ఆహార భద్రత పథకం కింద వీలైనంత ఎక్కువ మంది పేదవారికి తక్కువ ధరకే ఆహారం అదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వెల్లడించారు
పార్టీల ‘గూడు’పుఠాణి!
Aug 4 2013 10:39 PM | Updated on Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార భద్రత పథకం కింద వీలైనంత ఎక్కువ మంది పేదవారికి తక్కువ ధరకే ఆహారం అదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వెల్లడించారు. అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటగా ఆగస్టు 20 ఆహారభద్రత పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నగరంలోని పేదలకు తక్కువ ధరకే 50 వేల ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. మరో ఐదునెలల్లో పేదలందరికీ ఇల్లు ఇస్తామన్నారు. పట్టణ పేదలు, జేజే కాలనీల్లోని వారందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు.
ఆదివారం రోహిణీ సెక్టార్-21లో నిర్వహించిన మమ్మత్ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనధికారిక కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వం దేళ్ల తర్వాత మరోమారు లాల్‌దోరా పథకాన్ని అమలులోకి తెచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.1,800 ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. నగరంలోనూ పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. నగరంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మొత్తం 24 ప్రభుత్వ శాఖల్లో 116 సర్వీసులను ఆన్‌లైన్ చేశామన్నారు. పేదలందరికీ ‘రోటీ, కపడా, మకాన్’అనే నినాదంతో నగర ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు.
ఓట్లకోసం అసత్య ప్రచారం..
విధానసభ ఎన్నికల్లో గెలుపొందడమే ధ్యేయంగా ప్రతిపక్షమైన బీజేపీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ విషప్రచారాలకు తెరతీస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అనధికారిక కాలనీల్లో అభివద్ధిని సైతం ఎంసీడీలు అడ్డుకుంటున్నాయన్నారు. సమావేశంలో సీఎం పార్లమెంటరీ సెక్రెటరీ సురేందర్‌కుమార్, ఎంపీ జేపీ అగర్వాల్, కాంగ్రెస్ నాయకులు జగ్‌ప్రకాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement