మేకిన్ ఇండియా అంటారు కానీ... | Rahul Gandhi Hits Out at PM Narendra Modi at Delhi Rally | Sakshi
Sakshi News home page

మేకిన్ ఇండియా అంటారు కానీ...

Feb 4 2015 2:35 PM | Updated on Mar 18 2019 7:55 PM

మేకిన్ ఇండియా అంటారు కానీ... - Sakshi

మేకిన్ ఇండియా అంటారు కానీ...

ప్రధాని మోదీపై, కాషాయం పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై, కాషాయం పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం న్యూఢిల్లీలోని జహంగీర్ పూరీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ....  నేరగాళ్లకు దూరమని ఆ పార్టీ నాయకులు ఓ గప్పాలు కొట్టుకుంటారు... కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థుల్లో 20 మందికి నేర చరిత్ర ఉందని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీ 'మేకిన్ ఇండియా' అంటూ ప్రచారం చేస్తారు... కానీ ఆయన ధరించిన సూటు ఖరీదు రూ. 10 లక్షలు ఉంటుంది. అది కూడా విదేశాలలో తయారైందని చెప్పారు.

తాము అధికారంలోకి రాగానే దేశంలో ధరలు తగ్గిస్తామన్నారు... నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు. మీ హామీలన్నీ ఏమయ్యాయని ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంత తగ్గింది? దేశంలో చమురు ధరలు ఎంత తగ్గించారని రాహుల్ ఈ సందర్బంగా మోదీ సర్కార్ సూటిగా ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు అంత తగ్గినా... ద్రవ్యోల్బణం అదుపులోకి ఎందుకు లేదో వెల్లడించాలని మోదీ సర్కార్ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తీసుకొస్తామని రాహుల్ హస్తిన ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement