అంబేద్కర్‌నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా 11 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన చౌదరి ప్రేమ్‌సింగ్‌కు ఈ సారి చుక్కెదురైంది.
సాక్షి, న్యూఢిల్లీ: అంబేద్కర్‌నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా 11 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన చౌదరి ప్రేమ్‌సింగ్‌కు ఈ సారి చుక్కెదురైంది. ఢిల్లీ కాంగ్రెస్‌లో భీష్ముడిగా పేరుగాంచిన ప్రేమ్‌సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అశోక్ కుమార్ ఓడించారు.సింగ్‌కు బీజేపీ అభ్యర్థి ఖుషీరామ్ చునార్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఒకే పార్టీ అభ్యర్థిగా, ఒకే నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు పోటీచేసి గెలిచిన నేతగా ప్రేమ్ సింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. 12వ సారి కూడా నెగ్గి తన రికార్డు నిలబెట్టుకోవాలన్న ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఆఖరిసారి పోటీచేస్తున్నాను నన్ను గెలిపించండి అంటూ ప్రేమ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అశోక్‌కుమార్ (ఆమ్ ఆద్మీ పార్టీ)కు 36,239 ఓట్లు, ఖుషీరామ్ చునార్ (భారతీయ జనతా పార్టీ)కు 24,569, ప్రేమ్ సింగ్‌కు 19,753 ఓట్లు వచ్చాయి.