ఆస్తికోసం తండ్రిని చంపి తల్లి మీద హత్యాయత్నం చేసిన 38 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
తండ్రిని చంపిన కుమారుడికి జీవిత ఖైదు
Aug 5 2013 10:58 PM | Updated on Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ఆస్తికోసం తండ్రిని చంపి తల్లి మీద హత్యాయత్నం చేసిన 38 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఫిబ్రవరి 7వ తేదీ 2012న నిందితుడు చంద్రమోహన్ దింగ్రా తల్లిదండ్రుల పేరున ఉన్న ఆస్తిని కబలించాలని దాడి చేశాడు. తండ్రి హర్నామ్‌దింగ్రాను కత్తితో పొడిచి చంపుతుండగా తల్లిని కూడా హత్య చేస్తానని బెదిరించాడు. భర్తను రక్షించుకొనే ప్రయత్నంలో అడ్డుతగిలిన తల్లి తల మీద కూడా పలుమార్లు కత్తితో పొడిచాడు.
తరువాత తనకు తానుగా కత్తితో గాయాలుచేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. రక్తం మడుగులో పడి ఉన్న దంపతులను గమనించిన ఇరుగుపొరుగు సమాచారం అందించడంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా హర్నామ్ అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు. పోలీసులు చంద్రమోహన్ దింగ్రా మీద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారణ జరిపిన జిల్లా జడ్జి పీఎస్ తేజీ ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి నిందితుడిని దోషిగా ప్రకటించారు.
Advertisement
Advertisement