దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.
విమానంలో బంగారం తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
Aug 5 2013 6:29 AM | Updated on Sep 1 2017 9:40 PM
టీనగర్, న్యూస్‌లైన్: దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి చెన్నైకు వస్తున్న విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు చెన్నైకు వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో కేరళ రాష్ట్రం కన్నూర్‌కు చెందిన కసాబుద్దీన్ (27) అనే ప్రయాణీకుడు వద్ద 400 గ్రాముల బంగారు నగలు లభించాయి.
దీని గురించి అతని వద్ద విచారణ జరపగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో అతని వద్ద నున్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 13 లక్షలు ఉంటుం దని అధికారులు తెలిపారు. ఆదివా రం ఉదయం 6.30 గంటలకు దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండి యా ప్రయాణీకులను అధికారులు తనిఖీ చేశారు. కేరళ రాష్ట్రం త్రిచూర్‌కు చెందిన ప్రయాణీకుడు మోహిసాబు (33) వద్ద నుంచి 20 బంగా రు బిస్కెట్లను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. వీటి విలువ రూ. 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
రూ.46 కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం:
చెన్నై నుంచి వెళ్లిన విమానంలో రూ. 46 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. చెన్నై నుంచి సింగపూర్ మీదుగా థాయ్‌లాండ్‌కు విమానం బయలుదేరి వెళ్లింది. ఇందులో బయలుదేరిన ప్రయాణీకులు థాయ్‌లాండ్‌లో దిగారు. అక్కడ థాయ్‌లాండ్ కస్టమ్స్ అధికారులు ఉత్తర భారత దేశానికి చెందిన హర్‌దేవ్, పూరం సింగ్ అనే యువకుల వద్ద తనిఖీలు జరిపి 12 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 46 కోట్ల రూపాయిలు. వీరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement