కేంద్ర మంత్రి షిండేపై విలాస్ మండిపాటు | vilas fires on central minister shinde | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి షిండేపై విలాస్ మండిపాటు

Aug 5 2013 12:17 AM | Updated on Sep 1 2017 9:38 PM

ప్రత్యేక విదర్భ విషయంలో దేశ ప్రజలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ఎంపీ విలాస్ ముత్తెం వార్ ఆరోపించారు

నాగపూర్: ప్రత్యేక విదర్భ విషయంలో దేశ ప్రజలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ఎంపీ విలాస్ ముత్తెం వార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ‘పాతదైనందువల్లనే తెలంగాణ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని మీరు పేర్కొన్నారు. విదర్భ కంటే అత్యంత అర్హత కలిగినదని చెప్పారు. విదర్భ చారిత్రక వాస్తవాలు లేని దన్నారు. అందుకు సాక్ష్యాలేమీ లేవన్నారు. ఈ వ్యాఖ్యలు విదర్భ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ‘మీ శాఖ అధికారులు మి మ్మల్ని మభ్యపెడుతున్నారా లేదా గట్టి పత్రసహిత ఆధారాలున్నప్పటికీ మీరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. విదర్భ అం శం అత్యంత పాతదన్నారు.
 
  1953లో ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ సైతం విదర్భను ప్రతే ్యక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చంటూ సమర్థించిందన్నారు. విదర్భకు మంచి రాబడి ఉందని పేర్కొందన్నారు. అం దువల్ల మహారాష్ట్రలోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని సూచించిందన్నారు. ‘అనేక సంవత్సరాలుగా వివిధ కీలక మంత్రి పదవులను మీరు నిర్వహించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వెనుకబడిన విదర్భకు మీరు చేసేందేమీ లేదు. ప్రస్తుతం మీరు అత్యంత ప్రభావవంతమైన పదవిలో ఉన్నారు. విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లలేదు’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement