జాగ్రత్తగా, అన్నిరకాలుగా ఆలోచించే సినిమాలను ఎంపిక చేసుకోమ్మంటూ నటి రిచా చద్దాకు సలహా ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ.
ఎంపికలో జాగ్రత్త సుమా..!
Aug 4 2013 11:00 PM | Updated on Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: జాగ్రత్తగా, అన్నిరకాలుగా ఆలోచించే సినిమాలను ఎంపిక చేసుకోమ్మంటూ నటి రిచా చద్దాకు సలహా ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు. షేక్‌స్పియర్ రాసిన ‘రోమియో జూలియట్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిచా చద్దా కూడా నటిస్తోంది. దీంతో రీచా నటనపై సంతృప్తికరంగానే ఉన్న భన్సాలీ ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని, సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు.
ఈ విషయమై రీచా మాట్లాడుతూ... ‘అమితాబ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోల ఇమేజ్‌ను మార్చిన దర్శకుడిగా భన్సాలీకి పేరుంది. అటువంటి గొప్పవ్యక్తి ఇచ్చిన సలహా ఎంతో విలువైనదిగా భావిస్తాను. తాను తెరకెక్కిస్తున్న సినిమాలపట్ల పూర్తి అంకితభావాన్ని కనబర్చే భన్సాలీకి కోపం త్వరగా వస్తుంది. అయితే ఆయన పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. సినిమాల్లో దీపికా, నేను కలిసి నటించే సందర్భాలున్నాయి. మా నుంచి ఏవో అద్భుతాలను ఆయన ఆశించేవారు.
సినిమా అద్భుతంగా తెరకెక్కడానికి ఆయన పడే తపన ఏంటో అప్పుడు నాకు తెలిసొచ్చింది. అయితే ఆయనతో తొలి కలయిక నాకు అసంతృప్తినే మిగిల్చింది. నేను గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. అప్పుడు నేను పూర్తిగా పాశ్చాత్య వేశధారణలో ఉన్నా. ఆయన భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే యువతి కోసం వెతుకుతున్నారు. నన్ను చూసి ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఎదురుచూస్తున్న అవకాశం చేజారిందనుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా రామ్‌లీలాలో ఓ పాత్రను నువ్వు మాత్రమే చేస్తున్నావని ఆయన చెప్పార’ని తెలిపింది రిచా.
Advertisement
Advertisement