breaking news
delhi elections
-
చంద్రబాబు కొత్తరాగం.. మర్మం ఇదేనా?
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల పలితాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలను జనం నమ్ముతారా? ఢిల్లీ, ఏపీ మోడళ్లు ఫెయిల్ అని చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ అంశాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు బోధపడతాయి. ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. నిజాలకు పాతరేసి, తనకు కావాల్సిన వాదనను తెరపైకి తెస్తుంటారు. దీన్ని ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుని అనేక వ్యూహాలను పన్నింది. కేంద్రంలోని తన ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులూ తోడు కావడంతో ఆ పార్టీ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ బృందాన్ని బదనాం చేయడంలో బీజేపీ సఫలం అయింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్‌పై మరక పడింది. విశేషం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వాస్తవంగా ఎంత నష్టం జరిగిందన్నది ఇప్పటికీ మిథ్యే. అయినా కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు పలువురు మాత్రం నెలల తరబడి జైలులో ఉండవలసి వచ్చింది. అయినా బీజేపీకి తన విజయంపై నమ్మకం కలగలేదు.అందుకే తన ఎన్నికల మానిఫెస్టోలో అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. అన్నిటికి మించి పిభ్రవరి ఒకటో తేదీన ప్రకటించిన బడ్జెట్లో.. పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి ఐదున పోలింగ్ తేదీని ప్రకటించడంలోని ఆంతర్యం కూడా ఇదే అయి ఉండవచ్చన్న సందేహం కలుగుతుంది. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగవర్గాలు, మధ్యతరగతి వారు ఉంటారు. వారందరికి ఇన్ కమ్ టాక్స్ రాయితీ ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే డిల్లీ ఎన్నికల పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను మదింపుదారులకు ఊరట కలిగిందని అనుకోవచ్చు. అంతేకాదు. ఒకప్పుడు ఉచిత పథకాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ముసుగు తొలగించింది. ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మించి కొత్త వాగ్దానాలు చేసింది. వాటిలో ప్రధానమైనది పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇది కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వంటిది. ఏపీలో తన భాగస్వామి టీడీపీ రూ.1500 చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం వంటిది. ఈ మూడు రాష్ట్రాలలో ఈ హామీని ఎలా అమలు చేయాలో తెలియక ఆ పార్టీల ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఆ తరుణంలో బీజేపీ ఇలాంటి హామీ ఇచ్చింది. ఆప్ నెలకు రూ.2,100 రూపాయలు ఇస్తామని చెబితే బీజేపీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఊరించింది. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములను కొనసాగిస్తూ కొత్తవాటిని ఇస్తామని బీజేపీ తెలిపింది. ప్రతి గర్భిణీకి రూ.21 వేలు ఇస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెట్టే అటల్ క్యాంటీన్లు నెలకొల్పుతామని, పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీలిచ్చింది. ఆప్ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు, నీరు ఉచితంగా అందిస్తూండటం గమనార్హం. బీజేపీ ఇంకా పలు హామీలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు విస్మరించి, బీజేపీ అభివృద్ది మోడల్‌తో గెలిచిందని సత్యదూరమైన ప్రకటన చేశారు. నిజంగానే కేవలం అభివృద్ది ఆధారంగానే ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ఉంటే, ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ స్కీములను తాము కొనసాగిస్తామని బీజేపీ ఎందుకు చెబుతుంది? దీనర్థం ఆప్ మోడల్ ఢిల్లీలో సఫలమైంది కనుక దానిని అనుసరిస్తామని చెప్పడమే కదా! ఆప్‌ను దెబ్బతీయడానికి అంతకన్నా ఎక్కువ హమీలు ఇవ్వాలని అనుకోవడంలో అభివృద్ది మోడల్ ఏమి ఉంటుంది? ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో కేంద్రం పెత్తనం అధికంగా ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆప్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారనే చెప్పాలి. ఆప్ వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండేది. ఆప్, కాంగ్రెస్‌కు కలిసి సుమారు 49 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. కాంగ్రెస్‌కు వచ్చిన ఆరుశాతం ఓట్లు ఆప్‌ను దెబ్బకొట్టినట్లు అనిపిస్తుంది. కేజ్రీవాల్ తాము గెలుస్తామనే ధీమాతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బోల్తా పడ్డారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం స్కూళ్లు మెరుగుపరచింది. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లకు అక్కడ డిమాండ్ వచ్చేలా చేసిందన్నది వాస్తవం. అలాగే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.చంద్రబాబు ఈ రెండు పాయింట్లను సైతం విమర్శించారు. స్కూళ్లు బాగు చేశామంటున్నారు కాని కాలేజీలు పెట్టలేదని, ప్రజల ఇళ్లవద్దకు డాక్టర్లను పంపించారని ఒప్పుకుంటూనే సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులు నెలకొల్పలేదని అన్నారు. ఢిల్లిలో లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు అదే స్కామ్‌లో అభియోగానికి గురైన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎందుకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారో చెప్పరు. ఢిల్లీ ఆప్ ఓటమిని ఏపీలో వైఎస్సార్సీపీ పరాజయానికి పోల్చుతూ తాము కూటమి పక్షాన ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సంక్షేమం కాదని అభివృద్ధి ముఖ్యమని ఢిల్లీ ఓటర్లు అభిప్రాయపడ్డట్లుగా ఆయన అంటున్నారు. దీనిని ఏపీకి వర్తింపచేసే యత్నం చేశారు. నిజంగానే ఏపీలో YSRCP ప్రభుత్వం అమలు చేసిన మోడల్ సక్సెస్ అయిందన్న భావన.. భయం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేకుంటే జగన్ స్కీములన్నిటిని కొనసాగిస్తామని ఎందుకు ప్రకటించారో వివరించాలి కదా!. అమ్మ ఒడి కింద జగన్ ప్రభుత్వం తల్లికి రూ.15 వేలు చొప్పున ఇస్తుంటే, తాము అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ఎందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు? సూపర్ సిక్స్ అంటూ ఎందుకు ఊదరగొట్టారు? నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, మహిళలకు నెల నెలా రూ.1500, బలహీన వర్గాలకు 50 ఏళ్లకే ఫించన్, రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎలా ప్రకటించారు?. ఏపీలో జగన్ టైమ్‌లో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడితే అది అభివృద్ది కాదట. పోనీ చంద్రబాబు 15 ఏళ్లు ఇప్పటికే సీఎంగా పని చేశారు కదా! ఎందుకు స్కూళ్లను బాగు చేసి పేదలకు మంచి విద్య అందించలేదు. అసలు విద్య అనేది ప్రైవేటు రంగ బాధ్యత అని గతంలో అనేవారే! చంద్రబాబు తన పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయలేపోయారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే అభివృద్ధి కాదట. నాలుగు పోర్టులు నిర్మించడం అభివృద్ది కాదట. వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం అభివృద్ది మోడల్ అట. పోర్టులను ప్రవేటు పరం చేయాలని యోచించడం ప్రగతి అట. జగన్ ఎన్నికల మానిఫెస్టోని చిత్తశుద్దితో అమలు చేస్తే, చంద్రబాబు అండ్ కో ప్రజలను మాయ చేయడానికి వాడుకున్నారు. గెలిచిన తర్వాత సంక్షేమం కాదు.. అభివృద్ది అంటూ కొత్తరాగం తీస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో టీడీపీకి మద్దతుగా కేజ్రీవాల్ ఏపీలో ప్రచారం చేశారు. అప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా, ఢిల్లీ అభివృద్ది ప్రదాతగా, పాలనదక్షుడిగా చంద్రబాబుకు కనిపించారు. ఇప్పుడేమో అదే కేజ్రీవాల్‌ను రాజకీయ కాలుష్యం సృష్టించిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే ఉండడానికి అనర్హుడుగా, టెర్రరిస్టుగా, భార్యనే ఏలుకో లేని వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మోదీది అభివృద్ది మోడల్ అని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తూ మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీడియా ప్రతినిధి ఈ విషయాలు అడుగుతారేమోనని అనుకుంటే అలా జరిగినట్లు లేదు. ఆ ప్రశ్నలే రాకుండా ఆయన జాగ్రత్త పడతారేమో తెలియదు. చంద్రబాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని మీడియా ప్రచారం చేయాలి. అదే ఆయన వ్యూహం కూడా. ఏది ఏమైనా ఢిల్లీ ఫలితాల పేరుతో సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు మంగళం పలకడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుది చీటింగ్ మోడల్ అని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. మాటలు మార్చడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును మించి రాజకీయ కాలుష్య కాసారాన్ని సృష్టించగల నేత ఇంకెవరైనా ఉన్నారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆపద నుంచి ప్రజలకు విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(BJP victory) సాధారణ విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. దశాబ్ద కాలం తర్వాత ఆప్ద(ఆపద) నుంచి ఢిల్లీ ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని అన్నారు. బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అవకతవకలపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్నిరకాల అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. జనం సొమ్మును లూటీ చేసినవారి నుంచి తిరిగి కక్కిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇప్పటిదాకా పాలన వెలగబెట్టినవారు పచ్చి అవినీతిపరులు అని మండిపడ్డారు. షార్ట్–కట్ రాజకీయాలు చేసేవారికి ప్రజలు షార్ట్–సర్క్యూట్‌తో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజల రుణం తీర్చుకుంటాం ధూర్త, మూర్ఖ రాజకీయాలు మన దేశానికి అవసరం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆప్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఎజెండాను చోరీ చేసిందన్నారు. హిందుత్వ వేషంతో ఓట్లు రావడం లేదు కాబట్టి మిత్రపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల ఢిల్లీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని, నగరాన్ని అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని వివరించారు. యమునా నదిలో శుభ్రం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మన ప్రయత్నాలను యమున మాత తప్పకుండా ఆశీర్వదిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి ధూర్త, మూర్ఖ రాజకీయాలు చేసే దుష్టులు దేశ రాజకీయాలను కబ్జా చేయకుండా ఉండాలంటే లక్ష మంది యువత రాజకీయ రంగంలోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు రాజకీయ పరివర్తన అవసరమని తెలిపారు. 21వ శతాబ్దంలో వికసిత్ భారత్‌కు నూతన జీవన శక్తి, నూతన ఆలోచనలు, నూతన ఉత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అర్బన్ నక్సలైట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలను బలిపెట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి నీచ రాజకీయాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభివృద్ధి, సుపరిపాలనతోప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రెండు రెట్ల వేగంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు.ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి తిరుగులేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రాత్మక విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఇది తమ గ్యారంటీ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. -
బీజేపీకి జైకొట్టిన పీపుల్స్ పల్స్ కొడిమో ఎగ్జిట్ పోల్స్
-
ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష
దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలనుంది. ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్‌కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్‌పై ఉన్న కేజ్రీ వాల్ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ‘ఆప్’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా ‘శీష్ మహల్’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ. అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్‌లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్‌పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్‌కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్ కానున్న సీఈసీపై ఆప్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. -
మహిళా సత్తా చాటుతారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్న పార్టీలు మహిళా అభ్యర్థులను బరిలో నిలిపినా ఎంతమంది చట్ట సభల్లో అడుగు పెడతారన్న దానిపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. గడిచిన నాలుగు దశాబ్ధాలతో పోలిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగ్గా, గెలుపు తీరాన్ని ఎంతమంది చేరుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ 10 శాతం కూడా దాటని మహిళా ప్రాతినిధ్యం ఈసారైనా పెరుగుతుందా? అన్నది ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి. అభ్యర్థులు పెరిగారు.. ప్రాతినిధ్యం సంగతేంటో? ఢిల్లీకి గతంలో ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు పనిచేశారు. 1998లో బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, 1998– 2013 వరకు వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆప్‌కి చెందిన అతిశి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఢిల్లీ అసెంబ్లీలో మహిళా ప్రతినిధుల సంఖ్య 10 శాతం దాటలేదు. 2003 నుంచి ఇప్పటివరకు గత అసెంబ్లీలో మాత్రమే 10 శాతం అంటే 8 మంది గెలిచారు. ఈ ఎనిమిది మంది ఆప్ పార్టీకి చెందిన వారే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా పోటీ దారుల సంఖ్య పెరిగింది.ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కలిసి 96 మంది (14 శాతం) మహిళలు బరిలో నిలిచారు. ఇందులో ఆప్, బీజేపీల నుంచి తొమ్మిదేసి మంది ఉండగా, కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఉన్నారు. 1993లో, 1,316 మంది అభ్యర్థులలు పోటీలో ఉండగా, అందులో 58 మంది మహిళలు పోటీ చేయగా, 1998లో ఈ సంఖ్య 57కి తగ్గింది. 2003లో 78 మహిళలు, 2008లో 81, 2013లో 71, 2015లో 66కి మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, 2020లో 79 మంది మహిళలు పోటీ చేయగా, 10 శాతం (8) మంది విజయం సాధించారు. ఈసారి పోటీలో ఉ న్న 96 మంది మహిళలతో విజయాల రేటు రేటు మెరుగుపడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇక పార్టీల వారీగా చూస్తే 2008 నుంచి బీజేపీకి ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే లేరు.2008లో నలుగురు, 2013 లో ఐదుగురు, 2015లో ఎనిమిది, 2020లో ఆరు మందిని మహిళలను పోటీలో నిలిపినా ఎవరూ గెలువలేదు. ఈ సారి 9 మందిని బరిలో పెట్టి ఖాతా తెరవాలనే తాపత్రయంతో ఉంది. ఇక కాంగ్రెస్‌కు 2008లో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఆ తర్వాత వారినుంచి ప్రాతినిధ్యమే లేదు. ఈసారి ఏడుగురు మహిళలను పార్టీ రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక ఆప్ మాత్రం 2013 నుంచి స్థిరంగా విజయాలను నమోదు చేస్తోంది. 2013లో ఆరుగురిలో ముగ్గురు గెలవగా, 2015లో ఆరింటికి ఆరు, 2020లో తొమ్మిదిలో ఎనిమిది మంది గెలిచారు. ఆసారి తొమ్మిది మంది అభ్యర్థులను బరిలో పెట్టింది.ఆప్ ముఖ్యమంత్రి అతిశి, సీనియర్ ఎమ్మెల్యేలు రాఖీ బిద్లాన్, పర్మిలా టోకాస్, ధన్వతి చండేలా, బందన కుమార్, సరితా సింగ్‌లతో సహా ఏడుగురు మహిళా అభ్యర్థులను ఈసారి మళ్లీ పోటీలో పెట్టింది. మహిళలు మళ్లీ ఆకట్టుకునేందుకు ఆప్ ప్రభుత్వం కొద్ది నెలల ముందు మహిళలకు ప్రతి నెలా రూ. 1,000 అందించడానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే దీన్ని నెలకు రూ.2,100 పెంచుతామన్న హామీతో తిరిగి వారి మద్దతు కూడగట్టే పనిలో పడింది. -
ఇజ్జత్ కా సవాల్
-
ఢిల్లీ పోస్టర్ వార్‌లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్‌లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్‌పై, ఆ పార్టీ కన్వీనర్‌పై అరవింద్ కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
ఢిల్లీ ప్రజలపై బీజేపీ హామీల వర్షం
-
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో ఓటర్లకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. ఇక, తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. అలాగే, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటనలో తెలిపారు. దీంతో, విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.#WATCH | Delhi | Launching BJP's 'Sankalp Patra' for Delhi Assembly polls, BJP MP Anurag Thakur says," We will provide to the youth of Delhi one-time financial assistance of Rs 15,000 for preparation of competitive examinations and reimburse two-time travel and application fees.… pic.twitter.com/muyCpF8SJ7— ANI (@ANI) January 21, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొదటి మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప పత్రం’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లను రూ.500కే ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టో ఇలా.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం. ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6వేలకు ఇవి అదనం‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీపేద కుటుంబీలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, ప్రతి హోలీ, దీపావళి (ఒకటి చొప్పున) పండగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. రూ.5కే భోజనంసంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు -
చీపురుతో తుడిచేస్తా.. కేజీవాల్ నామినేషన్
-
జాట్లు తలరాతలు మార్చేస్తారు..!
సాక్షి, న్యూఢిల్లీ: జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ రాసిన లేఖతో హస్తినలో ఈ సామాజిక వర్గం పేరుమీద రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రాజకీయాల్లో జాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సుమారు 12 ప్రాంతాల్లో 8 నుంచి 28 శాతం వరకు జాట్లున్నారు. ఢిల్లీకి హరియాణా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. సుమారు 225 సరిహద్దు గ్రామాల్లో బలమైన సంఖ్యలో జాట్లున్నారు. ఫలితంగా, చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం ఓటర్లలో 7నుంచి 8 శాతం వాటా వీరిదే. వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. ఇటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అటు బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల అనుగ్రహంపైనే ఆశలు పెట్టుకున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఢిల్లీలోని 12 అంసెబ్లీ నియోజకవర్గాల్లో జాట్ల ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 8నుంచి 28 శాతం జాట్ల జనాభా ఉందంటున్నాయి. ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 28 శాతం, నజఫ్గఢ్లో 25, నరేలా, బిజ్వాసన్లలో 23, బవానా, నాంగ్లోయి జాట్లలో 20, మటియాలా, మెహ్రోలిల్లో 16, ఉత్తమ్‌నగర్‌లో 15, వికాస్పురిలో 10, ఛత్తర్‌పూర్‌లో 9, కిరాడిలో 8శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కైలాశ్‌ను జాట్ నేతగా ప్రమోట్ చేసిన ఆప్ ఒకప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అయితే, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన 8 మంది జాట్ ఎమ్మెల్యేలు, 2020లో 9 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతాలపై ఆప్ మంచి పట్టు సాధించింది. జాట్ నేతగా కైలాశ్ గెహ్లాట్‌ను ప్రమోట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలం గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మంచి ఆధిక్యం కనబరిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న వార్డుల్లో బీజేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాట్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే న్యూఢిల్లీ స్థానం నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న పర్వేశ్ వర్మ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. పర్వేశ్‌కు టికెట్ ఇచ్చి జాట్ల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. -
పోరాడేది ముగ్గురైనా.. పోటీ ఇద్దరి మధ్యే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఢిల్లీ ఎన్నికలకు శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చకునేందుకు సిధ్దమవుతున్నాయి. ఎన్నికల పోరులో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్, కాషాయ పార్టీల మధ్యే ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కదనరంగంలోకి కాలుదువ్విన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకుపోతుండగా, పరివర్తన్ యాత్రల పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రభావం చూపేందుకు సమాయత్తమయ్యారు. ఇక ప్రచార పర్వంలో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది. తన గత వైభావాన్ని పొందే పరిస్థతి లేకున్నా, అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.జాతీయ పార్టీలను ఊడ్చేసిన ఆప్..సామాన్యడినంటూ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ అసమాన్య రీతిలో జాతీయ పార్టీలను తన చీపురుతో ఊడ్చేశారు. 2013లో కాంగ్రెస్ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేజ్రీవాల్ జన్ లోక్‌పాల్ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రభుత్వంలోంచి దిగిపోయారు. అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో అసమాన్య రీతితో 70 స్థానాలకు గానూ ఏకంగా తన ఛరిష్మాతో 67 స్థానాలు సాధించిన బీజేపీ, కాంగ్రెస్‌లను మట్టి కరిపించారు. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని పొందిన ఆప్, ఆ తర్వాత 2020లోనూ రెండు పార్టీలకు చుక్కలు చూపించింది.2020 ఎన్నికల్లో ఆప్ ఏకంగా 53.57% ఓట్లతో 62 స్థానాలు సాధించింది. 38.51% ఓట్లు సాధించిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా... షీలాదీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్ళపాటు అధికార హవాను కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 4.26% ఓట్లకు పడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించే వ్యూహంతో... ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ మరోమారు జాతీయపార్టీలకు సవాల్ విసురుతున్నారు. మళ్లీ కొత్త పంథాలో ఆమ్ ఆద్మీప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పంథాలో దూసుకెళ్తోంది. లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో అప్రతిష్టపాలైన కేజ్రీవాల్ ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ అధినేతగా ప్రచార బాధ్యతలను భుజస్కందాలపై ఎత్తుకున్న కేజ్రీవాల్... పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ పథకాలతో ప్రజలకు చేరువైన ఆయన కొత్త తరహా హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షలకు బీమా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.1 లక్ష సహాయం, మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,100 ప్రత్యేక సహాయం, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులందరికీ ఉచిత వైద్యం, హిందు, సిక్కు పూజారులకు నెలకు రూ.18 వేలు సహాయం, విదేశీ విద్యను అభ్యసించే దళిత విద్యార్థుల పూర్తి ఖర్చులను భరించేటువంటి హామీలను ఇచ్చారు. వీటితో పాటు అక్రమంగా పెంచిన నీటి బిల్లులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించారు.ఆప్ హామీల ప్రకటన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కైలాష్ గెహ్లోత్ రాజీనామా, సీఎం అధికార నివాసం శీష్ మహల్‌పై రగులుతున్న వివాదం ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కట్లకు గురిచేస్తోంది. అంతేగాక ఆప్ అధినేతకు పోటీగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో దిగారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌తో పాటు బీజేపీ నేత పర్వేష్ వర్మను ఎదుర్కోవడం కేజ్రీవాల్‌కు సవాలుగా మారింది.పీఠం దక్కించుకోవాలన్న కాంక్షతో కమలంఆమ్ ఆద్మీ పార్టీని అప్రతిష్టాపాలు చేసి అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ ప్రణాళికలను అమలు చేస్తోంది. లిక్కర్ స్కాం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బజారుకీడ్చడంలో సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ... లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఆప్, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 54.35% ఓట్లను రాబట్టుకుంది. ఇదే పంథాను కొనసాగించాలన్న బలమైన లక్ష్యంతో ఉన్న బీజేపీ... యమునా కాలుష్యం, శీష్ మహల్లో విలాస జీవితం, లిక్కర్ స్కాం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆప్‌ను ఇరుకునపెడుతోంది. సామాన్యుడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్... అవినీతి సొమ్ముతో అద్దాల మేడలో విలాసంగా జీవించారంటూ బీజేపీ ప్రముఖంగా విమర్శిస్తోంది. ఈ నెల 3, 5 తేదీల్లో పరివర్తన యాత్రలో భాగంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శీష్ మహల్ కేంద్రంగానే కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలు మనోజ్ తివారీ, బాన్సురీ స్వరాజ్, ప్రదీప్ ఖండేల్వాల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి నేతలు బీజేపీ గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. ఒంటరి పోరులో కాంగ్రెస్ 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు పోటీ పడుతోంది. గత రెండు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ , ఆస్థిత్వాన్ని చాటుకునేందుకు కష్టపడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోరాడి 18.19% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్ల శాతంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అంశాన్ని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్, అల్కా లాంబ, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్ వంటి పార్టీ సీనియర్ నేతలు ఆప్‌కు పోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. -
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
మేము సహకరించకుండా ఉండి ఉంటే.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా అధికార ఆప్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్‌ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఆప్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం.అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారుదీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా తీవ్రంగానే స్పందించారు. ‘ మీకు ఎప్పుడూ ఆప్‌ను తిట్టడమే పని. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడతున్నట్లే. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మీరు ప్రారంభించిన ఆర్ఆర్టీఎస్ కారిడార్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పని అయినా స్వాగతిస్తాం. మీరుప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం, ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించకలిగారు. మేము ప్రజల కోసమే పని చేస్తామనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్‌కు మేము అడ్డుచెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్నీ సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పని చేయడమే మాకు తెలిసిన రాజకీయం’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు.‘ నేటి మీ ప్రసంగం 38 నిమిషాలు పాటు సాగితే.. అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ వ్యాఖ్యల్ని చూసి నేను చింతిస్తున్నా. ఈరోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టే అది జరిగింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అంతకుముందు ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ను ప్రారంభించిన క్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా తొలి ప్రాధాన్యం.దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారు’ అని మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. -
ప్రియాంకపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్ -
బీజేపీ కుట్రలను సమర్థిస్తున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్‌ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
సార్! నేను కాంగ్రెస్ వాడిని కాను! 'ఆప్' నేతను టోపీ సేమ్ టూ సేమ్ అంతే!
-
సీఏఏకి మద్దతిచ్చే సర్కార్ కావాలి
న్యూఢిల్లీ: జాతీయ భద్రత, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునిచ్చే ప్రభుత్వ అవసరమే ఢిల్లీకి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకలో సభలో మాట్లాడారు. ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసే ప్రభుత్వాలు ఇప్పుడు రాజధానికి అవసరం లేదని, సరైన దిశానిర్దేశం చేసే ప్రభుత్వమే కావాలని ఆప్‌పై ఆరోపణలు గుప్పించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు. శత్రువులు మనపై దాడి చేసేలా ప్రోత్సహించే ప్రభుత్వం ఢిల్లీకి ఇక అవసరం లేదని పిలుపునిచ్చారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల కోసం కన్నీరు కార్చేవారు ఢిల్లీని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది పేదలకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని, శ్రీలంకలో ఉండే జనాభా కంటే ఎక్కువగా ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని మోదీ అన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయకపోవడాన్ని ప్రధాని తప్పుపట్టారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమమైనదని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పుడు విమర్శకులూ అంగీకరిస్తున్నారని అన్నారు. బడ్జెట్‌పై విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై మోదీ ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. -
కేజ్రీవాల్, బీజేపీ నేతల హోరాహోరీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేజ్రీవాల్ నాయకత్వంలోని పాలకపక్షం ఆప్, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర పాలక పక్షం బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రధానంగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్ బాగ్‌లో కొనసాగుతున్న ప్రజా ఆందోళన ప్రధాన ఆయుధంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. నరేంద్ర మోదీ కావాలా లేదా షహీన్ బాగ్ కావాలా తేల్చుకోండంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సీఏఏ, ఎన్‌ఆరీసీలకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో డిసెంబర్ 15వ తేదీ నుంచి మహిళల ఆధ్వర్యంలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. (కేజ్రీవాల్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు) షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న దేశ ద్రోహులను కాల్చి పారేయండంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించగా, ‘ఆందోళనకారులను ఉపేక్షించినట్లయితే వారు రేపు మీ ఇళ్లలోకి జొరబడి మీ చెల్లెళ్లను, కూతుళ్లను రేప్ చేస్తారు, హత్య చేస్తారు’ అని బీజేపీ లోక్‌సభ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించడంతో ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ‘షహీన్‌బాగ్‌ను ప్రేమిస్తున్న వారికి సరైన సమాధానం ఇవ్వండి’ అంటూ శుక్రవారం బీజేపీ అధికారికంగా ఓ ఎన్నికల పాటను విడుదల చేసింది. ఈ పాటకు ఇప్పటికే ఆన్లైన్లో లక్ష లైక్స్ వచ్చాయి. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) పర్వేష్ వర్మ తాజాగా కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ‘ఆటంక్‌వాది, టెర్రరిస్ట్’ అని పిలిచారు. ఇక్కడ ఆప్‌కు సరికొత్త ఆయుధాన్ని ఆయన అందించినట్లయింది. ‘కేజ్రీవాల్ ఆటంక వాదా?, కాదనుకుంటే మీరు ఆప్‌కు ఓటేయండి’ అంటూ ఆ పార్టీ సరికొత్త ఎన్నికల పోస్టర్‌ను తీసుకొచ్చింది. ఆప్ సానుభూతిపరులైన బీజేపీ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆ పార్టీ ఈ పోస్టర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (గల్లీల్లో ఢిల్లీ ప్రచారం) కేజ్రివాల్ పార్టీయే మళ్లీ గెలుస్తుందంటూ పలు ముందస్తు ఎన్నికల సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలనే కసితో ఉన్న బీజేపీ షహీన్‌బాగ్ ఆందోళన ఒక్కదాన్నే ఆయుధంగా చేసుకుని ప్రచారం చేస్తోంది. ఆ విషయంలో కేజ్రివాల్‌ను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు కేజ్రివాల్ సమన్వయంతో శాంతియుతంగా తాను చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలనే నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. (‘మోదీ 24 క్యారెట్ల బంగారం.. ఆయన్ని నమ్మండి’) -
కేజ్రీవాల్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆయన తన ఎమ్మెల్యేలతో కొట్టించారని, ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సాక్షి టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేజ్రీవాల్ పరిపాలన నచ్చకపోవడంతోనే.. ఆయనకు వ్యతిరేకంగా వందలమంది నామినేషన్లు వేశారని అన్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 సీట్లకుపైనే వస్తాయని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం రాకపోవడం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందన్నారు. దేశానికి మోదీ, ఢిల్లీకి బీజేపీ అనేది తమ నినాదమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎక్కడ గుడిసె ఉందో, అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టించి.. గ్యాస్, టాయిలెట్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. కుషాల్ ఢిల్లీ తమ లక్ష్యమన్నారు. -
కేజ్రీవాల్‌కు గట్టిపోటీ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకర్గంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవడం.. భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తయినా తరువాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తేలనుంది. చదవండి: 6 గంటలు కేజ్రీ వెయిటింగ్ మరోవైపు నామినేషన్ దాఖలు చేసిన 93 మంది అభ్యర్థుల్లో పదిమంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) మాజీ కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఐదుగురు క్యాబ్ డ్రైవర్లు కూడా నామినేషన్ వేశారు. 2011లో భారత అవినీతి నిరోధక ఉద్యమంలో పాల్గొన్న నలుగురు సామాజిక కార్యకర్తలు కూడా నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు ‘చక్ దే ఇండియా’ సినిమాలో అతిథిపాత్ర పోషించిన జాతీయ హాకీ క్రీడాకారుడు కూడా ఢిల్లీ బరిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరంతా కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగానే బరిలో నిలిచామని చెబుతున్నారు. డీటీసీ కాంట్రాక్టు ఉద్యోగుల బృందంలోని మనోజ్ శర్మ మాట్లాడతూ.. కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు తమను కేజ్రీవాల్ విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. రాజకీయ రంగంలో కేజ్రీవాల్‌ను ఓడించడానికి ఇదే తమకు వచ్చిన ఏకైక అవకాశం అని ఆయన పేర్కొన్నారు. చదవండి: అయ్యో కేజ్రీవాల్.. ఆలస్యమైందా! ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదని నామినేషన్ దాఖలు చేసిన ఓ డ్రైవర్ తెలిపారు. ఆటోరిక్షా ఛార్జీలు సవరించబడ్డాయి కానీ, టాక్సీ డ్రైవర్లను ఆదుకోవడానికి కేజ్రీవాల్ ఎటువంటి పథకం తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆప్ నేతలు మాత్రం ఇదంతా బీజేపీ కుట్రేనని ఆరోపిస్తున్నారు. బలపరిచేందుకు కనీసం 10 మంది కూడా లేని వారితో కావాలనే నామినేషన్లు వేయించిందని ఆప్నేతలు ఆరోపిస్తున్నారు. చదవండి: ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ కాగా, మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తాము నామినేషన్ పత్రాలు ఇచ్చేదాకా ఆయన్ను వెళ్లనిచ్చేది లేదని అప్పటికే భారీ సంఖ్యలో అక్కడున్న అభ్యర్థులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ టోకెన్ తీసుకున్నారు. ఆయన టోకెన్ నంబర్ 45 వచ్చేసరికి ఆయన వేచిఉండాల్సి వచ్చింది. -
అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!
న్యూఢిల్లీ: తానెవరో తెలియదంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన లాంటి సామాన్యుల గురించి ఉన్నత పదవిలో ఉన్న మంత్రికి తెలియకపోవడం సాధారణ విషయమే అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్(జేడీయూ) బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు సైతం ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలు అందించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పీకే బృందంతో జట్టుకట్టారు. దీంతో కిషోర్ నేత్వంలోని ఐపాక్ టీం తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కో- ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ప్రశాంత్ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరు’ అని ప్రశ్నించారు.(రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం!) ఇందుకు బదులుగా పీకే గురించి విలేకరులు ప్రస్తావించడంతో.. ‘ అతడి గురించి నేను తెలుసుకోవాల్సింది.. కానీ నాకు అతనెవరో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పీకే.. ‘ఆయన ఒక సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుల గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్- బిహార్ రాష్ట్రాల నుంచి నాలాగా ఢిల్లీకి వచ్చిన ఎంతో మంది ఇక్కడ జీవనపోరాటం చేస్తున్నారు. ఆ లక్షల మందిలో ఒక్కడినైన నా గురించి కేంద్ర మంత్రికి తెలిసే అవకాశమే ఉండదు కదా’ అంటూ వినయపూర్వకంగానే హర్దీప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.(అరవింద్ కేజ్రీవాల్‌తో పీకే టీం) ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అవసరం ఉన్నపుడు అతడి సేవలు వినియోగించుకుని.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తరఫున అతడు ప్రచారంలోకి దిగగానే ఎవరని ప్రశ్నిస్తారా? కనీసం ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీయూ ఉపాధ్యక్షుడని కూడా తెలియకపోవడం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు. Prashant Kishor,Political Strategist on Union Min HS Puri asking 'Who is Prashant Kishor?': He is a senior minister,why will he know a ordinary man like me?In Delhi lakhs of ppl like me from UP-Bihar live and struggle,how will such a senior leader like Puri ji know so many ppl? pic.twitter.com/n9TW1WCCvb — ANI (@ANI) December 28, 2019 -
ప్రధాని అవుతారు.. సీఎంపై ప్రశంసలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అంటూ.. ప్రచార హోరును పెంచడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గత ఐదేళ్ల పాలనకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచారు. మరోసారి ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. టౌన్‌హాల్ సమావేశాల పేరిట కేజ్రీవాల్ ప్రజలతో మిళితమై.. ఇప్పటివరకు తాను చేసిన హామీల అమలును వివరిస్తూనే, బీజేపీని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టౌన్‌హాలు సమావేశంలో కేజ్రీవాల్‌ను కలిసిన ఒక వృద్ధురాలు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మంచి పనులు చేస్తూ.. బాధ్యతయుతమైన కొడుకుగా వ్యవహరిస్తున్నకేజ్రీవాల్ను ఒక్కసారైనా కలిసి, ఆశీర్వదించాలని ఉండేదని చెప్పుకొచ్చారు. తన ఆకాంక్ష ఇప్పుడు నెరవేరిందని, సీఎం కేజ్రీవాల్ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం అభిమానులతో కలిసి పెద్దావిడ ఆశీర్వదించిన వీడియోను ఆయన ట్విటర్లో పంచుకొన్నారు. आज एक बुजुर्ग अम्मा ने आशीर्वाद दिया... pic.twitter.com/g6OrRmwcJ2 — Arvind Kejriwal (@ArvindKejriwal) December 27, 2019 -
‘హస్తిన’.. ఎవరి హస్తగతమవునో..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందోననే అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిరసనలు, ఉద్యమాలకు నెలవు, భారత రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే రాజధాని నగరంలో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డడానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ మళ్లీ అదే ఫీట్‌ను నమోదు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన ఆప్ ఎంపీ సీట్లనూ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన హస్తం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని పొందే దిశగా వ్యూహాలు పన్నుతోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న త్రిముఖ పోరులో గెలిచి మురిసేదెవరో..! రాజకీయ చరిత్ర ఢిల్లీ 1990 వరకూ హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. 90ల తరువాత రాజధానిలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1991లో కాషాయ పార్టీకి హస్తిన ప్రజలు పట్టం కట్టారు. తదనంతర కాలంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి ఢిల్లీ కోటలో పాగా వేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ షీలా దీక్షిత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చి ఘనవిజయం సాధించింది. దూసుకొచ్చిన బీజేపీ కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉన్న ఢిల్లీలో 1991 పార్లమెంట్ ఎన్నికల్లో లాల్ కృష్ణ అద్వానీ సారథ్యంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. 40.2శాతం ఓట్లతో బీజేపీ 5సీట్లు గెలుచుకోగా, 39.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ వికసించిన కమలం బీజేపీ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తన పట్టును నిలుపుకుంది. ఈసారి 49.6శాతం ఓట్లతో మళ్లీ 5సీట్లను గెలుచుకొని, కాంగ్రెస్‌ను ద్వితీయ స్థానానికి నెట్టింది. 37.3శాతం ఓట్లను హస్తం పార్టీ గెలుచుకోగలిగింది. 1998లో జరిగిన ఎలక్షన్లలో వాజ్‌పేయి హయాంలోని కమల దళం 50.7శాతం ఓట్లతో 6సీట్లలో విజయ బావుటా ఎగురవేసింది. 42.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒక సీటుకే పరిమితమైంది. కమలం క్లీన్‌స్వీప్ 1991 నుంచి చిక్కిన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాషాయ పార్టీ 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తూ 51.7శాతం ఓట్లతో 7సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ రెపరెపలు దాదాపు దశాబ్దం కాలంపాటు సాగిన బీజేపీ ఆధిపత్యానికి చెక్‌పెడుతూ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో 54.8శాతం ఓట్లను సాధించి 6సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ అన్ని సీట్లనూ(7) తన వశం చేసుకుంది. బీజేపీ గెలుపు ఢంకా 2014 సార్వత్రిక ఎన్నికల్లో 3జీ స్కాం, కుంభకోణాలు, పలు అవినీతి ఆరోపణలతో దేశమంతా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచింది. ఎగ్జిట్‌పోల్స్ ముందే చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ 46.6శాతం ఓట్లతో 7సీట్లలో గెలుపు నగారా మోగించింది. -
ఢిల్లీ గుణపాఠం కనువిప్పేనా?
సందర్భం ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు రోజు సాయంత్రం నేను ఓలా విజ్డమ్ ట్యాక్సీని బుక్ చేశాను. పోలింగ్ జరగడానికి ముందురోజు ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గొని ఇంటికెళుతూ మేం ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నాం. మమ్మల్ని డ్రాప్ చేస్తూ, డ్రైవర్ ‘మీరు రాజకీయ పార్టీకి చెందినవారా’ అని అడిగాడు. నా ముఖాన్ని అతడు స్పష్టంగా గుర్తుపట్టలేకపోయాడు. అదేమంత పెద్ద విషయం కాదని అతడికి చెబుతూ మరుసటి రోజు జరగనున్న ఎంసీడీ ఎన్నిక గురించి ఏమనుకుంటున్నావని అడిగాను. అతడు సాంప్రదాయికంగా కాంగ్రెస్ ఓటరట. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా బీజేపీకి ఓటేశాడు. కానీ 2015లో అతడు కేజ్రీవాల్ పార్టీకి మారాడు. మరి ఈసారి? తన వార్డు అభ్యర్థుల పేర్లను అతడు గుర్తుపెట్టుకోలేదు కానీ ఈసారి మాత్రం మోదీకే ఓటేస్తానని చెప్పాడు. ఢిల్లీ మునిసిపల్ కౌన్సిస్ పనితీరు గురించి తన అభిప్రాయాన్ని అడిగాను. వాళ్లు ఒక్క పనీ చేయలేదు (కుచ్ కామ్ నíహీ కియా) అని నొక్కి చెప్పాడు. గత పదేళ్లుగా ఎంసీడిని పాలిస్తున్నది బీజేపీనే అని అతడికి గుర్తు చేశాను. కేజ్రీవాల్ మాకు ద్రోహం చేశాడు అని అతడు కొట్టిపడేశాడు. ఇప్పుడు తన నమ్మకం పూర్తిగా మోదీపైనే ఉందన్నాడు. ‘ఉత్తరప్రదేశ్‌లో ఆయన యోగి వంటి ఉత్తమ ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఢిల్లీలో కూడా ఆయన మంచి ప్రభుత్వానికి హామీ ఇస్తారు’ అనేశాడు. నాకు మాటల్లేకుండా పోయాయి. భయపడ్డాను కూడా. అయితే రాజకీయాల గురించి ఆ వోలా డ్రైవర్ నాకు తెలియనిది కొంత చెప్పాడు. బీజేపీకి అనుకూలంగా పెద్ద స్థాయిలో ఓట్లు సైలెంటుగా బదిలీ అవుతున్నాయని ఎన్నికల ప్రచారం ముగింపు నాటికే తేలిపోయింది. ఎంసీడీ పనితీరుపై ఓటర్లు దృష్టి పెట్టలేదని స్పష్టమైంది. అయితే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై నేను చేసిన విమర్శలపైనే వారు మరింత ఆసక్తి చూపారు. పోలింగు రోజున బీజేపీ పూర్తి ఆధిక్యత సాధించనుందంటూ పరిశీలకులు చేసిన అంచనాను ఎగ్జిట్ పోల్స్ ధ్రువపర్చాయి. తన సమీప ప్రత్యర్థిపై బీజేపీ 20 శాతం కంటే అదనంగా ఆధిక్యత సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతటి ఆధిక్యత సహజంగానే సీట్ల పరి భాషలో సంపూర్ణమైన క్లీన్ స్వీప్‌ను సాధించిపెడుతుంది. అలాంటి ఫలితం భయాన్ని, విషాదాన్ని కూడా కలిగిస్తుంది. అత్యంత చెత్త పనితీరును ప్రదర్శించే దేశీయ మునిసిపాలిటీల్లో ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీలుకూడా చేరిపోయి ఉంటాయనడంలో సందేహమే లేదు. ఢిల్లీలోని సగం జనాభాకు ఆశ్రయమిస్తున్న తూర్పు, ఔటర్ ఢిల్లీ ప్రాంతాలను సందర్శిస్తే, ఇక్కడి పట్టణ మౌలిక వసతులు యూపీ, బీహార్‌లోని పట్టణాలకంటే ఏమంత మెరుగ్గా ఉండవు. గత సంవత్సర కాలంగా ఢిల్లీనగరం చికున్ గున్యా, డెంగ్యూ వ్యాధులతో సతమతమైంది. ఇక వాయు కాలుష్యం అయితే అన్ని ప్రమాద హెచ్చరికలను అధిగమించేసింది. ఈ పరిస్థితికి ఎవరు కారణం అనే విషయంలో రెండు వాదనలకు తావులేదు. ఢిల్లీలోని మునిసిపల్ కార్పొరేషన్లు గత పదేళ్లుగా బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. పట్టణ ప్రభుత్వాలు ఎలా ఉండకూడదో ఈ మునిసిపాలిటీలు టెక్ట్స్ బుక్ ఉదాహరణగా నిలుస్తాయి. నిజం గానే ఢిల్లీ ప్రభుత్వం వద్ద వనరులు లేక అవి కునారిల్లుతున్నాయి. ఏమాత్రం పనిచేయని పాలకపార్టీకి ఢిల్లీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? స్పష్టంగానే దీనికి సమాధానం ఈవీఎం ట్యాంపరింగ్‌లో మాత్రం లేదు. బాధ్యతారహిత ఆరోపణలు చేయడానికి బదులుగా, ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టే బీజేపీ గెలుస్తోందన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. స్పష్టంగానే, బీజేపీకి ఓటు వేస్తున్నవారు పనిచేయని ఢిల్లీ మునిసిపాలిటీ కౌన్సిళ్లకు తాము రివార్డు అందిస్తున్నట్లు భావించడం లేదు. ఈ ఎన్నికల్లో తీవ్రమైన మునిసిపల్ సమస్యలను బీజేపీ పక్కకు దాటివేయిం చగలిగింది. దీనికి బదులుగా జాతీయవాదం, కశ్మీర్, గోవధ, జాతీయ భద్రత వంటి ఎంసీడీలకు సంబంధం లేని అంశాలపై చర్చించేలా ఓటర్లను, మీడియాను బీజేపీ ఏమార్చగలిగింది. బాగా చెడ్డపేరు వచ్చిన ప్రస్తుత కౌన్సిలర్లను మరోసారి నామినేట్ చేయకుండా చేసి ప్రజాగ్రహం తనపై మళ్లకుండా అది జాగ్రత్త పడింది. మరోవైపున ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఈ ఎన్నికను కేజ్రీవాల్‌పై వ్యక్తిగత రిఫరెండంగా మార్చి నిజమైన మునిసిపల్ సమస్యలపై చర్చను దారిమళ్లించింది.. చివరికి ఈ ఎన్నికలు సీఎం, పీఎంలకు మధ్య పాపులారిటీ పోటీగా మారిపోయాయి. ఢిల్లీ ప్రజలు సీఎంకు బదులుగా పీఎంను ఎంచుకున్న్టట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మోదీ మ్యాజికల్ ప్రభంజనంతో దీన్ని వివరించలేం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015లో బీజేపీని తుంగలో తొక్కివేసిన రోజు కూడా మోదీ ఏమంత తక్కువ శక్తిమంతంగా లేరు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా విజయాలతో మోదీ పాపులారిటీ ఒక మెట్టుపైనే ఉండేది. ఇప్పటివలే కాకుండా మోదీ ఆనాడు పార్టీ స్థానిక వ్యతిరేక ఓటును కూడా ఎదుర్కొనలేదు. మనమిప్పుడు ఈ కష్టమైన ప్రశ్న నుంచి తప్పించుకోలేం. 2015లో మోదీ వేవ్ ఎందుకు పనిచేయలేదు. 2017లో మాత్రం పనిచేస్తున్నట్లు ఎందుకు కనిపిస్తోంది? తేడా ఎక్కడుందంటే 2015 ఫిబ్రవరి నుంచి ఆప్ ప్రభుత్వంతో ఢిల్లీ పొందిన అనుభవంలోనే ఉంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆప్ తన నైతికాధికారాన్ని కోల్పోయింది. విద్యుత్ బిల్లులను పాక్షికంగా తగ్గిం చడం, స్కూల్ విద్య కోసం అదనపు నిధులను కేటాయించడం మినహా ప్రభుత్వం తన సమర్థతను ఏమాత్రం ప్రదర్శించక పోవడంతో సుపరిపాలనపై అది చేసిన వాగ్దానం తేలిపోయింది. హామీలను నెరవేర్చడానికి బదులుగా ఆప్ ప్రభుత్వం కేంద్రానికి, దాని ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్‌కి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ కాలం గడిపేసింది. ఆ ఆరోపణల్లో కొన్ని నిజమైనవే కావచ్చు. కాని ఈ ఆరోపణలపైనే ఎక్కువగా అది ఆధారపడినందువల్లే నా ఓలా డ్రైవర్ వంటి ఢిల్లీ ప్రజలను విసుగెత్తించేసింది. ఈ వ్యక్తిగత రిఫరెండాన్ని కోల్పోవడంతో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి ఆరాధన తనకే ఎదురు తగిలింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిన ఆప్ ఇప్పుడు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలి పోతోంది. ఈ పార్టీ ఇప్పటికైనా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటుందనే ఆశిద్దాం. ఢిల్లీలో ఎంసీడీ ఎన్నిక భారత రాజకీయాల్లో పెద్దన్నగా బీజేపీ వికాసానికి సంబంధించిన ఒక దశను పూర్తి చేసింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాన్నిగుర్తించనట్లయితే అవి కోలుకోవడం చాలా కష్టం. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav -
సంస్కరణలపై ‘ఢిల్లీ’ ప్రభావం ఉండదు: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల అమలు వేగంపై ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందినప్పటికీ.. ఆ ప్రభావంతో సంస్కరణల వేగం తగ్గబోదని ఆయన వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. 5వ భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా గురువారం అమెరికా ఆర్థిక మంత్రి జాకాబ్ లీతో కలసి జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జైట్లీ తెలిపారు. ‘నిజానికి నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం. ఒక్కచోట మాత్రమే కోల్పోయాం. ఈ పరిణామం.. ఆర్థిక సంస్కరణలపై ఎంతమాత్రమూ పడబోదు’ అని పేర్కొన్నారు. పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగ కల్పన, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల, పేదరికాన్ని తగ్గించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్టు జైట్లీ వివరించారు. -
ఎన్నికలు నిర్వహిస్తే బాబుకు ‘ఢిల్లీ ’ పరిస్థితే
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ నర్సీపట్నం: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితే సీఎం చంద్రబాబుకు పడుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు దక్కించుకున్న బీజేపీ, ఎనిమిది నెలలు తిరగకుండా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి టీడీపీ అంతకన్నా దారుణమైన పరిస్థితి తప్పదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టాయని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చెప్పినట్టుగానే స్టీల్‌ప్లాంట్ ఎన్నికల్లో అదే జరుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎన్నికల్లో వైఎస్సార్టీయూసీ ఎదుర్కొనే శక్తిలేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ పోటీచేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే సీఎంగా జగన్మోహన్రెడ్డిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం: నర్సీపట్నం పీనారపాలెం రెండో వార్డుకు చెందిన రుత్తల నూకరాజు తుపాను సమయంలో చెట్టు పడి మృతి చెందాడు. వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి సమకూర్చిన రూ.50 వేల చెక్కును గురువారం మృతుని భార్య లక్ష్మికి అమర్నాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్, మున్సిపాల్ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు తమరాన నాయుడు, బోడపాటి సుబ్బలక్ష్మి, బైపురెడ్డి వెంకటలక్ష్మి, కోనేటి వెంకటలక్ష్మి, మాజీ మహిళా విభాగం నాయకురాలు పీలా వెంకటలక్ష్మి, గుడబండి నాగేశ్వరరావు, గుడివాడ లక్షబాబు, ధనిమిరెడ్డి నాగు, ఎండీ భాషా, బైపురెడ్డి చినబాబు,చిట్టిరాజు , ఆరుగుల్ల రాజుబాబు, కర్రి శ్రీనివాసరావు, యాదగిరి శేషు, ఆదినారాయణ,ఏకా రాజుబాబు, ఆదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి రెఫరెండం కాదు
నెల్లూరు/ఆత్మకూరు/ పొదిలి: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వానికి రెఫరెండం కాబోవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ప్రకటించేవి ఎగ్జిట్‌పోల్స్ అని తరువాత ఎగ్జాట్ పోల్స్ వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు బకింగ్ హం జలమార్గాన్ని కూడా మరో మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరినట్లు శ్రీకాళహస్తి-నడికుడి రైల్యే లైను పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని..ఎటూ అధికారంలోకి వచ్చేది లేదని రాష్ట్ర విభజన సమయంలో అలవికాని హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత మువ్వల శ్రీహరి విగ్రహాన్ని ప్రకాశం జిల్లా పొదిలిలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. -
పెరుగుట విరుగుట కొరకేనా?
ఈ వ్యూహం జమ్మూ-కశ్మీర్ ఎన్నికల వరకూ ఫలించింది. ఢిల్లీలో బెడిసి కొట్టింది. ఈ పరిణామాన్ని కొందరు ఆరెస్సెస్ నాయకులు ముందుగానే ఊహించారు. వారి హెచ్చరికలను పట్టించుకునే స్థాయిని మోదీ, షా దాటిపోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చినప్పడు మోదీ వ్యవహరించిన తీరు, పది లక్షల ఖరీదు చేసే డిజైనర్ కోటు వేసుకోవడం, మూడుసార్లు మాత్రమే కలుసుకున్న ఒబామాతో అనేక దశాబ్దాల స్నేహం ఉన్నట్టు బరాక్ అంటూ సంబోధించడం ఆరెస్సెస్ నాయకులకు రుచించి ఉండదు. ఢిల్లీలో శనివారం పోలింగ్ జరిగిన సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించిన అన్ని సంస్థలూ ఆమ్ఆద్మీపార్టీ (ఏఏపీ- ఆప్)కే ఆధిక్యం ఉంటుందని స్పష్టంగా చెబుతున్నాయి. అసలు ఫలితాలు పదో తేదీన వెల్లడయ్యే వరకూ వీటిని సర్వే ఫలితాలుగానే పరిగణించాలి. పోలింగ్‌కు మూడు వారాల వ్యవధి ఉన్నదనగా మాజీ పోలీసు ఉన్నతాధికారి కిరణ్‌బేడీని భారతీయ జనతా పార్టీ (భాజపా) ముఖ్య మంత్రి అభ్యర్థిగా రంగంలో దింపినప్పుడు అది చాలా మంచి ఎత్తుగడ అనీ, భాజపా గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించినవారిలో నేనూ ఒకడిని. భాజపావైపే రవ్వంత మొగ్గుందని కూడా రాశాను. ఇందుకు కారణాలు లేక పోలేదు. నరేంద్రమోదీ సార్వత్రిక ఎన్నికల సమయంలో సృష్టించిన ప్రభంజనం అప్పటికీ కొనసాగుతున్నట్టే కనిపించింది. ఢిల్లీలో రెండు వేల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శాఖలున్నాయి. వేలమంది కార్యకర్తలు ఓటర్లకు నచ్చజెప్పడంలో, పోలింగ్ కేంద్రాలకు తీసుకొనివెళ్లి ఓట్లు వేయించడంలో అనుభవం కలిగినవారు. లోక్‌సభ ఎన్నికలలో ఆప్‌కు ఢిల్లీలోని ఏడు స్థానాలలో ఒక్కటంటే ఒక్కటీ రాలేదు. భాజపా ఢిల్లీ విభాగం నాయకులలో ముఠాలు ఉన్నాయని తెలుసు. పార్టీ అధ్యక్షు డు అమిత్ షా నయానోభయానో వారిని ఒకే తాటిమీదికి తెస్తారని అనుకున్నాం. పైగా లోక్‌సభ ఎన్నికలలో కానీ అనంతరం జరిగిన మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో కానీ మోదీ-షా ద్వయం స్థానిక నాయకుల మద్ద తుతో నిమిత్తం లేకుండానే ఘనవిజయాలు సాధించారు. మహారాష్ట్రలో పాతికేళ్ళ భాగ స్వామి శివసేనను తోసిరాజని జయభేరి మోగించారు. మోదీ జనాకర్షకశక్తి, షా యుద్ధ నైపుణ్యం, కిరణ్‌బేడీ పేరుప్రతిష్ఠల కారణంగా భాజపా గట్టెక్కుతుందని భావించాం. ఆ విభజన రేఖే కొలబద్ద ఎగ్జిట్ పోల్స్ నిర్ద్వంద్వంగా ‘పహలే ఆప్’ అని చాటుతున్నాయి కనుక భాజపా పరా జయానికి దారితీసిన కారణాలను గుర్తించడం కష్టం కాదు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య విభజన రేఖ చాలా సన్నగా ఉంటుంది. ఒకరికి ఆత్మవిశ్వాసంగా కనిపించిన ధోరణి మరొకరికి అహంకారంగా కనిపించవచ్చు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కూ అహంకారం ఎంతోకొంత ఉన్నప్పటికీ వినయసంపన్నుడుగా కనిపించ గలరు. మోదీ అటువంటి ప్రయత్నం కూడా చేయరు. మోదీ ఆత్మవిశ్వాసాన్ని ప్రజలు అహంకారంగా ‘అపార్థం’ చేసుకున్నారని అనుకోవాలి. ఢిల్లీ ఎన్నికలు వెస్ట్‌మినిస్టర్ పద్ధతిలో అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగినప్పటికీ ప్రచారం మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించింది. కిరణ్ బే డీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో అగ్రభాగాన నిలిపినప్పటికీ ప్రజల హృదయాలలో పోటీ నరేంద్రమోదీకీ, కేజ్రీవాల్‌కీ మధ్యనే. అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీ ఎన్నికలను మోదీ ప్రభుత్వం పనితీరుపై తీర్పుగా (రెఫరెండంగా) పరిగణించరాదంటూ పదేపదే చెప్పినప్పటికీ ఓటర్లు మాత్రం మోదీ, కేజ్రీవాల్‌కీ మధ్య పోరాటంగానే భావించి మోదీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. నిజంగా భాజపా ఓడిపోతే అది మోదీ పరాజ యం అవుతుంది కానీ కిరణ్ బేడీ ఓటమి కాజాలదు. మోదీ, అమిత్ షా ఢిల్లీ ఎన్నికలకు అసాధారణ ప్రాధాన్యం ఇచ్చి వాటికి మినీ జాతీయ ఎన్నికల స్థాయి కల్పించడమే కాకుండా కేజ్రీవాల్‌పైన విమర్శనాస్త్రాలన్నింటినీ సంధించి ఆప్ నాయకుడి స్థాయిని స్వయంగా ఆకాశం ఎత్తుకు పెంచారు. ఎత్తుగడలూ, వ్యూహప్రతివ్యూహాలూ గమనించి నట్లయితే హస్తిన సంగ్రామంలో అధికార పక్షానికి మోదీ-షా ద్వయం నాయకత్వం వహిస్తే ఆప్‌కు కేజ్రీవాల్ ఒక్కరే సారథి. సిద్ధాంతకర్త యోగేంద్రయాదవ్ సంపూర్ణ సహకారం అదించిన మాట వాస్తవమే కానీ మొత్తం ఆప్ యుద్ధతంత్రానికి రూపకల్పన చేసింది కేజ్రీవాల్ మాత్రమే. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ముఖాముఖీ పోటీయే హస్తిన పోరు రెండు బలమైన వ్యక్తిత్వాల మధ్య, రెండు భావజాలాల మధ్య, రెండు ధోరణుల మధ్య జరిగింది. 2014 మే సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ అట్టహా సంగా రంగప్రవేశం చేసి సుడిగాలి పర్యటనలు చేసి సునామీ సృష్టించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. సార్వత్రిక ఎన్నికలలో కానీ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికలలో కానీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతోనే. ఆ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అప్పటికే డీలాపడిపోయారు. యుద్ధానికి పూర్వమే పరాజయం అంగీకరించినట్టు కనిపించారు. అనూహ్యమైన రీతిలో అనతి కాలంలో అజేయ శక్తిగా ఎదిగిన మోదీకి దీటైన ప్రత్యర్థిగా కేజ్రీవాల్ నిలిచి ఢిల్లీ బస్తీ మే సవాల్ అన్నారు. మోదీ తన స్థాయిని విస్మరించి కేజ్రీవాల్‌పైన వ్యక్తిగత విమర్శలు చేశా రు. కేజ్రీవాల్ తెలివైన రాజకీయ నాయకుడు. ప్రధానిగా మోదీకి ఇప్పటికీ ప్రజామోదం దండిగా ఉన్నదనే ఎరుక ఆయనకు ఉంది. అందుకే మోదీపైన వ్యక్తిగత విమర్శలు చేయలేదు. జాతీయ స్థాయిలో ప్రధానిగా మోదీని ప్రజలు ఎన్నుకున్నారనీ, ఢిల్లీకి ఆయన ముఖ్యమంత్రి కాలేరు కనుక ఆ పదవికి తనను ఎన్నుకోవాలనీ వాదించారు. 2013 డిసెంబర్లో షీలాదీక్షిత్‌పై విజయం సాధించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ జనలోక్‌పాల్ బిల్లు పేరుతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఈ ఎన్నికలలో ఆయనకు ప్రతికూలాంశంగా మారుతుందని భాజపా నాయకత్వం భావించింది. అందుకే ఎన్నికల ప్రచారంలోనూ, టీవీ చర్చా గోష్ఠులలోనూ భాజపా నాయకులు 49 రోజుల తర్వాత పదవి విడిచి పారిపోయిన కేజ్రీవాల్ అరాచకవాది అంటూ నిందించారు. ధర్నాలు చేయడం ఆప్‌కు అలవాటు. పరిపాలన చేయడం భాజపాకు తెలుసు. అందుకని ఎవరికి తెలిసిన పని వారికి అప్ప గించాలంటూ ప్రధాని రాంలీలా మైదానంలో భాజపా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ పిలుపు నిచ్చారు. ఇదే అంశాన్ని కేజ్రీవాల్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. రెండు నెలలు నిండక ముందే పదవికి రాజీనామా చేసినందుకు ఏ మాత్రం భేషజం లేకుండా క్షమాపణ చెప్పడం కేజ్రీవాల్ విజయలక్ష్యం వైపు వేసిన తొలి అడుగు. అనంతరం తాను 49 రోజులలో చేసిన పరిపాలనలోని ప్రజారంజకమైన అంశాలను పేర్కొంటూ అటువంటి పాలనను ఐదేళ్ళపాటు అందించే అవకాశం ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. కమలాన్ని ముంచిన ముఠాలు రెండు పార్టీల ప్రచార శైలిలో సైతం వ్యత్యాసం ఉంది. మోదీ జాతీయ స్థాయి అంశా లను ప్రస్తావిస్తే కేజ్రీవాల్ ఢిల్లీలో సాధారణ ప్రజల నిత్యావసరాల గురించీ, నిత్యం వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారాల గురించీ ప్రస్తావించారు. మంచినీటి సర ఫరా, తక్కువ చార్జీలకు విద్యుచ్ఛక్తి అందించడం, మహిళలకు రక్షణ కల్పించేందుకు అనేక ప్రాంతాలలో కెమేరాలు అమర్చడం వంటి 70 అంశాలతో ఆప్ ఎన్నికల ప్రణాళిక రూపొందించారు. అంతకు ముందు ఢిల్లీ డైలాగ్ అనీ, మొహల్లా సభలనీ పౌరులతో సమాలోచనలు జరిపారు. ఆప్ ప్రచారం కొత్త పోకడలు పోతూ సృజనాత్మకంగా సాగితే భాజపా, కాంగ్రెస్ పార్టీల ప్రచారం పాత పద్ధతులలోనే చప్పగా సాగింది. భాజపా నాయకులు జీపులలో ప్రయాణం చేస్తూ పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రచారం సాగిస్తే ఆప్ వలంటీర్లు బస్తీలలో ప్రజలతో మాట్లాడిస్తూ, పాటలు పాడుతూ, పాడిస్తూ వారి మధ్యనే గడిపారు. ఆప్ వయస్సు రెండేళ్ళు. భాజపాలో పాతుకుపోయిన నాయకులూ, అలసిపోయిన నాయకులూ ఎక్కువ. వామపక్షాలతో సహా దేశంలోని అన్ని పార్టీలలో విభేదాలు ఉన్నాయి. నానా ముఠాల సమాఖ్యలు మన రాజకీయ పార్టీలు. అన్ని ముఠాలనూ సంతృప్తి పర్చుతూ ఒక తాటిమీద నడిపించడమే పెద్ద పార్టీల నాయకత్వాలు చేస్తున్న పని. ఆ విధంగా కాకుండా మోదీ, షాలు కొంత కరకుగా వ్యవహరించారు. బయటి నుంచి కిరణ్‌బేడీని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సరాసరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం చాలామంది పాతకాపులకు మనోవేదన కలిగించిన మాట వాస్తవం. భాజపా ప్రతిపక్షంలో ఉన్నంత కాలం పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ అనేక త్యాగాలు చేసిన నాయకులను కాదని కిరణ్‌బేడీని నెత్తిన పెట్టుకోవడం చాలా సాహసంతో కూడుకున్న నిర్ణయం. విజయపరంపర తెచ్చిన ఆత్మ విశ్వాసంతో మోదీ, షాలు ఇటువంటి నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. ఈ వ్యూహం జమ్మూ-కశ్మీర్ ఎన్నికల వరకూ ఫలించింది. ఢిల్లీలో మాత్రం బెడిసి కొట్టింది. ఈ పరిణామాన్ని కొందరు ఆరెస్సెస్ నాయకులు ముందుగానే ఊహించారు. వారి హెచ్చరికలను పట్టించుకునే స్థాయిని మోదీ, షా దాటిపోయారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చినప్పడు మోదీ వ్యవహరించిన తీరు, పది లక్షల ఖరీదు చేసే డిజైనర్ కోటు వేసుకోవడం, మూడుసార్లు మాత్రమే కలుసుకున్న ఒబామాతో అనేక దశాబ్దాల స్నేహం ఉన్నట్టు బరాక్ అంటూ సంబోధించడం ఆరెస్సెస్ నాయకులకు రుచించి ఉండదు. కాంగ్రెస్ పదేళ్ళ పాలనతో, అంతులేని అవినీతి ఆరోపణలతో విసిగిపోయిన దేశ ప్రజలు ఆ పార్టీని పదవి నుంచి తొలగించి భాజపాకు అధికారం అప్పజెప్పారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలైనప్పటికీ సామాన్య ప్రజల బతుకుల్లోకి వెలుగు ఇంకా తొంగి చూడలేదు. పెట్రోలు ఉత్పత్తుల ధరలు తగ్గినప్పటికీ నిత్యావసర ధరలు తగ్గలేదు. ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలతో బాంధవ్యం పెట్టుకొని, ఆ సంస్థల అధి నేతల ప్రశంసలు అందుకుంటూ వారిని ఆలింగనం చేసుకునే నాయకులను ప్రజలు అభిమానించరు. కార్పొరేట్ రంగానికి జనామోదం అంతగా పెరగలేదు ఇప్పటివరకు. యజమాని అనుమతి లేకుండా పరిశ్రమలకోసం భూమి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరించడాన్ని ప్రజలు హర్షించరు. ఇటు వంటి నిర్ణయాలు రేపు బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించబోతున్నారు. ప్రజలలో వ్యతిరేకత పెరగడం అనివార్యం. ఢిల్లీ ఎన్నికలలో భాజపా పరాజయం వల్ల దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తులు బలపడతాయి. భాజపా కనుక ఈ ఎన్నికలలో గెలుపొంది ఉంటే మోదీ హవా నిరాఘా టంగా కొనసాగేది. బీహార్‌లో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, ఇతర రాష్ట్రాలలో భాజపా బలపడే అవకాశాలు ఉండేవి. అందుకే మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ ఆప్‌కు ఓటు వేయవలసిందిగా ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను కేజ్రీవాల్ అమలు చేయగలరా అన్నది పెద్ద ప్రశ్న. కేంద్రంతో పేచీలు పెట్టుకోకుండా, భాజపా నాయకత్వంలో ఉన్న కార్పొరేషన్‌తో తగదా పడకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించడం కేజ్రీవాల్ ముందున్న సవాలు-ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే. త్రికాలమ్: కె.రామచంద్రమూర్తి -
ఓటింగ్ శాతంపైనే అందరి దృష్టి
-
ఢిల్లీ ఎన్నికలపై బిగ్ డిబేట్
దేశ రాజధాని నగరమైన హస్తినలో ఎన్నికలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఆసక్తే. అక్కడ కమలనాథులు పాగా వేస్తారా.. ఆప్ చీపురు దుమ్ము దులిపేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోడానికి అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. అందుకే 'సాక్షి టీవీ' ఈ ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ పోల్స్, నిపుణులతో చర్చా కార్యక్రమాలతో కూడిన 'బిగ్ డిబేట్'ను శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం చేయనుంది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు సంబంధించిన విశ్లేషణలు, ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం ఉందనే అంచనాలు.. అన్నీ ఇందులో ఉంటాయి. -
'మార్పు కోరుతున్న హస్తిన ప్రజలు'
న్యూఢిల్లీ: గత పాలకులు 16 ఏళ్లుగా న్యూఢిల్లీని భ్రష్టుపట్టించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దీంతో దేశ రాజధాని హస్తిన అస్థిరతతో సతమతమవుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేసి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ప్రజలను విజ్ఞప్తి చేశారు.గత పాలకులు హస్తినకు అంటించిన మురికిని బీజేపీ ఐదేళ్లలో వదలకొడుతుందని అన్నారు బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కిరణ్ బేడీ నేతృత్వంలో న్యూఢిల్లీ అభివృద్ధి ప్రారంభమవుతుందని అన్నారు. న్యూఢిల్లీలో పూర్తి స్థాయి బలమున్న పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. 70 స్థానాలు గల న్యూఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 7 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. -
మేకిన్ ఇండియా అంటారు కానీ...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై, కాషాయం పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం న్యూఢిల్లీలోని జహంగీర్ పూరీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.... నేరగాళ్లకు దూరమని ఆ పార్టీ నాయకులు ఓ గప్పాలు కొట్టుకుంటారు... కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థుల్లో 20 మందికి నేర చరిత్ర ఉందని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీ 'మేకిన్ ఇండియా' అంటూ ప్రచారం చేస్తారు... కానీ ఆయన ధరించిన సూటు ఖరీదు రూ. 10 లక్షలు ఉంటుంది. అది కూడా విదేశాలలో తయారైందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే దేశంలో ధరలు తగ్గిస్తామన్నారు... నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు. మీ హామీలన్నీ ఏమయ్యాయని ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంత తగ్గింది? దేశంలో చమురు ధరలు ఎంత తగ్గించారని రాహుల్ ఈ సందర్బంగా మోదీ సర్కార్ సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు అంత తగ్గినా... ద్రవ్యోల్బణం అదుపులోకి ఎందుకు లేదో వెల్లడించాలని మోదీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తీసుకొస్తామని రాహుల్ హస్తిన ప్రజలకు హామీ ఇచ్చారు. -
బిజెపి విజన్ డాక్యుమెంటరీ విడుదల!
-
'నా వెనుక 125 కోట్ల మంది ప్రజలున్నారు'
ఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రంలో బాధ్యాయుతమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు.. ఢిల్లీలో కూడా మంచి ప్రభుత్వం కావాలని ఆయన సూచించారు. ఆదివారం ఎన్నికల ప్రచారసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతలు ఒకరికి అప్పగిస్తే వారు పారిపోయారని.. ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తన వెనుక రూ.125 కోట్ల మంది ప్రజలు ఉన్నారనేది ప్రతీ క్షణం గుర్తుంచుకుంటానని మోదీ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే తమ లక్ష్యమన్నారు. -
మేమొస్తే 24 గంటల కరెంట్
తాగునీరు సామాన్యుడి హక్కుగా మారుస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ హామీలు మహిళల భద్రత కోసం 10 లక్షల సీసీటీవీ కెమెరాలు సాక్షి, న్యూఢిల్లీ: గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయం కట్టబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన హామీలనే ఆప్ మళ్లీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. తాగునీరు, విద్యుత్ అంశాలకు పెద్దపీట వేస్తూ మొత్తం 70 హామీలతో శనివారం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, తాగునీటిని సామాన్యుడి హక్కుగా మారుస్తామని, మహిళల భద్రత కోసం నగరంలో 10 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీలు గుప్పించింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల పత్రం కాదని.. తమకు గీత, బైబిల్, ఖురాన్, గురుగ్రంథ్ సాహెబ్ అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే వచ్చే ఐదేళ్లలో దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఢిల్లీలోనే వ్యాట్ తక్కువ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ‘అమెరికా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా 15 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మన తల్లులు, చెల్లెళ్ల భద్రత కోసం అవే ఏర్పాట్లు ఎందుకు చేయకూడదు. మేం పగ్గాలు చేపడితే నగరంలో 10-15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి బస్సులో ఒక సెక్యూరిటీ గార్డును పెడతాం. ప్రస్తుతం ఉన్న హోంగార్డులనే ఈ సేవలకు వినియోగిస్తాం. వారి కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, పూర్తిస్థాయి ఉద్యోగులుగా పరిగణిస్తాం’’అని కేజ్రీవాల్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించబోమని స్పష్టంచేశారు. అలాగే విద్యుత్ రేట్లను సగానికి సగం తగ్గిస్తామని గత హామీని పునరుద్ఘాటించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీకి కనీసం ఓ ఎజెండా కూడా లేదని, అందుకే మేనిఫెస్టో విడుదల చేయలేదని విమర్శించారు. మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలివీ.. నీటి మాఫియాకు కళ్లెం. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా. ప్రభుత్వఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలుగానే కొనసాగింపు. ప్రతి గ్రామంలో స్కూలు, ఆసుపత్రి. బలవంతపు భూస్వాధీనాల నిలిపివేత. కొత్తగా 900 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 30 వేల పడకలు. అత్యాచారం కేసుల సత్వర విచారణకు 47 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు. 10 వేల మంది హోంగార్డులతో మహిళా సురక్షా దళ్. 1984లో సిక్కుల ఊచకోత కేసుపై విచారణకు సిట్ ఏర్పాటు. ఢిల్లీ మురికివాడలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో 2 లక్షల మరుగు దొడ్ల ఏర్పాటు. -
సీ- ఓటర్ సర్వేలో మళ్లీ హంగ్!
