సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం | Congress working committee meeting begin, focus on strategy to take on Modi govenrment | Sakshi
Sakshi News home page

సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం

Jan 13 2015 11:19 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమైంది.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ...రెండో విడత జాబితపై కసరత్తు జరుగుతోంది.

మరోవైపు రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించటంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రాల్లో వరుస పరాజయాలపైనా నేతలు దృష్టి పెట్టనున్నారు.  ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం, అహ్మద్ పటేల్ సహా ఇతర నేతలు హాజరు అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement