 పలుకుతున్న చక్కెరను రేషన్ షాపుల్లో పదేళ్లుగా రూ.13.50కి అందజేస్తున్నారు. ఈ ఏడాది మేలో చెక్కర ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసిన కేంద్రం ఈ నెల నుంచి రాష్ట్రాలు పీడీఎస్ కోసం చక్కెరను బహిరంగ మార్కెట్ల నుంచి సేకరించాలని పేర్కొంది. కేజీకి రూ.18.50 మాత్రమే సబ్సిడీ ఇస్తామని స్పష్టం చేసింది. -
‘అనర్హత’ తీర్పును అమలు చేయండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసుల్లో దోషులుగా తేలిన రోజు నుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు ప్రారంభించింది. ‘సుప్రీం’ ఆదేశాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. తీర్పు వచ్చిన తర్వాత దోషులుగా తేలి, జైలుశిక్ష, జరిమానా పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారం తక్షణమే అనర్హులవుతారని, వారి సీటు ఖాళీ అవుతుందని స్పష్టం చేసింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పేర్లను తమకు పంపాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన పాలనాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల కోర్టుల్లో దోషులుగా తేలే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలతో కూడిన నివేదికను ప్రతి నెలా 15 నాటికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా తమకు అందజేయాలని సూచించింది. ఈ కేసుల పర్యవేక్షణ కోసం సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఇలాంటి కేసుల సమాచారాన్ని చట్టసభల అధిపతులకు(స్పీకర్/చైర్మన్), తమకు వెంటనే తెలియజేయడానికి ఈ యంత్రాంగం అవసరమని పేర్కొంది. ఇందులో అడ్వొకేట్ జనరల్/ప్రాసిక్యూషన్ డెరైక్టరేట్, తదితరాలను భాగం చేయాలని సూచించింది. -
పినాక రాకెట్ల పరీక్ష విజయవంతం
బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను బుధవారం ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. బాలసోర్‌కు సమీపంలోని చాందీపూర్ తీరం వద్దనున్న స్థావరం నుంచి మల్టీబ్యారెల్ రాకెట్ లాంఛర్ ద్వారా రెండు రౌండ్ల పినాకా రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఈ ప్రయోగాలు జరిపినట్లు పేర్కొన్నాయి. 1995 నుంచి వివిధ క్లిష్ట పరీక్షలను అధిగమించిన పినాకా రాకెట్లను ఇప్పటికే సైన్యం వాడుతోంది. ఈ ఏడాది జూలైలో అధునాతన పినాకా మార్క్-2 మల్టీబ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పరీక్షలను పశ్చిమ రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో జరిపినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే ఈ ఆధునిక రాకెట్లను సైన్యంలోకి చేరుస్తామన్నారు. శతఘు్నలకు సహాయకంగా 40 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని అభివృద్ధి చేశారు. -
పార్లమెంటులో ‘పాక్ మంటలు’
రెండోరోజూ స్తంభించిన ఉభయ సభలు పాక్ సైన్యం కాల్పులపై ఆంటోనీ ప్రకటన దుమారం న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: పూంచ్‌లో పాక్ సైన్యం కాల్పులకు సంబంధించి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చేసిన ప్రకటనతో చెలరేగిన దుమారం బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. పాక్ సైన్యానికి రక్షణ మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆయన క్షమాపణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాంటి ముఖ్యమైన అంశాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు కొందరు ఉగ్రవాదులతో కలిసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సైనిక యూనిఫామ్‌లో ఉన్న కొందరితో కలిసి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ఆంటోనీ చేసిన ప్రకటనపై మంగళవారం నాడే ఉభయ సభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. బుధవారం రాజ్యసభలో మాట్లాడిన రక్షణ మంత్రి తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ప్రకటన చేశానని చెప్పారు. జమ్మూ వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ తిరిగొచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు లభించినట్టయితే మరోమారు సభకు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు విమర్శల దాడిని కొనసాగించారు. తప్పుడు ప్రకటన చేసినందుకు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వాళ్లు (పాక్ సైన్యం) చంపడానికొస్తే మన రక్షణ మంత్రి వారి ప్రమేయం లేదంటున్నారు..’ అని షేమ్ షేమ్ అనే కేకల మధ్య సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. దాడిలో పాక్ సైనికుల ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు: జమ్మూలో సైన్యం రూపొందించిన ప్రకటనకు రక్షణ మంత్రి ప్రకటన విరుద్ధంగా ఉందంటూ బీజేపీ సభ్యులు అంతకుముందు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంటోనీ మార్పు చేసిన ఆర్మీ ప్రకటనను తీసుకువచ్చారంటూ.. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ రెండు సభల్లోనూ హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చింది. పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ లోక్‌సభలో ఆ పార్టీ నేత యశ్వంత్‌సిన్హా నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేశ నైతికతను దిగజార్చిందంటూ మండిపడ్డారు. ఆర్మీ ప్రకటనలో రక్షణమంత్రి మార్పులెందుకు చేశారని ప్రశ్నించారు. లోక్‌సభ మొదటిసారి వాయిదాపడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను కలిసిన బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. ఆర్మీ, ఆంటోనీ పరస్పర విరుద్ధ ప్రకటనలపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అద్వానీ.. ఆంటోనీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్‌నాధ్ ఆంటోనీకి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రక్షణ మంత్రి ప్రకటన చేశారని విలేకరులతో చెప్పా రు. కాంగ్రెస్ కూడా ఆంటోనీకి దన్నుగా నిలి చింది. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ ప్రతినిధి పి.సి.చాకో అన్నారు. పొరుగుదేశంతో ఉన్న వివాదాలకు చర్చలే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రధానితో ఆంటోనీ భేటీ: పూంచ్ మరణాలపై తాను చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో.. ఆంటోనీ ప్రధాని మన్మోహన్‌తో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిపై వివరణ ఇచ్చారు. అయితే పాక్ కాల్పులపై రక్షణ శాఖ రూపొందించిన నోట్లో 13 మంది ఉగ్రవాదులకు సంబంధించిన ప్రస్తావనను తొలగించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, పాక్ మిలటరీ ఉన్నతాధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నారు. పరిహారం వద్దు: జవాను భార్య పాట్నా: పాక్ దళాల కాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాను భార్య బీహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల నష్టపరిహారాన్ని నిరాకరించారు. అందుకు బదులుగా పాక్‌పై సైనిక చర్య జరపాలని డిమాండ్ చేశారు. ‘రూ.10 లక్షల పరిహారం నా భర్తను తిరిగి తీసుకురాగలదా? మాకు పరిహారం వద్దు. నా భర్త సహా ఇతర జవాన్లను చంపినందుకు సైన్యం పాక్‌కు దీటైన జవాబివ్వాలి’ అని అమర జవాను విజయ్రాయ్ భార్య పుష్పారాయ్ అన్నారు. -
సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడికి పోతోంది. చెన్నైలోని తెలుగువారు సైతం ఉద్యమబాట పట్టారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో బుధవారం నిరాహారదీక్ష జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించిన చోట వెలసిన స్మారక మందిరంలోని ఆయన విగ్రహానికి ముందుగా నివాళులర్పించారు. తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ ప్రసంగించారు. ఒక మంచికి, మరో చెడ్డకు సైతం తెలుగువారే ముందుండి నిలిచారని అన్నారు. ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు కావడం అదృష్టమన్నారు. ఒకే భాషను మాట్లాడుకునే వారికి రెండు రాష్ట్రాలు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పకిలిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ తెలుగువారే కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. నిరాహారదీక్షలు చేస్తే చాలు ప్రత్యేక రాష్ట్రాలు వస్తాయనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం దేశానికి చాటిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సమష్టికృషిగా ఆయన అభివర్ణించారు. విభజన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలే విభేదిస్తున్నారని పేర్కొన్నారు. అర్థం లేని డిమాండ్ నిరాహారదీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వీరికి కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లోనే అర్థం లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు చేపడితే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో విశ్లేషించుకుని దానిపై దృష్టి సారించాలన్నారు. అలా చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోరడం అవివేకమని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య 30 లక్షలు దాటిందన్నారు. ఈ రెండు ప్రాంతాల వారే లేకుంటే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకుంటే తెలంగాణకు గుర్తింపే లేదని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్య వంటివి ఏర్పడగలవని ఏనాడో రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. అనంతరం ఘంటసాల రత్నకుమార్ మాట్లాడారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి చెన్నైలోని తెలుగువారు మద్దతు పలకడం కనీస కర్తవ్యమని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారని రంగనాయకులు అన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్‌ను కొందరి స్వార్థం కోసం విభజించరాదని ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. విదేశీవనితగా భారత్‌లోకి అడుగుపెట్టిన సోనియాగాంధీకి ఆంధ్రప్రదేశ్ విలువ గురించి ఏమి తెలుసని కృష్ణారావు విమర్శించారు. విభజన ద్రోహులకు, సమైకాంధ్ర ఉద్యమకారులకు తెలుగు సంఘాల వారు ప్రకటించిన అవార్డులను ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులురెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.నారాయణ గుప్త, స్మారక మందిరం కార్యదర్శి రామకృష్ణ, ఆస్కా ట్రస్టీలు ఎరుకలయ్య, విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న కారు ...ఐదుగురి దుర్మరణం
హొసూరు, న్యూస్‌లైన్: క్రిష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద బుధవారం తెల్లవారు జామున కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి అతివేగం కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. పోచంపల్లి సమీపంలోని అమ్మన్ఆలయ ప్రాంతానికి చెందిన కాట్టురాజా (45), తేని జిల్లాలోని కరుప్పుస్వామి ఆలయంలో మొక్కుబడి తీర్చునేందుకు తమ కుటుంబ సభ్యులతోపాటు అతని తన భార్య స్నేహితురాలు సెందామరైతో కలసి కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ లేకపోవడంతో, త్వరగా ఆలయానికి వెళ్లి, చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలని కాట్టురాజా కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాట్టురాజా (45), అతని భార్య మలర్విళి (40), అత్తయ్య పద్మ (55) స్నేహితులు రాజేంద్రన్ (43), పళణి (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన కాట్టురాజా కొడుకు వసంత్ (7), కూతురు వశీక (15), సెందామరై (40)లను స్థానికులు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. వెనుక సీట్లో కూర్చొవడం వల్ల కాట్టురాజా కొడుకు, కూతురు, సెందామరై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. పోచంపల్లి ఇన్స్పెక్టర్ మురుగన్, బారూరు ఇన్స్పెక్టర్ మురుగేశన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు
సాక్షి, బళ్లారి : వందలాది మంది సిబ్బంది, అధికారులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. మరో వైపు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో పనుల నిమిత్తం వచ్చే వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బళ్లారి రాయల్ సర్కిల్ సమీపంలో రోడ్డుకు ఇటు వైపున జిల్లాధికారి కార్యాలయం, అటు వైపున తహసీల్దార్ కార్యాలయం ఉంది. జిల్లాధికారి కార్యాలయం ఆవరణలో రెవెన్యూ, సర్వే, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల ఫోరం, ట్రెజరీ తదితర 16 శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు నిత్యం వేలాది మంది ఇక్కడకు వస్తుంటారు. సమస్యల పరిష్కారానికి ఆందోళనకారులు నిత్యం ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంటారు. ఇంతటి రద్దీ కార్యాలయంలో కనీసం మంచినీరు లభించదు. గతంలో ఇక్కడ రెండు చిన్న హోటల్స్ ఉండేవి. వాటిని తొలగించడంతో గత్యంతరం లేక ప్రజలు రోడ్డుపైకి చేరుకొని దాహం తీర్చుకుంటున్నారు. ఇక ఆహార పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పరిశుభ్రత మచ్చుకైనా కనిపించదు. జిల్లాధికారి కార్యాలయ ఆవరణ మొత్తం బురదమయమే. వర్షాకాలంలో పరిస్థితి వర్ణాణాతీతం. నీరు నిల్వ ఉంటూ దోమలు స్వైర విహారం చేస్తుంటాయి. దశాబ్దాలుగా ఈ పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారు లేరు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలోనూ ఇదే తరహా సమస్యలు నెలకొన్నాయి.ఇక్కడ వ్యవవసాయ, ఉద్యానవన, ట్రాఫిక్, రూరల్ తదితర 10 శాఖల ముఖ్య కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చెత్తా చెదారం పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. వర్షాకాలంలో ఆవరణ బురదమయంగా ఉండటంతో పనులపై వచ్చే రైతులు, నగరప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాల్లో మంచినీరు తదితర వసుతులు కల్పించడంతోపాటు ఆవరణల్లో అంతర్గత రహదారులు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చెరువుల పునరుద్ధరణ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల చెరువులకు గాను తొలి దశలో 12 వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. దీనికి ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని చెప్పారు. గ్రామీణ చెరువుల పునరుద్ధరణపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విధాన సౌధలో ఏర్పాటు చేసినవర్క్షాపులో ఆయన ప్రసంగించారు. అన్ని చెరువులను ఒకే సారి పునరుద్ధరించడం సాధ్యం కాదన్నారు. కనుక దశలవారీ చేపడతామన్నారు. చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తుందని తెలిపారు. కనుక పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. సుమారు 4,500 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై సర్వే చేయించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. చెరువుల అభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. వర్క్‌షాపునకు అధ్యక్షత వహించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో 12 వేల చెరువుల పునరుద్ధరణను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున చెరువులను పునరుద్ధరించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు నడుం బిగించాలని కోరారు. దీనికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. పర్యావరణవేత్త యల్లప్ప రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని న్యూయార్క్‌లో శుద్ధమైన తాగు నీటి సరఫరా వ్యవస్థ ఉందన్నారు. అలాంటి వ్యవస్థ మరెక్కడా లేదన్నారు. మనం నది నీటిని వాడుతున్నప్పటికీ రెండు వారాలకోసారి పర్యావరణం, వాతావరణంలో మార్పు జరుగుతూనే ఉందని, దీని ప్రభావం నీటిపై ఉంటుందని ఆయన అన్నారు. -
విభజన ఆపుతూ త్వరలో ప్రకటన: లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: విభజనపై సీమాంధ్ర ప్రజల అభ్యర్థనలను పరిశీలించేవరకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తమకు అధిష్టానం సంకేతాలిచ్చిందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుధవారం ప్రకటించారు. ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీవూంధ్ర ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆ ప్రాంత నేతలు లగడపాటి ఇంట్లో సమావేశమై మరోమారు చర్చించారు. ఓ వైపు తెలంగాణపై వెనక్కి వెళ్లేది లేదని పార్టీ పెద్దలు స్పష్టం చేస్తుండటం, మరోవైపు పదవులకు రాజీనామాలు చేసి ఆందోళనలో పాల్గొనాలని ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వారంతా ఆయోమయంలో పడ్డారు. భేటీకి ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, హర్షకుమార్‌తో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, శైలజానాథ్‌లు హాజరయ్యారు. -
అధిష్టానానికి.. ఫిర్యాదుల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి పల్లంరాజుపై టీ-ఎంపీలు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై పల్లంరాజు, జేడీ శీలం, రేణుకా చౌదరిలపై గోవర్ధన్‌రెడ్డి సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బుధవారం లోక్‌సభ మొదటిసారి వాయిదా పడిన తర్వాత సభలో సోనియా గాంధీతో కేంద్రమంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు అక్కడకు చేరుకున్నారు. ఆంటోనీ కమిటీ పని పూర్తయ్యేంతవరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని పల్లంరాజు వెల్లడించినట్లు ప్రచురించిన ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. విభజనతో సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలను పరిశీలించి పరిష్కారాలు కనుగొనేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీ నివేదిక వచ్చాకే ప్రభుత్వంలో అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మాత్రమే తాను విలేకరులకు చెప్పినట్లు సోనియాకు పల్లంరాజు వివరించినట్లు తెలిసింది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రులతో సహా సీమాంధ్రవాసులంతా తెలంగాణ నుండి వెళ్లిపోవాల్సిందేనని సీనియర్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలు కూడా సోనియా వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలిసింది. పాల్వాయి అలా మాట్లాడడం తప్పేనని అభిప్రాయపడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను ఆయనతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ ఆపొద్దు.. వేగం పెంచండి: టీ-ఎంపీలు సీమాంధ్ర ప్రజల అభ్యర్థనల పరిశీలన పూర్తయ్యేవరకు రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని సీమాంధ్ర నేతలు ప్రచారం చేస్తున్న దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత ఎంపీలంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలకు మద్దతుగా వ్యవహరించిన జేడీ శీలం, రేణుకాచౌదరిలపై అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. -
జగతి ఎఫ్‌డీల కేసు విచారణ 27కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీలు)ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడానికి సంబంధించిన కేసులో పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చేపట్టిన విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈడీ లేవనెత్తిన పలు అంశాలపై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత వ్యవధి కావాలని ఈ సందర్భంగా జగతి తరఫు న్యాయవాది రవిగుప్తా అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన రామమూర్తి.. ఇరుపక్షాల న్యాయవాదులను సంప్రదించిన అనంతరం ఈ నెల 27కి విచారణను వాయిదావేశారు. -
హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
తిరుత్తణి, న్యూస్‌లైన్: తిరుత్తణి పెద్దవీధికి చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ తిరువళ్లూరు పడమర జిల్లా సహాయ కార్యదర్శి పసుంపొన్‌రాజా హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పసుం పొన్‌రాజా భార్య శరణ్య. పెళ్లికి ముందే ఈమె తిరుత్తణి నెహ్రూనగర్ ఆచారి వీధికి చెందిన శశికుమార్ (35)తో ప్రేమకలాపాలు సాగించింది. శశికుమార్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈమెకు వేరొకరితో పెళ్లి అయిన తర్వాత కూడా శశికుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త పసుంపొన్‌రాజా శరణ్యను మందలించాడు. కక్ష కట్టిన శరణ్య, శశికుమార్‌తో కలసి భర్తను హతమార్చడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో శశికుమార్ స్థానిక ఇంద్రానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్లు నాగరాజు (27), సుకుమారన్ సహాయాన్ని తీసుకున్నాడు. పసుంపొన్‌రాజా వ్యాపార విషయంగా అగూర్ ప్రాంతానికి వెళ్లి బైక్‌లో వస్తుండగా పసుంపొన్ రాజాను హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్, నాగరాజు, శరణ్యను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను తిరుత్తణి కోర్టులో హాజరు పరచి, పుళల్ జైలుకు తరలించారు. -
ఆంగ్లం మాకొద్దని తమిళ సంఘాల నిరసన
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల తరగతులకు వ్యతిరేకంగా తమిళ సంఘాలు గళం విప్పాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ ముట్టడికి బుధవారం యత్నించాయి. పలువురి ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షి, చెన్నై: నిర్బంధ విద్యా విధానం పేరుతో గత డీఎంకే ప్రభుత్వం విద్యా వ్యవస్థను తమిళమయం చేసింది. ఈ నిర్ణయం ఇతర భాషల విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత విద్యా వ్యవస్థలో ఆంగ్లానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రరుువేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆంగ్ల తరగతుల సంఖ్య పెంచేందుకు సిద్ధమయ్యూరు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో ఆంగ్లం తప్పని సరిచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరుుతే విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో తమిళం, ఆంగ్లంలో పరీక్షలు రాసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో ఆంగ్ల తరగతుల సంఖ్య పెంచే పనిలో పడ్డారు. ఈ పనులను విద్యాశాఖ వేగవంతం చేయడంతో తమిళాభిమాన సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం సచివాలయ ముట్టడికి నిర్ణయించాయి. సచివాలయ ముట్టడి యత్నం తమిళాభిమాన సంఘాలు, తమిళాభిమాన రాజకీయ పార్టీల నేతృత్వంలో బుధవారం ఉదయం చెన్నైలోని మన్రో విగ్రహం వద్ద తమిళ ప్రేమికులు గుమిగూడారు. ఆంగ్లం వద్దు, తమిళమే ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. సంఘాలు, ఎండీఎంకే, తమిళర్ వాల్ ఉరిమై కట్చి నేతలు హనీఫా, మణి అరసన్, మల్లై సత్య, వేల్ మురుగన్, వేణుగోపాల్ మాట్లాడారు. మాతృభాష మీద ప్రభావం చూపించే విధంగా ప్రభుత్వం ఆంగ్లానికి పెద్దపీట వేస్తోందని ధ్వజమెత్తారు. తమిళ విద్యా విధానాన్ని పట్టించుకోకుండా ఆంగ్లానికి కోట్లు వెచ్చించడం బాధాకరమన్నారు. ఆంగ్ల తరగతుల ఏర్పాటు ప్రక్రియ ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం తమిళాభిమానులు ర్యాలీగా సచివాలయం వైపు దూసుకెళ్లారు. వీరి ర్యాలీకి అనుమతి లేని దృష్ట్యా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించిన తమిళాభిమానుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చివరకు అందరినీ అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
కేంద్రం తీరుపై మండిపాటు ‘సమైక్య’ దీక్ష
ప్రాణాలు అర్పించైనా సరే సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటామని తమిళనాడులోని తెలుగు సంఘాలు శపథం చేశాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా తెలుగు సంఘాలు చెన్నైలో బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండి పడ్డాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడికి పోతోంది. చెన్నైలోని తెలుగువారు సైతం ఉద్యమబాట పట్టారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో బుధవారం నిరాహారదీక్ష జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించిన చోట వెలసిన స్మారక మందిరంలోని ఆయన విగ్రహానికి ముందుగా నివాళులర్పించా రు. తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ ప్రసంగించారు. ఒక మంచికి, మరో చెడ్డకు సైతం తెలుగువారే ముందుండి నిలిచారని అన్నారు. ఆనాడు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు కావడం అదృష్టమన్నారు. ఒకే భాషను మాట్లాడుకునే వారికి రెండు రాష్ట్రాలు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పలికిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ తెలుగువారే కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. నిరాహారదీక్షలు చేస్తే చాలు ప్రత్యేక రాష్ట్రాలు వస్తాయనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం దేశానికి చాటిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సమష్టికృషిగా ఆయన అభివర్ణించారు. విభజన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలే విభేదిస్తున్నారని పేర్కొన్నారు. అర్థం లేని డిమాండ్ నిరాహారదీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వీరికి కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లోనే అర్థం లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు చేపడితే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో విశ్లేషించుకుని దానిపై దృష్టి సారించాలన్నారు. అలా చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోరడం అవివేకమని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య 30 లక్షలు దాటిందన్నారు. ఈ రెండు ప్రాంతాల వారే లేకుంటే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకుంటే తెలంగాణకు గుర్తింపే లేదని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్య వంటివి ఏర్పడగలవని ఏనాడో రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. అనంతరం ఘంటసాల రత్నకుమార్ మాట్లాడారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి చెన్నైలోని తెలుగువారు మద్దతు పలకడం కనీస కర్తవ్యమని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారని రంగనాయకులు అన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్‌ను కొందరి స్వార్థం కోసం విభజించరాదని ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. విదేశీవనితగా భారత్‌లోకి అడుగుపెట్టిన సోనియాగాంధీకి ఆంధ్రప్రదేశ్ విలువ గురించి ఏమి తెలుసని కృష్ణారావు విమర్శించారు. విభజన ద్రోహులకు, సమైకాంధ్ర ఉద్యమకారులకు తెలుగు సంఘాల వారు ప్రకటించిన అవార్డులను ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులురెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.నారాయణ గుప్త, స్మారక మందిరం కార్యదర్శి రామకృష్ణ, ఆస్కా ట్రస్టీలు ఎరుకలయ్య, విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువుతో పోరాడి కోలీ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: సీమాపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా బరిలో ఉన్న సంతోష్ కోలీ బుధవారం ఉదయం మరణించారు. జూన్ 30న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ కోలీ తలకు తీవ్ర దెబ్బ తగలడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి మెదడులో రక్తం గడ్డకట్టడం(బ్రెయిన్ హేమరేజ్)తో పరిస్థితి విషమించింది. ఆమె ఉదయం గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో ఆప్ కార్యకర్తలు పలువురు గుర్గావ్లోని ఆసుపత్రిలోనే ఉన్నారు. సంతోష్ కోలీ మరణం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి లభించాలని కోరుతూ ఆమె పోరాటాన్ని తాము కొనసాగిస్తామన్నారు. ఈశాన్య ఢిల్లీలోని ఓ పేద కుటుంబానికి చెందిన సంతోష్ 2002 నుంచి కేజ్రీవాల్‌తో కలిసి ఆయన సారథ్యంలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేశారు. ప్రజాదరణ కలిగిన సంతోష్ ఆమ్ ఆద్మీ పార్టీ వీధులలో నిర్వహించే ప్రదర్శనలకు జనాలను సమీకరించేవారు. అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరాహార దీక్ష నిర్వహించిన సమయంలో ఆయన సుందర్ నగరీలోని కోలీ ఇంట్లోనే ఉన్నారు. కోలీ తండ్రి దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే సంతోష్ కోలీ పని తీరును గుర్తించిన ఆమ్ ఆద్మీ పార్టీ సీమాపురి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన తరువాత సంతోష్‌కు ఎన్నికలలో పోటీచేయరాదని ఫోన్లో బెదిరిం పులు వచ్చాయని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే జూన్ 30 సాయంత్రం పార్టీ సభ్యుడైన కుల్దీప్తో కలిసి బుల్లెట్‌పై వెళుతుండగా కౌశంబీ మెట్రో స్టేషన్ వద్దనున్న పసిఫిక్మాల్ ఎదురుగా ఎరుపు రంగు ఎస్యూవీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీని తాకిడికి బుల్లెట్లో మంటలు కూడా చెలరేగాయి. సంతోష్ మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో 37 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సంతోష్ కన్నుమూశారు. ప్రమాదంపై అనుమానాలు సంతోష్ కోలీకి జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆప్ పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అంటున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రమాదతీరు కారణంగా పోలీసులు కూడా గుర్తుతెలియని వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేశారు. అయితే ఇప్పటివరకు నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. సంతోష్‌కు జరిగింది మామూలు రోడ్డు ప్రమాదం కాదని, అది ఆమె ప్రాణాలు తీయడం కోసం జరిగిన దాడి అని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. సంతోష్‌ను చంపాలన్న కుట్రతోనే ఆమె వాహనాన్ని ఢీకొట్టారని అన్నారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని కూడా ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే తనను బెదిరించినట్లు సంతోష్ తెలిపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్‌పై పథకం ప్రకారం దాడి జరిగిందని మరొక నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. దీనిపై ఆప్ నేతలు లింక్ రోడ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశారు. -
పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు భారతీయ సైనికులను చంపినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం చాణక్యపురిలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కార్యకర్తలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను ఎక్కి అత్యధిక భద్రతా జోన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే వీరిని చెదరగొట్టడం కోసం పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. వీరిలో 170 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. అలాగే నయాదౌర్ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు సైనికులను చంపడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ హైకమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నివాసం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు భారతీయ సైనికులను చంపినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం చాణక్యపురిలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కార్యకర్తలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను ఎక్కి అత్యధిక భద్రతా జోన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే వీరిని చెదరగొట్టడం కోసం పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. వీరిలో 170 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. అలాగే నయాదౌర్ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు సైనికులను చంపడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ హైకమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నివాసం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
నవంబర్లోనే ‘ముఖ్య’నేత ఖరారు
న్యూఢిల్లీ: పదిహేనేళ్లు అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. ఈ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు అంటే నవంబర్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కారీ బుధవారం విలేకరులకు తెలిపారు. సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ముఖ్య పదవికి ఢిల్లీ బీజేపీశాఖ మాజీ అధ్యక్షుడు హర్షవర్ధన్ పాటిల్‌ను ప్రకటిస్తారన్న విలేకరుల ప్రశ్నకు గడ్కారీ సమాధానమిస్తూ ఇప్పటివరకు ఎవరి పేరును ఖరారు చేయలేదన్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు సన్నిహితంగా ఉండటంతో పాటు అవినీతి ఆరోపణలు లేని అందరికీ ఆమోదయోగ్యుడైన వర్ధన్ పేరు పరిశీలనకు వచ్చే అవకాశముం దని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చిన సీనియర్ నాయకులు ఆ పదవికి వర్ధన్ ఆమోదయోగ్యుడని తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీని గురించి తనకేమీ తెలియదని వర్ధన్ అన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ మాట్లాడు తూ సీఎం అభ్యర్థిత్వం విషయంలో తగిన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గందరగోళానికి తెరదించేందుకే... కార్యకర్తల్లో ఉన్న గందరగోళానికి తెరదించేందుకు సాధ్యమైనంత త్వరగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ యోచిస్తుందని వర్గాలు తెలిపాయి. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఖ్య పదవికి వీకే మల్హోత్రా పేరును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించి సంకేతాలున్నాయని, తొందర్లోనే ప్రకటన వస్తుందని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గోయల్ పనితీరుపట్ల పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తి గురించి అధిష్టాన ప్రముఖులకు అవగాహన ఉందన్నారు. ఇప్పటికే గోయల్ పనితీరుపై బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, వర్ధన్, మాజీ మేయర్ అర్తి మెహ్రా, అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గోయల్ మాట్లాడుతూ పార్టీ నాయకుల్లో ఎలాంటి నైరాశ్యం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేస్తున్నామని తెలిపారు. పార్టీలో అంతర్గత పోరు లేదని, పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామని వివరించారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ సన్నద్ధతకు వివిధ విషయాల గురించి ఇటీవలే నితీన్ గడ్కారీతో గోయల్ సమావేశమై చర్చించారు. సమష్టిగా పనిచేయండి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించేందుకు పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని గడ్కారీ కోరారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లతో బుధవారం సమావేశమైన ఆయన ఈ మేరకు నాయకులకు హితబోధ చేశారు. వార్డుస్థాయిలో పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా శ్రమించాలన్నారు. కౌన్సిలర్ ప్రదర్శనను బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్లను ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కౌన్సిలర్లకు ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తల మధ్య అసంతృప్తి ఉంటే వాటన్నింటిని పక్కనపెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. -
జల్గావ్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం
సాక్షి, ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మహారాష్ట్రలోని జల్గావ్ రావాలని ఆహ్వానం అందింది. స్థానిక బీజేపీ ఎంపీ హరిబావ్ జావలే ఆయనను జల్గావ్ను సందర్శించాలని కోరారు. ఈ విషయంపై బీజేపీకి చెందిన ఎంపీల బృందం గుజరాత్ ముఖ్యమంత్రితో మంగళవారం భేటీ అయింది. స్థానికంగా జరగనున్న వ్యవసాయ సదస్సులో పాల్గొనాలని వారు మోడీని కోరారు. ముఖ్యంగా పత్తి అధికంగా పండే ఈ ప్రాంతంలో పత్తి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయి తే రైతులకు లాభం చేకూరనుందని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నరేంద్ర మోడీకి అన్ని వివరాలు తెలిపి జల్గావ్కు రావాలని ఆహ్వానం పంపారు. ఆయన జల్గావ్ వచ్చినట్టయితే ఖందేశ్ ప్రాంతంలో కూడా బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపినట్లవుతుందని పార్టీ భావిస్తోంది. మోడీతో భేటీ అయిన వారిలో రావరే ఎంపీ హరిబావ్ జావలేతోపాటు జల్గావ్ ఎంపీ ఏటీ పాటిల్, ధులే ఎంపీ ప్రతాప్ సోనవణే, జాల్నా ఎంపీ రావ్‌సాహెబ్ దానవే తదితరులున్నారు. -
ఏపీ విభజనపై చర్చాగోష్టిలో వక్తల మనోభావం
పింప్రి, న్యూస్‌లైన్: విడిపోవడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పుణేలో ఆంధ్రప్రదేశ్ విభజన, రాజకీయ పరిస్థితులపై చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూ హ్య స్పందన లభించింది. డెక్కన్ జింఖానాలోని పుణే ఆంధ్ర సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని మేధావులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులే కాకుండా తెలుగు ప్రజలు కూడా హాజరై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల వారు పాల్గొన్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల వారు విడిపోవడం సబబు కాదని, తెలుగువారిగా ఐక్యంగా ఉండి రాజకీయ కుళ్లును కడిగివేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని, రాజకీయ నాయకులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతూ అక్కడి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు బాగా నష్టపోయారన్నారు. రాజకీయ ఎత్తుగడలో తెలుగు జాతి యావత్తూ చిత్తయిందని అభిప్రాయపడ్డారు. మరో వక్త మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మంచి చెడులను గ్రహించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల మధ్య ఐక్యత లేక పోవడంతో కత్తులు దూసుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలోనే వైఎస్ఆర్ ఆకస్మికంగా మృతి చెందారనీ, ఇదే ఆ రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తెలుగు జాతిని నిలువునా చీలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రరాష్ర్టంలో జరుగుతున్న మారణహోమాన్ని చూసి తెలుగుతల్లి రోదిస్తోందన్నారు. అందువల్ల దేశ సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాలు ఆయా ప్రాంతాల అభీష్టం మేరకు ఏర్పడ్డాయని, ఇంత తీవ్రస్థాయిలో గొడవ జరగలేదని ఓ విద్యార్థిని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ఐ.వి.రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన స్నేహ (ఇంజనీరింగ్ విద్యార్థి), రామారావు, శ్రీనివాస్, ఎస్.డి.రావు, ఎం.సి.కె. రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంఐఎం అడుగులు
సాక్షి, ముంబై: హైదరాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మహారాష్ట్రలో కూడా తమ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఓ ప్రముఖ మరాఠీ పత్రికలో వచ్చిన కథనం మేరకు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందుగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముంబై, ఠాణేలతోపాటు నవీముంబైలలోని మైనారిటీల ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో తొలుత పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఔరంగాబాద్‌లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నారు. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. నాందేడ్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికల్లో కూడా పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మైనారిటీ ఓటర్ల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈద్ తర్వాత కార్యాలయాల ఏర్పాటు నగరంలోని బాంద్రా, మహమ్మద్అలీ రోడ్డుతోపాటు అంబర్నాథ్, వాషీలో రంజాన్ తర్వాత ఎంఐఎం పార్టీ కార్యాలయాలను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత విదర్భ, మరాఠ్వాడాతోపాటు పశ్చిమ మహారాష్ట్రలో కూడా తమ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌కు నష్టం ? ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నించినట్టయితే కాంగ్రెస్‌కు కొంత మేర నష్టం వాటిల్లొచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా మైనారిటీ ఓటుబ్యాంకు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. అయితే ఇప్పటికీ మైనారిటీలపై సమాజ్‌వాదీ పార్టీ కొంతమేర ప్రభావం చూపింది. దీంతో కొందరు ఎస్పీ వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలో దిగినట్టయితే అనేకమంది మైనారిటీలు వారివైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి... 1956లో హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీని ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పార్టీ మంచి పట్టు సాధించింది. పార్టీ అధ్యక్షుడైన అసదుద్దీన్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ పార్టీ తర ఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఒకరు. -
‘కమిటీ’ కహానీలు... కాంగ్రెస్ నుంచి పూటకో మాట
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలు, పార్టీ నాయకుల ఒత్తిళ్లపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కాంగ్రెస్ అధిష్టానం గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. ఆ ప్రాంత నేతల అభిప్రాయాలను, ఫిర్యాదులను వినేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఒకసారి.. కమిటీని ఏర్పాటు చేశామని, పని మొదలు పెట్టిందని మరొకసారి.. రెండు మూడు రోజుల్లో కమిటీని ప్రకటిస్తామని ఇంకొకసారి.. తమను కలిసిన నాయకులకు రకరకాలుగా చెప్తుండటమే ఇందుకు నిదర్శనం. అదీగాక.. ఒక్కరే ఈ సమస్యలను పరిశీలిస్తారని తొలుత చెప్పిన కాంగ్రెస్ నాయకత్వం.. ఆ తర్వాత ఇద్దరు సభ్యులతో కమిటీ అని, అనంతరం ముగ్గురు సభ్యులని చెప్పగా.. ఇప్పుడు మొత్తం ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఉంటుందని పేర్కొనటం విశేషం. సీమాంధ్ర నేతల ఆందోళనలు, అభిప్రాయాలను వినే పనిని తొలుత సహజంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించారు. ఆ తర్వాత.. దిగ్విజయ్‌సింగ్, గులాంనబీఆజాద్లతో ఇద్దరు సభ్యుల కమిటీ ఉంటుందని హైకమాండ్ చెప్పింది. ఈ విషయం తొలుత కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆ తర్వాత స్వయంగా దిగ్విజయ్ కూడా ప్రకటించారు. సోమవారం రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర నేతలతో ఆంటోనీ మాట్లాడటం మొదలుపెట్టారని కూడా ఆయన ప్రకటించారు. కానీ.. అసలు ఇలాంటి కమిటీ ఏర్పాటు గురించి తనకు ఏమీ తెలియదని ఆంటోని మంగళవారం స్పష్టం చేయటం విశేషం. ఈ కమిటీ విషయంలో తనకు పార్టీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కూడా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో తనను కలిసిన విలేకరులతో పేర్కొన్నారు. మరోవైపు.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర సహాయమంత్రి జె.డి.శీలం ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను వినేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఉంటుందని చెప్పారు. ఆ కమిటీలో ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్‌లు ఉంటారని పేర్కొన్నారు. కానీ సాయంత్రానికల్లా అది ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అని.. అందులో ఆంటోనీ, మొయిలీ, దిగ్విజయ్‌లతో పాటు ఆజాద్, సుశీల్కుమార్షిండేలు కూడా ఉంటారన్న మాట బయటకు వచ్చింది. ఈ విషయం రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఐదుగురు నేతలతో కమిటీ ఉంటుందని సోనియాగాంధీ స్వయంగా తమకు చెప్పారని ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మీడియాతో పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేయబోయే కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు.. ఏ ఏ అంశాలను పరిశీలిస్తుంది అనే విషయాలను దిగ్విజయ్ త్వరలో ప్రకటిస్తారని.. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు సోనియాను కలిసిన తర్వాత మీడియాతో చెప్పటం మరో విశేషం. విభజనపై వాదప్రతివాదనలు వినేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీ ఐదుగురు సభ్యుల వద్ద ఆగుతుందా ఇంకా పెరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలు తెలంగాణ ఏర్పాటు త్వరగా పూర్తికావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ ప్రాంత నేతలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి గందరగోళం లేదు. ‘మాకు వివరించిన ప్రకారం నోట్ ముసాయిదాను రూపొందిస్తున్నాం’ అని ఆ శాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. -
కేంద్రం మొద్దు నిద్ర: నరేంద్ర మోడీ
అహ్మదాబాద్: దేశ సరిహద్దులను కాపాడటంలో యూపీఏ ప్రభుత్వం ఉదాశీన వైఖరి కనబరుస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. సరిహద్దులో ఓవైపు చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా మరోవైపు పాకిస్థాన్ దాడులకు తెగబడుతున్నా మన్మోహన్ సర్కారు మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు. కేంద్రం ఈ వైఖరిని ఎప్పుడు మార్చుకుంటుందని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైనికులు భారత భూభాగంలోకి చొరబడి ఐదుగురు జవాన్లను కాల్చి చంపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. మరోవైపు పాక్ కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికాలో త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ చర్చలు జరపరాదని బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా డిమాండ్ చేశారు. పాక్‌తో చర్చల విషయంలో భారత్ కఠిన వైఖరి అవలంబించాలని బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, షానవాజ్ హుస్సేన్ సూచించారు. -
సీబీఐకి సహకరించండి: సుప్రీంకోర్టు
‘కోల్గేట్’లో కేంద్రానికి ‘సుప్రీం’ నిర్దేశం సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనుల లెసైన్సులను ఎలా జారీ చేశారనే అంశానికి సంబంధించిన సమాచారం, అవసరమైన పత్రాలను ఎలాంటి జాప్యం లేకుండా సీబీఐకి అందించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీ వరకూ పూర్తయిన దర్యాప్తుకు సంబంధించి తాజా స్థాయీ నివేదికను 29వ తేదీన తనముందు ఉంచాల్సిందిగా సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. సీనియర్ అధికారులను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కావాలన్న కేంద్రం వైఖరిని మరోసారి ప్రశ్నించింది. ప్రభుత్వ పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఈ దర్యాప్తులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలని నిలదీసింది. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న దర్యాప్తులో అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించింది. -
విదేశీ ఎంబసీల ద్వారా ‘ఉగ్ర’ నిధులు
న్యూఢిల్లీ: మన దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి వీలైనంత సాయం చేస్తోంది. ఆ దేశంతో పాటు, దాని ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భాగంలో(పీవోకే)లో 42 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి గత మూడేళ్లలో 270 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారు. హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ లోక్‌సభలో ఈ వివరాలను వెల్లడించారు. 2010-12 మధ్య వెయ్యి సార్లు చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నించారని, వారిలో 160 మందిని భారత దళాలు కాల్చి చంపాయని తెలిపారు. దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, విదేశాల నిఘా సంస్థల ద్వారా ఇక్కడి ఉగ్రవాదులకు హవాలా మార్గంలో నిధులు అందుతున్నాయన్నారు. దీని కోసం నకిలీ నోట్లను మార్గంగా ఎంచుకున్నారని వెల్లడించారు. కాగా, నకిలీ భారత కరెన్సీ నోట్లను పాక్‌లో ముద్రించి చైనా, నేపాల్ తదితర దేశాల ద్వారా భారత్‌లోకి తరలిస్తున్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ్ మీనా రాజ్యసభలో వెల్లడించారు. గత జూన్ 30న ఒకేరోజు రూ. పదికోట్లకు పైగా విలువైన రెండు లక్షల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
ఉత్తరాఖండ్ మృతులు 6 వేలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సానికి ఆరువేల మందికిపైగా మరణించి ఉంటారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. అందులో 580 మంది మృతి చెందినట్లుగా ధ్రువీకరించామని, 5,474 మంది ఆచూకీ ఇప్పటికీ వెల్లడికాలేదని పేర్కొంది. ఆ ఘటనలో ఇంత భారీగా మృతులు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం ఇదే మొదటిసారి. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మంగళవారం లోక్‌సభకు ఒక నివేదిక సమర్పించారు. జూన్ 1 నుంచి 18 మధ్య అక్కడ 385 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, అది సాధారణ వర్షపాతానికి 440 రెట్లు ఎక్కువని తెలిపారు. భారీ వర్షాలు, వరద వల్ల రోడ్లు దెబ్బతిన్నా, వాతావరణం సహకరించకున్నా తక్కువ సమయంలోనే 1.10 లక్షల మందిని సురక్షితప్రాంతాలకు తరలించామని చెప్పారు. సహాయకార్యక్రమాల్లో భారీగా సైనిక బలగాలు పాలు పంచుకున్నాయని ఆంటోనీ తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఐదుగురు వైమానికదళ సిబ్బంది, తొమ్మిది మంది విపత్తు సహాయక సిబ్బందితో పాటు మరో ఎనిమిది మంది పారామిలటరీ సిబ్బంది మరణించినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణకు ప్రధాని రూ. వెయ్యికోట్ల సహాయాన్ని ప్రకటించగా.. ఇప్పటికే రూ. 400 కోట్లు అందజేశామని చెప్పారు. చార్ధామ్ ప్రాంతాల పునర్నిర్మాణానికి ప్రధాని నేతృత్వంలో కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించినా.. ఇంతవరకూ ఉత్తరాఖండ్‌కు నిధులు అందలేదంటూ బీజేపీ, ఎస్పీ, తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా.. చార్‌ధామ్‌లో గల్లంతైనవారి సంఖ్య, వారికి నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. దేశంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను, వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపర్చాలని కోరారు. ఉత్తరాఖండ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. -
కొడవ’కు స్వయం ప్రతిపత్తి కల్పించండి
సాక్షి, బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో కర్ణాటకలోని కొడుగు ప్రాంతాన్ని సైతం స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు కొడవ నేషనల్ కౌన్సిల్(సీఎన్సీ) ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎన్.యూ.నాచప్ప కొడవ మాట్లాడుతూ... కొడుగు ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత వాసులకు ఒక ప్రత్యేక వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయని, వాటిని రక్షించుకోవడానికే తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. భాషా, సంస్కృతిల పరంగా కొడగును అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340,342 ల ప్రకారం కొడగు ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రస్తుతం కొడవ వర్గానికి చెందిన ప్రజల సంఖ్య లక్షా యాభైవేలు మాత్రమేనని అందువల్ల తమను కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 331ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చినట్లుగా రాజకీయాల్లో రిజర్వేషన్‌ను కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ఇదే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటి పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 15న కొడగులో ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. అనంతరం ఈనెల 18న నగరంలోని టౌన్‌హాల్ ఎదుట ధర్నాను నిర్వహిస్తామని, అంతేకాక నవంబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొడవ వర్గానికి చెందిన ఐదు వేల మందితో భారీ ర్యాలీని సైతం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఫాస్ట్‌గా పాస్‌పోర్ట్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు అమలు ద్వారా పౌరులకు సకాలంలో పారదర్శక సేవలను అందించగలుగుతున్నామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి పీఎస్. కార్తికేయన్ తెలిపా రు. తద్వారా పోలీసు పరిశీలన సమయాన్ని మినహాయిస్తే 14 రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ను పంపిణీ చేయగలుగుతున్నామని వెల్లడించా రు. మంగళవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు ద్వారా 11 లక్షల పాస్‌పోర్ట్‌లను పంపిణీ చేశామని, ఒక్క జూలైలోనే 40 వేల మందికి పంపించామని వివరించారు. పౌరుల పట్ల స్నేహయుతంగా వ్యవహరించే చర్యల్లో భాగంగా పాస్‌పోర్ట్ మేళాలను నిర్వహించడం ద్వారా రద్దీని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. పాస్‌పోర్ట్ అర్జీదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా నగరంలోని లాల్బాగ్, మారతహళ్లి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వసతులను పెంచామని తెలిపారు. లాల్‌బాగ్‌లో 45 రోజుల్లో, మారతహళ్లిలో 30 రోజుల్లో అపాయింట్మెంట్లను విడుదల చేస్తునామని చెప్పారు. ఈ రెండు కేంద్రాల్లో ఏటీఎంలను నెలకొల్పడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పోలీసు పరిశీలన కోసం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ పరిధిలోని 102 పోలీసు స్టేషన్లలో ‘డెరైక్ట్ టు ఠాణా’ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పౌరుల ప్రయోజనార్థం తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలు ప్రతిపాదనలు చేశా మని ఆయన వివరించారు. ఇందులోని ముఖ్యాంశాలు.. = పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ఏటా 30 వేల అదనపు అపాయింట్మెంట్లకు అవకాశం ఉంటుంది. = పోలీసు శాఖ సహకారంతో పోలీసు పరిశీలన కాలాన్ని తగ్గించాలి. దీని వల్ల పాస్‌పోర్ట్ అందించే కాలాన్ని బాగా తగ్గించడానికి వీలవుతుంది. = కర్ణాటక ఈ-గవర్నెన్స్ శాఖ సహకారంతో బెంగళూరు వన్, కర్ణాటక వన్ కేంద్రాల సేవలను కూడా వినియోగించుకోవాలి. -
ఆంధ్రప్రదేశ్ విభజన సరికాదు
బనశంకరి, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీట్లు, ఓట్లు కోసం విభజించడం సరికాదని ప్రవాసాంధ్రులు కోటిరెడ్డి, వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం జేపీ.నగర ఏడవ పేజ్‌లోని కేఆర్.లేఔట్లో ప్రవాసాంధ్ర ఐటీ ఉద్యోగులు కోటిరెడ్డి, వివేకానందరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డు పట్టుకుని నిరసన వ ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాల కోసం అంధ్రప్రదేశ్‌ను విభజించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చేస్తే ప్రత్యేకరాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుని దేశ ఉనికికే ప్రమాదకరంగా మారతాయన్నారు. తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ మరోసారి పునరాలోచించాలన్నారు. సమైకాంధ్రకు మద్దతుగా న గరంలోని ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించాలని వారు పిలుపునిచ్చారు. ధర్నాలో వైఎస్.రవిరెడ్డి, సీ.చంద్రశేఖర్‌రెడ్డి, సురేంద్ర, హరి, భరత్‌రాజు, కే.శంకర, శ్రావణ్‌కుమార్, సచిన్‌అగర్వాల్, ఆనందరెడ్డి, ఎన్ఆర్ఐలు రూపేశ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధికే కాంగ్రెస్ ‘టి’ నిర్ణయం: ఏచూరి, వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా, అత్యంత బాధ్యతారహితం గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకొన్న ఈ నిర్ణయం బెడిసికొట్టడం ఖాయమని మంగళవారం పార్లమెంటు ప్రాంగణ ంలో విడివిడిగా మాట్లాడుతూ జోస్యం చెప్పారు. ఈ నిర్ణయంతో సీమాంధ్ర నిరసనలతో హోరెత్తుతుండటానికి కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న వైషమ్యాలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనన్నారు. విభజనతో తలెత్తే కీలక సమస్యలను పరిష్కరించకుండా తొందరపాటుతో వ్యవహరిస్తుండడం వ ల్లే ప్రజల్లో ఆగ్రహావేశాలు, వైషమ్యాలు పెరుగుతున్నాయని ఏచూరి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ తొలి నుంచీ సొంత వ్యవహారంగా చూస్తోందని వెంకయ్య ఆరోపించారు. -
నాంతమిళర్ పార్టీ నేత దారుణ హత్య
తిరుత్తణి, న్యూస్‌లైన్: నామ్‌తమిళర్ పార్టీకి నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తిరుత్తణి పట్టణంలో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. తిరుత్తణిలోని పెద్ద వీధికి చెందిన వ్యక్తి జయరామన్. అన్నాడీఎంకే రెండవ వార్డు కార్యదర్శిగా ఉంటున్నాడు. ఇతని కొడుకు పశుంపొన్‌రాజా(28) నామ్‌తమిళర్ పార్టీలో తిరువళ్లూరు జిల్లా పడమర విభాగ ఉప కార్యదర్శిగా ఉంటున్నాడు. తిరుత్తణిలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూవచ్చాడు. ఎంపిఎస్సాలైలో ప్రైవేటు కొరియర్ సర్వీస్, స్థానిక అగూరు వద్ద గోనె సంచుల వ్యాపారం చేస్తూ వచ్చాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన పశుంపొన్‌రాజా తిరిగి ఇంటికి తిరిగిరాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికారు. చిత్తూరు రోడ్డు, పట్టణ శివారు ప్రాంతమైన అగూరు సమీపంలోని విత్తనాల గోడౌన్ వద్ద రోడ్డు పశుంపొన్‌రాజా హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. తిరుత్తణి పోలీసు లు వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన పశుంపొన్రాజాను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు అన్న విషయం తెలియరాలేదు. తిరువళ్లూరు ఎస్పీ రూపేష్‌కుమార్ మీనా పర్యవేక్షణలో తిరుత్తణి డీఎస్పీ గోపాల్, ఇన్స్పెక్టర్ విమారాజ్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోను, తిరుత్తణి పట్టణంలోను అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం పసుంపొన్‌రాజా మృతదేహాన్ని సొంత ఊరైన పుదుకోట్టైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీకి చెందిన నిర్వాహకుడు తిరుత్తణి ప్రాంతంలో హత్యకు గురి కావడం ఇదే మొదటిసారి. సీమాన్ నివాళి పొన్‌రాజా మృతికి అంజలి ఘటించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు సీమాన్ మంగళవారం సాయంత్రం తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. పోస్టుమార్టం గది నుంచి తీసుకొచ్చిన పశుంపొన్‌రాజా మృత దేహానికి ఆయన పూలమలవేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ నేతలతో కలసి తమిళ తల్లికి కూడా అంజలి ఘటించారు. విలేకరులతో మాట్లాడుతూ, పశుంపొన్‌రాజా తమ పార్టీ అభివృద్ధి కోసం తిరుత్తణి ప్రాంతంలో చురుగ్గా పనిచేశారని తెలిపారు. పశుంపొన్‌రాజా హత్య కేసుపై పోలీసులకు కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని సీమాన్ తెలిపారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంజలి ఘటించారు. -
దీక్షకు దిగిన డీడీ నాయుడు మెడికల్ కళాశాల విద్యార్థులు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తమను నట్టేట ముంచిన డీడీ నాయుడు కళాశాలపై చర్యలు తీసుకోవాలని, విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు మంగళవారం దీక్ష చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని కున్నవలం గ్రామంలో డీడీ నాయుడు మెడికల్ కళాశాల ఉంది. ఈ కళాశాలకు 2010లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కళాశాల నిర్వాహణ కోసం అనుమతి ఇచ్చింది. తర్వాత పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించిన మెడికల్ కౌన్సిల్ 2011లో అనుమతిని రద్దు చేసింది. కళాశాల నిర్వాహకులు 2010లో కౌన్సిల్ ఇచ్చిన అనుమతిని చూపించి 2011లో 103 మందిని, 2012లో 100 మందికి పైగా విద్యార్థులను చేర్చుకున్నారు. వారి నుంచి డొనేషన్ సహా అనేక ఫీజుల రూపంలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించినా యూనివర్సిటీ నిర్వహించే ఒక్క పరీక్షను కూడా విద్యార్థులు రాయలేదు. దీంతో కళాశాలపై అనుమానం కలిగిన విద్యార్థులు యూనివర్సిటీ వీసీని కలిశారు. దీంతో కళాశాలకు అనుమతి లేదని తెలుసుకున్న షాక్‌కు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పలుమార్లు ఆందోళనలు చేశారు. విద్యార్థులకు నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటామని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. వీసీ ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో పాటు, కళాశాల చైర్మన్ డీడీ నాయుడుపై చీటింగ్, హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. మూడు నెలల క్రితం అతన్ని పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గూండా చట్టం కింద అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. దీంతో తమ ఫీజులు తిరిగి చెల్లించాలని కొందరు, పరీక్ష రాసే అవకాశం కల్పించాలని మరి కొందరు ఆందోళన చేయడంతో కళాశాలను మూసేశారు. నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ 2011-12 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు మంగళవారం దీక్షకు దిగారు. డీడీ నాయుడు నిర్వాకం వల్ల తాము మూడు విద్యా సంవత్సరాలు, లక్షలాది రూపాయలు నష్టపోయామని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. టెంట్‌ను తొలగించిన పోలీసులు: దీక్షకు అనుమతి లేదని ఆగ్రహించిన పోలీసులు విద్యార్థులు వేసుకున్న టెంట్‌ను తొలగించారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనేక విధాలుగా నష్టపోయిన తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని వాపోయారు. అనంతరం కళాశాల లోపలికి వెళ్లిన విద్యార్థులు తాము ఆమరణ నిరాహర దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. తమ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, లేదా తమకు వేరే కళాశాలలో సీటు కల్పించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్తు నాశన మైందన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. -
మరో ‘అణు’ ఆందోళన
కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా చెలరేగిన ఉద్యమం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో మరో ఉద్యమం ఉదయిం చింది. కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు మంగళవారం నిరసన తెలిపారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన మద్రాసు అటామిక్ పవర్ స్టేషన్ (కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం) ఉంది. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ దీనిని మంజూరు చేశారు. మొత్తం 220 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లతో 1984 జనవరి 24న ప్రారంభమైంది. దేశంలోనే ఇది తొలి అణువిద్యుత్ కేంద్రమని చెబుతారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వల్ప అవాంతరాలు మినహా ఈ కేంద్రం సజావుగా సాగుతోంది. ఈ అనుభవంతోనే కూడంకులంలో మరో అణు విద్యుత్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అణు విద్యుత్ కేంద్రానికి అనుకూలంగా కోర్టులు తీర్పు ఇచ్చాయి. దీంతో ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. అగ్నిపర్వతమంటూ ప్రచారం కల్పాక్కం- పుదుచ్చేరికి మధ్యలో అణువిద్యుత్ కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో అగ్నిపర్వతం ఉందనే ప్రచారం జోరందుకుంది. ‘కల్పాక్కం అణుశక్తి కేంద్రం - అగ్నిపర్వతం’ అనే పుస్తకంలో ఈ అంశాన్ని పేర్కొన్నట్లు తెలుసుకున్న స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందని, దీని ప్రభావం అణువిద్యుత్ కేంద్రంపై పడితే గ్రామాలు తుడిచి పెట్టుకుపోగలవని భయపడుతున్నారు. కల్పాక్కం పరిసర గ్రామాల్లోని ప్రజలు మంగళవారం తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. డాక్టర్ పుహళేంది నాయకత్వంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ వాదనను అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ అంశంపై అణువిద్యుత్ కేంద్రం అధికారి ప్రభాత్‌కుమార్ వివరణ ఇచ్చారు. తమిళనాడులో వేలాది ఏళ్లకు ముందు ఆలయాలు, సొరంగాలు ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. సదరు పుస్తకంలో పేర్కొన్నట్లు 250 ఏళ్ల క్రితం అగ్నిపర్వతం ఉన్నట్లు దాఖలాలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అగ్నిపర్వతాల పరిశోధనల పుటల్లో సైతం కల్పాక్కంలో అగ్నిపర్వతం ప్రస్తావన లేదని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. -
పరవళ్లు తొక్కుతున్న నదులు
తిరుచ్చి, తంజావూరు, అరియలూరు, నాగపట్నం, కరూర్ జిల్లాల్లోని నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. మెట్టూరు ఉబరి నీరు, కొల్లిడం నది, ముక్కొంబు, కళ్లనై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావేరి మంగళవారం కాస్త శాంతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, చెన్నై: కర్ణాటక, కేరళలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. ప్రధానంగా మెట్టూరు డ్యాం పొంగి పొర్లుతోంది. కావేరి ఉగ్ర తాండవంతో డ్యాం నీటిమట్టం 121 అడుగులు దాటింది. పూర్తిస్థాయిలో 120 అడుగులు మాత్రమే నీటి నిల్వలు ఉండాల్సిన దృష్ట్యా మిగులు జలాల్ని బయటకు విడుదల చేస్తున్నారు. మెట్టూరు డ్యామ్‌లోకి మంగళవారం సెకనుకు 1.36 లక్షల ఘనపుటడుగుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అలాగే సెకనుకు 1.21 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కావేరి మంగళవారం సాయంత్రానికి కాస్త శాంతించింది. కృష్ణరాయసాగర్, కపిని డ్యామ్‌ల నుంచి నీటి విడుదల శాతాన్ని సెకనుకు 90 వేల ఘనపుటడుగులకు తగ్గించడమే ఇందుకు కారణం. అయితే కావేరిలో అంతకంటే ఎక్కువగా నీరు ప్రవహిస్తోంది. నదీ తీరంలో కురుస్తున్న వర్షాలే ఈ పరిస్థితికి కారణం. పొంచివున్న ముప్పు కావేరి నీటితో మెట్టూరు డ్యాం నిండింది. ఈ నీటిని సాగుబడి నిమిత్తం కాలువల ద్వారా ఓ వైపు, ఉబరి నీటిని 16 గేట్ల ద్వారా మరోవైపు బయటకు పంపుతున్నారు. దీంతో మెట్టూరు నుంచి సేలం, నామక్కల్, ఈరోడ్, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, అరియలూరు తదితర 11 జిల్లాల గుండా కావేరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఈ తీరంలోని కొల్లినడం నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అలాగే కళ్లనై, ముక్కోం బు, మాయనూరు, పడనై డ్యామ్‌లు, ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కావేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుచ్చి వద్ద లక్ష ఘనపుటడుగుల మేరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడి పురాతన వంతెనల మీదుగా రాకపోకల్ని నిలుపుదల చేశారు. తీరవాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత కావేరి కళకళలాడుతుండడంతో తిరుచ్చి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా తంజావూరు, అరియలూరు మీదుగా నాగపట్నం వద్ద సముద్రంలో నీళ్లు కలవనున్నాయి. వృథా కాని రీతిలో తీరంలోని చెరువులు, చిన్నచిన్న జలాశయాలకు కాలువల ద్వారా నీటిని మళ్లించే పనిలో నీటిపారుదల శాఖ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
సమైక్యం కాకుంటే.. గ్రేటర్ సీమ ఇవ్వండి
సోనియాకు కర్నూలు జిల్లా నేతల వినతి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో రాయలసీమ మరింత వెనకబాటుకు గురవుతుందని కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల బృందం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్ద ఆందోళన వెలిబుచ్చింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని.. అలా వీలుకాని పక్షంలో రాయలసీమ నాలుగు జిల్లాలతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు బృంద సభ్యులు చెప్పారు. కర్నూలు జిల్లా నేతలు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం సోనియాగాంధీని పార్లమెంటు ప్రాంగణంలో కలిశారు. ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, మురళీకృష్ణలు ఈ బృందంలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగితే తమ జిల్లాకు ఆ ప్రాంతంతో నదీ జలాల వివాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు సోనియాకు వివరించామని చెప్పారు. ‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులు దాటితే కానీ నీరు కిందకు రాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వారు పై నుంచి నీటిని కిందకు రానిచ్చే అవకాశాలు తక్కువ. అక్కడ విద్యుత్ ఉత్పత్తిని సైతం మొదలుపెడితే నీటి వినియోగం పెరిగితే ప్రాజెక్టులో నీరే ఉండదు. అదీగాక తెలంగాణలో ఆయకట్టు ప్రాంతం ఎక్కువ. దాంతో వారికే ఎక్కువ నీరు అవసరం. వారి అవసరాలు తీరేవరకూ కిందకు నీరు వదలకుంటే మా ప్రాంతం అర తా ఎడారిగా మారటం ఖాయం’ అని నేతలు సోనియా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతితోనూ భేటీ: కర్నూలు జిల్లా నేతలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కూడా కలిశారు. విభజనతో తమ ప్రాంతానికి జరిగే నష్టాన్ని ఆయనకు వివరించి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని లేకుంటే 3 రాష్ట్రాలుగా విభజించాలని కోరారు. రాయల తెలంగాణ అనలేదు..కోట్ల: రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని తాను కోరలేదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యమే తన తొలి ప్రాధాన్యం అని.. అలా వీలుకాని పక్షంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. మంగళవారం సోనియాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. విభజనతో కర్నూలుకు తాగు, సాగు నీటి విషయంలో వచ్చే సమస్యలను సోనియా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. -
ఆర్బీఐ జోక్యంతో రూపాయి రికవరీ
ముంబై: రూపాయి మారకం విలువ మంగళవారం చాలా నాటకీయ పరిణామాలకు లోనైంది. ఇంట్రాడేలో మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయి 61.80కి పడిపోయి.. అంతలోనే మళ్లీ కోలుకుని, 11 పైసల లాభంతో 60.77 వద్ద ముగిసింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం, చివర్లో ఎగుమతిదారులు భారీగా డాలర్లను విక్రయించడం రూపాయి రికవరీకి తోడ్పడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు.. 60.88తో పోలిస్తే బలహీనంగా 61.05 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో ఒక దశలో కొత్త రికార్డు కనిష్టమైన 61.80కి కూడా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ జూలై 8న చివరిసారిగా 61.21 కనిష్ట స్థాయిని (ఇంట్రాడే) తాకింది. తాజాగా ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి 11 పైసల లాభంతో 60.77 వద్ద క్లోజయ్యింది. అమెరికాలో రికవరీ సంకేతాలతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను ఉపసంహరించవచ్చన్న ఆందోళనలు మరోసారి తలెత్తడం సైతం ఈ పరిణామానికి దారితీశాయని ధన్లక్ష్మి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ట్రెజరీ) శ్రీనివాస రాఘవన్ చెప్పారు. అమెరికా పరిణామాలపై ఎక్కువగా ఆధారపడటమనేది దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఫారెక్స్ మార్కెట్లలో ఆర్బీఐ జోక్యం చేసుకుని ఉండొచ్చని, తద్వారా రూపాయి కోలుకుని ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. ప్రతికూల సెంటిమెంట్ కారణంగా రూపాయి రానున్న రోజుల్లో 62 స్థాయికి క్షీణించగలదని ఆయన చెప్పారు. రూపాయి స్థిరత్వానికి చర్యలు: చిదంబరం రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు, దేశీ కరెన్సీని స్థిరపర్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం రాజ్యసభకు తెలిపారు. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పెరుగుతుండటానికి, రూపాయి పతనానికి దారితీస్తున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోందని వివరించారు. మరోవైపు, ముడిచమురు, బంగారం దిగుమతుల వల్లే క్యాడ్ పెరుగుతోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులు తగ్గించడం ద్వారా క్యాడ్‌ను కట్టడి చేసేందుకు పలు చర్యలు ఇప్పటికే తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూపాయి క్షీణతను అడ్డుకునే దిశగా స్వల్పకాలికమైన దిద్దుబాటు ప్రయత్నాలను కూడా చేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ సూచించారు. ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్ కార్యకలాపాలను నియంత్రించాలని ఆయన చెప్పారు. రూపాయి స్థిరత్వానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయే కాకుండా మిగతా దేశాల కరెన్సీలు కూడా క్షీణిస్తున్నాయని వివరించారు. -
గత 2 రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాం: ఎంపీ హర్షకుమార్
న్యూఢిల్లీ: రాష్ట్రవిభజనపై నిరసనగా సీమాంధ్రలో పెద్దఎత్తునా ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర మంత్రులు కూడా పార్లమెంటును విభజన సెగతో కాకపుట్టించారు. గత రెండు రోజులుగా పార్లమెంట్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు సమైక్యా నినాదాలతో పార్లమెంట్లో హొరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాము రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించామన్నారు. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై రేపు కూడా సమావేశమవుతామని హర్షకుమార్ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్న విషయాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు కలిసి ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు మంత్రులు కూడా సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారని హర్షకుమార్ చెప్పారు. -
టోల్‌నాకాల పరిస్థితులపై కంపెనీల ఆందోళన
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘శివ్డీ-నవశేవా సీలింక్ ప్రాజెక్టు’ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు గతంలో ఆసక్తి కనబర్చిన ఐదారు కంపెనీలు టెండర్ల ప్రక్రియకు మాత్రం దూరంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క సంస్థ కూడా టెండరు వేయకపోవడంతో ప్రాజెక్టు భవిత అగమ్యగోచరంగా మారింది. టెండర్లు వేసేందుకు సోమవారం ఆఖరు రోజు కావడంతో సాయంత్రం గడువు ముగిసే వరకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యూపీఎస్ మదన్ స్పష్టం చేశారు. దాదాపు రూ.9,630 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 16.5 కిలోమీటర్ల మార్గం సముద్రంపైనే ఉంటుంది. తొలుత ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చిన బడా సంస్థల్లో ఐఆర్బీ ఇన్ఫ్రా, హ్యుందయ్, సింట్రా-సోమా, గ్యామన్ ఇన్ఫ్రా- ఓహెచ్ఎల్, జీఎంఆర్, ఎల్ అండ్ టీ, శామ్సన్, టాటా రియల్టీ, ఆటోస్ట్రెడ్ ఇండియన్ ఇన్ఫ్రా, విన్సి వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఐఆర్బీ, హ్యుందయ్ కంపెనీలు ఇటీవల కొల్హాపూర్ టోల్‌నాకా వద్ద జరిగిన హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టబడులకు వాతావరణం అనుకూలంగా లేదని కారణం చూపుతూ టెండరు వేయకూడదని గతవారమే నిర్ణయం తీసుకున్నాయి. మిగతా నాలుగు సంస్థలు మాత్రం టెండరు వేయకపోవడానికి గ ల కారణాలను స్పష్టం చేయలేదు. ఆర్థిక సంక్షోభాలు, మార్కెట్లలో మాంద్యం కారణంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సేకరించే అవకాశాలు తక్కువగా ఉండడం, టోల్ వసూళ్లపై భరోసా లేకపోవడం వంటి వాటి వల్ల కంపెనీలు టెండర్ల దాఖలుకు వెనుకడుగు వేసి ఉండవొచ్చని ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచే అన్ని కంపెనీలతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించక ముందు పలుసార్లు సమావేశాలు జరిగాయి. సీలింక్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఊహించిన విధంగా ఉంటుందా..? టోల్ ద్వారా రాబట్టే డబ్బులతో ఈ ప్రాజెక్టుకు వెచ్చించిన డబ్బులు వసూలవుతాయా..? వంటి అనేక సందేహాలను సదరు సంస్థలు సమావేశంలో వ్యక్తం చేశాయి. కాని ఈ ప్రాజెక్టు నిర్మాణానికిఅవసరమయ్యే వివిధ శాఖల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), అనేక విధాల సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు హామీ ఇచ్చామని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్వినీ బిడే చెప్పారు. అయినప్పటికీ ఏ కంపెనీ కూడా టెండరు వేసేందుకు ముందుకు రాలేదని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, అందుకు నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టును క్యాష్ ఆన్ కాంట్రాక్టు ప్రతిపాదనపై చేపట్టేందుకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తామని, ఆరు నెలల్లో మరోసారి టెండర్లను ఆహ్వానిస్తామని ఆమె చెప్పారు. -
మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే
నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు. బలాబలాల ఆధారంగానే... వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. విదర్భపై మౌనం ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు. -
మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే
నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు. బలాబలాల ఆధారంగానే... వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. విదర్భపై మౌనం ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు. -
విదర్భను చేరిస్తేనే మద్దతివ్వండి
ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను మంగళవారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. విదర్భ బిల్లును చేరిస్తేనే ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని అధిష్టానానికి విన్నవించామన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలిశామన్నారు. తమ డిమాండ్‌కు అధిష్టానం సానుకూలంగా స్పందించిందన్నారు. అధిష్టానాన్ని కలిసినవారిలో ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్, నానాపటోల్ తదితరులున్నారు. ఇదిలాఉండగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ఈ వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. -
మాజీ ఎమ్మెల్యేల పింఛన్ ఇకనుంచి రూ. 40 వేలు
మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త. వీరికిస్తున్న పింఛన్‌ను రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు పెంచాలని విధానసభ వర్షాకాల ముగింపు సమావేశం రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు మాజీ పార్లమెంట్ సభ్యుల కంటే ఎక్కువ పింఛన్ లభించనుంది. ఈ నిర్ణయంవల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ.30 కోట్ల భారం పడనుంది. ఇటీవల ముగిసిన వర్షాకాల విధానసభ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయి. వీటిలో మాజీ ఎమ్మెల్యేల పింఛన్ పెంపు బిల్లు ఆఖరు రోజున చర్చకు వచ్చింది. అయితే ఎటువంటి చర్చలు జరపకుండానే ఆమోదం లభించింది. పెరిగిన నిత్యావసర సరకుల ధరతో పోలిస్తే మాజీలకు చెల్లించే పింఛన్ మొత్తం సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. సంసారాన్ని నెట్టుకురావడమే కష్టతరంగా మారింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలాఉండగా మాజీ ఎంపీలకు నెలకు రూ.20 వేల పింఛన్ వస్తుండగా, ఐదు సంవత్సరాలు పూర్తయిన మాజీ ఎమ్మెల్యేలకు ఇకనుంచి నెలకు రూ.25 వేలు పింఛన్ కింద లభించనుంది. ఒకసారికంటే ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా పనిచేస్తే పెన్షన్‌లో ప్రతి సంవత్సరం రూ. రెండు వేల చొప్పున అదనంగా లభిస్తుంది. దివంగత ఎమ్మెల్యేల వారసులు లేదా వారి బంధువులకు కూడా పింఛన్ లభిస్తుంది. కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు చెల్లిస్తున్న పింఛన్ మొత్తం ఎక్కువేనని ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా తమకు పింఛన్ మొత్తం పెంచాలంటూ 2011 నుంచి మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వాయిదావేసింది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన విధానసభ వర్షాకాల సమావేశంలో ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మాజీల పంటపండింది. అయితే 2011 నుంచి పెంపు పెన్షన్ చెల్లించాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నిర్ణయానికి గత గురువారమే ఆమోదం తెలిపినప్పటికీ ఆర్థిక శాఖ మాత్రం వ్యతిరేంచింది. అయితే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో ఈ ప్రతిపాదనకు మంజూరు లభించినట్లు తెలిసింది. -
ఇకపై పుణేలో రెండు పూటలా నీటి సరఫరా
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగర ప్రజలకు శుభవార్త. ఇకపై రెండుపూటలా నీటిని సరఫరా చేయాలని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నిర్ణయిచింది. ఇందుకు కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు నిండిపోవడమే. కొరత సమస్య కారణంగా పీఎంసీ ప్రస్తుతం నగర వాసులకు రోజుకు ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొరత సమస్యను అధిగమించేవిధంగా చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్లలో రెండు నెలలపాటు ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించామని, ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగే నీటి పారుదల విభాగం సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే తెలిపారు. కాగా కత్రజ్, జాంబుల్వాడి, ధనకావాడి, అప్పర్ ఇందిరానగర్, భారతీ విద్యాపీఠ్, కన్హే, ఆంబేగావ్ పఠార్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో రోజుకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతాలకు రెండు పూటలా నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిదిన నీటి సరఫరా బంద్ రావేత్లోని నీటి సరఫరా కేంద్రంలో విద్యుద్దీకరణ పనులు చేపడుతుండడంతో వాఘోళి పరిసర ప్రాంతాలకు గురువారం నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అయితే శుక్రవారం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా చేస్తామని నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు వెల్లడించారు. క్రమబద్ధీకరణ దిశగా... తన పరిధిలోని అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించే దిశగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించింది. నగరంలో దాదాపు పదివేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. వాస్తవానికి అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పీసీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమ్నెస్టీ అనే ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి నగరవాసులనుంచి ఆశించినమేర స్పందన రాలేదు. కేవలం 900 మంది మాత్రమే తమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరణ ఫీజును రెట్టింపు చేయడంతో అనేకమంది వెనక్కితగ్గారు. ఇదిలాఉండగా పీసీఎంసీకి 80 కోట్ల మేర నీటిబకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకునేందుకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఈ విషయమై పీసీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రవీణ్ లడ్కత్ మాట్లాడుతూ బకాయిదారులకు మరో అవకాశమిస్తామన్నారు. ఇక అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఆమ్నెస్టీ పథకంలో ప్రస్తుతం కొన్నిమార్పులుచేర్పులు చేశామన్నారు. అక్రమ కనెక్షన్లు ఉన్నవారు అక్టోబర్, 30వ తేదీలోగా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఆలోగా కొత్త కనెక్షన్లను అమర్చుకోవాలన్నారు. రాబడి పెంపునకు చర్యలు రాబడి పెంపుదిశగా పీసీఎంసీ అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 150 కోట్ల మేర నష్టపోయిన కార్పొరేషన్ ఆస్తి పన్ను, నీటి పన్ను, భవన నిర్మాణ అనుమతుల విభాగాల రాబడి పెంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పీసీఎంసీ కమిషనర్ శ్రీకర్ పరదేశి చెప్పారు. ఇప్పటిదాకా పన్ను చెల్లించని భవనాలను గుర్తించి, వాటి యజమానుల వద్ద వార్షిక పన్ను వసూలు చేస్తామన్నారు. ఇటువంటివి రెండు లక్షల భవనాలు ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నామన్నారు. వీరందరి వద్ద పన్ను వసూలు చేస్తామన్నారు. తద్వారా రాబడి లోటును పూడుస్తామన్నారు. 2013-14 తొలిత్రైమాసికంలో ఎల్బీటీ కింద రూ. 221.78 కోట్లు వసూలయ్యాయన్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో అప్పట్లో అమలులో ఉన్న ఆక్ట్రాయ్ కింద రూ. 293 కోట్లు వసూలయ్యాయని ఆయన వివరించారు. -
అవసరమైతే స్టాళ్లు తెరుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఘాటెక్కిన ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు షీలా సర్కార్ చర్యలు ప్రారంభించింది. రాజధానిలో పెరుగుతున్న ఉల్లి ధరలను ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని అభివృద్ధి శాఖ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్ చెప్పారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ప్రజలకు చౌకగా ఉల్లిపాయలను అందించడం కోసం గతంలో మాదిరిగా ఈఏడాది కూడా ప్రభుత్వం స్టాళ్లు తెరుస్తుందని చెప్పారు. నల్లబజారు మార్కెట్‌తో పాటు అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెల మొదటి ఆరు రోజులలో రాజధానికి ఉల్లి దిగుమతి తగ్గిందని చౌహాన్ చెప్పారు. 2012లో 4,513.5 టన్నుల ఉల్లి రాజధానికి రాగా, ఈసారి 3,884.5 టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. ఇది గత సంవత్సరం కన్నా అరవై టన్నులు అంటే 14 శాతం తక్కువన్నారు. గతేడాది ఆగస్టు ఒకటిన ఉల్లి హోల్‌సేల్ రేటు ధర కిలోకు రూ.4.50 నుంచి రూ.8.75 మధ్య ఉంటే, ఈసారి అది రూ.13.75 నుంచి రూ.27 మధ్య ఉందని చౌహాన్ తెలిపారు. రానున్న రోజులలో ఉల్లి ధర తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీఎంసీ పరిస్థితిని సమీక్షిస్తోందని చౌహాన్ తెలిపారు. ఉల్లి ధరలు ఢిల్లీలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్కువగా ఉన్నాయని వివరించే ప్రయత్నం చేశారు. దిగిరాని ఉల్లిధరలు ఇదిలావుండగా పెరిగిన ఉల్లి ధరలు మంగళవారం కూడా దిగిరాలేదు. ఇంకా రాజధాని వాసులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు అమాంతంగా కేజీకి రూ.50కి పెరగడంతో నగరవాసులు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల మహారాష్ట్రలోని నాసిక్, రాజస్థాన్ నుంచి వచ్చే ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. కొత్త పంట మార్కెట్లోకి వస్తే ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. అయితే అక్టోబర్‌లో కర్ణాటక నుంచి పంట మార్కెట్‌కు వస్తే ధరలు తగ్గుతాయని వివరించారు. జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ గణాంకాల ప్రకారం...ఢిల్లీ, లాసల్గావ్లో గత నెల నుంచి ఉల్లి హోల్‌సేల్ ధరలు రూ.50 శాతం మేర పెరిగాయి. లాసల్గావ్ మండిలో జూలై తొలి వారంలో ఉల్లి రూ.16 నుంచి 17కి పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ.30కి చేరుకుంది. -
విద్యుత్ చార్జీలు పెంపుతో పెనుభారం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో ప్రత్యేక కనెక్షన్లు ఉన్నవారికి విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.6.50 నుంచి రూ.7కి పెంచడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) వెనుక ఉన్న ప్రభుత్వమే ఈ విధానాలకు కారణమని ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ విమర్శించారు. సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘ దాదాపు 4వేల హౌసింగ్ సొసైటీల్లో నివసిస్తున్న రెండు లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభుత్వ నిర్ణయ భారం పడుతుంది. పజా సంక్షేమానికి కృషిచేయాల్సిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విద్యుత్ కంపెనీలకు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి విద్యుత్ కంపెనీలకు మధ్య ఇప్పటికే చీకటి ఒప్పదం కుదిరింద’ని ఆయన ఆరోపించారు. మూడేళ్లలో 72శాతం విద్యుత్ చార్జీలు పెంచారని విజయ్‌గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు పెంపుదల చూస్తుంటే విద్యుత్ కంపెనీల చేతుల్లో ముఖ్యమంత్రి కీలుబొమ్మగా మారారని అర్థమవుతుందన్నారు. జూలై 26న డీఈఆర్సీ ఐదు శాతం విద్యుత్టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్‌సరఫరా చేస్తుండగా ఢిల్లీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ‘ పంజాబ్‌లో కమర్షియల్ యూనిట్‌కి రూ.5.74, మీడియం యూనిట్ కి రూ.6.26, లార్జ్ యూనిట్‌కి రూ.6.33 ఉంది. నగరంలో మాత్రం యూనిట్ రూ.7 వసూలు చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు 30శాతం తగ్గిస్తామన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. విధానసభ ఎన్నికల్లో గెలుపు తర్వాత వెంటనే విద్యుత్ టారిఫ్‌లపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. -
విద్యుత్ చార్జీలు పెంపుతో పెనుభారం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో ప్రత్యేక కనెక్షన్లు ఉన్నవారికి విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.6.50 నుంచి రూ.7కి పెంచడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) వెనుక ఉన్న ప్రభుత్వమే ఈ విధానాలకు కారణమని ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ విమర్శించారు. సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘ దాదాపు 4వేల హౌసింగ్ సొసైటీల్లో నివసిస్తున్న రెండు లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభుత్వ నిర్ణయ భారం పడుతుంది. పజా సంక్షేమానికి కృషిచేయాల్సిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విద్యుత్ కంపెనీలకు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి విద్యుత్ కంపెనీలకు మధ్య ఇప్పటికే చీకటి ఒప్పదం కుదిరింద’ని ఆయన ఆరోపించారు. మూడేళ్లలో 72శాతం విద్యుత్ చార్జీలు పెంచారని విజయ్‌గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు పెంపుదల చూస్తుంటే విద్యుత్ కంపెనీల చేతుల్లో ముఖ్యమంత్రి కీలుబొమ్మగా మారారని అర్థమవుతుందన్నారు. జూలై 26న డీఈఆర్సీ ఐదు శాతం విద్యుత్టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్‌సరఫరా చేస్తుండగా ఢిల్లీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ‘ పంజాబ్‌లో కమర్షియల్ యూనిట్‌కి రూ.5.74, మీడియం యూనిట్ కి రూ.6.26, లార్జ్ యూనిట్‌కి రూ.6.33 ఉంది. నగరంలో మాత్రం యూనిట్ రూ.7 వసూలు చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు 30శాతం తగ్గిస్తామన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. విధానసభ ఎన్నికల్లో గెలుపు తర్వాత వెంటనే విద్యుత్ టారిఫ్‌లపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. -
ఆమ్ ఆద్మీ ఐదో జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో తమపార్టీ తరఫున పోటీచేసే ఏడుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన ఐదో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. దీనిలో బురాడి, ద్వారకా, గాంధీనగర్, జనక్‌పురి, కరోల్‌బాగ్, మెహ్రౌలీ సీటీ నుంచి పోటీపడనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరిలో సామాజిక కార్యకర్తలతోపాటు ఢిల్లీపోలీస్కి చెందిన ఓ రిటైర్డు కానిస్టేబుల్, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఉన్నారు. ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పటివరకు 40 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగిలిన సీట్ల అభ్యర్థులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. కార్యకర్తల డిమాండ్లకు అనుగుణంగా ఈ సీట్లకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆప్ నేతలు తెలిపారు. అభ్యర్థులు వీరే..: బురాడి నుంచి ఆమ్ఆద్మీ పార్టీ తరఫున సంజీవ్‌ఝా పోటీకి దిగనున్నారు. సంజీవ్‌ఝా తన మిత్రులతో కలిసి 12 ఏళ్లుగా ఢిల్లీలోని పలు బస్తీల్లో చిన్నారులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. స్థానిక యువకులతో కలిసి ‘నవపల్లవ్’అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పారు. పనికోసం ఢిల్లీకి వచ్చేవారికి సంస్థఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అన్నాహజారే ఆందోళనల్లోనూ మొదటి నుంచి పాల్గొంటున్నారు. ఢిల్లీ పోలీస్‌కి చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్ కృష్ణకుమార్ రాటీ పార్టీ తరఫున ముండుకా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అన్నా హజారే జన్‌లోక్‌పాల్ ఉద్యమం చే స్తున్న సమయంలో కృష్ణ కుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పేపర్లలో అన్నాహజారే ఉద్యమ వార్తలు చదివి, ఉద్యోగం వదులుకుని ఉద్యమంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ద్వారకాసిటీ నుంచి పోటీచేస్తున్న దాయిత్వ్ రవి సూర్యన్ 2000 నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.పేదలకోసం ఉచితంగా హోమియో థెరఫీ చికిత్స కేంద్రాన్ని నెలకొల్పారు. పేద తల్లిదండ్రుల కూతుళ్ల పెళ్లిళ్లు చేయడంలో ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు. గతంలో బీజేపీ కిసాన్ మోర్చాలో పనిచేశారు. పాత ఢిల్లీలోని గాంధీనగర్ నుంచి పోటీకి దిగుతున్న స్వతంత్ర సేనానీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నోఏళ్లుగా పనిచేస్తున్నారు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. కరోల్‌బాగ్ స్థానానికి పోటీచేస్తున్న యువ సమాజసేవకి విశేష్వ్రి ఢిల్లీవికాస్ సంస్థ ఉద్యోగి. పౌరహక్కులకోసం ఉద్యమిస్తున్నారు. పశ్చిమ ఢిల్లీ జనక్‌పురి సిటీ నుంచి రాజేశ్శ్రషి పోటీ చేయనున్నారు. బీహార్‌లో నిర్వహించిన ఓ సెమినార్లో మాజీ రాష్ట్రపతి అబ్దుకలాం ప్రసంగం విన్నతర్వాత రాజేశ్‌లో ఎంతో మార్పు వచ్చింది. తన మిఠాయి దుకాణాన్ని మానుకుని బీహార్‌లోని ప్రతి గ్రామానికి తిరిగి బిందుసేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న సామాజిక ఆందోళనల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. నరేంద్ర సెజవాల్ను ఆమ్ఆద్మీపార్టీ మహరౌలీ సిటీ నుంచి పోటీకి దింపుతోంది. కాశ్మీర్ నుంచి నిరాశ్రయులుగా ఢిల్లీకి చేరేవారికోసం స్నేహితులతో కలిసి పాటుపడుతున్నారు.పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. -
సీఎం పరువు నష్టం కేసు విజేందర్‌పై అభియోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం...బీజేపీ నేత విజేందర్ గుప్తాపై మంగళవారం పరువునష్టం అభియోగాలను నమోదుచేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని 150వ సెక్షన్ కింద గుప్తాపై అభియోగాలను ఖరారు చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నమ్రితా అగర్వాల్ పేర్కొన్నారు. అక్టోబర్ 28వ తేదీలోగా న్యాయస్థానానికి హాజరై షీలాదీక్షిత్ వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించారు. గతేడాది మున్సిపల్ ఎన్నికలకు ముందు విజేందర్ గుప్తా తనపై అనుచిత భాషను ఉపయోగించారని, తనకు పరువు నష్టం కలిగించారని షీలాదీక్షిత్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హజరుకాకుండా ఉండడం కోసం తన క్లయింట్‌కు మినహాయింపు ఇవ్వాలని షీలాదీక్షిత్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. అయితే దీనిని గుప్తా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. విచారణ తేదీ గురించి షీలాదీక్షిత్‌కు ముందుగానే తెలుసని, అందువల్ల మినహాయింపునకు తగిన ఆధారాలు లేవని గుప్తా తరపు న్యాయవాది అజయ్ బర్మన్ వాదించారు. విద్యుత్ కంపెనీలతో కుమ్మక్కై, వాటికి సహాయపడ్డారని షీలాదీక్షిత్‌పై గుప్తా ఆరోపణలు చేసి ఆమె పరువుకు భంగం కలిగించినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి తేలిందని న్యాయస్థానం గత నెల ఒకటో తేదీన అభిప్రాయపడింది. అయితే ఈ ఆరోపణను గుప్తా మంగళవారం తోసిపుచ్చారు. ఈ అభియోగాలు తనను అవమానానికి గురిచేస్తున్నాయన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎక్కడా ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే పదాలను ఉపయోగించలేదని చెప్పారు. ఒక వేళ తాను తప్పు చేస్తే వెంటనే కారాగారంలో పెట్టాలని అన్నారు. అయితే సరైన కారణాలను చెప్పకుండానే ముఖ్యమంత్రి కోరుకున్న ప్రతిసారీ మినహాయింపు పొందుతున్నారని, తాను మాత్రం మినహాయింపు కోరినందుకు చిన్న చిన్న వివరాలను కూడా సమర్పించాల్సి వస్తోందన్నారు. ఇది తనను వేధించడమేనని అన్నారు. కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు తాను మినహాయింపు కోరినప్పుడు తనకు అనుమతి లభించడం లేదని, ముఖ్యమంత్రికి మాత్రం గైర్హాజరీకి మాత్రం అనుమతి లభిస్తోందన్నారు. దీంతో తదుపరి విచారణ తేదీన షీలాదీక్షిత్ హాజరుకాకపోతే ఆమెపై చర్య తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ తేదీన షీలాదీక్షిత్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని తెలిపింది. -
తుంగభద్రకు పోటెత్తిన వరద
హొస్పేట, న్యూస్‌లైన్ : తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, చిక్కమగళూరు, శృంగేరి, తీర్థహళ్లి తదితర మలెనాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో సోమవారం డ్యాంలోని మొత్తం 33 క్రష్ట్ గేట్లలో 25 క్రష్ట్ గేట్లను నాలుగు అడుగులు మేర, మిగత 8 క్రస్ట్ గేట్లను ఒక్క అడుగు మేర పైకి ఎత్తి దిగువకు 1,60,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి ఇంకా రెండు రోజులు కొనసాగవచ్చని, లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని మండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1631.86 అడుగులు, కెపాసిటీ 96.491 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 1,74,860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,60,000 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. తుంగభద్ర లోతట్టు ప్రాంతాలు జలమయం..: తుంగభద్ర ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతమైన హంపిలోని పురంధరదాసు మండపంతోపాటు ఇతర అనేక స్మారకాలు పూర్తిగా నీట మునిగాయి. అదే విధంగా హంపిలో ఉన్న రామలక్ష్మణ ఆలయంలోకి వరద నీరు పోటెత్తింది. ఆలయం ముందున్న ధ్వజ స్థంభం సగానికి పైగా నీట మునిగింది. ఆలయం పక్కనున్న హోటళ్లోకి కూడా వరద నీరు భారీగా చేరింది. కాగా హంపికి వచ్చిన విదేశీ పర్యాటకులు తుంగభద్రమ్మ వరద ఉధృతిని వీక్షించి ఆనందిస్తున్నారు. -
కోర్టుకు చేరిన చేరన్ కుమార్తె ప్రేమ వ్యవహారం
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : దర్శకుడు చేరన్ కూతురు దామిని ప్రేమ వ్యవహారం తీవ్రమవుతోంది. దామిని అమాయకురాలని, ప్రేమ పేరుతో చంద్రు మోసం చేస్తున్నారని, అతనిది నేరపూరిత చరిత్ర అని చేరన్ దంపతులు ఆరోపించారు. దామిని మాత్రం తన ప్రేమికుడ్ని వదిలేది లేదంటూ స్పష్టం చేసింది. చేరన్ వర్గం తనను మోసగాడిగా చిత్రీకరిస్తున్నట్లు చంద్రు ఆరోపిస్తున్నాడు. మరోపక్క డ్యాన్సర్‌గా అతను అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన దృశ్యాలు ఇంటర్నెట్లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి. మరో పక్క పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఈ వ్యవహారం తాజాగా కోర్టుకెక్కింది. చంద్రు తల్లి చేరన్ కూతుర్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తులు ధనపాలన్, సి.బి సెల్వం సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. చంద్రు తల్లి ఈశ్వరి అమ్మాళ్ తరపున న్యాయవాది శంకర సుబ్బు వాదనలు వినిపించారు. దర్శకుడు చేరన్ కూతురు దామినిని చంద్రు ప్రేమించారని తెలిపారు. దీంతో చేరన్ తన అనుచరులతో అతనిపై హత్యాయత్నం చేయించారని తెలిపారు. ఈ విషయమై చేరన్ కూతురు దామిని పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. అయినా దామినిని పోలీసులు విచారణ పేరుతో సంరక్షణ హాస్టల్లో ఉంచారని ఆరోపించారు. ఈ కేసును అత్యవసర విభాగంలో విచారించాలని కోరారు. వాదోపవాదాలను విన్న న్యాయమూర్తులు ఈ కేసును అత్యవసర విచారణకు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదే విదంగా చేరన్ కూతురు దామినిని కోర్టుకు హాజరు పరచాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు దామినిని కోర్టులో హాజరుపరిచారు. అదే విధంగా చేరన్ తన భార్య, పెద్ద కూతురుతో కోర్టుకు హాజరయ్యారు. -
ఉల్లి ధరలు ఘాటెక్కి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉల్లి ధరలు ఘాటెక్కి వినియోగదారుల కంట తడి పెట్టిస్తున్నాయి. రాష్ర్టంలో బాగా వర్షాలు కురిశాయని ఆనందించాలో, ఆ వర్షాలే ఉల్లి పంటను నాశనం చేశాయని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో సోమవారం కిలో ఉల్లి ధర రూ.45 పలికింది. గత వారం రూ.30 ఉన్న ధర అమాంతం యాభై శాతం పెరిగింది. రంజాన్‌తో పాటు ఇతర పండుగలు సమీపిస్తున్నందున ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడం కూడా ధర పెరుగుదలకు కారణమని వారు విశ్లేషించారు. రాష్ట్రంలో స్థానికంగా చిత్రదుర్గ, చిక్కమగళూరు, దావణగెరె జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే భారీ వర్షాల వల్ల ఈ జిల్లాల్లో ఉల్లి పంట భారీగా దెబ్బతింది. ప్రస్తుతం ఈ జిల్లాల నుంచి రోజుకు 300 బస్తాల ఉల్లి మాత్రమే వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో నగరానికి రోజుకు 25 వేల బస్తాలు వచ్చేవి. ప్రస్తుతం 15 వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇక తమిళనాడు నుంచి వస్తే తప్ప ఆకాశం బాట పట్టిన ధరలు దిగి వచ్చేలా లేవు. అయితే ఈ నెలాఖరుకు కానీ అక్కడ పంట చేతికి రాదు. అప్పటి వరకు ధరలు తగ్గే సూచనలు లేవని వ్యాపారులు తెలిపారు. దైనందిన జీవితంలో ఉల్లికి ఉండే గిరాకీ అందరికీ తెలిసిందే. రోజు వారీ వీటి వినియోగం నగరంలో కొన్ని వేల కిలోలు ఉంటుంది. యశ్వంతపుర మార్కెట్ యార్డులో ఉల్లిని టోకుగా విక్రయిస్తారు. అక్కడే కిలో రూ.40 వరకు పలుకుతోందని టోకు వ్యాపారులు తెలిపారు. -
విమర్మల జోరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఈ నెల 21న జరుగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమయ్యాయి. అప్పుడే విమర్శల పర్వం ప్రారంభమైంది. జేడీఎస్‌కు చెందిన హెచ్డీ. కుమారస్వామి, ఎన్. చలువరాయస్వామిలు శాసన సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కుమారస్వామి రాజీనామా చేసిన బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి ఆయన సతీమణి అనితా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే. సురేశ్ బరిలో ఉన్నారు. చలువరాయ స్వామి రాజీనామా చేసిన మండ్య స్థానంలో బహు భాషా నటి రమ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టస్వామి రంగంలో ఉన్నారు. బీజేపీ కూడా రంగంలో ఉన్నప్పటికీ పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనేది బహిరంగ రహస్యం. రమ్య వైరాగ్యం మండ్యలో శనివారం నామినేషన్‌ను దాఖలు చేసిన సందర్భంలో తన పెంపుడు తండ్రి ఆర్టీ. నారాయణ్ గుండె పోటుతో మరణించడంతో నటి రమ్య ఖిన్నులయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి తీవ్రంగా కుంగిపోయారు. ఉప ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి కూడా లేదని చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు గాబరా పడ్డారు. ఆమెకు ధైర్యం నూరిపోసి పోటీకి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి రంజితతో పాటు తన ఆప్తులతో సమాలోచనలు సాగించిన అనంతరమే ఆమె ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారాయణ్ అంత్యక్రియలను ఆదివారం మైసూరులో నిర్వహించారు. ఈ కార్యాలకు హాజరైన కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రి అంబరీశ్ల వద్ద రమ్య తన అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. తండ్రి సూచన మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, ప్రజా సేవకు లభించిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని వారు ఆమెను అనునయించినట్లు సమాచారం. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఆమెను బరిలో కొనసాగించడం తప్ప కాంగ్రెస్‌కు వేరే మార్గం లేకుండా పోయింది. జేడీఎస్‌పై సీఎం విమర్శలు ఉప ఎన్నికల్లో బీజేపీతో అవగాహనకు రావాలని ప్రయత్నించడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జేడీఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. బెంగళూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పార్టీల అవగాహన వల్ల కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని, జేడీఎస్ అసలు రంగు బయట పడుతుందని తెలిపారు. తాము లౌకికవాదులమని చెప్పుకునే జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామిల గురించి ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. మత తత్వ పార్టీలకు, జేడీఎస్‌కు మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. పార్టీ పేరుకు సెక్యులర్ అని తగిలించుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. కాగా పెంపుడు తండ్రి ఆకస్మిక మరణంతో నటి రమ్య పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితుల్లో వెనక్కు తగ్గడం సాధ్యం కాదని ఆమెకు నచ్చజెప్పామని ఆయన వివరించారు. -
సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాఫీగా జరిగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని మన్మోహన్సింగ్ సోమవారం విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత రెండు మూడు సమావేశాల్లో ఎంతో సమయం వృథా అయిందని, దాన్ని ఈసారి పునరావృతం కానీయొద్దని ఉదయం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఆయనన్నారు. కానీ తర్వాత కాసేపటికే ఆయన సొంత పార్టీ ఎంపీలే ఉభయ సభలనూ పదేపదే స్తంభింపజేయడం విశేషం! -
రాజకీయ లబ్ధి కోసమే ‘తెలంగాణ’: బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలత ప్రకటించిందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణపై కాంగ్రెస్ ఇవాళ పార్లమెంటులో సైతం తీవ్ర వ్యతిరేకత చవి చూసింది. దీనంతటికీ అంత అవసరమేమొచ్చిందన్నదే మా ప్రశ్న’ అని అన్నారు. తెలంగాణ కారణంగా డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోనూ గూర్ఖాలాండ్ ఉద్యమం మళ్లీ భగ్గుమంటోందని, తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సూత్రాన్నే పాటించామని, కాంగ్రెస్ అందుకు భిన్నంగా కొత్తగా రాష్ట్రాలను విభజిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో ‘తెలంగాణ’ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు జోరందుకుంటాయన్నారు. డార్జిలింగ్ ప్రస్తుత పరిస్థితికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు బాధ్యత వహించాలన్నారు. కాగా, అవినీతిపరులకు, పెత్తందార్లకు తమ పార్టీలో ఎలాంటి చోటు లేదని బుద్ధదేవ్ అన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. చెన్నై నాగపట్టణం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నరిణంపుదుపల్లం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అలాగే చెంగల్పట్టు సమీపం ఏడాలం జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : తంజావూరు జిల్లా ఓరత్తనాడు కణ్ణన్కుడి ప్రాంతానికి చెందిన మణిమారన్ (29), సతీస్ కుమార్(27), లక్ష్మీ కందన్ (29), శరవణన్ (28), ఇళయరాజ (28) స్నేహితులు. వీరు తాంబరం పెరుంగళత్తూరులోని అద్దె ఇంటిలో ఉంటూ శ్రీ పెరుంబుదురూర్, తాంబరం తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ముట్టుకాడులో సినిమా చూసేందుకు కారులో వెళ్లారు. సినిమా చూసిన అనంతరం కారులో బయలుదేరారు. ముట్టుకాడు బస్స్టాపింగ్ సమీపంలో కారు వేగంగా వస్తున్న సమయంలో హఠాత్తుగా పశువు రోడ్డపైకి వచ్చింది. డ్రైవర్ హఠాత్తుగా బ్రేకులు వేయడంతో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మణిమారన్, కృష్ణకుమార్ ఇద్దరూ సంఘటనా స్థలంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని స్థానికులు కేళంబాక్కం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న అడయార్ ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ రవికుమారన్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగపట్టణం నరిమణం పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నాగలింగం (50), అదే ప్రాంతానికి చెందిన రైతు భక్తవత్సలం (55) కలసి ఆదివారం రాత్రి నాగైకు బైకులో బయలు దేరారు.అలాగే తిరుచ్చి పెరియార్ నగర్‌కు చెందిన 8 మంది ఆమ్ని వ్యాన్‌లో వేలాంగనికి పర్యాటనకు వెళ్లి అక్కడ నుంచి కారైకాల్‌కు వెళుతున్నారు. నరిణంపుదుపల్లం సమీపంలో వెళ్తుండగా బైకును వ్యాన్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైకులో వెళ్తున్న నాగలింగం భక్తవత్సలం ఇద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ మరియసూసై, వ్యాన్‌లో ప్రయాణిస్తున్న విజయ్ (19)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నాగపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందాడు. పోలీసులు కేసువిచారణ జరుపుతున్నారు. వ్యానును ఢీ కొన్న కారు కొరుక్కుపేట: చెంగల్పట్టు సమీపంఏడాలం జంక్షన్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుచ్చి నుంచి చెన్నైకు వస్తున్న కారు చెంగల్పట్టు సమీపంలోని జీఎన్శెట్టి రోడ్డు, ఏడాలం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొనింది. అదే సమయంలో పాడిలోని మేల్మలైయనూర్లోని అంగాలమ్మన్ ఆలయానికి వెళ్తున్న వ్యానును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యానులో ప్రయాణిస్తున్న 16 మంది గాయపడ్డారు. పాత పెరుంగలత్తూర్కు చెందిన జే విజ్ఞాశ్వరన్(26) తల్లిదండ్రులు సరళామణి (48),జ్యోతిలింగం(62)లతో కలసి తిరుచ్చి వెళ్లాడు. తిరిగి కారులో ఇంటికి వస్తున్నారు. కారును విజ్ఞాశ్వరన్ నడుపుతున్నారు. ఏడాలం వద్ద రోడ్డు దాటుతున్న ఎస్దానం(40) అనే మహిళను కారు ఢీ కొనింది. అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న వ్యానును కూడా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు,కారు ఢీకొన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యానులో ఉన్న 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని చెంగల్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పడాలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆహార చట్టాన్ని అనుమతించం : ముఖ్యమంత్రి జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆహార భద్రతా చట్టాన్ని ఎంతమాత్రమూ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. చట్టం తీరుపై కేంద్రాన్ని, దీనికి మద్దతు పలికిన డీఎంకే అధినేత కరుణానిధిని ఆమె దుయ్యబట్టారు. ఆహార భద్రతా చట్టమంతా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. అరుుతే చట్టం రూపకల్పనను లోతుగా విశ్లేషిస్తే మూడేళ్ల తర్వాత బియ్యం కిలో రూ.20 లెక్కన పేదలు కొనుగోలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై వేలకోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనం కోసం ఈ చట్టాన్ని హడావుడిగా ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. రెండు నాల్కల కరుణ తమిళ ప్రజలను పీక్కుతినగల ఆహార భద్రతా చట్టంపై డీఎంకే అధినేత కరుణానిధి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని జయలలిత దుయ్యబట్టారు. ఈ ఏడాది మార్చిలో యూపీఏకు డీఎంకే గుడ్‌బై చెప్పినప్పుడు కేంద్రానికి బయట నుంచి మద్దతిస్తారా అని మీడియా ప్రతినిధి కరుణను ప్రశ్నించారన్నారు. ఎంతమాత్రం లేదని కరుణ సమాధానం ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆహార భద్రతా చట్టం అమలులో ఉన్న అనేక సాదక బాధకాలపై తమ సభ్యు లు పార్లమెంటులో నిలదీస్తారని పేర్కొన్నారన్నారు. ఇందుకు తగినట్లుగా టి.ఆర్.బాలు తదితర సభ్యులు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీసినట్లు పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయని తెలిపారు. అయితే అకస్మాత్తుగా డీఎంకే పార్లమెంటు సభ్యులు ఇళంగోవన్ ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తుతిస్తూ ప్రసంగించారన్నారు. కరుణ సైతం ఇది చాలా మంచి చట్టమని పొగుడుతూ మద్దతు పలకబోతున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ చట్టం ఆమోదానికి అండగా నిలవడం ద్వారా కరుణ తన రెండు నాల్కల ధోరణి చాటుకున్నారని జయ వ్యాఖ్యానించారు. అంతేగాక చట్టాన్ని స్వాగతించడం ద్వారా తమిళులకు ఆయన ద్రోహం చేశారని విమర్శించారు. తాను మాత్రం అభ్యంతరం పలుకుతూ ప్రధానికి లేఖ రాశానని గుర్తు చేశారు. లోపభూయిష్టమైన ఆహార భద్రతా చట్టాన్ని తమిళనాడుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జయలలిత సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
రెండో విడత కౌన్సెలింగ్‌కు శ్రీకారం
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్, దంత వైద్యకోర్సుల సీట్ల సంఖ్య పెరిగింది. వీటి భర్తీ నిమిత్తం మలి విడత కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. వైద్య సీట్ల పెంపుపై అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఆరోగ్యశాఖ నేతృత్వంలో 18 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1823 ఎంబీబీఎస్ సీట్లు, 11 స్వయం ప్రతిపత్తి హోదా (ప్రరుువేటు) కళాశాలల్లో 838 సీట్లు ఉన్నాయి. చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 70 సీట్లు, 18 ప్రయివేటు దంత వైద్య కళాశాలల్లో 909 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి 28,788 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సీట్లను గత నెల భర్తీ చేశారు. సీట్లు దక్కని వాళ్లు నిరుత్సాహపడే సమయంలో భారత మెడికల్ కౌన్సిల్ శుభవార్త పంపింది. దీంతో అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. సీట్ల పెంపు ఈ విద్యా సంవత్సరానికి అదనపు సీట్లను రాష్ట్రానికి కేటాయిస్తూ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సీట్లు ఏఏ కళాశాలలకు అనేది తేలడంలో జాప్యం నెలకొంది. ఫలితంగా కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇది వరకు ప్రకటించిన ర్యాండం నెంబర్లు, ర్యాంకుల ఆధారంగా ఈ సీట్ల భర్తీకి నిర్ణయించారు. ఈ క్రమంలో సీట్ల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాల్ని మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ మేరకు చెన్నై ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 85, స్టాన్లీ వైద్య కళాశాలకు 100, సేలం వైద్య కళాశాలకు 25, తిరుచ్చికి 50, తూత్తుకుడికి 50, తిరువణ్ణామలైకు 100 సీట్లు కేటారుుంచారు. కేంద్రానికి పోను రాష్ర్ట ప్రభుత్వ కోటా కింద 349 సీట్లు దక్కాయి. ఇది వరకు ఖాళీగా ఉన్న ఏడు సహా మొత్తం 356 ప్రభుత్వ కోటా సీట్ల భర్తీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే కేకేనగర్ ఈఎస్ఐసీ తదితర పది ప్రయివేటు కళాశాలలకు అదనంగా కేటాయించిన 714 సీట్ల భర్తీకి నిర్ణయించారు. ఇక చెన్నై ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు అదనంగా 100 సీట్లు వచ్చాయి. ఇందులో 15 కేంద్ర ప్రభుత్వ కోటా, 85 రాష్ర్ట ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. అలాగే పదిహేను ప్రయివేటు దంత వైద్య కళాశాలలకు 937 సీట్లను కేటాయించారు. వీటన్నింటినీ రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయూలని అధికారులు నిర్ణయించారు. కీల్పాకం వైద్య కళాశాల వద్ద సోమవారం ఉదయం 9 గంటలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలి రోజు రెండు వందల మంది అభ్యర్థులను ఆహ్వానించారు. సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు తమ ఆప్తులతో ఆనందాన్ని పంచుకున్నారు. -
తీర గ్రామాలను ముంచెత్తుతున్న వరదనీరు
కావేరి వరదలో చిక్కుకున్న నలుగురు రాత్రంతా నరకయాతన అనుభవించారు. జాతీయ విపత్తుల నివారణ బృందం రంగంలోకి దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లి విరిసింది. మరోవైపు కావేరి ఏ మాత్రమూ శాంతించడం లేదు. ఎప్పుడేం జరుగుతుందోనని తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, చెన్నై: కర్ణాటకలోని వర్షాలతో కావేరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం నాటి పరిస్థితే సోమవారమూ కొనసాగింది. మెట్టూరు డ్యాం నిండిపోవడంతో ఉబరి నీళ్లను బయటకు పంపుతున్నారు. డ్యామ్‌లోకి 1.5 లక్షల ఘనపుటడుగుల నీళ్లు వస్తున్నాయి. అలాగే 1.2 లక్షల ఘనపుటడుగుల నీటిని బయటకు పంపుతున్నారు. మెట్టూరు నుంచి ఉబరి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో డెల్టా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర గ్రామాల్లో తిష్ట వేసి పరిస్థితిని సమీక్షిస్తోంది. చిన్నపాటి వరద ముప్పు హెచ్చరిక జారీ అయినా ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సర్వం సిద్ధం చేసింది. కొన్ని గ్రామాలను వరద ముంచెత్తడంతో అక్కడి వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించింది. కొట్టుకెళ్లిన నలుగురు: ధర్మపురి జిల్లా చెల్లంకోట్టైకు చెందిన మాధయ్యన్(50) బంధువు మరణించారు. ఆయన కర్మకాండ చేస్తూ వరద నీటిలో మాధయ్యన్ ఆదివారం కొట్టుకెళ్లారు. ఆయన్ను రక్షించేందుకు ఎనిమిది మంది రెండు బుట్ట పడవల్లో వెళ్లారు. వరద పెరగడంతో ఆ పడవలు బోల్తా కొట్టాయి. దీంతో అందులో ఉన్న వాళ్లు కావేరిలో పడ్డారు. ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అయితే మాధయ్యన్, జాలర్లు రామకృష్ణన్, ముత్తు, సహదేవన్ వరదలో చిక్కుకుపోయూరు. ఫలించిన కృషి: హొగ్నెకల్ వద్ద కావేరిలో చిక్కుకున్న వీరిని రక్షించేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రాత్రంతా చెట్టు మీదే ఆ నలుగురు నరకయాతన అనుభవించారు. నీటి ఉద్ధృతి కారణంగా తమ వాళ్లు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదోనన్న ఆందోళన బాధిత కుటుంబాల్లో నెలకొంది. ధర్మపురి కలెక్టర్ వివేకానంద, ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిబ్బంది ఆదివారం రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. హ్యాండ్ మైక్ ద్వారా బాధితులకు ధైర్యం చెబుతూ వచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జాతీయ విపత్తుల నివారణ బృందం సభ్యులు హొగ్నెకల్‌కు చేరుకున్నారు. తాళ్ల సాయంతో నీటిలోకి దిగేందుకు ఆ బృందం పలుమార్లు ప్రయత్నించింది. ఓ దశలో ఇద్దరు సభ్యులు నీటి ఉద్ధృతికి కొట్టుకెళ్లారు. అయితే ఆ ఇద్దరూ ఈతగాళ్లు కావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రెండు హెలికాప్టర్లను సోమవారం రంగంలోకి దించారు. వీటి ద్వారా ఒక్కొక్కరినీ అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. వీరికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం హొగ్నెకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కావేరి ఉగ్ర తాండవాన్ని ఎదుర్కొని వీరోచితంగా పోరాడి నలుగుర్ని రక్షించిన ఆ బృంద సభ్యులు, హెలికాప్టర్ పెలైట్లను స్థానికులు అభినందించారు. వారి కరచలనం కోసం పోటీపడ్డారు. -
ప్రీతిరాఠీ కేసును సీబీఐతో విచారణ జరిపించండి
ప్రీతి రాఠీ మృతి కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె తండ్రి అమర్‌సింగ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. నగర పోలీసుల అచేతనత్వంతో విసిగిపోయిన అమర్‌సింగ్... ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించాలని తన పిటిషన్లో అభ్యర్థించారు. ఢిల్లీకి చెందిన ప్రీతి రాఠీ ఉద్యోగంలో చేరేందుకు ఈ ఏడాది మే నెల రెండో తేదీన బాంద్రా రైల్వేస్టేషన్లో దిగింది. అంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలపాలైన ప్రీతి ని స్థానిక బాంబే ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ జూన్ నెల ఒకటో తేదీన మరణించింది. అదే నెల నాలుగో తేదీన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఆమెకు అంత్యక్రియలు జరిగిన సంగతి విదితమే. ‘ప్రణాళికాబద్ధంగా ఈ దాడి జరిగింది. ఇప్పటికీ నిందితులెవరనే విషయాన్ని పోలీసులు కనుగొనలేకపోయారు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడే నిందితుడని చెప్పలేం. నగర పోలీసుల దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు. అందువల్ల ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించండి’ అని అమర్‌సింగ్ తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ విషయాన్ని అమర్‌సింగ్ తరఫు న్యాయవాది గౌతమ్ ప్యారేలాల్ వెల్లడించారు. -
ప్రీతిరాఠీ కేసును సీబీఐతో విచారణ జరిపించండి
ప్రీతి రాఠీ మృతి కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె తండ్రి అమర్‌సింగ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. నగర పోలీసుల అచేతనత్వంతో విసిగిపోయిన అమర్‌సింగ్... ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించాలని తన పిటిషన్లో అభ్యర్థించారు. ఢిల్లీకి చెందిన ప్రీతి రాఠీ ఉద్యోగంలో చేరేందుకు ఈ ఏడాది మే నెల రెండో తేదీన బాంద్రా రైల్వేస్టేషన్లో దిగింది. అంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలపాలైన ప్రీతి ని స్థానిక బాంబే ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ జూన్ నెల ఒకటో తేదీన మరణించింది. అదే నెల నాలుగో తేదీన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఆమెకు అంత్యక్రియలు జరిగిన సంగతి విదితమే. ‘ప్రణాళికాబద్ధంగా ఈ దాడి జరిగింది. ఇప్పటికీ నిందితులెవరనే విషయాన్ని పోలీసులు కనుగొనలేకపోయారు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడే నిందితుడని చెప్పలేం. నగర పోలీసుల దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు. అందువల్ల ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించండి’ అని అమర్‌సింగ్ తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ విషయాన్ని అమర్‌సింగ్ తరఫు న్యాయవాది గౌతమ్ ప్యారేలాల్ వెల్లడించారు. -
వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ చిప్‌లు
టోల్‌నాకాల వద్ద రుసుములు వసూలు చేసే ప్రక్రియను మరింత వేగవంతమయ్యేలా చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. టోల్‌నాకాల వద్ద వాహనాల కదలికలను గమనించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాన్ని (ఆర్ఎఫ్ఐడీ) అమర్చుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఇటీవల అంధేరీ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ పరికరం అమర్చడం ద్వారా కలిగే లాభాలను కూడా వివరించారు. ఆర్ఎఫ్ఐడీ పరికరాన్ని అమర్చిన వాహనాల వేగాన్ని దూరం నుంచే నియంత్రించవచ్చన్నారు. ఓవర్ లోడింగ్‌ను కూడా నివారించవచ్చన్నారు. ఆర్ఎఫ్ఐడీలో వాహనాలకు సంబంధించిన మొత్తం వివరాలను పొందుపర్చుతారు. ఈ పరికరం అమర్చడంతో వాహనాల కదలికలను కూడా కంప్యూటర్లో గమనించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.వాహనాలకు ఈ పరికరం రీచార్జ్కార్డు వంటిదని, టోల్‌నాకా మీదుగా వాహనం వెళ్లగానే టోల్సెస్ మొత్తం అందులో నుంచి తగ్గి నాకా ఆపరేటర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో బ్యాలెన్స్ అయిపోగానే రీచార్జ్ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్ఎఫ్ఐడీని స్టికర్ మాదిరిగా వాహనానికి ముందు భాగంలో ఉన్న అద్దానికి అంటిస్తారు. ఇది ఒక చిప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని పేరు, ఫిట్నెస్ వివరాలు, పీయూసీ సర్టిఫికెట్‌తోపాటు రవాణా చేస్తున్న వస్తువుల పన్ను చెల్లింపు వివరాలను కూడా ఇందులో ఉంటాయి. ఈ పరికరం ట్రక్కులు, ట్యాంకర్ల వంటి భారీ వాహనాలకు బాగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. అంతేగాకుండా 22 ఆటోమేటిక్ సరిహద్దు చెక్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇందులో నాలుగు చెక్ పోస్టులను ఇది వరకే ప్రారంభించామనీ, మరో నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయనీ వివరించారు. మిగతా చెక్‌పోస్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ స్టిక్కర్లను అంటించడానికి ఠాణే ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి కొంత మేర తగ్గనుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
క్యాన్సర్ నివారణకు జెనెటిక్ కౌన్సెలింగ్
న్యూఢిల్లీ: మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ కారణంగా చనిపోయారా? ఇప్పటికీ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారెవరైనా ఉన్నారా? భవిష్యత్తులో మీకూ క్యాన్సర్ వస్తుందేమోననే భయం మీలో ఉందా? అయితే మీరు తప్పకుండా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిందే. క్యాన్సర్ నిజానికి వంశపారంపర్యమైన వ్యాధి కాకపోయినప్పటికీ వ్యాధిగ్రస్తులతో దగ్గరి సంబంధం, ప్రత్యేకించి రక్త సంబంధం ఉన్నవారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశముందనే విషయం ఎన్నో పరిశోధనల్లో తేటతెల్లమైంది. అయితే శరీరాన్ని తొలిచేసే వరకు బయటపడని ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతూనే ఉన్నారు. మరి ఈ వ్యాధిని ముందుగా గుర్తించడమెలా? ఎవరెవరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది? దీనికి పరిష్కారమేంటి? తదితర విషయాలపై అవగాహన కల్పించడమేగాకుండా క్యాన్సర్ నివారణకుగాను జెనెటిక్ కౌన్సెలింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్. క్యాన్సర్ కారణంగా మృతి చెందిన, బాధపడుతున్నవారి కుటుంబ సభ్యుల్లో అందుకు కారణమైన జన్యువులను ముందుగానే గుర్తించడం ద్వారా వ్యాధి రాకుండా చేయొచ్చని, అలా గుర్తించడం జెనెటిక్ కౌన్సెలింగ్ వల్లే సాధ్యమవుతుందంటున్నారు వైద్య నిపుణులు. సర్ గంగారాం హాస్పిటల్ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విషయమై పలుచోట్ల అవగాహన శిబిరాలను, సదస్సులను ఏర్పాటు చేసింది. క్యాన్సర్ వచ్చే అవకాశమున్నవారిని జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వచ్చేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఒకసారి ఈ వ్యాధిబారిన పడితే తలెత్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో? జెనెటిక్ కౌన్సెలింగ్ ఏ విధంగా వ్యాధి రాకుండా సాయపడుతుందో తెలియజెప్పడమేకాకుండా క్యాన్సర్ నివారణకు తమవంతు కృషి చేస్తోంది. వ్యాధి సోకినవారు కూడా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడం వల్ల భవిష్యత్తులో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై కూడా తెలుస్తుందంటున్నారు నిర్వాహకులు. వ్యాధి సోకనివారికి ఈ కౌన్సెలింగ్‌ను చేయడం ద్వారా వారు వ్యాధిబారిన పడకుండా చేయొచ్చని చెబుతున్నారు. సర్ గంగారాం ఆస్పత్రిలోని జెనెటిక్ విభాగం డెరైక్టర్ డాక్టర్ ఐసీ వర్మ ఈ విషయమై మాట్లాడుతూ... ‘రొమ్ము, ఆండాశయం, కళ్లు(రెటీనోబ్లాస్టోమా), మెదడు, థైరాయిడ్, మూత్రపిండాలు, పిత్తాశయము తదితర అవయవాలకు క్యాన్సర్ సోకేందుకు కారణమయ్యే జన్యువులను జె నెటిక్ టెస్టింగ్ వల్ల తెలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా పరీక్షించినప్పుడు పాజిటివ్ రిపోర్టు వస్తే క్యాన్సర్ సోకకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. అంతేకాక క్యాన్సర్ సోకిన తర్వాత సంబంధిత అవయవాలు తొలగించడం వంటివాటిని కూడా నివారించవచ్చు. కీమో థెరపీ వంటి అత్యంత బాధాకరమైన చికిత్స జోలికి వెళ్లకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. క్యాన్సర్ సోకకుండా ఉండేలా ఎటువంటి జీవన శైలిని అవలంబించాలనే విషయమై ఓ అవగాహనకు రావొచ్చు. ఇదంతా జెనెటిక్ టెస్టింగ్‌కు వెళ్లినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంద’న్నారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఈ కార్యక్రమంలోభాగంగా సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించడం, సోకినవారి జీవిత కాలాన్ని పెంచేందుకు అవసరమైన చికిత్సను అందించడం, మమ్మోగ్రాఫ్స్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం వంటివి కూడా చేస్తున్నామన్నారు. ఇవన్నీ అనుభవం కలిగిన, నిపుణులైన జెనెటిక్ కౌన్సెలర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయని చెప్పారు. -
తండ్రిని చంపిన కుమారుడికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: ఆస్తికోసం తండ్రిని చంపి తల్లి మీద హత్యాయత్నం చేసిన 38 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఫిబ్రవరి 7వ తేదీ 2012న నిందితుడు చంద్రమోహన్ దింగ్రా తల్లిదండ్రుల పేరున ఉన్న ఆస్తిని కబలించాలని దాడి చేశాడు. తండ్రి హర్నామ్దింగ్రాను కత్తితో పొడిచి చంపుతుండగా తల్లిని కూడా హత్య చేస్తానని బెదిరించాడు. భర్తను రక్షించుకొనే ప్రయత్నంలో అడ్డుతగిలిన తల్లి తల మీద కూడా పలుమార్లు కత్తితో పొడిచాడు. తరువాత తనకు తానుగా కత్తితో గాయాలుచేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. రక్తం మడుగులో పడి ఉన్న దంపతులను గమనించిన ఇరుగుపొరుగు సమాచారం అందించడంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా హర్నామ్ అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు. పోలీసులు చంద్రమోహన్ దింగ్రా మీద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారణ జరిపిన జిల్లా జడ్జి పీఎస్ తేజీ ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి నిందితుడిని దోషిగా ప్రకటించారు. -
ఫ్యామిలీ కోర్టుల బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో ఫ్యామిలీ కోర్టులను పటిష్టం చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. మురికి నాలాల పూడికతీత, సఫాయి కార్మికుల హోదాని పెంచాలని సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు. కేసుల భారాన్ని తగ్గించేందుకే... ఢిల్లీలో తొలి ఫ్యామిలీ కోర్టును 2009, మే 15న ద్వారకా జిల్లా న్యాయస్థానం కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేశారు. విడిపోయిన కుటుంబసభ్యుల మద్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నించడంతో పాటు కేసులు ఎక్కువైన సాంప్రదాయ కోర్టుల పైనుంచి వైవాహిక కుటుంబపరమైన వివాదాల కేసుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 9 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. 2012, డిసెంబర్ 17 నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీలో 11 సివిల్ డిస్ట్రిక్ట్స్ ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఢిల్లీని 11 మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా విభజించారు. దీంతో నగరంలో 11 ప్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టుల కోసం ఒక ప్రిన్సిపల్ జడ్జి, 10 మంది జడ్జిలు ఉన్నారు. కానీ 11 ఫ్యామిలీ కోర్టులకు ఒక్కొక్క ప్రిన్సిపల్ జడ్జి ఉండాలన్న ఉద్దేశంతో పది మంది జడ్జిలకు పదోన్నతి కల్పించి ప్రిన్సిపల్ జడ్జిలుగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ బిల్లుకు ఆమోదం నగరంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, వాక్‌వేలను ఎక్కువగా అమరుస్తున్నందువల్ల వాటిని సమయానుసారం తనిఖీ చేయడం, పరీక్షించడం, భద్రతా సర్టిఫికెట్లు జారీ చేయవలసిన ఆవశ్యకత పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లుల ముసాయిదా రూపొందించారు. దీనిని కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీ సఫాయి కర్మచారీల కమిషన్ డిమాండ్ మేరకు సీవర్ లైన్ల పూడికతీతపనులు, శుభ్రపరిచే పనులు చేసే కార్మికుల హోదాను కనీస వేతనాల చట్టం కింద మెరుగపరచాలని నిర్ణయించింది. చేతులతో నాలాలను పూడికతీసి శుభ్రపరిచేవారిని ఇకమీదట సెమీ స్కిల్డ్ లేబర్‌గా, యంత్రాలతో శుభ్రపరిచే వారిని స్కిల్డ్ లేబర్‌గా ఇక నుంచి పరిగణించనున్నారు. -
తెలంగాణ అంశంపై కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. బిల్లుతయారీకి సమయానికి రాజీ సూత్రం తీసుకొస్తామని ఆయన అన్నారు. రాజ్యాంగపరంగా అన్ని విధివిధానాలను అనుసరిస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుకుంటామని ఉద్యోగులకు హామీ ఇస్తున్నామంటూ దిగ్విజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సెటిలయిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఓ కమిటీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తొలుత క్యాబినెట్ భేటీ అవుతుంది అని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై తీర్మానం చేయాలని కేంద్రం అసెంబ్లీకి సూచిస్తుంది. తీర్మానం తర్వాత కేంద్రం ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పారు. ఓ వైపు విభజన ప్రక్రియ అధికారికంగా కొనసాగుతూనే ఉంటుందని, మరోవైపు పార్టీ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటుందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. -
ఘనంగా పోచమ్మ బోనాలు
పట్టణంలోని తెలుగువాళ్లు పోచమ్మ బోనాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు నైవేద్యం సమర్పించారు. జంతుబలిచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. గ్రామదేవత వరాలదేవి మందిరం వద్ద ఉదయం నుంచే వేలాది మంది అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అయితే ఈ ఏడు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కార్పొరేటర్ మురళి మచ్చ, లక్ష్మీ అశోక్‌పాటిల్ వివిధ సదుపాయాలు కల్పించారు. పోచమ్మను దర్శించుకోవడానికి కామత్‌ఘర్, బండారి కాంపౌండ్, పద్మనగర్, కన్నేరి తదితర దూరప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వర్షం కురవడంతో మందిర ప్రాంగణంలో మండపాలు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. భక్తుల రద్దీ వల్ల దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేశారు. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ పద్ధతిలో దర్శనానికి అనుమతించారు. అంతేగాకుండా ప్రత్యేక వలంటీర్లను కూడా నియమించామని బోనాల నిర్వాహకులు నోముల శేఖర్, అధ్యక్షులు తుమ్మ రమేష్ పేర్కొన్నారు. అదేవిధంగా జంతుబలులు ఇచ్చే ప్రాంతాల్లో తగిన పారిశుద్ధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గతంలో మందిర ప్రాంగణంలో అమ్మవారి దర్శనం కోసం వర్షం కురుస్తున్నా గంటల తరబడి బారులుతీరేవాళ్లు. ఈసారి ఈ సమస్య నుంచి విముక్తి లభించిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. -
అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలు
న్యూఢిల్లీ: రాజధానివాసులకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు అమాంతంగా కేజీకి రూ.50కి పెరగడంతో నగరవాసులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే టమాటా, పప్పు ధాన్యాలు, ఇతర కాయగూరల ధరలతో బెంబేలెత్తుతున్న నగరవాసులకు ఉల్లి ఘాటు మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. వర్షాల కారణంగా రాజస్థాన్, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి వచ్చే ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. మదర్ డెయిరీ సఫల్ అవుట్‌లెట్‌లో రూ.40లకు కేజీ దొరుకుతున్న ఉల్లిని స్థానిక వ్యాపారులు రూ.50లకి విక్రయిస్తున్నారు. ఢిల్లీ అజాద్‌పూర్ మార్కెట్లో హోల్‌సేల్ రేట్ ఉల్లి కేజీకి రూ.25 నుంచి 35కి పెరిగిందని ఉల్లి వ్యాపారి సంఘాల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర బుదిరాజ్ తెలిపారు. వారం క్రితం రూ.18 నుంచి 28లకి పెరిగిందని గుర్తు చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల రాజస్థాన్, లాసల్గావ్ నుంచి వచ్చే ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయిందని అన్నారు. కొత్త పంట మార్కెట్లోకి వస్తే ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొత్త పంట అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. అయితే అక్టోబర్‌లో కర్ణాటక నుంచి పంట మార్కెట్‌కు వస్తే ధరలు తగ్గుతాయని వివరించారు. జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ గణాంకాల ప్రకారం...ఢిల్లీ, లాసల్గావ్లో గత నెల నుంచి ఉల్లి హోల్‌సేల్ ధరలు రూ.50 శాతం మేర పెరిగాయి. లాసల్గావ్ మండిలో జూలై తొలి వారంలో ఉల్లి రూ.16 నుంచి 17కి పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ.30కి చేరుకుంది. -
అధిష్టానాన్ని కలవనున్న రాష్ట్ర బీజేపీ నేతలు
ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుతోపాటు దీనినికూడా చేర్చాలంటూ ఒత్తిడి తెచ్చేందుకుగాను మంగళవారం దేశరాజధానికి చేరుకుని అధిష్టానాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలోని పార్టీ అధిష్టానాన్ని మంగళవారం కలవాలని నిర్ణయించాం. ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని ఒత్తిడి చేస్తాం. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్న మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలుస్తాం’ అని అన్నారు. కాగా ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ప్రత్యేక విదర్భ రాష్ట్ర వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. 1992లో భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు అనుగుణంగా ఓ తీర్మానం ఆమోదించింది. -
ప్రత్యేక విదర్భ కోసం జంతర్‌మంతర్‌లో వీజాక్ ఆందోళన
ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ప్రకటనతో విదర్భ ఉద్యమం మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం తక్ష ణమే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విదర్భ జాయింట్ యాక్షన్ కమిటీ (వీజాక్) సభ్యులు నగరంలోని జంతర్‌మంతర్‌వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలదాకా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి (వీఈడీసీ) అధ్యక్షుడు దేవేంద్ర పరేఖ్, మాజీ మంత్రి రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు ఆశిష్ దేశ్‌ముఖ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడు అజయ్ సంఘి, రాం నెవ్లే, అరుణ్ కేదార్, అహ్మద్ కదర్, రవికాంత్ ఖోబ్రగడే, ప్రతిభా ఖపర్దే, ట్రేడియస్ పీటర్‌తోపాటు ప్రముఖ ఆర్థికవేత్త శ్రీనివాస్ ఖండేవాలే, దీపక్ నిలావర్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కొందరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతోపాటే విదర్భకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అవకాశం లభిస్తే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లను కలసిఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళతామన్నారు. పదాధికారులను ఎన్నుకోం వీజాక్కు పదాధికారులను ఎన్నుకోకూడదని నిర్ణయించినట్టు సభ్యులు తెలిపారు. కేవలం ఈ పదవుల కోసం గతంలో విదర్భ ఉద్యమం దెబ్బతిందని, నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమది సమాఖ్య మాత్రమేనన్నారు. విడిపోతేనే పురోగతి మహారాష్ట్ర నుంచి విదర్భ విడిపోతేనే త్వరిగతిన అభివృద్ధి చెందుతుందని జాక్ సభ్యులు పేర్కొన్నారు. కొత్త రాష్ట్ర ఆవిర్భావం వల్ల కొత్త కొత్త పరిశ్రమలు ఆవిర ్భవిస్తాయని, దాంతోపాటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఇది నిరుద్యోగ నిర్మూలనకు దోహదం చేస్తుందన్నారు. -
దిగ్విజయ్‌ని కలిసిన కేంద్ర మంత్రులు
ఢిల్లీ: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తమ వాదన వినిపించారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్‌కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్‌కు తమ వాదన వినిపించినట్లు తెలిపారు. ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని ఆయన కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు. సమావేశాలకు అడ్డుపడకుండా సీమాంధ్ర ఎంపిలను ఒప్పిస్తామని చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌ను కలిసినవారిలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి ఉన్నారు. సమైక్యాంధ్రకే తమ మొదటి మద్దతని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. అలా కాకపోతే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల అపాయింట్లు కోరినట్లు చెప్పారు. కమిటీ ముందు వాదనలు వినిపించమని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు కోట్ల తెలిపారు. ఎటువంటి పరిస్థితులలో తాము హైదరాబాద్ వదలుకోం అని, హైదరాబాద్‌తో కలిసే ఉంటామని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి చెప్పారు. శ్రీశైలం జలాశయానికి నీరు ఎలా వస్తాయనేది తమ ప్రధాన సమస్య అన్నారు. పైనుంచి నీరు రాకుంటే తమ ప్రాంతం ఎడారి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరతారు. -
విభజన వివాదం రోజుకో కొత్త మలుపు
ఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. రాయల్-తెలంగాణ అంశం వెనక్కు వెళ్లిపోయింది. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం - మరో పక్క హైదరాబాద్ అంశంపై చర్చ - ఇంకోవైపు సీమాంధ్ర కావాలన్న వాదం ... ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా నేతలు తమ జిల్లాను తెలంగాణలో కలపమని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఎంపి ఎస్పివై రెడ్డి, రాభూపాల్ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు పార్టీ రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని వారు కోరారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా వారు కోరారు. తమ జిల్లాను తెలంగాణలో కలపమని ఆమెను కూడా వారు కోరనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తమ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేపు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అని సమైక్యాంధ్రవాదులు విమర్శిస్తున్నారు. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చిన సమయంలో ఒక్క కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపమని కోరడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తీరును వారు తప్పుపడుతున్నారు. -
తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: పార్టీలో మాట్లాడుకోకుండా తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఒకే రోజు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రావడానికి టీడీపీ, బీజేపీలే కారణమని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు కావాల్సింది కాంగ్రెస్ కమిటీ కాదని, ప్రభుత్వం తరఫున కమిటీ వేసి సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. విభజన తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు సీమాంధ్ర ఉద్యోగులకు సంబంధించి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు దుమారంలేపాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ వైఖరిని వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. -
రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం
న్యూఢిల్లీ : డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి సోమవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నకైన వారితో రాజ్యసభ సభ్యుడు హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని సభకు పరిచయం చేశారు. అలాగే ఇటీవలే మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ తదితర నాయకులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. -
విమానంలో బంగారం తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
టీనగర్, న్యూస్‌లైన్: దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి చెన్నైకు వస్తున్న విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు చెన్నైకు వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో కేరళ రాష్ట్రం కన్నూర్‌కు చెందిన కసాబుద్దీన్ (27) అనే ప్రయాణీకుడు వద్ద 400 గ్రాముల బంగారు నగలు లభించాయి. దీని గురించి అతని వద్ద విచారణ జరపగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో అతని వద్ద నున్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 13 లక్షలు ఉంటుం దని అధికారులు తెలిపారు. ఆదివా రం ఉదయం 6.30 గంటలకు దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండి యా ప్రయాణీకులను అధికారులు తనిఖీ చేశారు. కేరళ రాష్ట్రం త్రిచూర్‌కు చెందిన ప్రయాణీకుడు మోహిసాబు (33) వద్ద నుంచి 20 బంగా రు బిస్కెట్లను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. వీటి విలువ రూ. 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రూ.46 కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం: చెన్నై నుంచి వెళ్లిన విమానంలో రూ. 46 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. చెన్నై నుంచి సింగపూర్ మీదుగా థాయ్‌లాండ్‌కు విమానం బయలుదేరి వెళ్లింది. ఇందులో బయలుదేరిన ప్రయాణీకులు థాయ్‌లాండ్‌లో దిగారు. అక్కడ థాయ్‌లాండ్ కస్టమ్స్ అధికారులు ఉత్తర భారత దేశానికి చెందిన హర్దేవ్, పూరం సింగ్ అనే యువకుల వద్ద తనిఖీలు జరిపి 12 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 46 కోట్ల రూపాయిలు. వీరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
కావేరి నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది
కావేరి నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. సెకనుకు 1.5 లక్షల ఘనపుటడుగులకుపైగా నీరు ప్రవహిస్తోంది. నదీ తీరంలోని 11 జిల్లాల్లో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు గ్రామ వాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మెట్టూరు డ్యాం నిండడంతో 16 గేట్ల ద్వారా ఉబరి నీటిని బయటకు పంపుతున్నారు. సాక్షి, చెన్నై: కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కావేరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎండిపోయిన మెట్టూరు డ్యాం నీటిమట్టం ఈ వర్షాల పుణ్యమా అని నెలన్నరలో వంద అడుగులు దాటింది. దీంతో సాంబా సాగుకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆదివారం వేకువజాము నుంచి కావేరి నది ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో వర్షాలు కొనసాగుతుండడంతో అక్కడి జలాశయాల నుంచి ఉబరి నీటి విడుదల పెరిగింది. సెకనుకు 1.5 లక్షల ఘనపుటడుగులకుపైగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. హొగ్నెకల్, మెట్టూరు డ్యాం వద్ద ప్రజాపనుల శాఖ ప్రధాన ఇంజినీర్ అశోకన్, ఆర్డీవో చంద్రన్, ఇంజినీర్లు సురేష్, కుమరేషన్ నేతృత్వంలో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మెట్టూరు గేట్ల ఎత్తివేత: ఎనిమిదేళ్ల తర్వాత ఆదివారం మెట్టూరు డ్యాం గేట్లను ఎత్తివేశారు. డ్యామ్‌లోకి సెకనుకు లక్షా పదిహేను వేల ఘనపుటడుగుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 120 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబా సాగు నిమిత్తం కాలువల ద్వారా సెకనుకు 40 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా ఉబిరి నీటిని బయటకు పంపించే పనిలో పడ్డారు. డ్యామ్ 16 ప్రధాన గేట్లు ఎనిమిదేళ్ల తర్వాత తెరుచుకున్నాయి. సెకనుకు 40 వేల ఘనపుటడుగుల ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి బయటకు వెళుతున్న నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. వీరిని కట్టడి చేయడం అధికారులకు తలకు మించిన భారమవుతోంది. డ్యామ్ నుంచి మొత్తం 80 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రికి లక్ష ఘనపుటడుగులు దాటే అవకాశం ఉంది. అప్రమత్తం: కావేరి ఉగ్ర తాండవం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. హొగ్నెకల్ పరిసరాల్లోని చిన్నచిన్న గ్రామా ల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరారుు. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తీరం వెంబడి గ్రామాల్లోని కల్వర్టులు, వంతెనల్ని తాకుతూ నీళ్లు ప్రవహిస్తున్నారుు. స్థానికులను పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూశాఖ అధికారులు అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. కావేరి తీరం వైపు ఎవరూ వెళ్లొద్దని, వంతెనల మీద బస్సులు, ఇతర వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని హెచ్చరికలు జారీ చేశారు. మెట్టూరు నుంచి ఉబరి నీరు విడుదల కావడంతో సేలం, నామక్కల్, ఈరోడ్, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, అరియలూరు తదితర 11 జిల్లాల్లోని లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చీప్ ఇంజినీర్ అశోకన్ మీడియాతో మాట్లాడుతూ మెట్టూరు గేట్ల ఎత్తి వేతతో తీర వాసుల్ని అప్రమత్తం చేశామన్నారు. ఉబరి నీటి కారణంగా కావేరి తీరంలోని 524 చెరువులు నిండే అవకాశం ఉందన్నారు. ఉబరి నీరు ఉద్ధృతంగా సముద్రంలో కలవని రీతిలో ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. కళ్లనై నీళ్లు విడుదల మెట్టూరు నిండడంతో ఆ నీటి మీద ఆధారపడి ఉన్న కళ్లనై జలాశయం నీటిని సైతం విడుదల చేశారు. కళ్లనై నీటిని తంజావూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై జిల్లాలకు సాగుబడి నిమిత్తం పంపిణీ చేయనున్నారు. పుల్లంబాడి, పుదియ కట్టలై మేడు వైపుగా ఉన్న కాలువల ద్వారా సాగుబడికి సోమవారం నీళ్లు విడుదల చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. నీలగిరుల్లో కురుస్తున్న వర్షాలకు భవానీ నది పరవళ్లు తొక్కుతోంది. పిళ్లూరు డ్యాం గేట్లను ఎత్తి వేయడంతో భవానీ సాగర్‌కు నీటి రాక పెరిగింది. దీంతో మేట్టుపాళయం పరిసరాల్లోని భవానీ నదీ తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. వర్ష సూచన పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు నీటి రాక పెరిగింది. ఈ పరిస్థితుల్లో 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి చెన్నై, కాంచీపురం తదితర జిల్లాల్లో వర్షం పడింది. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. నదిలో చిక్కుకున్న నలుగురు హొగ్నెకల్ వద్ద కావేరి ప్రవాహంలో ఆదివారం సాయంత్రం నలుగురు కొట్టుకెళ్లారు. వీరిని రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హొగ్నెకల్ వద్ద కావేరి ఉద్ధృతిలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. అతడ్ని రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు జాలర్లు సైతం కొట్టుకెళ్లారు. ఈ నలుగురూ ఓ చెట్టు ఆసరాగా నది మధ్యలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరిని రక్షించేందుకు జాలర్లు, గజ ఈతగాళ్లను అధికారులు రంగంలోకి దించారు. అయితే చీకటి కారణంగా పరిస్థితులు అనుకూలించడం లేదు. రాత్రి వేళ నీటి ఉద్ధృతి పెరిగిన పక్షంలో వీరు కొట్టుకెళ్లవచ్చన్న ఆందోళన నెలకొంది. -
విద్యార్థులు కష్టపడితే మంచి భవిష్యత్తు
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో సుఖం లభిస్తుందని బెళగావికి చెందిన విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ హెచ్‌జీ శేఖరప్ప అన్నారు. ఆయన ఆది వారం రావ్ బహుద్దూర్ వై.మహాబలేశ్వరప్ప ఇం జనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్నారని, వారి కలలను నిజం చేసే దిశగా విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభను చూపి నిజం చేయాలన్నారు. ఉత్తర కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతి పెద్దదని తెలిపారు. ఈ వర్సిటీ పరిధిలో 204 ఇంజనీరింగ్ కళాశాలలు, దాదాపు 4,50,000 మంది విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయంలోని 32 విభాగాలున్నాయని, అన్ని విభాగాలకు సరిసమానమైన ప్రాధాన్యత కలిగి ప్రతి ఒక్కరికీ ఉ ద్యోగం లభించే అవకాశాలున్నాయన్నారు. వచ్చే ఏడాదిలో విద్యార్థుల బుద్ధి వికాసం పెంపొందించేందుకు కొత్త సిలబస్, కొత్త ప్రశ్నాపత్రిక ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి 85 శాతం అటెండెన్స్ ఉండేలా కళాశాలలకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు అల్లం గురు బసవరాజు అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు కేఎం మహేశ్వరస్వామి, కార్యదర్శి హెచ్ఎం గురుసిద్దస్వామి, సహకార్యదర్శి నేపాక్షప్ప, కోశాధికారి హిమంత్రాజు, పాలన మండలి అధ్యక్షుడు డీవీ.బసవరాజు, సభ్యులు అల్లం వినాయక, రాజేంద్రకుమార్, ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి ‘108’ సమస్యలు
సాక్షి, బెంగళూరు : ‘ఆరోగ్యకవచ-108’ సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి ప్రయత్నిస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా కొన్ని రోజులుగా బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రిలేనిరాహార దీక్షలు చేస్తున్న 108 సిబ్బంది నాయకులను ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సిబ్బంది వేతనాల పెంపు, పనివేళల తగ్గింపు తదితర విషయాలు న్యాయసమ్మతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వోద్యోగులగా గుర్తింపుపై, మిగిలిన సమస్యలను సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళుతానన్నారు. నాలుగేళ్లుగా సేవలందించిన 108 సిబ్బందిలో ఒకేసారి 2,500 మందిని తొలగించడం సాధ్యం కాదన్నారు. ఏ సందర్భంలో జీవీకే సంస్థ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారో తెలియదన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని 108 సిబ్బంది సమస్యలకు ప్రభుత్వం పరిష్కారమార్గాన్ని కనుగొంటుందని అన్నారు. కాగా, ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ అభృర్థిగా బరిలో దిగిన శాండల్‌వుడ్ నటి రమ్య
సాక్షి, బెంగళూరు : మండ్య లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభృర్థిగా బరిలో దిగిన శాండల్‌వుడ్ నటి రమ్యకు సినీ గ్లామర్ కలొసొచ్చే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలు, ప్రత్యర్థి పార్టీకి ఆ ప్రాంతంలో ఉన్న పట్టు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయం స్పష్టమవుతుంది. మండ్య పార్లమెంటు స్థానం పరిధిలో మేల్కోటే, నాగమంగ ళ, శ్రీంగపట్టణ, కే.ఆర్ పేట, మండ్య, మద్దూరు, మళవళ్లి, మైసూరు జిల్లాలోని కే.ఆర్ నగర్ శాసనసభలు ఉన్నాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదింటిని (నాగమంగళ, శ్రీరంగపట్టణ, కే.ఆర్ పేట, మద్దూరు, కే.ఆర్ నగర) ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ కైవసం చేసుకుంది. ఇక రెండింటిలో (మళవళ్లి, మండ్య) కాంగ్రెస్, మేల్కోటేలో సర్వోదయ కర్ణాటక పక్ష గెలుపొందాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 16,14,874 ఓటర్లు ఉండగా.. వారిలో 8,01,173 మంది మిహ ళలు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ ఎనిమిది నియోజక వర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు 5,42,336, కాంగ్రెస్ అభ్యర్థులకు 3,44,085 ఓట్లు వచ్చాయి. అంతే కాకుండా 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం నుంచి చలువరాయస్వామి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత, ప్రస్తుత గృహ మండలి మంత్రి అయిన అంబరీష్ కంటే దాదాపు 23 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఏ విధంగా చూసినా ఈ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ కంటే జేడీఎస్‌దే పై చేయిగా కనిపిస్తోంది. అంతేకాకుండా అవగాహన కుదిరితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు బీజేపీకి సహకరించే అవకాశాలున్నాయి. దీంతో ప్రస్తుత జేడీఎస్ అభ్యర్థి పుట్టరాజు గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న రమ్య సినీ రంగంలో అగ్రగామి హీరోయిన్. అంతేకాకుండా ఆమెకు రాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న ఎస్.ఎం కృష్ణ ఆశీస్సులూ ఉన్నాయి. ఇక అంబరీష్ కూడా శక్తి వంచన లేకుండా రమ్య గెలుపు కోసం రాజకీయ వ్యూహరచన చేస్తున్నారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా రమ్య నామినేషన్ వేసిన రోజే ఆమె తండ్రి ఆర్.టీ నారాయణ్ హఠాన్మరణం చెందారు. దీంతో సానుభూతి ఓట్లు కలిసి వస్తాయని కాంగ్రెస్ నాయకుల ఆశాభావం. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఈ నెల 24 వరకూ వేచిచూడాల్సిందే. -
రాష్ట్ర రైతుల్లో ఈసారి ఆనందం
సాక్షి, బెంగళూరు : రెండేళ్లుగా కరువుతో కొట్టుమిట్టాడిన రాష్ట్ర రైతుల్లో ఈసారి ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది కోలారు, చిక్కబళాపుర జిల్లాల్లో తప్పించి అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడటంతో ఖరీఫ్‌లో విత్తన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జూలై చివరికి రాష్ట్రంలో అన్ని పంటలకూ కలిపి 74.29 లక్షల హెక్టార్లను ఖరీఫ్ సీజన్‌గా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఇప్పటికే 51 లక్షల హెక్టార్ల మేర విత్తన ప్రక్రియ పూర్తయింది. ఇది లక్ష్యంలో దాదాపు 68 శాతం. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 35.22 లక్షల హెక్టార్ల మేరకు మాత్రమే విత్తన ప్రక్రియ పూర్తయ్యింది. పత్తి, చెరకు తదితర వాణిజ్య పంటల విత్తన ప్రక్రియ లక్ష్యం తో పోలిస్తే 91 శాతంతో దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో పప్పుదినుసులు (74 శాతం), నూనె గింజలు (65 శాతం), ధాన్యపు గింజలు (59 శాతం) ఉన్నాయి. పెరిగిన నీటి లభ్యత ... ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర తదితర ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తుండటంతో కర్ణాటకలోని అన్ని రిజర్వాయర్లలోకి వరద భారీగా చేరింది. దీంతో రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పంటలకు నీటి లభ్యత పెరగడంతో వాణిజ్య పంటలవైపు రైతులతోపాటు, వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. ఈ ఖరీఫ్‌లో 10.55 లక్షల హెక్టార్లలో వాణిజ్య పంటలను పండించాలని వ్యవసాయ శాఖ లక్ష్యం కాగా ఇప్పటికే 9.65 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ పూర్తయింది. ఇందులో పత్తి 4.5 లక్షల హెక్టార్లు, చెరుకు 4.17 లక్షల హెక్టార్లు, పొగాకు 0.98 లక్షల హెక్టార్లు విస్తీర్ణం మేర విత్తన ప్రక్రియ పూర్తయింది. పప్పుధాన్యాలు... ఈ ఖరీఫ్ సీజన్లో 15.87 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు పండించాలని లక్ష్యంగా ఎంచుకోగా.. కంది, పెసర తదితర పంటలకు సంబంధించి ఇప్పటి వరకూ 11.73 లక్షల హెక్టార్లలో (74 శాతం) రైతులు విత్తన ప్రక్రియ పూర్తి చేశారు. వేరుశనగ, సూర్యకాంతి తదితర నూనెగింజల పంటలకు సంబంధించి 12.82 లక్షల హెక్టార్లు లక్ష్యం కాగా... ఇప్పటికే 8.33 లక్షల హెక్టార్లలో (65 శాతం) రైతులు విత్తనాలు వేశారు. ధాన్యపు పంటల విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. 21 లక్షల హెక్టార్ల లక్ష్యానికి సంబంధించి ఇప్పటి వరకూ 12.39 (59 శాతం) లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ ముగిసింది. జిల్లాల వారీగా తీసుకుంటే మొత్తం 30 జిల్లాలకు గాను 23 జిల్లాల్లో 60 శాతం పైగా విత్తన ప్రక్రియ పూర్తయింది. ఇందులో హావేరి 97 శాతంతో మొదటి స్థానంలో నిలువగా తుమకూరు 26 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. -
ఖేమ్కాను పట్టించుకోలేదేం?
న్యూఢిల్లీ/జైపూర్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంలో సోనియా జోక్యం చేసుకొని లేఖ రాయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సోనియా లేఖ రాసిన అనంతరం దుర్గాశక్తి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారును కోరింది. అయితే, ఈ వ్యవహారంపై ప్రధానికి సోనియా మాటమాత్రంగా చెబితే సరిపోయేదని, లేఖ రాయాల్సిన అవసరం లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టంచేయగా, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అశోక్ ఖేమ్కా బదిలీ విషయంలో ఆమె ఎందుకు కల్పించుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) విరుచుకుపడుతున్నాయి. తాజాగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేయడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తాయి. రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీల్లోని అక్రమాలు బయటపెట్టిన పాపానికి హర్యానాలో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ పైనా ఆమె ఇదే విధంగా ప్రధానికి లేఖ రాసి ఉండాల్సిందని ఎస్పీ వ్యాఖ్యానించింది. ఖేమ్కా వ్యవహారంలో సోనియా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. అయితే ఖేమ్కా, దుర్గాశక్తిల అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. వాద్రా భూవివాదం సివిల్ వ్యవహారమని, ఖేమ్కాను అక్కడి ప్రభుత్వం మిగిలిన అధికారులతో పాటు బదిలీ చేసిందని చెప్పారు. దుర్గాశక్తి సస్పెన్షన్‌కు మతపరమైన ఉద్రిక్తతలను కారణంగా చూపుతూ సమాజ్‌వాదీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఎంపీ జితిన్ ప్రసాద విమర్శించారు. దుర్గాశక్తి సస్పెన్షన్‌కు ఇసుక మాఫియా ఒత్తిళ్లే కారణమని అన్నారు. దుర్గాశక్తికి అధికారుల బాసట: దుర్గాశక్తి నాగపాల్‌కు మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ సహా పలువురు రిటైర్డ్, సీనియర్ అధికారులు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. తన వాదనను వినిపించుకునే అవకాశమైనా ఇవ్వకుండానే ఆమెను సస్పెండ్ చేయడాన్ని వినోద్ రాయ్ తప్పుపట్టారు. ఆమె సస్పెన్షన్‌ను మాజీ సీవీసీ ఎన్.విఠల్ రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. వాద్రా భూముల వ్యవహారంలో బదిలీ అయిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా కూడా దుర్గాశక్తికి మద్దతు పలికారు. చాలా కొద్దిమంది యువ ఐఏఎస్ అధికారులు మాత్రమే ఇసుక మాఫియాతో తలపడే సాహసం చేస్తారని, దుర్గాశక్తి తన విధి నిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించారని కితాబునిచ్చారు. దుర్గాశక్తి నాగపాల్‌ను యూపీ సర్కారు అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని తీర్మానించింది. రాజస్థాన్‌లో ఎస్పీ బదిలీ.. రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన రెండు రోజులకే జైసల్మేర్ ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేసింది. పోఖ్రాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సలేహ్ మహమ్మద్ తండ్రి గజీ ఫకీర్ (78) సహా పలువురిపై స్మగ్లింగ్ సహా పలు ఆరోపణలున్నాయి. జైసల్మేర్ ఎస్పీ పంకజ్ చౌదరి రెండు రోజుల కిందట గజీ ఫకీర్, ఇతరులపై హిస్టరీ షీట్లను తెరిచారు. దీంతో రాజస్థాన్ సర్కారు ఆయన్ని ఆదివారం అజ్మీర్ జిల్లాలోని కృష్ణగఢ్ పోలీసు శిక్షణ కేంద్రం కమాండెంట్‌గా బదిలీ చేసింది. ఎస్పీని బదిలీ చేయడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. జైసల్మేర్ జిల్లాలో బంద్ పాటిం చారు. ఫకీర్పై 1965లో తొలిసారిగా హిస్టరీ షీట్ తెరిచారని, 1984లో ఆ ఫైలు గల్లంతైందని చౌదరి తెలిపారు. 1990లో తిరిగి ఆయనపై హిస్టరీ షీట్ తెరవగా, 2011 మేలో మూసేశారని చెప్పారు. తాను మళ్లీ ఆయనపై హిస్టరీ షీట్‌ను తెరవడానికి, తన బదిలీకి సంబంధం ఉంటే ఉండవచ్చని అన్నారు. -
మద్యానికి ‘కరువు’ లేదు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో గత ఏడాది కరువు రావడంతో తాగేందుకు కూడా నీరు లేక ప్రజలు విలవిల్లాడిపోయారు. గత్యంతరం లేక కొందరు వలసపోయారు. ఇదేకాలంలో మద్యం అమ్మకాలు మాత్రం రికార్డుస్థాయిలో జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు ఏకంగా 80.53 కోట్ల లీటర్ల మద్యం స్వాహా చేసినట్లు ఎక్సైజ్‌శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆదాయం పెంచేందుకు మద్యం విక్రయాలు పెంచాలని ప్రభుత్వం స్వయం గా అధికారులను పురమాయిస్తోంది. దీంతో మద్యం విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మించిపోయాయి. మద్యం విక్రయాలు ఏటా 8 నుంచి 10 శాతం పెరగడం గమనార్హం. ఒకపక్క రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కరువు, మరోపక్క మద్యం ఏరులైపారుతున్నట్లు తెలుస్తోంది. 2013లో ముగి సిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 33.83 కోట్ల లీటర్ల దేశీయ తయారీ మద్యం, 31.70 కోట్ల లీటర్ల బీరు, 15 కోట్ల లీటర్ల విదేశీ మద్యం అమ్ముడయిం ది. ఇదిలాఉండగా ముంబై, ఠాణే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ఇలా ఐదు జిల్లాల్లో 2011-12లో 26.74 కోట్ల లీటర్ల మద్యం విక్రయమయింది. అదే 2012-13లో ఏకంగా 2.25 కోట్ల లీటర్లు పెరిగింది. మద్యం ధరలు గత మూడేళ్లతో పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. దీన్నిబట్టి మద్యం విక్రయాలు తగ్గిపోవాల్సి ఉండగా, పరిస్థితి అందు కు భిన్నంగా ఉంది. ప్రతిరోజూ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడేళ్లలో బీరు సేవిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. బీర్ల విక్రయా లు 12 శాతం పెరగగా, విదేశీ మద్యం 5.48 శాతం, దేశీయ మద్యం అమ్మకాలు 2.61 శాతం పెరిగాయి. వైన్ విక్రయాలు 31.27 లక్షల లీటర్లు ఉండగా, ఈ విభాగంలోనూ 14 శాతం విక్రయాలు పెరిగాయి. 2008-09లో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.4, 436 కోట్ల ఆదాయం వచ్చింది. నాలుగేళ్లలో ఈ ఆదాయం రెట్టింపయింది. మద్యం విక్రయాల ద్వారా గతేడాది ప్రభుత్వానికి సుమారు రూ.9,460 కోట్ల రాబడి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే సంవత్సరం రూ.10,535 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ర్ట ప్రభు త్వ ఖజానాలోకి అత్యధిక ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే సమకూరుతోంది. అందుకే మద్యం రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరించవద్దని పోలీసులకు ప్రభుత్వం పరోక్షంగా సూచిం చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
మరో రోజూ కావాలి
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సమయంలో అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు, బ్యాండ్‌మేళాలు, టపాసులు వినియోగించేందుకు నాలుగు రోజులపాటు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయి తే లౌడ్‌స్పీకర్ల సౌండ్‌లో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. నియమాలకు లోబడి నిర్దేశించిన స్థాయుల ప్రకారమే సౌండ్ సిస్టంను వాడాల్సి ఉం టుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు హర్షం వ్యక్తం చేశాయి. ఉత్సవాల కోసం ఒక రోజు అదనంగా.. అంటే ఐదు రోజులపాటు అర్ధరాత్రి వరకు లౌడ్స్పీక ర్లు, బాణసంచా, బ్యాండ్, భజనలు, కీర్తనలు ఆల పించేందుకు అనుమతివ్వాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. గతంలో మూడు రోజుల వరకు అనుమతి ఉండగా ఈసారి నాలుగు రోజులకు పెంచారు. అయితే లౌడ్‌స్పీకర్ సౌండ్‌ను మాత్రం తగ్గించాలని ప్రభుత్వం షరతులు విధించింది. దీంతో మండళ్ల నిర్వాహకులు నియమాలకు లోబడి అర్ధరాత్రిలోపు లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఉత్సవాలు మినహా మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిన విషయం తెలి సిందే. కాగా ధ్వని కాలుష్యం నియంత్రణకు కట్టుబడి ఏటా 15 రోజులు మాత్రమే అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వినియోగించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. గణేశ్ ఉత్సవాల సమయంలో ఐదోరోజు విగ్రహాల నిమజ్జనం, గౌరీవిగ్రహాల నిమజ్జనం, అనంత చతుర్థి ఇలా మూడు రోజులు మాత్రం అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లకు అనుమతి ఉండేది. ఈసారి అదనంగా మరోరోజు అనుమతి లభించింది. ఏటా శివాజీ జయంతి, ఈద్-ఏ-మిలాద్, అంబేద్కర్ జయంతి, మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, దీపావళి, క్రిస్మస్, 31 డిసెంబర్, గణేశ్ ఉత్సవాల్లో నాలుగు రోజులు, నవరాత్రి ఉత్సవాల్లో 13 రోజులు అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వినియోగించేందుకు అనుమతి ఉంటుంది. అవసరమైతే మరో రెండు రోజులు పొడగించడానికి జిల్లా అధికారులకు అధికారాలు ఉంటాయి. గణేశ్ ఉత్సవాల కోసం ఐదు రోజుల పాటు సంగీత పరికరాలకు అనుమతించాలని బృహన్ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు నరేశ్ దహిబావ్కర్ జిల్లా అధికారికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇక్కడి నుంచి అనుమతి లభిస్తే మొత్తం ఐదు రోజు లు గణేశ్ ఉత్సవాలను భారీ ఆటపాటలతో నిర్వహించుకోవచ్చు. -
కేంద్ర మంత్రి షిండేపై విలాస్ మండిపాటు
నాగపూర్: ప్రత్యేక విదర్భ విషయంలో దేశ ప్రజలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ఎంపీ విలాస్ ముత్తెం వార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ‘పాతదైనందువల్లనే తెలంగాణ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని మీరు పేర్కొన్నారు. విదర్భ కంటే అత్యంత అర్హత కలిగినదని చెప్పారు. విదర్భ చారిత్రక వాస్తవాలు లేని దన్నారు. అందుకు సాక్ష్యాలేమీ లేవన్నారు. ఈ వ్యాఖ్యలు విదర్భ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ‘మీ శాఖ అధికారులు మి మ్మల్ని మభ్యపెడుతున్నారా లేదా గట్టి పత్రసహిత ఆధారాలున్నప్పటికీ మీరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. విదర్భ అం శం అత్యంత పాతదన్నారు. 1953లో ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ సైతం విదర్భను ప్రతే ్యక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చంటూ సమర్థించిందన్నారు. విదర్భకు మంచి రాబడి ఉందని పేర్కొందన్నారు. అం దువల్ల మహారాష్ట్రలోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని సూచించిందన్నారు. ‘అనేక సంవత్సరాలుగా వివిధ కీలక మంత్రి పదవులను మీరు నిర్వహించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వెనుకబడిన విదర్భకు మీరు చేసేందేమీ లేదు. ప్రస్తుతం మీరు అత్యంత ప్రభావవంతమైన పదవిలో ఉన్నారు. విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లలేదు’ అని అన్నారు. -
కేంద్ర మంత్రి షిండేపై విలాస్ మండిపాటు
నాగపూర్: ప్రత్యేక విదర్భ విషయంలో దేశ ప్రజలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ఎంపీ విలాస్ ముత్తెం వార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ‘పాతదైనందువల్లనే తెలంగాణ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని మీరు పేర్కొన్నారు. విదర్భ కంటే అత్యంత అర్హత కలిగినదని చెప్పారు. విదర్భ చారిత్రక వాస్తవాలు లేని దన్నారు. అందుకు సాక్ష్యాలేమీ లేవన్నారు. ఈ వ్యాఖ్యలు విదర్భ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ‘మీ శాఖ అధికారులు మి మ్మల్ని మభ్యపెడుతున్నారా లేదా గట్టి పత్రసహిత ఆధారాలున్నప్పటికీ మీరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. విదర్భ అం శం అత్యంత పాతదన్నారు. 1953లో ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ సైతం విదర్భను ప్రతే ్యక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చంటూ సమర్థించిందన్నారు. విదర్భకు మంచి రాబడి ఉందని పేర్కొందన్నారు. అం దువల్ల మహారాష్ట్రలోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని సూచించిందన్నారు. ‘అనేక సంవత్సరాలుగా వివిధ కీలక మంత్రి పదవులను మీరు నిర్వహించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వెనుకబడిన విదర్భకు మీరు చేసేందేమీ లేదు. ప్రస్తుతం మీరు అత్యంత ప్రభావవంతమైన పదవిలో ఉన్నారు. విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లలేదు’ అని అన్నారు. -
నగరంలో ‘ప్రత్యేక’ బోనాలు
సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ ప్రకటించడంతో నగరంలోని తెలంగాణ ప్రజలు ఆదివారం ఉదయం పోచ మ్మ తల్లికి మొక్కలు చెల్లించుకున్నారు. పశ్చిమ దాదర్‌లోని హనుమాన్ మందిరం వద్ద ఉన్న ప్రాచీ న పోచమ్మ ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ ఆలయం 30 ఏళ్ల క్రితం నిర్మితమైందని కొంతమంది స్థానికులు తెలి పారు. అప్పటి నుంచి పోచమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారని, కల నెరవేరడంతో మొక్కులు చెల్లించుకున్నారని బహుజన్ సమాజ్ పార్టీ ముంబై కార్యదర్శి నాగ్‌సేన్‌మాల తెలిపారు. తూర్పు అంధేరీలో... సాకినాకాలోని శీత్లాదేవి పోచమ్మ తల్లికి తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహించా రు. మహిళలు బోనాలను తలపై ఉంచుకుని అమ్మవారి మందిరానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యే క పూజలు నిర్వహించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు వందకుపైగా కుటుంబాలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలి పారు. కాగా ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు బండి హిరమణి, కుర్భా రత్నమ్మ, చింతకింది లక్ష్మి, బొద్దు పద్మలత తదితరులు పాల్గొన్నారు. నయీగావ్లో దాదర్‌లోని నయీగావ్లో పోచమ్మ తల్లి బోనాల పండుగను తెలుగు ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. తొలుత అభిషేకం చేశారు. తర్వాత గణపతి పూజ, నవగ్రహ పూజ, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల మధ్య పలు వీధులమీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తర్వాత అమ్మవారికి తమ వెంట తెచ్చిన నైవేద్యాన్ని సమర్పిం చారు. భక్తులకు తీర్థ,ప్రసాదాలను అందజేసినట్టు నిర్వాహకులు అనుమల్ల సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా పాల్గొని అమ్మవారికి చీరలు, సారెలు సమర్పించారన్నారు. స్థానిక కార్పొరేటర్లు, ఇతర సంఘాల ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, దోమల శంకర్, చెరిపెల్లి కనకప్రసాద్, పాపని సుదర్శన్ తదితరులు ఉత్సవాల నిర్వహణకు తోడ్పడ్డారు. -
నాగపూర్ మెట్రోరైలు ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
నాగపూర్ : నాగపూర్‌లో మెట్రో రైలు పట్టాలెక్కడం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ఆర్థిక వనరుల సమీకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో రైల్వే మనుగడకు అంతర్గత ఆర్థిక రేటు వసూలు (ఎఫ్ఐఐఆర్) ఎనిమిది శాతం ఉండగా, ప్రస్తుతం 0.47 శాతం మాత్రమే ఉంది. దీంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమీక్షించేందుకు, అలాగే ఈ సమస్యను ఎలా అధిగమించాలనే విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ను అడిగి తెలుసుకోవాలని నాగపూర్ అభివృద్ధి సంస్థ (ఎన్ఐటీ) కు కేంద్ర పట్టణాభివృద్ధి విభాగం (యూడీడీ) సూచించింది. యూడీ డీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాజెక్టు 2014లో ప్రారంభించి 2019లో పూర్తిచేయడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రాజెక్టు నివేదిక పునఃసమీక్షకు మరో రెండు, నెలల సమయం పట్టే అవకాశముంది. అలా గే కేంద్ర పట్టణాభివృద్ధి విభాగం చూపిన పరిష్కార మార్గం ఈ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాస్తవానికి సమగ్ర సర్వే తర్వాతనే డీఎంఆర్సీ నివేదికను తయారుచేసింది. అయితే ఇప్పుడు ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తిరస్కరించడం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక పరిస్థితిపై అనుమానాల నేపథ్యంలోనే నాగపూర్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధి విభాగం తిరిగి సమగ్ర ప్రాజెక్టు నివేదికను కోరింది. కొద్ది నెలల్లోనే మెట్రో మోడల్లో లొసుగులు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఎన్ఐటీ అధికారులతో శనివారం ప్రజా రవాణా వ్యవస్థ ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) ఎస్కే లోహియా మాట్లాడుతూ ప్రాజెక్టు సామర్థ్యం పెంచుకోవాలంటే అదనపు ఆదాయాన్ని సమీకరించుకోవాల్సి ఉంటుందన్నారు.ఆదాయాన్ని పెంచుకునేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నామన్నా రు. తన గమ్యాన్ని చేరుకునేం దుకు మెట్రో వినియోగదారుడు బస్సుపై అయితే ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించనవసరం లేకుండా చూడాలన్నారు. ఈ విషయమైఎన్ఐటీ అధికారులు మాట్లాడుతూ దీనిపై రవాణా సంబంధిత అభివృద్ధి(టీవోడీ) పథకాన్ని రూపొందించామన్నారు. ఈ విషయమై ఎంపీ విలాస్ ముత్తెంవార్ మాట్లాడుతూ ప్రాజెక్టుపై యూడీడీ అనుమానాలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఢిల్లీ మెట్రోను కూడా మొదటి మూడు నెలల్లో ప్రయాణికులు వినియోగించుకోలేదన్నారు. ప్రస్తుతం ఆ మెట్రోకు స్పందన బాగా పెరిగిందన్నారు. -
ఎంపికలో జాగ్రత్త సుమా..!
న్యూఢిల్లీ: జాగ్రత్తగా, అన్నిరకాలుగా ఆలోచించే సినిమాలను ఎంపిక చేసుకోమ్మంటూ నటి రిచా చద్దాకు సలహా ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు. షేక్స్పియర్ రాసిన ‘రోమియో జూలియట్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిచా చద్దా కూడా నటిస్తోంది. దీంతో రీచా నటనపై సంతృప్తికరంగానే ఉన్న భన్సాలీ ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని, సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఈ విషయమై రీచా మాట్లాడుతూ... ‘అమితాబ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోల ఇమేజ్ను మార్చిన దర్శకుడిగా భన్సాలీకి పేరుంది. అటువంటి గొప్పవ్యక్తి ఇచ్చిన సలహా ఎంతో విలువైనదిగా భావిస్తాను. తాను తెరకెక్కిస్తున్న సినిమాలపట్ల పూర్తి అంకితభావాన్ని కనబర్చే భన్సాలీకి కోపం త్వరగా వస్తుంది. అయితే ఆయన పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. సినిమాల్లో దీపికా, నేను కలిసి నటించే సందర్భాలున్నాయి. మా నుంచి ఏవో అద్భుతాలను ఆయన ఆశించేవారు. సినిమా అద్భుతంగా తెరకెక్కడానికి ఆయన పడే తపన ఏంటో అప్పుడు నాకు తెలిసొచ్చింది. అయితే ఆయనతో తొలి కలయిక నాకు అసంతృప్తినే మిగిల్చింది. నేను గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. అప్పుడు నేను పూర్తిగా పాశ్చాత్య వేశధారణలో ఉన్నా. ఆయన భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే యువతి కోసం వెతుకుతున్నారు. నన్ను చూసి ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఎదురుచూస్తున్న అవకాశం చేజారిందనుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా రామ్‌లీలాలో ఓ పాత్రను నువ్వు మాత్రమే చేస్తున్నావని ఆయన చెప్పార’ని తెలిపింది రిచా. -
పార్లమెంట్ హౌస్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు, స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల నేపథ్యంలో పార్లమెంట్ హౌస్‌కు పరిసరాల్లో ఉన్న కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో భద్రతను పెంచుకోవాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇంటెలిజెన్స్ విభాగాల హెచ్చరికల నేపథ్యంలో పార్లమెంట్ సమీపంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆయా భవనాల్లోకి ప్రవేశించే ప్రతివ్యక్తిని తనిఖీ చేయాలని కోరారు. రేల్ భవన్, ఆర్బీఐ, గురుద్వారా రాకబ్ గంజ్, అల్ ఇండియా రేడియోలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పభుత్వ వాహనాలు, దుస్తుల్లో వచ్చే వారిపై ప్రత్యేక నిఘా వేసి ఉంచాలని నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి కోరారు. అలాగే పార్లమెంట్ హౌస్ సమీపంలోని అన్ని భవనాల ప్రాంగణాల్లో తనిఖీలు చేస్తున్నామని, అక్కడే రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను కూడా తొలగిస్తున్నామన్నారు. అయితే బెదిరింపు హెచ్చరికల విషయాలను వెల్లడించేందుకు నిరాకరించారు. పార్లమెంట్ సభలు జరిగే సమయంలో అసాంఘిక శక్తులు అరాచకం సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సభలు ప్రారంభం కానున్నాయి. అయితే దాడులు చేసేందుకు ప్రభుత్వ వాహనాలు, దుస్తులు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటివాటిని నిలువరించేందుకు అందరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. 2001, డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి సమయంలో ఆయుధాలు కలిగిన ఐదుగురు ఉగ్రవాదులు తెల్లటి అంబాసిడర్ కారును ఉపయోగించారని, దానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నకిలీ స్టిక్కర్‌ను కూడా వినియోగించారని గుర్తు చేశారు. -
రోష్నిపై దాడి అందరి వైఫల్యం
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో విద్యార్థిని రోష్ని మీద జరిగిన దాడి విశ్వవిద్యాలయంలో సామాజిక చర్చకు తెరలేపింది. విద్యార్థులు, బోధనా సిబ్బంది పాల్గొన్న ఈ సభలో జేఎన్‌యూ విద్యార్థి నేత వీ లెనిన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఓ విద్యార్థి సహ విద్యార్థిని మీద చేసిన దాడి విద్యార్థి సమాజం వైఫల్యమే. ఇందుకు అందరం బాధ్యులమే’’ అని అన్నారు. విశ్వవిద్యాలయంలో రెండు రోజుల కిందట జరిగిన బహిరంగా సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి సీసీ కెమెరాల నిఘా సరిపోదని, హింసాత్మక దాడికి మూలమైన పితృస్వామ్య భావజాలాన్ని తుడిచిపెట్టడం ద్వారా మాత్రమే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడగలమన్నారు. అధ్యాపకురాలు అనురాధ చెనాయ్ మాట్లాడుతూ.. ‘‘పితృస్వామ్య పాలన మగవాళ్లకు మహిళ మీద సర్వాధిపత్యం ఉందని నూరిపోస్తోంది. ఇలాంటి అహంకారమే వీరితో డిసెంబర్ 16 సామూహిక అత్యాచారాన్ని సమర్థిస్తూ నిరసన ప్రదర్శన చేయించింది. విశ్వవిద్యాలయంలో కాప్ పంచాయత్‌ల వాతావరణం నెలకొల్పాలని చూస్తున్నారు. మహిళల మీద సమాజంలో జరుగుతున ్న దాడులకు విశ్వవిద్యాలయం మినహాయింపు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘సమాజ ఆధిపత్య ధోరణిగా సాగుతున్న పితృస్వామ్య భావజాలం జేఎన్‌యూ విద్యార్థుల మీద కూడా ఉంటుంది. దీనికి వీరేమీ మినహాయింపు కాదు. ఒకవేళ అలా భావిస్తే మనల్ని మనం అపహాస్యం చేసుకున్నట్లే. రోష్ని మీద జరిగిన దాడి మనల్ని విచలితుల్ని చేస్తోంది. ఇది ఆధిపత్య భావజాలంలోభాగంగానే గుర్తించాల్సి ఉంటుంది’’ అని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ జయతి ఘోష్ అన్నారు. ‘‘రోష్ని మీద జరిగిన దాడికి ఎవరి మీదో నిందలు వేయడం కంటే దీనికి అందరు నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేయడం. విద్యార్థి సమాజం మానసిక పరిణితికి గుర్తు’’ అని విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షుడు సుధీర్‌కుమార్ సొపొరీ అన్నారు. ‘‘అయితే ఇలాంటి సంఘటనల పట్ల విశ్వవిద్యాలయం దయగా వ్యవహరిస్తుందనే అర్థంలో తీసుకోవద్దు’ అని ఆయన హెచ్చరించారు. సామాజికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మీద అమానవీయ దాడితో అల్లాడిన విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వవిద్యాలయంలో తమ కూతురు, కుమారుడు ఎలా ఉంటున్నారో అని పడిన ఆందోళనకు ఈ సభ గొప్ప ఊరడింపు. విద్యార్థులు, అధ్యాపకవర్గాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సభ వారి తల్లిదండ్రుల ఆందోళనకు ఉపశమనం కలిగించింది. అయితే ఇంతటితో వదిలిపెట్టకుండా విద్యార్థుల కోసం 24 గంటల సహయ కేంద్రాన్ని ప్రారంభించాలి’’ అని సూచించారు. లింగ వివక్ష వ్యతిరేక అవగాహన కమిటీలో అధ్యాపక వర్గాల ప్రతినిధి అయేషా కిద్వాయ్ మాట్లాడుతూ.. ‘‘వే ధింపులు జరిగినా విద్యార్థినులు విశ్వవిద్యాలయ వర్గాలకు ఫిర్యాదు చేయరనే భరోసానే ఆకాశ్ దాడికి అవకాశం ఇచ్చింది. రోష్ని వేధింపులను సహించడం వల్లనే దాడి చేసేందుకు ధైర్యం చేయగలిగాడ’ని పేర్కొన్నారు. ఐసీయూలోనే రోష్ని ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవహర్లాల్ నెహ్రూ విద్యార్థి రోిష్ని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. గత నాలుగు రోజుల నుంచి అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లోనే ఉన్న ఆమె రోజు రోజుకు కోలుకుంటోందని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ బీడీ అథాని ఆదివారం విలేకరులకు తెలిపారు. ‘ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రోజురోజుకు మెరుగవుతోంది. ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంద’ని వివరించారు. తలపై తీవ్ర గాయాలవడంతో మెదడులో రక్తం గడ్డ కట్టిందని, అన్ని గాయాలకు డ్రెస్సింగ్ చేశామన్నారు. కుడి మణికట్టుకు కూడా తీవ్ర గాయమైందని తెలిపారు. అన్ని అవయవాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనతో తరగతి నుంచి బయటకు రాలేదని ఆకాశ్ అనే విద్యార్థి గొడ్డలితో రోష్నిపై దాడి చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బీహార్లోనే 12వ తరగతి వరకు చదివిన ముజాఫర్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి చిన్న కుమార్తె రోష్ని ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వచ్చింది. అయితే అకాశ్తో తన సోదరికి ఎలాంటి సంబంధం లేదని, అతడు అనేకసార్లు ప్రేమిస్తున్నానని చెప్పినా తిరస్కరించిందని రోష్ని సోదరుడు సుధీర్ గుప్తా తెలిపారు. తన సోదరి చదువుల్లో ముందుంటుందన్నాడు. అయితే అకాశ్ రాసిన హిందీ, ఇంగ్లిష్‌లో ఉన్న నాలుగు పేజీల లేఖను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి వివరించారు. -
ప్రతి పేద కుటుంబానికి ఫ్లాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే జేజే కాలనీల్లో నివసించే ప్రతి పేద కుటుంబానికి ఫ్లాట్లు మంజూరు చేస్తామని బీజే పీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ హామీ ఇచ్చారు. ‘జుగ్గీ జోపిడీ మహాసమ్మేళనం’ పేరిట బీజేపీ ఢిల్లీప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం తల్కటోరా స్టేడియంలో భారీ సభ నిర్వహించారు. దీనికి నగరంలోని వివిధ జుగీ ్గజోపిడీ ప్రాంతాల్లోని పేదలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వీరినుద్దేశించి గోయల్ మాట్లాడుతూ.. సహాయం కోసం తన వద్దకు వచ్చే వారి కోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయన్నారు. గతంలోనూ తాను పేదలకు ఎంతో దగ్గరగా ఉంటూ సేవలందించానని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీ తరఫున ఇస్తున్న వాగ్ధానాలను తనను చూసి నమ్మవద్దని, గతంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు, తమ పార్టీ నిజాయితీని చూసి నమ్మవచ్చన్నారు. కాంగ్రెస్‌పార్టీ మాదిరిగా ఎన్నికల కోసం హామీలివ్వడం తమకు చేత కాదన్నారు. పేదలకు 60వేల చౌక ధరలు ఇళ్లు నిర్మించి ఇస్తామని గొప్పలు చెప్పిన షీలా సర్కార్ ఇప్పటికీ 14వేల మందికి మాత్రమే నిర్మించి ఇచ్చిందన్నారు. మిగిలిన వారికి ఇప్పటికీ ఎలాంటి సహాయం అందలేదని చెప్పారు. తక్కువ ధరకే విద్యుత్, క్రమం తప్పకుండా ఇళ్లకు రోజు నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. పరిశుభ్రత, మహిళల రక్షణ, ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. పేదలు తనను ‘విజయ్‌గోయల్ జుగ్గీవాలా’అని పిలుచుకోవడాన్ని స్వాగతిస్తానన్నారు. ‘పేదలందరికీ రేషన్‌కార్డులు, అన్ని ఇళ్లలో విద్యుత్ వెలుగులు, విద్య,వైద్యం, రక్షణ అన్ని అంశాల్లో మెరుగైన సేవలందిస్తాం. జేజే క్లస్టర్లలోని 22 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూర్చేందుకు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మా అజెండాలో పొందుపర్చాం’అని గోయల్ అన్నారు. జేజే కాలనీల్లోని వారందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు. అన్ని బస్తీలకు విద్యుత్ సరఫరా, రేషన్‌కార్డులను పంపిణీ చేయడంతోపాటు బస్తీవికాస్ కేంద్రాలను పునఃప్రాంభిస్తామన్నారు. నిరంతర నీటి, విద్యుత్ సరఫరా అందజేస్తామని గోయల్ హామీ ఇచ్చారు. జేజే కాలనీలన్నింటిలో డ్రై నేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. ప్రత్యేకంగా పోలీస్బూత్లను ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామన్నారు. జేజేకాలనీవాసులకు ఇవ్వబోయే ప్లాట్లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ)మోడల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్‌వి అన్నీ గొప్పలే: గడ్కరీ ‘దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తర్వాత పండిత్ జవహర్‌లాల్‌నెహ్రూ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆమె తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీ దేశంలో పేదరికాన్ని రూపుమాపుతామంటూ వాగ్ధానాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీవన్నీ గొప్పలే తప్ప..చేతల్లో అవి ఉండవు’అని బీజేపీ సీనియర్‌నాయకుడు నితిన్ గడ్కరీ విమర్శించారు. పదిహేనేళ్లలో ఢిల్లీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఎప్పుడూ గొప్పగా చెబుతుంటారని, క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు పేదలకు అందుతున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. మరోమారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ప్రజలకు చేసే మేలుకంటే వారి జేబులు కొల్లగొట్టడమే పెరుగుతుందన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులకీ, నేటికీ చాలా తేడా ఉందన్నారు. ధరల పెరుగుదల, విద్యుత్, నీటిబిల్లులు తదితరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్‌పార్టీకి తమ ఓటుతో ప్రతిఒక్కరూ బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సుభాష్సచ్దేవ్, బీజేపీ నాయకులు రమేశ్ బిదూరీ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీల ‘గూడు’పుఠాణి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార భద్రత పథకం కింద వీలైనంత ఎక్కువ మంది పేదవారికి తక్కువ ధరకే ఆహారం అదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వెల్లడించారు. అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటగా ఆగస్టు 20 ఆహారభద్రత పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నగరంలోని పేదలకు తక్కువ ధరకే 50 వేల ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. మరో ఐదునెలల్లో పేదలందరికీ ఇల్లు ఇస్తామన్నారు. పట్టణ పేదలు, జేజే కాలనీల్లోని వారందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఆదివారం రోహిణీ సెక్టార్-21లో నిర్వహించిన మమ్మత్ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనధికారిక కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వం దేళ్ల తర్వాత మరోమారు లాల్దోరా పథకాన్ని అమలులోకి తెచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.1,800 ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. నగరంలోనూ పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. నగరంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మొత్తం 24 ప్రభుత్వ శాఖల్లో 116 సర్వీసులను ఆన్లైన్ చేశామన్నారు. పేదలందరికీ ‘రోటీ, కపడా, మకాన్’అనే నినాదంతో నగర ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఓట్లకోసం అసత్య ప్రచారం.. విధానసభ ఎన్నికల్లో గెలుపొందడమే ధ్యేయంగా ప్రతిపక్షమైన బీజేపీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ విషప్రచారాలకు తెరతీస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అనధికారిక కాలనీల్లో అభివద్ధిని సైతం ఎంసీడీలు అడ్డుకుంటున్నాయన్నారు. సమావేశంలో సీఎం పార్లమెంటరీ సెక్రెటరీ సురేందర్‌కుమార్, ఎంపీ జేపీ అగర్వాల్, కాంగ్రెస్ నాయకులు జగ్ప్రకాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
శివమొగ్గ,న్యూస్‌లైన్ : శివమొగ్గ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగా,భద్రతోపాటు శరావతి, దండావతి, వరదా, కుమద్వతి, మాలతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. వరదనీరు చుట్టుముట్టి పలు గ్రామాలతోపాటు భద్రావతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సొరబ తాలూకా ఆనవట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుమరికొప్ప గ్రామంలో కుండ పోత వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మంజునాథ్(5) అనే బాలుడు మృతి చెందాడు. ఇదే తాలూకా చంద్రగుత్తి మండలంలో కమకూరు గ్రామనివాసి మున్నప్ప(50)వరదనీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. భద్రా జలాశయం నుంచి ముందుజాగ్రత్త చర్యగా నీటిని దిగువకు విడుదల చేయడంతో భద్రావతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కేఎస్ఆర్టీసీ బస్టాండు వెనుక భాగం నీట మునగడంతో వాహనరాకపోకలను మళ్లించారు. కవలుగుంది గ్రామంలోకి వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై గ్రామస్తులను సమీపంలోని పాఠశాలకు తరలించి అక్కడ గంజికేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాగర తాలూకా తమిడికొప్ప చెరువు పొంగి పొర్లింది. దీంతో చెరువు పక్కనే ఉన్న రహదారి నీటమునిగి వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శికారిపుర తాలూకా గౌరిహళ్ల చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో శికారిపుర-సొరబ ప్రధానరహదారి జలమయమైంది.సొరబ తాలూకాలో వరదానది పరవళ్లు తొక్కడంతో వందలాది ఎకరాల్లోకి వరదనీరు చొరబడి పంటలు నీటమునిగాయి. వరదల కారణంగా శివమొగ్గ తాలూకా గాజనూరులోని తుంగాజలాశయం కళకళలాడుతోంది. జలాశయంలోకి ఇన్‌ప్లో 61,131 క్యూసెక్కులుగా ఉండగా 60,352 క్యూసెక్కుల నీటిని హొస్పేట తుంగభద్రా డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు. భద్రా జలాశయం ఇన్‌ప్లో 44,665 క్యూసెక్కులుగా ఉండగా 61, 646 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాతహొన్నూరు సమీపంలోని తుంగా, భద్రా నది సంగమ స్థలం సముద్రాన్ని తలపిస్తోంది. లింగమనక్కి జలాశయ గరిష్టనీటిమట్టం 1819 అడుగులు కాగా ప్రస్తుతం 1816.75 అడుగులకు చేరుకుంది. 67,478 క్యూసెక్కులు డ్యాంలోకి వస్తుండగా 57,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. 24గంటల వ్యవధిలో శివమొగ్గ తాలూకాలో 21.4 మిల్లీమీటర్లు, భద్రావతిలో 18.6, తీర్థహళ్లిలో 47.6, సాగరలో 16.8 , శికారిపురలో 5.6, సొరబలో 29.2, హొసనగర తాలూకాలో 82.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. -
బీజేపీ చీలిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారం
సాక్షి, బళ్లారి : అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బీఎస్ యడ్యూరప్ప, బీ. శ్రీరాములు వి డిపోయి కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేయడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున నాగప్ప, సగీర్ అహ్మద్‌లు పేర్కొన్నారు. బళ్లారి లోక్‌సభ అభ్యర్థి కోసం పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేం దుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గత అ సెంబ్లీ ఎన్నికల కంటే కేవలం 2 శాత ం మాత్రమే ఓట్ల శాతం పెరిగిందని గుర్తు చేశారు. తమకు అధికారం వచ్చింది కదా? అని కార్యకర్తలు, నేతలు విర్రవీగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ నుంచి విడిపోయిన కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు స్వతంత్రంగా పోటీ చేస్తా యా? లేక బీజేపీలో తిరిగి కలుస్తాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియ లేదన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయికే కిలో బియ్యం, క్షీరభాగ్య వంటి సంక్షేమ పథకాలను జారీ చేసి జనరంజక పాలన అంది స్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బళ్లారి లోక్‌సభ నుంచి 1999లో సోనియాగాంధీ పోటీ చేసి గెలుపొందారని గుర్తు చేశారు. బళ్లారి జి ల్లాపై మేడం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. తాము ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రమే వచ్చామని, టికెట్ కేటాయింపు తమ చేతుల్లో లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారన్నారు. ఈ కార్యక్రమంలో బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్, కాంగ్రెస్ పరిశీలకులు గోపీనాథ్, చంద్రిక పరమేశ్వరీ, మాజీ ఎంపీ ఎన్వై హనుమంతప్ప, బళ్లారి నగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ ఎంపీ కోళూరు బసవనగౌడ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పంపాపతి, డేగులపాడు నారాయణప్ప, వెంకటరావ్ ఘోర్పడే, అసుండి వన్నూరప్ప(వండ్రీ), గిరిమల్లప్ప, కమలా మరి స్వామి, కార్పొరేటర్లు వెంకటరమణ, అశోక్, బె ణకల్ బసవరాజగౌడ తదితరులు పాల్గొన్నారు. -
డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు కుట్ర
సాక్షి, చెన్నై: డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తి రునల్వేలి వేదికగా వ్యూహ రచన జరిగినట్టు, ఇంటెలిజెన్స్ దృష్టికి ఈ కుట్ర సమాచారం చేరినట్టు ఓ మీడియాలో వచ్చిన కథనం ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ డీజీపీ రామానుజంను ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సభ్యులు 29 మంది అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీలో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పక్షాన చేరారు. పార్టీకి రెబల్‌గా వీరు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తిరునల్వేలి వేదికగా కుట్ర జరిగి ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. ఆ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఓ మీడియాలో కథనం సైతం వెలువడింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో పార్టీ రెబల్ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను తిరువణ్ణామలై కీల్ నాచ్చుపట్టు వద్ద ఓ వ్యాన్ ఢీకొట్టి వెళ్లి పోవడం అనుమానాలకు దారి తీసింది. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రెట్టింపు అయింది. దీంతో ఆపార్టీ నాయకుడు బాలాజీ నేతృత్వంలో పలువురు డీజీపీ కార్యాలయానికి శనివారం చేరుకున్నారు. అక్కడి ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేల హత్యకు కుట్ర జరిగినట్టు సమాచారం అందిందన్నారు. ప్రధానంగా చెంగల్పట్టు ఎమ్మెల్యే అనగై మురుగేషన్, తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రహ్మణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్‌లను టార్గెట్ చేసి కుట్ర జరిగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరునల్వేలి వేదికగా ఈ కుట్రకు పథకం రచించబడి ఉందని, ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని విన్నవించారు. -
ఎన్నికలలోకి నటి రమ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బహు భాషా నటి రమ్య ఎన్నికల రంగంలోకి అడుగిడారు. శాసనసభ ఎన్నికల్లో తన తల్లికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆమె ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ మండ్య ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. మండ్యతో పాటు బెంగళూరు లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజైన శనివారం ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు గ్రామీణ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శివ కుమార్ సోదరుడు డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి నామినేషన్లు సమర్పించారు. మండ్య జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టరాజు శుక్రవారం నామినేషన్‌ను దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌తో అవగాహన కుదరవచ్చని వినిపిస్తున్నప్పటికీ బీజేపీ తన అభ్యర్థులను రంగంలోకి దించింది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గానికి ఎం. కృష్ణప్ప, పారిశ్రామికవేత్త మునిరాజు, మండ్య స్థానానికి దొరస్వామిలు ఆ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గతంలో ఈ స్థానాలకు జేడీఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన హెచ్డీ. కుమారస్వామి. ఎన్. చలువరాయస్వామి శాసన సభకు ఎన్నిక కావడంతో ప్రస్తుతం ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్‌సభలో నోరు మెదపలేదేం.. : కుమారపై సిద్ధు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి లోక్‌సభలో ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ నామినేషన్‌ను దాఖలు చేయడానికి ముందు రామనగరలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనవసరంగా జరుగుతున్న ప్రస్తుత ఉప ఎన్నికకు కుమారస్వామే కారణమని ఆరోపించారు. దీని వల్ల ఖజానాపై కూడా భారం పడుతుందన్నారు. ఓటములతో కుంగిపోయిన దేవెగౌడ కుటుంబానికి రామనగర అండగా నిలిచిందని, అయితే ఆ కుటుంబం నుంచి ఈ పట్టణానికి దక్కిందేమీ లేదని విమర్శించారు. జేడీఎస్, బీజేపీల అపవిత్ర పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం వల్ల ప్రజలు నానా బాధాలు పడ్డారని దుయ్యబట్టారు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని అన్నారు. దేవెగౌడ కుటుంబం ఏనాడూ బహిరంగ రాజకీయాలు చేయలేదని, నిగూఢ ఒప్పందాలతోనే రాజకీయాలు చేసిందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. -
హనీఫా మళ్లీ అరెస్ట్
సాక్షి, చెన్నై: తెన్కాశి హనీఫా మళ్లీ అరెస్టు అయ్యాడు. బెంగళూరు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా హనీఫాను చేర్చారు. విచారణ నిమిత్తం అతడ్ని బెంగళూరు తీసుకెళ్లే పనిలో కర్ణాటక పోలీసులు పడ్డారు. ఇటీవల బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉండడంతో ఆ కేసు విచారణ రాష్ట్రం చుట్టూ సాగుతోంది. రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఇప్పటికే అరెస్ట్ అయ్యూరు. దీనిని నిరసిస్తూ మైనారిటీ సామాజిక వర్గం ఆందోళనలు నిర్వహించింది. అక్రమ అరెస్టులుగా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో తెన్కాశి హనిఫాను పేలుళ్ల కేసులో నిందితుడిగా చేరుస్తూ శనివారం అరెస్టు చేశారు. మదురైలో హనీఫా తెన్కాశి హనీఫా దిండుగల్ సమీపంలో ఇటీవల అరెస్టు అయ్యారు. బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర విచ్ఛిన్నానికి మదురై సమీపంలో జరిగిన కుట్రలో హనీఫా నిందితుడు. హనీఫా ప్రస్తుతం మదురై కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు పేలుళ్ల కేసులో హనీఫా హస్తం ఉన్నట్లు కర్ణాటక పోలీసులు తేల్చారు. అతడ్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందం అధికారులు శనివారం మదురై చేరుకున్నారు. అరెస్టుకు సంబంధించిన ఉత్తర్వులను మదురై కేంద్ర కారాగారం అధికారులకు అందజేశారు. హనీఫాను విచారణ నిమిత్తం తీసుకెళ్లడానికి కర్ణాటక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యార్థులతోనే ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కమిటీ సోమవారం సమావేశం కానుంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ కీలకం. ఎన్నో కలలతో, లక్ష్యాలతో విద్యార్థులు కళాశాలలకు వస్తుంటారు. అరుుతే ర్యాగింగ్ భూతం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా కళాశాల జీవితంలోకి అడుగుపెట్టే విద్యార్థులను సీనియర్లు చిన్నపాటి అల్లరి చేష్టలతో సరదాగా ఆట పట్టించడం ర్యాగింగ్‌గా ముద్రపడింది. ఈ సరదా కొన్ని సమయూల్లో శ్రుతి మించుతోంది. అసంబద్ధ, అసభ్యకరమైన ప్రశ్నలేగాక, దుస్తులను విప్పించడం వంటి చేష్టలకూ కొందరు సీనియర్లు వెనకాడడం లేదు. ర్యాగింగ్ విషయంలో విద్యార్థినులూ తక్కువేం కాదు. ర్యాగింగ్ భూతం దెబ్బతో ఇటీవలే చెన్నైలో ఓ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ మిద్దెపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ర్యాగింగ్‌ను కొందరు సరదాగా తీసుకుంటున్నారు. సున్నితమనస్కులైన విద్యార్థులు మాత్రం బెదిరిపోతున్నారు. మరికొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాలు దృష్టి సారించారుు. అస్సోంలో 1988 డిసెంబరు 17న ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లో దీనిని అమలు చేయడం ప్రారంభించారు. కలెక్టర్ నేతృత్వంలో కమిటీ తమిళనాడులోని అన్ని కళాశాలలు, యూని వర్సిటీల్లో ఈ నెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యూరుు. దేశం నలుమూలల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ చేరారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై కలెక్టర్ సుందరవల్లి నేతృత్వంలో ర్యాగింగ్ నిరోధక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో జిల్లా రెవెన్యూ అధికారి, నగర కమిషనర్, మీడియా ప్రతినిధులు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడికల్, సాంస్కృతిక కళాశాలల విద్యార్థులను సభ్యులుగా చేర్చారు. ర్యాగింగ్ బాధితుల సౌకర్యార్థం 1077 నెంబర్‌తో టోల్ ఫ్రీ ఫోన్ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులతో ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సమావేశం కానున్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ను అదుపుచేసే బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం, ఆపైన అధికారుల పర్యవేక్షణగా నిర్ణయించడం విశేషం.