-
షాజియా, బేడీలు బీజేపీలో చేరడం దారుణం
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే సన్నిహితులుగా ముద్ర పడిన ఆప్ కార్యకర్తలు షాజియా ఇల్మి, కిరణ్ బేడీలు బీజేపీలో చేరడం దారుణమని ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతకర్త యోగేందర్ యాదవ్ ఆరోపించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ' కేంద్రంలోని అధికార బీజేపీకి అర్థబలం, మీడియాబలం, కార్పొరేట్ బలం పుష్కలంగా ఉన్నాయన్నారు. బీజేపీ మోసపూరిత పార్టీ అని ఆయన విమర్శించారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీకి అన్ని రకాల బలాలు ఉన్నాయని.. అయిన ఆమె 'మోసం' పార్టీ వైపు వెళ్లారని అన్నారు. ఢిల్లీ ఓటర్లు చాలా చైతన్యవంతులని యోగేంద్ర యాదవ్ గుర్తు చేశారు. బీజేపీ ఆడుతున్న నాటకాలను వారు ఎండగడతారు.ఆయన తెలిపారు. ఈ నెల 10న న్యూఢిల్లీలో జరిగిన మోదీ ర్యాలీ ఫ్లాప్ అయిందని... ఆ ర్యాలీకి కేవలం 25 వేల మంది ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారో ప్రధాని మోదీకే తెలియాలని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా యోగేంద్ర యాదవ్ తెలిపారు. -
హస్తిన పైనే అందరి కన్నూ
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. పోటాపోటీగా సాగనున్న ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని రంగంలోకి దించి ఆమ్ఆద్మీనే కాక, కాంగ్రెస్‌ను కూడా బీజేపీ ఖంగు తినిపించింది. మోదీ పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే చాలదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. అమెరికా, ఇంగ్లండ్, రష్యా లేదా ఫ్రాన్స్ దేశాల రాజధాని నగరాల మేయర్లు ఎవరో ఎవరూ పట్టించుకోక పోవడం విచిత్రం. అంతదాకా ఎందుకు, హైదరాబాద్ లేదా ముంబై మేయర్ ఎవరో గుర్తుందా? ఆ నగరాలలో చాలావాటికంటే ఢిల్లీ చిన్నది. కానీ ఆ ఎన్నికలే రాజకీయవేత్తలందరికీ అతి కీలకమైనవి. మీడియా సైతం మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇచ్చే దాని కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఢిల్లీకి ఇస్తుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత 2013లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ, ఆ పార్టీని నిర్ణయాత్మకంగా ఓడించింది. దాని ఓటు బ్యాంకులన్నిటినీ కొల్లగొట్టింది. ఢిల్లీ శాసనసభ 70 స్థానాల్లో బీజేపీ 31, ఆప్ 28, గెలుచుకోగా, కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమైంది. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ సైతం ఓటమిపాలై, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 స్థానాలను భారీ ఆధిక్యతతో గెలుచుకుంది. కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు అందుకు భిన్నమైనవి. హఠాత్తుగా కేజ్రీవాల్ బాగానే గడబిడ చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం తిరిగి పూర్వప్రాభవం గురించి కలలు కంటోంది. షీలా దీక్షిత్‌ను పక్కకు తప్పించి అజయ్ మాకెన్‌ను ప్రచార సారథిని చేసింది. పార్లమెంటు ఎన్నికల తదుపరి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఢిల్లీలో ఓడిపోతే, ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పార్టీ వృద్ధిని నిరోధిస్తుంది. ఏది ఏమైనా బీజేపీని నిలువరిం చాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ వంటి బీజేపీ మిత్రపక్షాలు సైతం అది ఓడిపోతేనే అదుపులో ఉంటుందని సంతోషిస్తాయి. నిజానికి రిటైరయిన బీజేపీ సీనియర్ నాయకత్వం ఢిల్లీలో ఓడిపోవాలనే కోరుకుంటుంది. ఇక కాంగ్రెస్ 2013లో దక్కించుకున్న 8 సీట్ల కంటే మెరుగ్గా రాణించాలి. అప్పుడే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు కాగలుగుతారు. మోదీ విజయాలు, నాయకత్వ శైలి గాంధీ కుటుంబంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. జైల్లో ఉండాల్సింది పోయి ఆయన ప్రధాని అయ్యారు. అవమానానికి లేదా నిర్లక్ష్యానికి గురికావడానికి గాంధీ కుటుంబం అలవాటు పడినది కాదు. అందుకే ఓటమిని జీర్ణించుకోలేక పోతోంది. ఇక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలి. లేకపోతే భారీగా నష్టపోయి, మరపునపడి పోతారు. అధికార వర్గేతర పార్టీ ఆమ్ఆద్మీ కేజ్రీవాల్ నేతృత్వాన ఢిల్లీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం గొప్ప రాజకీయ ప్రయోగం. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే అలాంటి ప్రయోగం తిరిగి మరెన్నడూ జరగదు. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్, కేజ్రీవాల్‌లకు అస్తిత్వ సమస్య. ఇక బీజేపీ ఓటమి పాలవడం అంటే మోదీ, అమిత్‌షాలు ప్రతిష్టను కోల్పోవడం. ఇక బీజేపీని నిలవరించడానికి ప్రతిపక్షాలు ఒక్కటవుతాయి. కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్‌కు అపార నిధులున్నాయి. ఢిల్లీలో పెద్ద క్యాడరూ ఉంది. ఆ పార్టీ నేతలు గత 60 ఏళ్లుగా అంతులేని అధికారాన్ని అనుభవించినవారు. సానుభూతి లభిస్తుందేమోనన్న ఆశతో ఈసారి ఆ పార్టీ ప్రతిచోటా సీనియర్ నేతలను బరిలోకి దించుతోంది. దురదృష్టవశాత్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమ పుత్రిక శర్మిష్ట ముఖర్జీని కాంగ్రెస్ తరఫున పోటీకి దిగనిచ్చారు. ఆయన కుమారుడు బెంగాల్ నుంచి ఎంపీ. ఆయనేమో రాష్ట్రపతి. మొత్తం కుటుంబ మంతా ఇలా అధికారానికి అర్రులు చాచడం మంచిది కాదు. కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేస్తుంది. 2013లో వచ్చిన 24 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీ పునరుజ్జీవనం ఇక కలే. అందుకే ఒకప్పటి కాంగ్రెస్ సానుభూతిపరులంతా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో లబ్ధి పొందిన నామినేటెడ్ ఎంపీలు, గవర్నర్లు, కొందరు ‘మేధావులు’ కూడా వేచి చూస్తు న్నారు. ఓడ ఎప్పుడు మునిగిపోతుందో దాన్లో ఉన్న ఎలుకలు ముందుగా పసిగట్టి దుంకేస్తాయి. అలాగే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కేజ్రీవాల్ వ్యూహం, బలహీనతలు కేజ్రీవాల్ 2013 ఎన్నికలకు ముందు రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ధూషించి, అవమానించిన తీరు సిగ్గుచేటైనది. అయినా ఆయన గొప్ప అద్భుతాలు చేసి కాంగ్రెస్, బీజేపీలను ఓడించి గెలుపొందారు. ముఖ్యమంత్రి అయ్యాక కేజ్రీవాల్ ఆమోదయోగ్యంకాని రీతిలోఅహంకారిగా తనను బయటపెట్టుకున్నారు. షాజియా ఇల్మీ, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్ లు సహా వేలాది మంది ఇతరులు ఆయనను ఎందుకు వదలి పోయారు? అధికారంతో పాటూ సంక్రమించే అహంకారం వ్యక్తిని నాశనం చేస్తుంది. 2013లో ఆమ్ఆద్మీ పార్టీ తరఫున వేలాది మంది ప్రముఖులు ప్రచారం చేశారు. రాజకీయ కార్యకర్తలంతా జీతభత్యాలకు పనిచేసేవారుగా ఉన్న ఈ కాలంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా తెలివి తేటలు, ఉత్సాహోత్తేజాలు గల వేలకొలది కార్యకర్తలు ఢిల్లీలో కేజ్రీవాల్‌కు లభించారు. కానీ ఆయన ఆత్మహత్యా సదృశమైన బాట పట్టి, జనాదరణ గలిగిన నేతలందరినీ అవమానించడం మొదలెట్టారు. చివరికి ఒంటరిగా మిగిలారు. అయినా ఆయనకింకా పేదలలో మంచి మద్దతుంది. కాకపోతే అయన శక్తియుక్తులు, నైపుణ్యం గలిగిన నేతలంతా బీజేపీకి చేరువయ్యారు. వారణాసి నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయడం, ఆయనపై విమర్శలు గుప్పిస్తుండటం వల్ల కేజ్రీవాల్‌కు ముస్లింల మద్దతు ఉంది. బీజేపీ మధ్య తరగతిని, దళితులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఆయన ఆ వర్గాల మద్దతును కోల్పోవాల్సి వస్తుంది. ‘‘శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించవద్దు’’ అని నెపోలియన్ చెప్పాడు. కేజ్రీవాల్ సరిగ్గా దానికి విరుద్ధంగా బీజేపీకి గొప్ప ముఖ్యమంత్రి అభ్యర్ధి లేడని దాడి సాగిస్తూ తప్పు చేశారు. విజయ్ గోయల్, విజేందర్ గుప్త, ముఖి తదితరులు జనాకర్షణ ఏమాత్రం లేని వారే. మిగతావారంతా పనికిరానివాళ్లు కాబట్టి ప్రజలు తననే ఎంచుకుంటారని కేజ్రీవాల్ భావించారు. కానీ అమిత్‌షా తమ తప్పును గ్రహించి షాజియా ఇల్మీ, కిరణ్బేడీలను రంగంలోకి దించారు. అదే పనిగా విమర్శిస్తుండటం అంటే ప్రత్యర్థి తప్పలు సరిదిద్దు కునేట్టు చేయడమేననే గుణపాఠం ఆయన నేర్చుకోవాల్సి ఉంది. ఒకప్పటి కేజ్రీవాల్ మద్దతుదార్లకూ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు జీతభత్యాలు లేని కార్యకర్తలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఉన్నది అత్యుత్సాహంతో ఉన్న శత్రువులే. బీజీపీ బలాలు, బలహీనతలు బీజేపీలో కేజ్రీవాల్‌కు సరితూగే నేతలెవరూ లేరని, ప్రజలు బలమైన, చైతన్యశీలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ పార్టీ సర్వేల్లో వెల్లడైంది. అందుకే అది రిటైర్డ్ పోలీస్ అధికారి కిరణ్‌బేడీని పార్టీలో చేర్చుకుంది. ‘‘ఆశ్చర్యంలో ముంచెత్తడం గొప్ప సానుకూలతను కలుగజే స్తుంది’’ అని ప్రాచీన చైనా వ్యూహకర్త సున్ జు అన్నాడు. జనాదరణలో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని తెచ్చి బీజేపీ ఆప్ నేతనే కాదు, కాంగ్రెస్‌ను కూడా ఖంగు తినిపించింది. ఆకస్మికమైన ఈ ఆశ్చర్యకరమైన ఎత్తుగడతో బీజేపీ కొంత సానుకూలతను సాధించింది. ఇక బీజేపీకి నరేంద్రమోదీ ఎలాగూ ఉండనే ఉన్నారు. కేజ్రీవాల్‌ను అధికారంలోకి తేవడం వల్ల ఫలితం శూన్యమని, కేంద్రం మద్దతు లేనిదే ఆయనేమీ చేయలేడని ఢిల్లీలో చాలామంది భావిస్తున్నారు. పైగా దళిత, ముస్లిం ఓటర్లలో 2014 నాటికంటే ఇప్పడు బీజేపీ వ్యతిరేకత తక్కువగా ఉంది. కాంగ్రెస్ హయాంలో కంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. చమురు ధరల తగ్గుదల పుణ్యమాని ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఈ సానుకూల పరిస్థితి బీజేపీకి ఉపయోగపడుతుంది. 2013లో కేజ్రీవాల్‌కు ఓటు వేసిన మధ్యతరగతి, యువత పెద్ద సంఖ్యలో బీజేపీ పక్షానికి చేరారు. నెల క్రితం వరకు బీజేపీ గెలుపుపై చాలా ధీమాగా ఉంది. కానీ మెజారిటీ దక్కకపోవచ్చునేమోనని ఇప్పడు ఆందోళన చెందుతోంది. ఢిల్లీలో అది ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. కేరళ, తమిళనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పార్టీని పెంపొందింపజేయాలన్న లక్ష్యానికి హాని కలుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడమంటే కాంగ్రెస్, ప్రతి పక్షాలు నీరసపడిపోవడమే. దేశంలో అన్ని చోట్లా తమకు సరిపడేటంతమంది నేతలు లేరనే గుణపాఠాన్ని బీజేపీ ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. పోటాపోటీగా సాగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ధీటైన నేత తమకు లేరు కాబట్టే కిరణ్ బేడీని ఆహ్వానించి పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడాలంటే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించక తప్పదు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. ప్రధాని స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే సరిపోదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. ఆ పార్టీ రేపు ఏ దిశగా సాగనున్నదో ఢిల్లీ ఫలితాలు సూచిస్తాయి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
అరువు రాజకీయం, అదే యుద్ధతంత్రం
ఢిల్లీ ఎన్నికలలో భాజపా ఓటమిని మోదీ జీర్ణించుకోలేరు. విజయం అత్యవసరం. అందుకే పార్టీలో మొదటి నుంచీ సేవచేస్తున్న నాయకులు ఏమనుకున్నా సరే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకత్వం అభిప్రాయం ఏమైనా సరే బేడీని రంగంలో దింపి కేజ్రీవాల్ ఆటకట్టించాలని భాజపా త్రిమూర్తులు (మోదీ, షా, జైట్లీ) నిర్ణయించారు. సమాచార సాంకేతికరంగం (ఐటీ), వ్యాపారరంగం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కొత్త పదాలు తరచుగా వినిపిస్తున్నాయి. సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్-ముఖ్య కార్యనిర్వహణ అధికారి) వాటిలో ఒకటి. అవుట్సోర్సింగ్ అనే మాట తరచుగా వినిపించే మరో మాట. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కారణంగానే మనదేశంలో ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇంతమంది ఐటీ ఉద్యోగులు దర్జాగా బతికేస్తున్నారు. కొన్ని దశాబ్దాల కిందట రాజకీయ నాయకులూ, వణిక్ప్రముఖులూ, పారిశ్రామికవేత్తలూ విడి విడిగా ఉండేవారు. సంపన్నుల సరసన కనిపించడానికి సైతం రాజకీయ నాయకులు సంకోచించేవారు. ఇప్పుడు వ్యాపారవేత్తలే రాజకీయనాయకులు అవుతున్నారు. రాజకీయ నాయకులకూ వ్యాపార లక్షణాలు అలవడుతున్నాయి. వ్యాపార నైపుణ్యం ప్రదర్శించడం రాజకీయ నాయకులకు అదనపు అర్హతగా, గర్వకారణంగా పరిణమిం చింది. రాజకీయ నాయకులు సంపన్నులతోనే వ్యవహారం చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ వ్యాపారానికే పరిమితం కాకుండా రాజకీయాలలోకి సైతం ప్రవేశించింది. అవుట్సోర్సింగ్ అంటే ఏదైనా ఒక సంస్థకు లేదా వ్యక్తికి ఒకానొక నిర్దిష్టమైన పని చేసే బాధ్యత అప్పగించడం, ఆ బాధ్యత నెరవేర్చినందుకు పారితోషికం చెల్లించడం. ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా పని సాధ్యం కాదని అనిపిస్తే, అదనంగా సాయం తీసుకుంటే తప్ప విజయం వరించదని భావిస్తే బయటి సంస్థకు లేదా వ్యక్తికి లేదా బృందానికి ఆ పని అప్పజెప్పడాన్ని పొలిటికల్ అవుట్సోర్సింగ్ అనుకోవచ్చు. 2014 ఎన్నికలలో ఒకటి, రెండు శాతం ఓట్లు తక్కువ పడతాయని అంచనా వేసుకొని వాటిని తీసుకొచ్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ (తెదేపా) నాయకుడు చంద్రబాబు నాయుడు సినీ నటుడు పవన్ కల్యాణ్‌కి అప్పగించడం ఇటువంటిదే. ఎన్ని ఓట్లు హీరో కారణంగా వచ్చాయో తెలియదు కానీ తెదేపా విజయంలో ఆయన పాత్ర ఎంతోకొంత ఉన్నదని అందరూ అంగీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పని యావత్తూ సింగపూర్‌కి అవుట్సోర్స్ చేస్తున్నారు చంద్రబాబునాయుడు. ఈ మాదిరి రాజధాని నిర్మాణం కోసం డిజైనింగ్ నుంచి నిర్మాణం దాకా ఒక బుల్లి విదేశానికి అప్పగించిన రాష్ట్రాధినేత కానీ దేశాధినేత కానీ ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ లేడు. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. మన దేశంలో అవుట్‌సోర్సింగ్‌లో కానీ ఆర్థిక సంస్కరణల అమలులో కానీ ఆద్యుడు చంద్రబాబునాయుడే. తర్వాత చాలా కాలానికి నరేంద్రమోదీ అందుకున్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా దావోస్ పర్యటన మాత్రం బాబు మాను కోరు. సంపన్నదేశాల అధినేతలను కలుసుకునే అవకాశం వదులుకోరు. ఆంధ్రప్రదేశ్‌కు సీఈఓ చంద్రబాబునాయుడు అయితే మొన్నటి వరకూ గుజరాత్‌కూ, ఇప్పుడు భారత్‌కూ నరేంద్రమోదీ. కంపెనీని జయప్రదంగా నిర్వహించి లాభాల బాటలో నడిపించిన సమర్థుడైన సీఈఓగా పేరుప్రఖ్యాతులు సంపాదించాలి. సంపద సృష్టించాలి. ప్రగతి ఫలాలు పేదవారి బతుకులను బాగుచేయాలి. వారిని మధ్య తర గతిలోకి చేర్చాలి. ఇదీ విపణి చోదక ఆర్థిక వ్యూహం. అభివృద్ధి నమూనా. లక్ష్యం సాధించే సత్తా తన యంత్రాంగానికి లేకపోతే బయటి నుంచి శక్తియుక్తులను అరువు తెచ్చుకోవడంలో తప్పు లేదంటారు. గెలుపే ప్రధానం- వ్యాపారమైనా, రాజకీయమైనా. రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరన్నది తెలిసిందే. అవసరమైతే శత్రువును కూడా అక్కున చేర్చుకోవాలి. పక్కన కూర్చోబెట్టుకోవాలి. నెత్తిన ఎక్కించుకోవాలి. ఈ సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) 2014 ఎన్నికల సమయంలో జయప్రదంగా అమలు చేశారు (2009లో చంద్రబాబునాయుడు ఇదే సూత్రం అనుసరించి తెరాసతో పొత్తు పెట్టుకొని చేసిన ప్రయోగం ఫలించలేదు). వరంగల్లు జిల్లాలో ఒక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా ఒక మహిళను నిలబెట్టినప్పుడు చాలా మంది కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ‘మిమ్మల్ని అంతగా తిట్టిపోసిన వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటి’ అంటూ ప్రశ్నించారు. ఆమె ఏమని తిట్టారో కూడా కేసీఆర్ నవ్వుతూ చెబుతూ ఆ నియోజకవర్గంలోనే కాకుండా పక్క రెండు మూడు నియోజకవర్గాలలో కూడా పార్టీ అభ్యర్థులు గెలవాలంటే ఆమెకు టిక్కెట్టు ఇవ్వక తప్పదని తేల్చిచెప్పారు. ఇది రాజకీ యం. చాణక్యుడి కాలం నుంచీ అమలు జరుగుతున్న యుద్ధతంత్రం. అందుకే కిరణ్ బేడీని భారతీయ జనతా పార్టీ (భాజపా)లోకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానించినప్పుడు దేశ ప్రజలు నివ్వెరపోలేదు. నిరుడు మే ఎన్నికల అనంతరం నరేంద్రమోదీ తన మంత్రిమండలిలోకి హర్షవర్దన్‌ను తీసుకోవడం పెద్ద తప్పిదం. మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా మంచి పేరున్న హర్షవర్ధన్ కేంద్ర కేబినెట్లో చేరిపోవడంతో ఢిల్లీ భాజపా విభాగం గట్టి నాయకుడు లేక బలహీనపడింది. బహునాయకత్వంతో ముఠాతగాదాలు ముదిరి పోయాయి. కార్యకర్తలు కర్తవ్యతా విమూఢులై డీలా పడిపోయారు. 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందుకు ప్రజలకు సంజాయిషీ చెప్పుకొని వారికి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ దగ్గరైనారు. మోదీ రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌పైన పదునైన విమర్శనాస్త్రాలు సంధించడానికి కారణం అదే. ప్రధాన ప్రత్యర్థి బలపడుతున్నాడనే స్పృహ మోదీ చేత దాడి చేయించింది. భాజపా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయకు చెందిన కంపెనీలు ఢిల్లీ విద్యుత్ బోర్డుకోసం చేసిన పనులలో అవినీతికి పాల్పడినాయంటూ కేజ్రీవాల్ ధ్వజం ఎత్తారు. ఉపాధ్యాయను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించే పరిస్థితి లేదు. ఒక వేళ పార్టీ ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోతే అది మోదీ పరాజయంగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. పైగా మోదీకీ, కేజ్రీవాల్‌కీ మధ్య పోటీ అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)కి అనుకూలం. మోదీ ప్రధానిగానే ఉంటారు. ముఖ్యమంత్రి పదవి స్వీకరించరు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వెల్లడించలేదు. తమతో మమేకమై, తమ దైనందిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వాగ్దానం చేస్తున్న కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రిగా మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించే అవకాశం ఉంది. అందువల్ల కేజ్రీవాల్‌కు దీటైన ప్రత్యర్థిగా కిరణ్ బేడీని రంగంలోకి దించాలని నిర్ణయించారు. దేశంలోనే ఐపీఎస్‌కు ఎంపికైన మొట్టమొదటి మహిళగా, జైళ్ళలో సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థురాలైన అధికారిగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకురాలుగా ఢిల్లీ పౌరుల హృదయాలలో స్థానం సంపాదించిన బేడీని ఎన్నికలలో భాజపా పక్షాన దింపాలన్న ప్రతిపాదనను 2013 డిసెంబర్ నాటి ఎన్నికల సమయంలోనే పార్టీ నాయకత్వం చర్చించింది. కానీ ఎన్నికలకు ముందు బయటి వ్యక్తిని ఆహ్వానించి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపితే జీవితాంతం పార్టీకి విధేయులుగా ఉంటూ సేవచేస్తూ వచ్చిన నాయకులూ, కార్యకర్తలూ నొచ్చుకుంటారనే అభిప్రాయంతో ఆ ప్రతిపాదనకు స్వస్తి చెప్పారు. కానీ అప్పటి కంటే ఇప్పుడు మోదీ ప్రాబల్యం పెరిగింది. ప్రతిష్ఠ పతాక స్థాయికి చేరింది. ఢిల్లీ ఎన్నికలలో భాజపా ఓటమిని మోదీ జీర్ణించుకోలేరు. విజయం అత్యవసరం. అందుకే పార్టీలో మొదటి నుంచీ సేవచేస్తున్న నాయకులు ఏమనుకున్నా సరే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)నాయకత్వం అభిప్రాయం ఏమైనా సరే బేడీని రంగంలో దింపి కేజ్రీవాల్ ఆటకట్టించాలని భాజపా త్రిమూర్తులు (మోదీ, షా, జైట్లీ) నిర్ణయించారు. బేడీతో పాటు షాజియా ఇల్మాను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. జయప్రద కూడా అదే దారిలో ఉన్నట్టు వార్త. అమర్‌సింగ్ తోడు లేకపోతే ఈ పాటికి జయప్రద భాజపాలో ఉండేవారు. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు భాజపా నాయకత్వానికి ఇబ్బంది ఉండదు. అమర్‌సింగ్ కూడా అంటే అభ్యంతరం. కిరణ్ బేడీకి ఉన్న జనాకర్షణ శక్తిని వినియోగించుకొని అన్నాహజారే అనుయాయులలో చీలిక తెచ్చి ఆమ్ ఆద్మీ చీపిరి కట్టతోనే కేజ్రీవాల్‌ను కొట్టాలన్నది భాజపా వ్యూహం. మొన్నటి వరకూ మోదీకీ, భాజపాకూ వ్యతిరేకంగా ట్వీటర్లో వ్యాఖ్యలు చేస్తూ, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారే సరసన నిలబడి చేసిన ప్రసంగాలలో కాంగ్రెస్‌నూ, భాజపానూ ఒకే గాటన కట్టి దుయ్యపడుతూ వచ్చిన బేడీ పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తున్నారు. కోర్టులు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ గుజరాత్ మారణకాండ విషయంలో ప్రజాకోర్టులో మోదీ నిర్దోషిగా ఇంకా నిరూపణ కావలసి ఉన్నదంటూ కరకుగా వ్యాఖ్యానించిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇప్పుడు మోదీని అభివృద్ధికి ప్రతీకగా, గాంధీజీ వారసుడుగా అభివర్ణించడం అందరికీ రుచించక పోవచ్చు. అయినా నరేంద్రమోదీయే స్వయంగా విమర్శలను విస్మరించి బేడీని పార్టీలోకి స్వాగతిస్తే మనకేమిటి సమస్య అని ఓటర్లు అనుకోవచ్చు. వీధి పోరాటాలలో ఆరితేరిన కేజ్రీవాల్‌పై ఆధిక్యం సాధించడం అంత సులువు కాదు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలంటూ ఇరవై సంవత్సరాలుగా ఉద్ఘోషిస్తూ ఎన్నికల ప్రణాళికలో సైతం భాజపా పొందుపరిచింది. ఆ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతకర్త యోగేంద్ర యాదవ్ సంధించిన ప్రశ్నకు భాజపా నాయకత్వం నుంచి సమాధానం లేదు. ఇప్పుడది అంత ముఖ్యమైన అంశం కాదంటూ బేడీ చెప్పిన జవాబు పేలవంగా ఉంది. బేడీ రాకతో ఆమ్ ఆద్మీ పార్టీలో కాక పెరిగింది. భాజపా శ్రేణుల్లో ఉత్పాహం ఉరకలు వేస్తోంది. ‘ఢిల్లీ కా సీఎం కైసా హో, కిరణ్‌బేడీ జైసా హో’ అంటూ నినదిస్తున్నారు. మూడు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులూ అవినీతికి అతీతులే. కాంగ్రెస్ పార్టీ షీలాదీక్షిత్‌ను కాకుండా అజయ్ మాకెన్‌ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూచించడంతో పదిహేనేళ్ళ పాలనలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పొరపాట్లకు సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. భాజపా, ఏఏపీ మధ్య పోటీ వేడిగా వాడిగా ఉంటుంది. ఇప్పుడైతే భాజపావైపే రవ్వంత మొగ్గు కనిపిస్తోంది. భాజపా కనుక గెలుపొందితే రాజకీయాలలో అవుట్సోర్సింగ్ (పచ్చి అవకాశవాదం అని అర్థం) విధానం జయప్రదమైనట్టే. ఈ పదం రాజకీయ పదజాలంలో కూడా స్థిరపడిపోతుంది. - murthykondubhatla@gmail.com కె.రామచంద్రమూర్తి -
హస్తినలో పాగాకు బీజేపీ గట్టి ప్లానే వేసింది..
