'ఢిల్లీ టూ గల్లీ.. సమస్యలు తెలిసిన నేత వెంకయ్య' | narendra modi admires venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ టూ గల్లీ.. సమస్యలు తెలిసిన నేత వెంకయ్య'

Jan 10 2015 1:52 PM | Updated on Mar 29 2019 9:31 PM

'ఢిల్లీ టూ గల్లీ.. సమస్యలు తెలిసిన నేత వెంకయ్య' - Sakshi

'ఢిల్లీ టూ గల్లీ.. సమస్యలు తెలిసిన నేత వెంకయ్య'

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

ఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య అని మోదీ కొనియాడారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ఢిల్లీ సహా గల్లీ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య నాయుడు అని పేర్కొన్నారు. శనివారం రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని మోదీ మరోసారి స్పష్టం చేశారు.

 

దేశ యువత బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో బీజేపీ ప్రజల పట్టం కట్టారన్నారు. పేదరిక నిర్మూలనలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement