గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో ప్రత్యేక కనెక్షన్లు ఉన్నవారికి విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.6.50 నుంచి రూ.7కి పెంచడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.
విద్యుత్ చార్జీలు పెంపుతో పెనుభారం
Published Tue, Aug 6 2013 10:33 PM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో ప్రత్యేక కనెక్షన్లు ఉన్నవారికి విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.6.50 నుంచి రూ.7కి పెంచడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్‌సీ) వెనుక ఉన్న ప్రభుత్వమే ఈ విధానాలకు కారణమని ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ విమర్శించారు. సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘ దాదాపు 4వేల హౌసింగ్ సొసైటీల్లో నివసిస్తున్న రెండు లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభుత్వ నిర్ణయ భారం పడుతుంది.
పజా సంక్షేమానికి కృషిచేయాల్సిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విద్యుత్ కంపెనీలకు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి విద్యుత్ కంపెనీలకు మధ్య ఇప్పటికే చీకటి ఒప్పదం కుదిరింద’ని ఆయన ఆరోపించారు. మూడేళ్లలో 72శాతం విద్యుత్ చార్జీలు పెంచారని విజయ్‌గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు పెంపుదల చూస్తుంటే విద్యుత్ కంపెనీల చేతుల్లో ముఖ్యమంత్రి కీలుబొమ్మగా మారారని అర్థమవుతుందన్నారు. జూలై 26న డీఈఆర్‌సీ ఐదు శాతం విద్యుత్‌టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్‌సరఫరా చేస్తుండగా ఢిల్లీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ‘ పంజాబ్‌లో కమర్షియల్ యూనిట్‌కి రూ.5.74, మీడియం యూనిట్ కి రూ.6.26, లార్జ్ యూనిట్‌కి రూ.6.33 ఉంది. నగరంలో మాత్రం యూనిట్ రూ.7 వసూలు చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు 30శాతం తగ్గిస్తామన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. విధానసభ ఎన్నికల్లో గెలుపు తర్వాత వెంటనే విద్యుత్ టారిఫ్‌లపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
Advertisement
Advertisement