ప్రత్యేక తెలంగాణ ప్రకటించడంతో నగరంలోని తెలంగాణ ప్రజలు ఆదివారం ఉదయం పోచ మ్మ తల్లికి మొక్కలు చెల్లించుకున్నారు. పశ్చిమ దాదర్‌లోని హనుమాన్ మందిరం వద్ద ఉన్న ప్రాచీ న పోచమ్మ ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు
సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ ప్రకటించడంతో నగరంలోని తెలంగాణ ప్రజలు ఆదివారం ఉదయం పోచ మ్మ తల్లికి మొక్కలు చెల్లించుకున్నారు. పశ్చిమ దాదర్‌లోని హనుమాన్ మందిరం వద్ద ఉన్న ప్రాచీ న పోచమ్మ ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ ఆలయం 30 ఏళ్ల క్రితం నిర్మితమైందని కొంతమంది స్థానికులు తెలి పారు. అప్పటి నుంచి పోచమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారని, కల నెరవేరడంతో మొక్కులు చెల్లించుకున్నారని బహుజన్ సమాజ్ పార్టీ ముంబై కార్యదర్శి నాగ్‌సేన్‌మాల తెలిపారు.
తూర్పు అంధేరీలో...
సాకినాకాలోని శీత్లాదేవి పోచమ్మ తల్లికి తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహించా రు. మహిళలు బోనాలను తలపై ఉంచుకుని అమ్మవారి మందిరానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యే క పూజలు నిర్వహించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు వందకుపైగా కుటుంబాలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలి పారు. కాగా ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు బండి హిరమణి, కుర్భా రత్నమ్మ, చింతకింది లక్ష్మి, బొద్దు పద్మలత తదితరులు పాల్గొన్నారు.
నయీగావ్‌లో
దాదర్‌లోని నయీగావ్‌లో పోచమ్మ తల్లి బోనాల పండుగను తెలుగు ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. తొలుత అభిషేకం చేశారు. తర్వాత గణపతి పూజ, నవగ్రహ పూజ, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల మధ్య పలు వీధులమీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తర్వాత అమ్మవారికి తమ వెంట తెచ్చిన నైవేద్యాన్ని సమర్పిం చారు. భక్తులకు తీర్థ,ప్రసాదాలను అందజేసినట్టు నిర్వాహకులు అనుమల్ల సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా పాల్గొని అమ్మవారికి చీరలు, సారెలు సమర్పించారన్నారు. స్థానిక కార్పొరేటర్లు, ఇతర సంఘాల ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, దోమల శంకర్, చెరిపెల్లి కనకప్రసాద్, పాపని సుదర్శన్ తదితరులు ఉత్సవాల నిర్వహణకు తోడ్పడ్డారు.