రాజధానిలో ఫ్యామిలీ కోర్టులను పటిష్టం చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు.
ఫ్యామిలీ కోర్టుల బలోపేతం
Aug 5 2013 10:56 PM | Updated on Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో ఫ్యామిలీ కోర్టులను పటిష్టం చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. మురికి నాలాల పూడికతీత, సఫాయి కార్మికుల హోదాని పెంచాలని సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు.
కేసుల భారాన్ని తగ్గించేందుకే...
ఢిల్లీలో తొలి ఫ్యామిలీ కోర్టును 2009, మే 15న ద్వారకా జిల్లా న్యాయస్థానం కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేశారు. విడిపోయిన కుటుంబసభ్యుల మద్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నించడంతో పాటు కేసులు ఎక్కువైన సాంప్రదాయ కోర్టుల పైనుంచి వైవాహిక కుటుంబపరమైన వివాదాల కేసుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 9 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. 2012, డిసెంబర్ 17 నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీలో 11 సివిల్ డిస్ట్రిక్ట్స్ ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఢిల్లీని 11 మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా విభజించారు. దీంతో నగరంలో 11 ప్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టుల కోసం ఒక ప్రిన్సిపల్ జడ్జి, 10 మంది జడ్జిలు ఉన్నారు. కానీ 11 ఫ్యామిలీ కోర్టులకు ఒక్కొక్క ప్రిన్సిపల్ జడ్జి ఉండాలన్న ఉద్దేశంతో పది మంది జడ్జిలకు పదోన్నతి కల్పించి ప్రిన్సిపల్ జడ్జిలుగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.
లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ బిల్లుకు ఆమోదం
నగరంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, వాక్‌వేలను ఎక్కువగా అమరుస్తున్నందువల్ల వాటిని సమయానుసారం తనిఖీ చేయడం, పరీక్షించడం, భద్రతా సర్టిఫికెట్లు జారీ చేయవలసిన ఆవశ్యకత పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లుల ముసాయిదా రూపొందించారు. దీనిని కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీ సఫాయి కర్మచారీల కమిషన్ డిమాండ్ మేరకు సీవర్ లైన్ల పూడికతీతపనులు, శుభ్రపరిచే పనులు చేసే కార్మికుల హోదాను కనీస వేతనాల చట్టం కింద మెరుగపరచాలని నిర్ణయించింది. చేతులతో నాలాలను పూడికతీసి శుభ్రపరిచేవారిని ఇకమీదట సెమీ స్కిల్డ్ లేబర్‌గా, యంత్రాలతో శుభ్రపరిచే వారిని స్కిల్డ్ లేబర్‌గా ఇక నుంచి పరిగణించనున్నారు.
Advertisement
Advertisement