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్‌తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్‌ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా కమలనాధులు... కిరణ్‌బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ఇప్పుడు... ఢిల్లీలో బీజేపీ ఇమేజ్ను పూర్తిగా మార్చేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ అంటే తమదే అనే ఆమ్ ఆద్మీ పార్టీకి... ఇప్పుడు కిరణ్‌బేడీ గట్టిపోటి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నలభై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న కిరణ్‌బేడీకి... నిజాయితీ పరురాలు అనే ఇమేజ్ ఉంది. దాదాపు 35 ఏళ్లపాటు ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్న బేడీని... బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో విస్తృతంగా వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలువనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 2008లో ఈ స్థానం నుంచి చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రపతి కుమార్తె అయినప్పటీకి శర్మిష్ట తన తండ్రి ప్రభావం ఏమీ లేకుండా ఆమె సాదాసీదాగా ప్రచారం చేసుకుంటున్నారు. 'తన తండ్రి రాష్టపతిగా కాకుండా ప్రజల మనిషిగా నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడు ఆమె తెలిపారు. దేశాధినేత కుమార్తె కావటంతో తన గెలుపుపై ఎక్కవ అంచనాలు ఉన్నాయన్న సంగతిని ఆమె అంగీకరించారు. కైలాష్ ఒక అసెంబ్లీ స్థానం మాత్రమే కాదు... 1986 నుంచి అది మాకు సొంత ఇంటితో సమానమని' శర్మిష్ట వివరించారు. -
కేజ్రీవాల్‌పై రె'ఢీ': జయప్రద
న్యూఢిల్లీ : సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రద త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయప్రద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కూడా కలిసినట్లు సమాచారం. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై పోటీకి సిద్ధమన్న జయప్రద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు శనివారం ఢిల్లీ వెళ్లనున్న ఆమె బీజేపీ పెద్దలను కలవనున్నారు. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు...జయప్రదను పార్టీలోకి తీసుకుని, కేజ్రీవాల్ పై పోటీకి నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కమలం హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె చివరకు బీజేపీ వైపు మొగ్గు చూశారు. -
ఆ ఎమ్మెల్యేలలో 97% కోటీశ్వరులే!
దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్, 10న ఫలితాల వెల్లడి ఉంటుంది. అయితే.. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల చరిత్రలు చూస్తే.. వాళ్లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యేల్లో 97 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 31 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందులో 30 మందికి సగటున 12 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. అలాగే, వాళ్లలో మొత్తం 17 మందికి నేర చరిత్ర కూడా ఉంది. ఈ విషయం వాళ్లు ఇచ్చిన అఫిడవిట్లలోనే ఉంది. 49 రోజుల పాటు అధికారంలో కూర్చున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు. ఆ పార్టీకి ఉన్న 28 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. వీళ్ల సగటు ఆస్తి కోటి రూపాయలు. ముగ్గురి మీద క్రిమినల్ కేసులున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. వాళ్లలో ఏడుగురు.. అంటే 88 శాతం మంది కోటీశ్వరులు. వాళ్ల సగటు ఆస్తి 10కోట్ల రూపాయలకు పైనే. వీళ్లలో ఇద్దరి మీద క్రిమినల్ కేసులున్నాయి. -
సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ...రెండో విడత జాబితపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించటంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రాల్లో వరుస పరాజయాలపైనా నేతలు దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం, అహ్మద్ పటేల్ సహా ఇతర నేతలు హాజరు అయ్యారు. -
ఢిల్లీ ఎన్నికలకు నగారా
వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు 13న తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపింది. సోమవారమిక్కడ కమిషనర్లు హెచ్ఎస్ బ్రహ్మ, నసీమ్ జైదీలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఢిల్లీలో 1.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎన్నికలు లేకపోవడంతో ఢిల్లీ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు తమ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీ కిందటేడాది నవంబర్ 4న రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన గడువు ఫిబ్రవరి 15న ముగియనుంది. ఎన్నికల కోసం 11,736 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ , కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అసెంబ్లీ స్థానం సహా వివిధ రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమబెంగాల్లోని బంగోన్ లోక్‌సభ స్థానానికి కూడా ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తామని వీఎస్ సంపత్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జారీ చేసిన పలు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి సంతకం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘తన రాజ్యాంగ అధికారాలను ఎప్పుడు వాడాలో ఆయన(రాష్ట్రపతి)కు తెలుసు’ అని సంపత్ పేర్కొన్నారు. వ్యూహ రచనల్లో పార్టీలు.. షెడ్యూల్‌కు ముందే ఢిల్లీలోని ప్రధాన పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నాయి. ఆప్ ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పోస్టర్లు, హోర్డింగులు, ఎస్ఎంఎస్లు, రేడియో సందేశాలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది. గడిచిన రెండు నెలల్లో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 55 సభలు నిర్వహించారు. విద్యుత్తు చార్జీలను తగ్గిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. తమ 49 రోజుల పాలనలోని విజయాలను ప్రధానంగా పేర్కొంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇక ప్రధాని మోదీ ప్రభంజనమే తమను గెలిపిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరంలో బీజేపీ శ్రేణులు మోదీ పోస్టర్లు, హోర్డింగులను పెద్దఎత్తున ఏర్పాటు చేశా యి. ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ.. మరో ఐదారు సభలకు హాజరవుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా మునుపెన్నడూ లేని రీతి లో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది. అయితే ప్రచారపరంగా ప్రత్యర్థి పార్టీల కన్నా వెనుకబడి ఉంది. ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. -
'ఢిల్లీ టూ గల్లీ.. సమస్యలు తెలిసిన నేత వెంకయ్య'
ఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య అని మోదీ కొనియాడారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ఢిల్లీ సహా గల్లీ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య నాయుడు అని పేర్కొన్నారు. శనివారం రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని మోదీ మరోసారి స్పష్టం చేశారు. దేశ యువత బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో బీజేపీ ప్రజల పట్టం కట్టారన్నారు. పేదరిక నిర్మూలనలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. -
ఢిల్లీలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం:వెంకయ్య
ఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ వరాల జల్లు కురిపిస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, వెంకయ్యలు హాజరయ్యారు. కేంద్ర సాయం లేకుండా ఢిల్లీ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని వెంకయ్య తెలిపారు. మేక్ ఇన్ ఇండియా సాయంతో దేశంలో నిరుద్యోగాన్ని పారద్రోలుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. జమ్మూ కశ్మీర్ లో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ సీట్లు గెలుచుకుందని అమిత్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ తరుపున ముగ్గురు సీఎంలు అయ్యారని.. బీజేపీతోనే దేశ, రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. -
మోదీకి కేజ్రీ(స)వాల్
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేడో, రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని మోదీ శనివారం రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు అమిత్ షా కూడా హాజరు కానున్నారు. మరోవైపు ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా మోదీకి వ్యతిరేకంగా ఆప్ పార్టీ పోస్టర్లు అంటించింది. -
'ఆప్'పై న్యాయపరమైన చర్య తీసుకోండి: బీజేపీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని తమ పార్టీ నాయకుడు జగదీష్ ముఖీకి బీజేపీ ఢిల్లీ శాఖ సూచించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగదీష్ ముఖీ అంటూ ఆప్ ప్రచారం చేస్తోంది. ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లను ఆటో రిక్షాల వెనుక అతికించి ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. అయితే బీజేపీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. తాము సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ఆప్ నాయకులు ఇలాంటి ప్రచారం ఎలా చేస్తారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఆప్ పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని జగదీష్ ముఖీని కోరినట్టు వెల్లడించారు. కాగా తన లాయర్లతో పాటు జగదీష్ ముఖీ సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. -
2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్
మహిళల కోసం దేశ రాజధానిలో రెండు లక్షల పబ్లిక్ టాయిలెట్లు కట్టిస్తామని, రేప్ కేసుల విచారణకు వంద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. వాటితో పాటు.. నగరమంతా వై-ఫైతో కనెక్ట్ అయి ఉండే సీసీటీవీ కెమెరాలను కూడా పెట్టిస్తామంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ హామీలు ప్రకటించింది. 'ఢిల్లీ డైలాగ్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపింది. రాజధాని నగరం నడిబొడ్డునున్న తల్కతోరా గార్డెన్స్‌లో 500 మంది మహిళలతో నిర్వహించిన సదస్సులో ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ హామీలను గుప్పించారు. తమ ప్రాంతాలకు దగ్గర్లో ఏవైనా మద్యం దుకాణాలుంటే, వాటిని మూసేయాల్సిందిగా తీర్మానాలు చేయొచ్చని ఆయన మహిళలకు చెప్పారు. ప్రతి డీటీసీ బస్సులో ఈవ్ టీజింగ్‌ను అరికట్టడానికి ఓ మార్షల్‌ను పెడతామని కూడా అన్నారు. -
విధానసభ ఎన్నికలు ఆచితూచి ఆప్ ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనం ప్రభావాన్ని తట్టుకుని గెలవడం కోసం గట్టి అభ్యర్థులు అవసరమనే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజాయి తీ, విశ్వసనీయత కలిగిన కార్యకర్తలుగా ముద్రపడినవారికే టికెట్లను కేటాయించే దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రచారరంలో తమ పార్టీ అభ్యర్థులు మిగతా పార్టీల అభ్యర్థుల కన్నా ముందుండాలనే ఉద్దేశంతో ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 22 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆప్ ఇప్పటికే విడుదల చేసింది. ఇందు లో ఆప్ సర్కారులో మంత్రులుగా ఉన్న నలుగురి పేర్లతో పాటు 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు కూడా అందులో ఉన్నాయి. అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి లేదా రెండు రోజులలో విడుదల చేసే అవకాశముంది. రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సమావేశమై రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఈ నెల 28వ తేదీనవిడుదల చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో 20 మంది పేర్లు ఉండొచ్చని, వారిలో ఏడు పేర్లు కొత్తవని అంటున్నారు. గత విధానసభ ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన్పపటికీ చిత్తశుద్ధితో పనిచేసే వారికి రెండో జాబితాలో చోటు కల్పించనున్నారు. రాఖీబిర్లాతోపాటు అల్కా లాంబా, దేవేంద్ర సెహ్రావత్, గోపాల్‌రాయ్ తదితరుల పేర్లు ఉండొచ్చని అంటున్నారు. అల్కా లాంబా ఆప్ తర పున విధానసభ ఎన్నికలలో దిగనున్న కొత్త ముఖం కాగా రాఖీ బిర్లా గత ఎన్నికలలో మంగోల్‌పురి నుంచి విజయం సాధించారు. గోపాల్‌రాయ్.. బాబర్‌పుర్ నియోజకవర్గంనుంచి పోటీచేసి ఓడిపోయారు. దేవేంద్ర సెహ్రావత్ కూడా విధానసభ ఎన్నికల్లో బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి పోటచేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఆయన లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మళ్లీ పరాజయం పాలయ్యారు. -
ఢిల్లీకి మళ్లీ ఎన్నికల కళ!
ఢిల్లీకి ఎనిమిది నెలల రాజకీయ అనిశ్చితి నుండి ఎట్టకేలకు విముక్తి లభించింది. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు రెండూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అశక్తతను వ్యక్తం చేయడంతో అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్ మంగళవారం సిఫార్సుచేశారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానాన్ని కలుపుకొని బీజేపీ 32 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌కు 28 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 8 లభించాయి. కొంత ఊగిసలాట తర్వాత అదే నెలలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా అది రెండు నెలలుకూడా మనుగడ సాధించలేకపోయింది. పదవినుంచి వైదొలగుతూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించదల్చుకుంటే ఆ సిఫార్సును పట్టించుకుని ఉండేవారు. ఎందుకంటే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేమని బీజేపీ ఆదిలోనే చెప్పింది. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మరోసారి దాన్నే పునరుద్ఘాటించింది. కనుక మళ్లీ ఎన్నికలు నిర్వహించడం తప్ప అక్కడ ప్రత్యామ్నాయం లేదు. మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయని అందరూ అంచనావేసిన సమయంలో రాష్ట్రపతి పాలన వచ్చిపడింది. ఆనాటి యూపీఏ సర్కారు అభీష్టార్థం నడుచుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ సిఫార్సును పక్కనబెట్టారు. కనుకనే కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. రాజ్యాంగ నిబంధనలను పాటించడంలో అటు కార్యనిర్వాహకవర్గమూ, ఇటు రాజకీయ పక్షాలూ విఫలమవుతున్నాయి. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంనుంచి ఆలోచించడంతప్ప నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న స్పృహ కరువవుతున్నది. ఢిల్లీలో ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను తొలగించడానికి ఏం చేయదల్చుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు లెఫ్టినెంట్ గవర్నర్‌నూ, కేంద్ర ప్రభుత్వాన్నీ ఏడు నెలలక్రితం కోరినప్పుడు కొందరు నొచ్చుకున్నారు. ఇది కార్యానిర్వాహక వర్గం అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడ్డారు. కానీ, సుప్రీంకోర్టు వెంటపడింది గనుకే ఇంత ఆలస్యంగానైనా అసెంబ్లీ రద్దు విషయం తేలింది. ఈ కాలమంతా రాజకీయ పార్టీల పిల్లిమొగ్గల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి, దాన్ని నవాబ్‌జంగ్ అంగీకరించలేదని అలిగి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల అనంతరం కొంతకాలంపాటు వైఖరి మార్చుకున్నారు. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. అది సాధ్యపడేలా లేదని గ్రహించాక మళ్లీ అసెంబ్లీ రద్దు పాటపాడారు. బీజేపీ సైతం ఇలాంటి ఊగిసలాటనే ప్రదర్శించింది. ఈ ఊగిసలాట ఉద్దేశపూర్వకం కూడా కావొచ్చు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదు గనుక ప్రతిపక్షంలోనే కూర్చుంటామని అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే స్పష్టంగా చెప్పిన ఆ పార్టీ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడగానే కొత్త ఆలోచనలు చేసింది. అధికారికంగా ఏమీ చెప్పకపోయినా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై కొంత ప్రయత్నంచేసినట్టు కనబడింది. తమ పార్టీకున్న 31 మంది సభ్యుల్లో ముగ్గురు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికై బలం 29కి తగ్గడంతో ఈ విషయంలో చురుగ్గా కదల్లేకపోయింది. అందువల్లే ఖాళీ ఏర్పడిన మూడు అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ మూడు స్థానాలూ గెల్చుకున్నా ఫిరాయింపుల ద్వారా తప్ప ప్రభుత్వం ఏర్పాటుచేయడం అసాధ్యమని, అది పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని చివరకు భావించింది. దాని పర్యవసానమే అసెంబ్లీ రద్దు నిర్ణయం. అయితే, ఈ ఎన్నికలు మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోగానీ...ఈ నెలలో జరగబోయే జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలతోగానీ రాకుండా చూడటంలో విజయం సాధించింది. ఢిల్లీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రీకరించడం కోసమే ఈ ఎత్తుగడవేసింది. వాస్తవానికి ఢిల్లీలో బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. కనుకనే నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నా కాంగ్రెస్‌పై ఏర్పడిన అసంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది. మోదీ రాకతో ఆ పరిస్థితి మారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెల్చుకోగలిగింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఇచ్చిన ఊపుతో ఢిల్లీ అసెంబ్లీని కూడా చేజిక్కించుకోగలమన్న విశ్వాసం ఆ పార్టీలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో అందరి విశ్వాసాన్నీ పొందగలిగిన ఒక నాయకుణ్ణి ముందుకు తీసుకురావడంలో బీజేపీ ఇంతవరకూ సఫలం కాలేదు. అయితే, కాంగ్రెస్ వరస అపజయాలతో కుదేలై ఉండటమూ, నిరుడు ఎన్నికల నాటికి అవినీతిని ప్రధానాస్త్రంగా చేసుకుని నైతికంగా దృఢంగా కనబడిన ఆప్ ఇప్పుడు మిగిలిన పార్టీల్లో ఒకటిగా మిగిలిపోవడమూ బీజేపీకి పనికొచ్చే అంశాలు. అయితే, ఢిల్లీలో ఇటీ వల జరిగిన కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవి. రాజధాని నగరంలోని త్రిలోక్‌పురిలో మత ఘర్షణలు నెలకొనడమూ, తమ కాలనీల్లో మతపరమైన ఊరేగింపు జరపరాదంటూ నంద్నగ్రి, బవానాల్లో కొందరు తీర్మానాలు చేయడమూ పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. సామాన్య పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించే ఇలాంటి ఉదంతాలను మొగ్గలోనే తుంచి, కారకులపై చర్య తీసుకోకపోతే ఎన్నికల వాతావరణం కలుషితమవుతుంది. అనవసర వైషమ్యాలు, ఉద్రిక్తతలు పెరుగుతాయి. రాజధాని నగరంగా ఉన్న ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం దేశ ప్రతిష్టను పెంచదు. కనుక అన్ని రాజకీయ పక్షాలూ ఎన్నికలు ఆగమిస్తున్న ఈ దశలో బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో మెలగాలి. ప్రతి కాలనీలోనూ శాంతి కమిటీలు ఏర్పాటు చేసి సామాన్య పౌరులకు అండగా నిలిచి, శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదపడాలి. -
బీజేపీయే కారణం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఆలస్యానికి కారణం బీజేపీయే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. ఢిల్లీలో రాబోయేది తమ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ప్రత్యక్ష పోరుకు బీజేపీ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం అభ్యర్థిని బీజేపీ ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు మంగళవారం కేంద్ర కేబినెట్ సిఫారసు చేయడంతో త్వరలో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ముందుకు రాకపోవడంతో లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
'ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాలేదు'
-
'ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాలేదు'
ఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగుమం కానుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీ కూడా ఆసక్తి కనబరచకపోవడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను సోమవారం కలిసిన పలు పార్టీ ల నేతలు ప్రభుత్వ ఏర్పాటు కంటే ఎన్నికల వైపే ఆసక్తి చూపారు. ఢిల్లీలో ఏ పార్టీ కూడా అధికారాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని నజీబ్ జంగ్ తాజాగా స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు తనకు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ నివేదికను రాష్ట్రపతికి నజీబ్ జంగ్ పంపనున్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజకీయ అనిశ్చితిని తొలగించాలని సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని నజీబ్ కు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలని నజీబ్ జంగ్ ను కోరారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించడంతో అందరూ బీజేపీకి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. ఆ దిశగా కమలదళం కూడా ప్రయత్నించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎన్నికలకే మొగ్గు పుతున్నట్లు తాజా పరిణామాల్ని బట్టి తెలుస్తోంది. -
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: వెంకయ్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. ఎన్నికలంటే బీజేపీ భయం లేదన్నారు. ఒకవేళ గెలుస్తామని బీజేపీకి నమ్మకం ఉంటే గత 5 నెలల్లో ఎన్నికలకు వెళ్లి ఉండేది అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు స్పందించారు. పూర్తి మెజారిటీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. -
ఎన్నికలంటే బీజేపీకి భయం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ నిప్పులు చెరిగారు. బీజేపీకి కొంచెమైనా సిగ్గు ఉంటే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. బీజేపీ తీరు వల్ల ఢిల్లీ ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారన్నారు. ఢిల్లీలో నీటి, విద్యుత్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నారు. అందుకే ఢిల్లీలో ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. బీజేపీకి అణువంతైన విశ్వాసం ఉండి ఉంటే గత ఐదు నెలల్లో ఎన్నికలు నిర్వహించి ఉండదేని కేజ్రీవాల్ అన్నారు. అతిపెద్ద పార్టీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. Follow @sakshinews -
తొలిరోజే తడాఖా చూపించిన కేజ్రీవాల్
-
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
-
ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు...?
-
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. అసెంబ్లీలో తమకు తగినంత బలం లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు తెలిపినట్టు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వనందున ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పామన్నారు. ఈ సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో హర్షవర్థన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు గవర్నర్ తనను ఆహ్వానించారని హర్షవర్థన్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము నిరాకరించామని ఆయన వెల్లడించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెల్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. -
హస్తినపై ‘కేజ్రీ’ ఇంద్రజాల్
విశ్లేషణ, డా॥పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు ఇటీవల జరిగిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజ కీయాలపై అత్యంత ప్రాముఖ్యత గలిగిన, దిగ్భ్రాంతి కరమైన ప్రభావాన్ని నెరపాయి, నెరపనున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో సృష్టించిన అద్భుతాలు ప్రత్యేకించి బల మైన ప్రభావాన్ని కలుగజేశాయి. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని అసాధారణ విజయాలను ఆమ్ఆద్మీ సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ ఫలితాల నుంచి చేదు గుణపాఠాలను నేర్చుకోవాల్సివచ్చింది. గాంధీ కుటుంబం జనాకర్షణ శక్తి అడుగంటిందనే చేదు గుణపాఠాన్ని కాంగ్రెస్ నేర్చుకుంది. ఒక కుటుంబం దేశాన్ని శాసిస్తుంటే ప్రధాని ఎలాంటి ప్రాధాన్యం లేకుండా మిగలడాన్ని ప్రజలు గత తొమ్మిదేళ్లుగా నిస్సహాయంగా చూస్తూ వచ్చారు. అవకాశం రావడంతోనే ఆ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అన్ని కసరత్తులూ చేసింది. ప్రధాన ప్రత్యర్థులైన నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఇద్దరిపైనా సమస్త చిట్కాలను ప్రయోగించింది. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌ను అవినీతిపరునిగా చూపాలని యత్నించింది. మోడీపై సీబీఐ కేసులను నమోదు చేయించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించినది తానే తప్ప మన్మోహన్ కారని గత ఐదేళ్లుగా సోనియా నమ్ముతూ వచ్చారు. ధరలు ఎంతగా పెరుగుతున్నా ‘ఉచిత తాయిలాలు’ పంచితే చాలు ప్రజలు ఓట్లు వేసేస్తారని ఆమె విశ్వసించారు. మన్మోహన్‌ను పక్కకునెట్టి, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు. అవినీతిని మినహాయిస్తే కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. నేడు కాంగ్రెస్ కర్ణాటక, అసోం, మహారాష్ట్రలలో మాత్రమే అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నా అక్కడంతా గందరగోళమే. ‘2014’పై ప్రభావం తథ్యం బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించినా ఢిల్లీలో విజయం సాధించలేకపోవడమే దానికి అతిపెద్ద పరాజయం. ఛత్తీస్‌గఢ్‌లో అది బొటాబొటీ విజయంతో పరువు దక్కించుకుంది. ఢిల్లీ కాక మరో రాష్ట్రం చేజారితే బీజేపీ లేదా మోడీ అనుకూల పవనాలు అదృశ్యమైపోయి ఉండేవే. అయితే బీజేపీ కూడా ఈ ఫలి తాల నుంచి కొన్ని గుణపాఠాలను నేర్చుకుంది. కాంగ్రెస్ పట్లా, అధిక ధరల పట్లా ప్రజలు విసిగిపోయారు కాబట్టే తాము గెలిచామని దానికి అర్థమైంది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లలో ఆమ్ఆద్మీ లాంటి గట్టి పార్టీ లేదు. కాబట్టి బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను ముఖాముఖీ ఎదుర్కొని బీజేపీ విజ యం సాధించగలిగింది. మొత్తంగా చూస్తే... ఆమ్ఆద్మీ విజయం సాధించగా, కాంగ్రెస్ విఫలమైంది. బీజేపీ ఫలితాలు బాగానే ఉన్నా అంత గొప్పవేమీకావు. ఏదిఏమైనా 2014 ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావితం చూపుతాయనడం నిస్సందేహం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ఆద్మీ దేశవ్యాప్తంగా పోటీకి దిగడానికి యత్నిస్తుందని, కాంగ్రెస్, బీజేపీలకు తాము ప్రత్యామ్నాయం కాగల మని కేజ్రీవాల్ అంటున్నారు. అది కొంత అత్యాశాపూరితమైన లక్ష్యమే కావ చ్చు. దేశవ్యాప్తంగా ఆపార్టీ ఎంతప్రభావం చూపగలుగుతుందనేది సందేహమే. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ముస్లిం ఓట్లన్నింటినీ తానే దక్కించుకోవాలని ప్రయత్నించింది. ముస్లిం ఓటర్లు మాత్రమే గెలుపుకు సరిపోరని నాలుగు రాష్ట్రాల ఘోర పరాజయం తేల్చి చెప్పింది. అలాగే కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాలు, తెగలపై దృష్టిని కేంద్రీకరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ సంఖ్యలో ఆదివాసి జనాభా ఉన్నా కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇక షెడ్యూ ల్డ్ కులాల కోసం అసాధారణమైన రీతిలో కొత్త పథకాలను, విధానాలను రూపొందించి, భారీగా నిధులను కేటాయించింది. కానీ ఎస్సీలు కాంగ్రెస్‌కు ఓటు వేయడం మానేసారు. కాబట్టే ఢిల్లీలో ప్రేమ్‌సింగ్, రాజ్‌కుమార్ చౌహాన్ వంటి ఎస్సీ కాంగ్రెస్ నేతలు అనామకుల చేతుల్లో ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీలలో కాంగ్రెస్ అత్యంత పక్షపాత పూరితమైన గవర్నర్లను నియమించింది. ఆ రాష్ట్రాల్లో కేంద్ర నిధులను కుమ్మరించింది. ఆహార భద్రతా చట్టం తెచ్చి, పేదలకు ఆహారం అందిస్తున్నామంటూ వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం వెచ్చించారు. అయితే ఆ చట్టాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు కనబడ లేదు. కనీసం రెండు రాష్ట్రాలనైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ అన్ని సర్కస్ ఫీట్లను ప్రదర్శించేసింది. ఇక కాంగ్రెస్‌లో ఎలాంటి ఆలోచనలూ, ఆశా మిగల్లేదు. ఈ పరాజయాలు ఆ పార్టీ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీశాయి. ఓటమి భయం పుట్టించాయి. సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని సోనియా ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడమే కాంగ్రెస్ వద్ద ఉన్న ఏకైక చిట్కా అని నా అభిప్రాయం. కాంగ్రెస్ ఇక వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తుంది. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్‌ను వదిలి నితీష్‌కుమార్‌తో కలవాలని చూస్తుంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు దగ్గరి బంధువు మన్‌ప్రీత్‌సింగ్ బాదల్‌తో మైత్రిని ఆకాంక్షిస్తుంది. ఏపీలోనూ మిత్రుల కోసం వెతుకులాట తప్పదు. తమిళనాడులో దానికి డీఎంకే తప్ప గత్యంతరం లేదు. అయితే డీఎంకే అందుకు సిద్ధపడుతుందా అనేది అనుమానం. ఒడిశాలో బిజూ జనతాదళ్ అసమ్మతి వాదులనైనా జత కలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోడానికి కారణం ధరలు విపరీతంగా పెరిగిపోవడమేనని సోనియా గుర్తించినట్టున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజ స్థాన్, ఢిల్లీలలో వేల కోట్ల రూపాయలను ‘ఉచిత తాయిలాలు’గా కుమ్మరించారు, ‘అన్నీ ఉచితమే’ విధానాన్ని అనుసరించారు. అయినా పరాభవమే మిగిలింది. కాబట్టి ఇక ఆమె ఆర్థిక వ్యవస్థ పగ్గాలను మన్మోహన్‌కే అప్పగించి దరిజేర్చమని కోరవచ్చు. మధ్య తరగతి ఎలాగూ తమకు ఓటు చేయదని కాంగ్రెస్ గత తొమ్మిదేళ్లుగా మధ్యతరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు పట్టించుకోవాలని సోనియా భావించవచ్చు. కానీ అందుకు సమయం మించిపోయింది. అయితే అవినీతి వ్యతిరేక చర్యలతో అకట్టుకునే అవకాశం లేకపోలేదు. కానీ కాంగ్రెస్‌కు సుపరిపాలనను అందించడం ఎలాగో తెలియదు. ప్రతిభగల వ్యక్తులకు ప్రభుత్వాన్ని నడిపించే అధికారాలను అప్పగించడం దాని ఆలోచనకు అందదు. క్లుప్తంగా చెప్పాలంటే గాంధీల దర్బారు నిండా గుమిగూడిన వంధిమాగధులను కాంగ్రెస్ వదుల్చుకోలేదు. కాబట్టి దాని బుర్రలో కొత్త ఆలోచనలు పుట్టే ఆశ లేదు. ముగింపు పలికేస్తాడు జాగ్రత్త ఈ ఫలితాలు బీజేపీకి, మోడీకి గెలుపే కాదనలేం. కానీ ప్రతిచోటా అది కాంగ్రెస్‌ను ఓడించింది. దాదాపు 250 మంది పార్లమెంటు సభ్యులున్న దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీజేపీ ఎలాంటి పురోగతిని సాధించలేకపోయింది. ఏపీలో అది రాష్ట్రవిభజనను ఆపితే 25 మంది ఎంపీలను కూడగట్టుకోవచ్చు. అలాంటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోగల తెగింపు, రాజకీయ చతురత కలిగిన మేధ ఆ పార్టీకి లేదు. కాబట్టి అది కూడా ఎన్నికలకు ముందే పొత్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తుంది. అయితే ఈ రెండు ప్రాంతాల్లో దానికి కొత్త మిత్రులు దొరికే అశ లేదు. కొత్త మిత్రులు, కొత్త విజయాలు లేకుంటే... బీజేపీ 1996లో లాగా మూణ్ణాళ్ల ముచ్చట ప్రభుత్వం ఏర్పాటుతో సరిపెట్టుకోవాల్సివస్తుంది. దేశం ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో మోడీ సీట్లు సంపాదించగలరే గానీ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆయన పెద్దగా చేయగలిగినది లేదు. బీజేపీ ప్రజాసంబంధాల కార్యక్రమం మహాజోరుగా సాగుతోంది. అయితే అది కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఒక్క సీటును కూడా సంపాదించి పెట్టలేదు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా చేయగలదేగానీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అనేది అనుమానమే. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు నేర్పుతున్న గుణపాఠం ఒక్కటే... అవి బొత్తిగా ముసలివైపోయాయి, అలసిపోయాయి. గత ముప్పయ్యేళ్లుగా కాంగ్రెస్, బీజేపీల నాయకత్వం మారలేదు. వాళ్లు తమ పదవులను పట్టుకొని వదలడం లేదు. ఇప్పటికైనా వదలకపోతే... అతిపెద్ద ఇంద్రజాలకునిగా అవతరించిన కేజ్రీవాల్ చీపురు కట్ట మంత్రదండంతో వారికి ముగింపు పలకాల్సిరావొచ్చు. పట్టణీకరణ వేగంగా సాగుతున్న మన దేశంలో మార్పు కూడా నగరాల్లోనే ప్రారంభమౌతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదు. -
అధికారానికో దండం!
సాధారణంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. కానీ దేశ రాజధాని హస్తినలో ఇందుకు విరుద్దంగా పరిస్థితి ఉంది. 'పవర్' కోసం పాకులాడకుండా పార్టీలు మిన్నకుండిపోయాయి. అసలు తమకు అధికారమే ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. పవర్ మాకొద్దంటూ భీష్మించుకుని కూర్చున్నాయి. ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాం కానీ పాలన పగ్గాలు మాత్రం తీసుకోబోమని పారిపోతున్నాయి. అరకొర మెజారిటీతో హస్తిన అధికారం తమకొద్దని తీసిపాడేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఉఠ్కంత కొనసాగుతోంది. ఎన్నికలు పూర్తైన ఒక్క పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. జాతీయ పార్టీ బీజేపీ, కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాలన పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటోంది. ఒకరితో ఒకరు జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేసేందుకు కూడా పార్టీలు ఒప్పుకోవడం లేదు. అధికారం కోసం రాజకీయ పార్టీలు పాకులాడడం వర్తమాన రాజకీయ రంగంలో సాధారణ విషయం. సహజ లక్షణానికి విరుద్దంగా అధికారం వద్దని పొలిటికల్ పార్టీలు మడి కట్టుకుని కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ శాసనసభలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం మొగ్గుచూపడం లేదు. రెండో అతిపెద్ద పార్టీగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే మాట చెబుతోంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బీజేపీ 31, ఆప్ 28 సీట్లు గెల్చుకుని ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. ఇక్కడే పేచీ వచ్చి పడింది. అధికారం కోసం ఏ పార్టీ ముందు చేతులు చాచబోమని రెండు పార్టీలు స్పష్టం చేయడంతో కొత్త సర్కారు ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. ఢిల్లీ ప్రజలు బీజేపీ, ఆప్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని.. కాబట్టి ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరినా ఒప్పుకోవడం లేదు. మిగతా పార్టీల మద్దతు తీసుకోవడానికీ అంగీకరించడం లేదు. అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించబోమని బీజేపీ, అవినీతి పార్టీలతో జట్టు కట్టబోమని ఆప్ పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఢిల్లీ భవితవ్యం ఆధార పడి ఉంటుంది. హస్తిన ఓటర్లు మాత్రం మళ్లీ ఎన్నికలు వస్తాయేమోనని భయపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ, ఆప్‌ల విధానాలను ప్రశంసిస్తున్నారు. -
ముంబైలో పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ సై
ముంబై: ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబై దృష్టి సారించింది. ముంబైలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. మహారాష్ట్రలోని మిగతా స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావిస్తోంది. ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ముంబైలో ఆరు లోక్‌సభ స్థానాలున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని ఆప్ సభ్యులకు ఉత్సాహాన్నిచ్చాయని వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నడుం కట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీవైపు ప్రజలు చూస్తున్నారని మయాంక్ గాంధీ అన్నారు. అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్లుగా హస్తినను ఏలుతున్న షీలా దీక్షిత్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ముంబైపై దృష్టి పెట్టడడంతో ప్రధాన పార్టీల్లో కలకలం మొదలయింది. -
అధికారం మాకొద్దు అంటున్న పార్టీలు
-
25 మంది ఎమ్మెల్యేలు నేరచరితులే
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 25 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈసారి మళ్లీ 22 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు గెలిచారని, వీరిలో 15 మందిపై కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. బీజేపీ నుంచి 17 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయని, ఆ పార్టీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ కూడా నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ సభ్యుడు తెలిపారు. బీజేపీ నుంచి 31 మంది గెలవగా, వీరిలో 13 మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై దాడులు తదితర తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో ముగ్గురు, కాంగ్రెస్‌లో ఇద్దరు, శిరోమణి ఆకాళీ దళ్, జేడీ (యూ) స్వతంత్ర అభ్యర్థిపై నేరాభియోగాలు ఉన్నాయని వెల్లడించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి అపూర్వ ఆదరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజకీయాల్లోని అవినీతిని ఊడ్చిపారేస్తామంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీవాసులు బాసటగా నిలబడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం నాటి ఫలితాల్లో ఏకంగా 28 స్థానాలు గెలుపొందింది. ఆప్ మొదటి నుంచి అవలంభించిన పంథా ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ఓటు షేర్ పరంగా చూస్తే బీజేపికి 34శాతం ఓట్లు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీ 32 శాతం రాబట్టింది. దాదాపు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ నంతా తమ ఖాతాలోకి వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 16 స్థానాలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న 11 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోవడం విశేషం. కే జ్రీవాల్ చేపట్టిన ఉద్యమాలు, ఇచ్చిన హామీలు, ప్రచారం చేసిన తీరు ఢిల్లీవాసికి దగ్గర చేసింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై పోటీ చేస్తానంటూ కేజ్రీవాల్ చేసిన సవాల్ దేశవ్యాప్తంగా ఆ పార్టీపై చర్చకు దారితీసింది. కేజ్రీవాల్ పార్టీకి పడిన ఓట్లతో అగ్రభాగం యువతదే. ఢిల్లీలో ఈ మారు కొత్త ఓటర్లు 47శాతం మంది చేరారు. వీరిలోఎక్కువ మంది హర్యానా నుంచి వచ్చిన వారే. అరవింద్ కేజ్రీవాల్ సైతం హర్యానాకి చెందిన వాడే కావడంతో మరింత లాభించింది. షీలాదీక్షిత్‌పై 25,864 ఓట్ల మెజార్టీతో కేజ్రీవాల్ తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. -
ప్రేమ్ సింగ్‌కూ తప్పని ఓటమి
సాక్షి, న్యూఢిల్లీ: అంబేద్కర్‌నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా 11 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన చౌదరి ప్రేమ్‌సింగ్‌కు ఈ సారి చుక్కెదురైంది. ఢిల్లీ కాంగ్రెస్‌లో భీష్ముడిగా పేరుగాంచిన ప్రేమ్‌సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అశోక్ కుమార్ ఓడించారు.సింగ్‌కు బీజేపీ అభ్యర్థి ఖుషీరామ్ చునార్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఒకే పార్టీ అభ్యర్థిగా, ఒకే నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు పోటీచేసి గెలిచిన నేతగా ప్రేమ్ సింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. 12వ సారి కూడా నెగ్గి తన రికార్డు నిలబెట్టుకోవాలన్న ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఆఖరిసారి పోటీచేస్తున్నాను నన్ను గెలిపించండి అంటూ ప్రేమ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అశోక్‌కుమార్ (ఆమ్ ఆద్మీ పార్టీ)కు 36,239 ఓట్లు, ఖుషీరామ్ చునార్ (భారతీయ జనతా పార్టీ)కు 24,569, ప్రేమ్ సింగ్‌కు 19,753 ఓట్లు వచ్చాయి. -
రీపోలింగ్‌లో 53 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: జంగ్‌పురా నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన రీపోలింగ్‌లో 53 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంలు మొరాయిండంతో సరాయ్ కాలే పోలింగ్ బూత్‌లో ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో 813 ఓటర్లు శనివారం నిర్వహించాల్సిన రీపోలింగ్‌లో ఓటు వేయాల్సి ఉండగా కేవలం 438 మంది మాత్రమే ఓటు వేశారు. వీరిలో 269 మంది పురుషులు, 169 మంది మహిళలు ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. -
మోడల్ పోలింగ్ కేంద్రాలకు ఢిల్లీ వాసుల ప్రశంస
న్యూఢిల్లీ: పారదర్శకంగా ఎన్నికలు జరపడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్ కేంద్రాలకు ఢిల్లీ ఓటర్లు కితాబునిచ్చారు. మెరుగైన మౌలిక వనరులు, జనసమ్మర్థ నియంత్రణ, స్పష్టంగా కనిపించే సూచికలు, ప్రాథమిక చికిత్స వసతితో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఢిల్లీ ఓటర్లు మెచ్చుకున్నారు. తొలిసారిగా ఓటు వేసిన 19 ఏళ్ల రాధిక శర్మ ‘‘నేను ఓటు చేయడానికి వెళ్లిన పోలింగ్ స్టేషన్ పరిశుభ్రమైన వాతావరణంలో చక్కగా నిర్వహించారు’’ అని ప్రశంసించింది. హరినగర్‌లోని పోలింగ్ కేంద్రానికి రాధిక శర్మ తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది. ‘‘ఎన్నికల కమిషన్ ఇలాంటి వసతులను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి. ఇలాంటి వాతావరణం కల్పిస్తే ఓటు వేయడానికి ముఖం చాటేస్తున్న వారు కూడా కదలివచ్చి ఓటు వేస్తారు’’ అని రాధిక అభిప్రాయపడింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తొమ్మిది ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శాలీమార్బాగ్, సీమాపురి, లక్ష్మినగర్, చత్తర్‌పూర్, నజఫ్‌గఢ్, హరినగర్, రితాల, చాందీచౌక్లలో ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లక్ష్మినగర్‌కు చెందిన సుమన్ కౌశిక్ మాట్లాడుతూ ‘‘గతసారి ఎన్నికల్లో నేను ఓటు చేయలేదు. ఈసారి వేయాలని కచ్చితంగా నిర్ణయం చేసుకున్నాను. అయితే దారులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఐతే ఈసారి ఎన్నికల కమిషన్ జాగ్రతలు తీసుకొని చక్కటి సూచికలను ఏర్పాటు చేసింది’’ అని వివరించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో 65.86 శాతం పోలింగ్ నమోదయింది. బరిలో దిగిన 810 మంది అభ్యర్థుల్లో 70 మంది విజేతలుంటారు. ఈసారి పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు కమిషన్ ఈ రిక్షాలను ఏర్పాటు చేసింది. కేంద్రం ఉన్న చోటుకు సుల భంగా వెల్లేందుకు వీలుగా సూచికలను ఏర్పాటు చేసింది. దీని వలన ఓటింగ్ శాతం బాగా పెరిగింది. ఎన్నికల కమిషన్ తెచ్చిన నూతన సంస్కరణలకు ఓటర్లు హర్షామోదాలు తెలిపారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ కూడా ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట రద్దీ లేదు. తోసుకోవడాలు, కుమ్ములాటలు లేవు. ఓటర్లు అసౌకర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఓటరు వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇంటర్నెట్ అనుసంధానంతో వెబ్ కెమెరాల ద్వారా నిర్వహణ పర్యవేక్షణ కూడా సమర్థవంతమైన నిర్వహణకు తోడ్పడింది’’ అని వివరించారు. -
క్యూలో నిలబడి ఓటేసిన సోనియా, షీలా దీక్షిత్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. వీవీఐపీలు కొలువుదీరిన హస్తినలో ప్రముఖులు తమ ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంకవాధ్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా లోథి ఎస్టేట్‌లో ఓటేశారు. అటు... నేవీ చీఫ్ కామ్రాజ్ లేన్‌లో నేవీ చీఫ్ డీకే జోషీ ఓటేశారు.మాజీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ వినోద్‌రాయ్, కాంగ్రెస్ నాయకుడు రామ్‌లాల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామరాజ్లేన్లో వినోద్‌రాయ్, నిర్మన్ భవన్లో రామ్‌లాల్ ఓటు వేశారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాలు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ మందిర్మార్గ్లో ఓటు వేశారు. బీజేపీ ముఖ్యమంత్రి హర్షవర్థన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణానగర్‌లో ఆయన ఓటు వేశారు. ఢిల్లీవాసులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకొని గత రికార్డులు బద్దలు కొట్టాలని ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇక ఉదయం 8 గంటలకు మందకొడినన ప్రారంభమైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీల్లో ఎవరిని గద్దెనెక్కించాలో నిర్ణయించడానికి ఢిల్లీ ఓటర్లు ముందుకు కదిలారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు... ఛత్తీస్గడ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటె ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుందని చీఫ్ ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ ఎన్నికల బరిలో 33 శాతం మంది కోటీశ్వరులే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 810 మంది అభ్యర్థులలో 33 శాతం మంది కోటీశ్వరులే. వీరిలో అతి సంపన్ను డైన అభ్యర్థి ఆస్తి 235 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా చూస్తే... రాజోరీ గార్డెన్ నుంచి పోటీచేస్తున్న మంజిందర్ సిర్సా అతి సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.235.5 కోట్లు. సిర్సా తరువాత స్థానంలో సుశీల్ గుప్తా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన గుప్తా ఆస్తుల విలువ రూ.164 కోట్లు. ఢిల్లీ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలను పరిశీలించిన ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ అభ్యర్థులలో 33 శాతం మంది కోటీశ్వరులని తేల్చింది. ఐదేళ్ల కిందట అభ్యర్థి సగటు ఆస్తి 1.7 కోట్ల రూపాయలు ఉండేదని, ఇప్పుడది రూ.3.43 కోట్లకు పెరిగిందని ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి 14 కోట్ల రూపాయలుంది. బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.8 కోట్లు. సామాన్యుల పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.2.5 కోట్లు ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటన్నవారిలో బీజేపీ ముందు.. గత ఐదేళ్లలో అభ్యర్థులపై క్రిమినల్ రికార్డుల సంఖ్య కూడా 14 నుంచి 16 శాతానికి పెరిగిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 129 మంది అభ్యర్థులపై.. అంటే 16 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 93 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులలో 15 మందిపై, బీజేపీ అభ్యర్థులలో 31 మందిపై, బీఎస్పీ అభ్యర్థులలో 14 మందిపై, ఆప్ అభ్యర్థులలో ఐదుగురిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా ప్రజలను పాలిస్తామని నమ్మబలుకుతూ ఎన్నికల్లో నిల్చుంటున్నవారు కోట్లు కూడబెట్టిన వారు, కేసుల్లో ఇరుకున్నవారని తెలిసినా ప్రజలకు వారికే పట్టం కడుతున్నారని, అలాంటివారిని తిరస్కరించే అవకాశం ఈసారి ఓటర్లకు ‘నోటా’ బటన్ ద్వారా వచ్చిందని నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
కేజ్రీవాల్‌కు మూడు చోట్ల ఓటు: బీజేపీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్టిపోటీ ఇస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మూడు ప్రాంతాల్లో ఓటరుగా నమోదయ్యారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహిబాబాద్‌లో, ఢిల్లీలోని సీమాపురి, న్యూఢిల్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన ఎన్నికల గుర్తింపు కార్డు పొందారని బీజేపీ నేతలు ఆరోపించారు. -
జోరు తగ్గిన జెండాల వ్యాపారం
నగరంలో ఎన్నికల మూడ్ కనిపించడం లేదు. ప్రతిసారి జెండాలు, బ్యానర్లు, టోపీలు. స్కార్ప్‌లు, స్టిక్కర్లు, మాస్క్‌లతో హోరెత్తించే వివిధ పార్టీల నాయకులు ఈసారి వాటి జోలికి పెద్దగా వెళ్లడం లేదు. దీంతో ఎన్నికల ప్రచార సామగ్రి వ్యాపారం చేసేవారిలో నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల జెండాలు, బ్యానర్ల నమూనాలతో ఈ దుకాణాలు నిండి ఉన్నప్పటికీ ఆర్డర్లిచ్చే వారు కనిపించడం లేదు. ఎన్నికల తేదీ సమీపిస్తున్నా బేరసారాలు ఊపందుకోలేదని దుకాణదారులు అన్నారు. ఇందుకు కారణం అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలని వారు చెప్పారు. ఎన్నికలనగానే బ్యానర్లు, జెండాల కోసం తమ దగ్గరకు పరుగెత్తుకు వచ్చే రాజకీయ నేతలు ఈసారి మాత్రం ఆర్డర్లు జారీచేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినా పెద్ద రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎవరూ తమకు ఇంత వరకు భారీ ఆర్డరు జారీ చేయలేదన్నారు. పాతికేళ్లలో ఈ పరిస్థితి చూడలేదు పాతికేళ్ల వ్యాపారానుభవంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని , ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా వ్యాపారం మందకొడిగా సాగుతోందని ఆల్ ఇండియా ఎలక్షన్ మెటీరియల్ ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ గుల్షన్ చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సదర్ బజార్ నుంచి ప్రచార సామగ్రి వెళుతుందని , కానీ ఈసారి మాత్రం పొరుగు రాష్ట్రాల మాట అటుంచినా, ఢిల్లీ నేతల నుంచి కూడా ఆర్డర్లు రావడం లేదని ఆయన చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు సగానికి తగ్గాయని తెలిపారు. గతంలో ఎన్నికలు వచ్చినప్పడల్లా షీలా దీక్షిత్, యోగానంద శాస్త్రి, హరూన్ యూసఫ్, విజయ్ గోయల్‌తో పాటు పలువురు నేతలు ప్రచార సామగ్రి కోసం తమ ఫ్యాక్టరీకే ఆర్డర్లు ఇచ్చేవారని చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు సగానికి తగ్గాయన్నారు. ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలతో పాటు టెక్నాలజీ విస్తృత వినియోగం వల్ల తమ బేరాలు తగ్గాయని సురేష్ అనే మరో వ్యాపారి వాపోయారు. రేడియో, సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఓటర్లను ముఖ్యంగా యువతను ఆకట్టుకోవచ్చుననే విషయాన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గుర్తించారని, దీంతో బ్యానర్లు, జెండాల వంటి ప్రచార సామగ్రి వాడకం తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రచార సామగ్రిని తానే తయారు చేసుకుంటోందని తెలిపారు. -
మినీ మహా సమరం!
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కొత్త సభలను కొలువుతీర్చే పనికి ఎన్నికల సంఘం శుక్రవారం శ్రీకారం చుట్టింది. నవంబర్ 11న జరిగే ఛత్తీస్‌గఢ్ ఎన్నికలతో మొదలై...డిసెంబర్ 4న నిర్వహించే ఢిల్లీ, మిజోరం ఎన్నికలతో ఈ మినీ మహా సమరం ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరంలలో కాంగ్రెస్...మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఇప్పుడు పాలకపక్షాలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈమధ్య ఇచ్చిన రెండు తీర్పుల ప్రభావం ఈ ఎన్నికల్లో కనబడబోతున్నది. మొదటిది-పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ‘ఎవరూ నచ్చలేద’ని చెప్పేందుకు ఓటర్లకు తొలిసారి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనపు మీటను ఏర్పాటుచేయబోతున్నారు. అలాగే, నేరచరితులుగా తేలి రెండేళ్లకు మించి శిక్షపడే సందర్భంలో ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెనువెంటనే రద్దవుతుందని ఇచ్చిన తీర్పు కూడా అన్ని పార్టీలనూ భయపెట్టేదే. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నపక్షంలో అలాంటివారికి టిక్కెట్ ఇచ్చేందుకు ఈసారి పార్టీలు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఈ అయిదేళ్లలోనూ ఎప్పుడైనా తీర్పు వెలువడి, అందులో శిక్షకు గురైతే వెంటనే వారి సభ్యత్వం ఎగిరిపోతుందన్న భయం అన్ని పార్టీలకూ ఉంటుంది. ఎన్నికలనేసరికి పాలకపక్షాలుగా ఉన్న పార్టీలకు వణుకు సహజం. అయిదేళ్ల తమ పాలన తీసుకొచ్చిన మార్పులూ, అందులోని గుణదోషాలూ విస్తృతంగా చర్చకొచ్చే సమయం గనుక వాటిని సమర్ధించుకోవాల్సిరావడం ఇబ్బందే. ఆ రకంగా చూస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ కే ంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలాంటివి. ఇప్పుడేలుతున్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలమనిగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈసారి సునాయాసంగా పాగా వేయగలమనిగానీ ఆ పార్టీకి నిండైన విశ్వాసం లేదు. కేంద్రంలో కుంభకోణాల పరంపర, అధిక ధరలు, అస్తవ్యస్థ పరిపాలన మాత్రమే కాదు...ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ పాలకపక్షంగా లేదా ప్రతిపక్షంగా విఫలమైన తీరే అందుకు కారణం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓటర్లు వరసగా మూడుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. మూడుసార్లూ షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో అక్కడున్న 70 స్థానాల్లో కాంగ్రెస్‌కు 41 వచ్చాయి. బీజేపీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ పౌరుల్లో నెలకొన్న అభద్రతాభావం ఆమెకు ఈసారి ఆమెకు శాపమే. శాంతిభద్రతలు సక్రమంగా లేవని, మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన నిర్భయ ఉదంతం ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదికాక తరచుగా పెరిగిన విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. నిత్యావసర సరుకులు...మరీ ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటడం మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలను బాగా కుంగదీసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడుగా విభజించాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా విపక్ష బీజేపీ విజయఢంకా మోగించింది. అయితే, ఈసారి కొత్తగా బరిలోకి దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందేమోనన్న భయం అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌నూ వెన్నాడుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్. అక్కడకూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశావహంగా లేదు. శాంతిభద్రతల క్షీణత, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, విద్యుత్‌చార్జీల పెంపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి గుదిబండలు. ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను నిలుపుకోలేదని గుజ్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ది అత్తెసరు మెజారిటీయే. 200 స్థానాలున్న సభలో అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నవి 96 స్థానాలు మాత్రమే. అప్పట్లో ఆరుగురు సభ్యులున్న బీఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో 78 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు సునాయాసంగా గెలవగలనన్న విశ్వాసంతో ఉంది. ఇప్పుడు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మళ్లీ తమకే దక్కుతాయని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రజాదరణపొందిన వివిధ పథకాలవల్లా, అభివృద్ధి కార్యక్రమాలవల్లా వరసగా మూడోసారి కూడా సునాయాసంగా విజయం సాధించగలనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. చౌహాన్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు, కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపబోవని పార్టీ భావిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని 230 స్థానాల్లో బీజేపీకి ఇప్పుడు 153 స్థానాలుండగా కాంగ్రెస్ 66 స్థానాలు గెల్చుకుంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 90 స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 49 సాధించగా, కాంగ్రెస్ 39 స్థానాలు గెల్చుకుంది. ఆమధ్య కాంగ్రెస్ కాన్వాయ్‌పై నక్సలైట్లు దాడిచేసి ముఖ్య నాయకులను హతమార్చిన ఘటన తర్వాత తమపై సానుభూతి వెల్లువెత్తుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది. కానీ, పాలనలోనూ...మరీ ముఖ్యంగా ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంలో సమర్ధతను కనబరిచిన రమణ్‌సింగ్ సర్కారును సవాల్ చేయడం అంత సులభమేమీ కాదు. మొత్తమ్మీద ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ సంగతలా ఉంచి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్రమోడీ దీక్షాదక్షతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. ఇందులో ఘనవిజయం సాధిస్తేనే తన పార్టీలో మోడీ తిరుగులేని నేతగా ఎదుగుతారు... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశలు ఈడేరతాయి. -
ఏఏపీ సభ్యురాలు సంతోష్ కోలి మృతి
రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అభ్యర్థి సంతోష్ కోలి బుధవారం మరణించారు. ఆమె మృతి పట్ల ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గతనెల 30న కోశాంబిలోని పసిఫిక్ మాల్ సమీపంలో సంతోష్ కోలి, ఏఏపీ మరో కార్యకర్త కులదీప్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చి ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోష్ తలకు తీవ్ర గాయమైంది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆ ప్రమాదంలో కులదీప్ మాత్రం స్వల్పగాయాలపాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సంతోష్ కోలి పోటీ చేయనున్నారు. ఎన్నికల బరిలో నిలబడితే ప్రాణాలకు హాని తలపెడతామని గతంలో సంతోష్ కోలికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.