ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని తమ పార్టీ నాయకుడు జగదీష్ ముఖీకి బీజేపీ ఢిల్లీ శాఖ సూచించింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని తమ పార్టీ నాయకుడు జగదీష్ ముఖీకి బీజేపీ ఢిల్లీ శాఖ సూచించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగదీష్ ముఖీ అంటూ ఆప్ ప్రచారం చేస్తోంది. ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లను ఆటో రిక్షాల వెనుక అతికించి ఎన్నికల ప్రచారం సాగిస్తోంది.
అయితే బీజేపీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. తాము సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ఆప్ నాయకులు ఇలాంటి ప్రచారం ఎలా చేస్తారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఆప్ పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని జగదీష్ ముఖీని కోరినట్టు వెల్లడించారు. కాగా తన లాయర్లతో పాటు జగదీష్ ముఖీ సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు.